Pathols
-
గుంతలో పడిన అంబులెన్స్ : బతికొచ్చిన తాత
గతుకులు, గుంతల రోడ్డు కారణంగా అనేక ప్రమాదాలు, ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం చూశాం. కానీ అదే గుంత మనిషికి ప్రాణం పోసింది. నమ్మ శక్యంగా లేకపోయినా ఇది నిజం. హర్యానాలో ఈ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుసుకుంది. అనారోగ్య కారణాలతో దర్శన్ సింగ్ బ్రార్ (80)చనిపోయాడు.అతని మృతదేహాన్ని అంబులెన్స్‌లో పాటియాలా నుండి కర్నాల్ సమీపంలోని అతని ఇంటికి తీసుకు వెళుతున్నారు. మరోవైపు అతని బంధువులు అంత్యక్రియలు అన్ని ఏర్పాట్లు చేసేవారు. కానీ విధి మరోలా ఉంది. ఉన్నట్టుండి అంబులెన్స్ గుంతలో పడింది. అదే మృతుడికి ప్రాణం పోసింది. అంబులెన్స్‌లో అతనితో పాటు ఉన్న మనవడు తన తాత చేయి కదలడం గమనించాడు. వెంటనే ఊపిరి పరక్షీంచగా గుండె కొట్టుకోవడంతో వెంటనే బ్రార్‌ను ఆసుపత్రికి తరలించాడు. అతడు బతికే ఉన్నట్లు అక్కడి వైద్యులుప్రకటించారు. కర్నాల్‌లోని ఎన్‌పి రావల్ ఆసుపత్రిలో క్రిటికల్ ICUలో చికిత్స పొందుతున్నాడు. నిజంగా ఇది అద్భుతం, దేవుడి దయ, ఆయన త్వరగా కోలుకోవాలంటూ బంధువులు కోరుకుంటున్నారు భూమ్మీద ఇంకా నూకలున్నాయి అంటూ సంతాపం తెలపడానికి వచ్చిన బంధువులంతా ఆ కుటుంబాన్ని అభినందించి వెళ్లారు. క్రిటికల్, కానీ శ్వాస ఉంది బాధితుడు శ్వాస తీసుకుంటున్నాడు. రక్తపోటుతో పాటు పల్స్ ఉన్నాయి, అయితే ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉన్నందున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని రావల్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ నేత్రపాల్ తెలిపారు. -
3 రోజులు.. 3,069 గుంతలు
సాక్షి, సిటీబ్యూరో: వానొస్తే నగర జీవనం నరకం కాకూడదనే తలంపుతో సీఆర్ఎంపీ కింద ప్రధాన రహదారుల మార్గాల్లోని రోడ్ల నిర్మాణం, నిర్వహణ బాధ్యతల్ని ప్రైవేటు ఏజెన్సీలకిచ్చారు. రోడ్ల పరిస్థితి ఫర్వాలేదని భావిస్తున్న తరుణంలోనే.. ఇటీవల కురిసిన వరుస వర్షాలతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. జీహెచ్ఎంసీ నిర్వహణలోని రోడ్లతో పాటు సీఆర్ఎంపీ మార్గాల్లోనూ గుంతలు పడ్డాయి. ప్రయాణాలకు ఆటంకంగా మారి, అవస్థలుకలిగిస్తున్నాయి. ప్రైవేట్ ఏజెన్సీల మార్గాల్లో ఫిర్యాదు చేసేందుకుసంబంధిత ఏజెన్సీల ఫోన్ నంబర్లతో ఆయా మార్గాల్లో బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్‌కే ఫిర్యాదు చేస్తున్నారు. ప్రధాన రహదారుల పరిస్థితి ఇలాఉండగా, కాలనీలు.. అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. ఇటీవల కురిసిన వరుస వర్షాలతో నగరంలోని అనేక రహదారులు దెబ్బతిన్నాయి. నగరంలో వానొస్తే రోడ్లు జలమయం కావడం.. గుంతలమయం కావడం.. ప్రయాణం నరకప్రాయంగా మారడం.. నగర ప్రజలకు తెలిసిందే. ఈ సంవత్సరం ఇప్పటి వరకు వరుస వర్షాలు కురవకపోవడం.. కరోనా కారణంగా ప్రజలు చాలావరకు ఇళ్లల్లోనే ఉండటం.. లాక్డౌన్ తదితర కారణాలతో రోడ్ల సమస్యలు పెద్దగా దృష్టికి రాలేదు. ఈమధ్య వరుసబెట్టి కురిసిన వర్షాలతో అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. అధ్వానపు రోడ్ల సమస్యలు ఉండరాదనే తలంపుతో ఈ సంవత్సరం ప్రధాన రహదారుల మార్గాల్లోని 709 కి.మీ మేర రోడ్ల నిర్వహణను ప్రభుత్వం సీఆర్ఎంపీ (సమగ్ర రోడ్ల నిర్వహణ పథకం) పేరిట బడా కాంట్రాక్టు ఏజెన్సీలకు అప్పగించింది. రోడ్ల నిర్మాణం పూర్తయినా, కాకున్నా వీటి అధీనంలో ఉన్న ప్రాంతాల్లో రోడ్లపై ఏర్పడ్డ పాట్‌హోల్స్ (గుంతలు) పూడ్చివేత తదితర మరమ్మతుల్ని ఈ ఏజెన్సీలే చేయాల్సి ఉంది. కాంట్రాక్టు ఒప్పందం మేరకు ఇప్పటి వరకు 50 శాతం రోడ్ల నిర్మాణం పూర్తిచేయాల్సి ఉండగా పనులు పూర్తికాలేదు. మిగతా రోడ్లలో ఏర్పడే సమస్యల్ని సైతం ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. వర్షాలకు సీఆర్ఎంపీ పరిధిలోని మార్గాల్లో, ఇతర మార్గాల్లో వెరసి మొత్తం 3069 పాట్‌హోల్స్ ఏర్పడ్డట్లు అధికారులు గుర్తించారు. వాటి మరమ్మతుల పనులు వెంటనే చేపట్టామని, చాలా వరకు పూర్తి కాగా, మిగతావి త్వరలోనే పూర్తి అవుతాయన్నారు. ఫిర్యాదు చేసేదెలా? సీఆర్ఎంపీ ఏజెన్సీలు పనులు చేపట్టిన మార్గాల్లోని రోడ్లపై ఫిర్యాదులకు ఆయా మార్గాల్లో సదరు ఏజెన్సీ.. ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆ పని జరగలేదు. త్వరలోనే ఫోన్ నంబర్లతో సైనేజీలు ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత ఏజెన్సీలను ఆదేశించినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. రోడ్ల సమస్యలపై ఇప్పటి వరకు పెద్దగా ఫిర్యాదులు లేకపోవడంతో తాము కూడా ఇతర పనులపై దృష్టి సారించినట్లు, ఇప్పుడిక వీటిపై శ్రద్ధ చూపుతామని మరో అధికారి పేర్కొన్నారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించకుంటే కాంట్రాక్టు ఏజెన్సీలకు పెనాల్టీలు విధించవచ్చు. కానీ, ఫిర్యాదులే అందనిది పెనాల్టీలా వేస్తారో మరి! -
గతుకుల రోడ్లపై హ్యాపీ జర్నీ..
ఒకవైపు మెట్రో నిర్మాణ పనులు, మరోవైపు ఫ్లై ఓవర్ నిర్మాణాలు.. వీటికి తోడు నాణ్యతలేని రోడ్లు.. చిన్నపాటి వర్షానికే ఎక్కడికక్కడ గుంతలమయంగా మారుతున్నాయి. నగరంలోని వందలాది కిలోమీటర్ల పొడవునా ఈ గుంతలే దర్శనమిస్తున్నాయి. బండి నడపాలంటేనే భయమేస్తుంది. మరోవైపు ట్రాఫిక్ రద్దీ. గంటల తరబడి రోడ్లపై పడిగాపులు. ఈ పరిస్థితుల్లో ప్రయాణంలో ఎలాంటి అలసట లేకుండా సాగిపోయేందుకు ఈ కొత్త సీటింగ్ సదుపాయం దొహదం చేస్తుందంటున్నారు తయారీదారులు. వీటిని https://bit.ly/338bHtr లింక్ ద్వారా బుక్ చేసుకోవచ్చంటున్నారు. సాక్షి,సిటీబ్యూరో: నగర రోడ్లపై అడుగడుగునా గుంతలు.. అరగంట పాటు బండి నడిపితే వెన్ను నొప్పితో పాటు నడుము పట్టేస్తుంది. చినుకు పడితే చిత్తడిగా మారే రోడ్లుపై వాహనాలు నడపడం నరకప్రాయమే. ఎక్కడ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. అలాగని ఇంటి నుంవచి బండి బయటకు తీయకుండా ఉండలేం. నగరంలో ఏ చిన్న అవసరానికైనా ద్విచక్ర వాహనం నిత్యావసరం. ఇలాంటి పరిస్థితుల్లో గతుకుల రోడ్లపై, గుంతల్లోంచి బండి నడుపుతూ వెన్ను, నడుం నొప్పితో సర్వైకల్ స్పాండిలైటిస్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండగలమా! నగర రహదారులపై బైక్‌లు, కార్లలో సాఫీగా ప్రయాణం చేయగలమా!!.. అంటే సాధ్యమేనంటోంది హైదరాబాద్ కేంద్రంగా ఆవిర్భవించిన ‘ఫీల్‌గుడ్ ఇన్నొవేషన్స్’ స్టార్టప్ సంస్థ. గతేడాది ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుకు పరిచయం చేసిన 10 స్టార్టప్ సంస్థల్లో ఇది ఒకటి. ఎయిర్ సస్పెన్షన్ పద్ధతిలో రూపొందించిన సీట్లను వినియోగించడం ద్వారా వెన్ను నొప్పి సమస్య లేకుండా బైక్‌పై సాఫీ సాగిపోవచ్చని చెబుతున్నారు ఈ సంస్థ వ్యవస్థాపక ఇంజినీరింగ్ నిపుణులు మాధవరెడ్డి, సంతోష్‌కుమార్, విశ్వనాథ్. వీరు కలిసి చేసిన కుషన్ ప్రయోగం విజయవంతమైంది. కారు, బైక్ నడిపే సమయంలో డ్రైవర్‌కు సీటుకు మధ్య ఒక గాలిపొరతో కూడిన సీటింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది కుదుపుల వల్ల వచ్చే ఒత్తిడిని డ్రైవింగ్ చేసే వ్యక్తులపై పడకుండా నిరోధిస్తుంది. బైక్ కోసం రూపొందించిన ఎయిర్ కుషన్ సీటు ఇక సాఫీగా ప్రయాణం బైక్, కారు నడిపేటప్పుడు కుదుపులను ఎదుర్కొనేందుకు ఇప్పటి వరకు జెల్, కుషన్, ఫోమ్ సీట్లను వినియోగిస్తున్నారు. కానీ వీటి నుంచి లభించే ప్రయోజనం చాలా తక్కువ. ఫీల్‌గుడ్ ఇన్పొవేషన్స్ రూపొందించిన ఫిగో సెయిల్ స్పోర్ట్, ఫిగో సెయిల్ పిలియన్, ఫిగో ఫ్లోట్ మూడు రకాల సీటింగ్ సదుపాయం ఎంతటి బలమైన కుదుపులనైనా తట్టుకొనే సామర్థ్యంతో ఉంటాయి. వాహనాలు గుంతల్లో పడినప్పుడు వెన్నుపై ఒత్తిడి పడకుండా సీటింగ్ మధ్యలో ఉన్న గాలిపొర అడ్డుకుంటుంది. దీంతో కనీసం 2 గంటల పాటు హాయిగా బండి నడపవచ్చునని చెబుతున్నారు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన విశ్వనాథ్ మల్లాది. ‘మేం రూపొందించిన ఈ సీటింగ్ సదుపాయం వల్ల ఒక గాలిపొరపై కూర్చుని బండి నడుపుతున్నట్లుంటుంది’ అని చెప్పారు. ఫీల్‌గుడ్ ఇన్నొవేషన్స్ గతంలో కేవలం స్పోర్ట్స్ బైక్‌లను దృష్టిలో ఉంచుకొని సీట్లను రూపొందించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇప్పుడు అన్ని రకాల వాహనాలకు వినియోగించే అనువైన సీటింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు. కార్లు, బైక్‌లకు షాక్ అబ్జర్వర్స్ వల్ల కొంతమేర ఒత్తిడి తగ్గుతుంది. మిగతా ఒత్తిడిని ఈ సరికొత్త ఎయిర్ సస్పెన్షన్ సీట్లు నిరోధిస్తాయి. ప్రస్తుతం ఈ సీట్లను ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. -
డెత్ స్పాట్లు!
సాక్షి,సిటీబ్యూరో: ఉస్మానియా వర్సిటీ పరిధిలో ‘ప్రమాదకరంగా’ మారిన పాట్‌హోల్ ఓ యువ వ్యాపారి ప్రాణం తీసింది. నారాయణగూడకు చెందిన వ్యాపారి విశాల్ గత మంగళవారం హబ్సిగూడ ప్రాంతంలో స్కూటర్‌పై వెళుతుండగా రోడ్డుపై ఇబ్బందికరంగా ఉన్న పాట్‌హోల్‌ను తప్పించేందుకు తన వాహనాన్ని ఎడమ వైపునకు తిప్పాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మరణించారు. కేవలం ఇదొక్కటే కాదు... నగర వ్యాప్తంగా పాట్‌హోల్స్, మ్యాన్‌హోల్స్ కారణంగా నిత్యం అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. భూగర్భ మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, కమ్యూనికేషన్ కేబుళ్ల కోసం రహదారులపై ఏర్పాటు చేస్తున్న పాట్‌హోల్స్/మ్యాన్‌హోల్స్ ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు తీస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మినిస్ట్రీ ఆఫ్ రోడ్Š ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్‌టీఎహెచ్) తొలిసారిగా ఈ కేటగిరీని తమ గణాంకాల్లో చేర్చింది. రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా పేరుతో ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఏడాది రాష్ట్రంలో ఈ రకమైన ప్రమాదాలు 282 చోటు చేసుకున్నాయి. ఇందులో 82 మంది మృత్యువాత పడగా 424 మంది క్షతగాత్రులయ్యారు. ఆయా హోల్స్‌కు మూతలు ఏర్పాటు చేయడంలో యంత్రాంగాల నిర్లక్ష్యం, సరైన సూచికలు లేకుండా ఎక్కడికక్కడ మరమ్మతుల పేరుతో తవ్వకాలు, పెరుగుతున్న రోడ్ల ఎత్తుకు తగ్గట్టు వీటి ఎత్తు పెంచకపోవడం ప్రధాన కారణాలుగా స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా అడ్డదిడ్డంగా స్పీడ్‌బ్రేకర్లు దర్శనమిస్తుంటాయి. వీటి ఏర్పాటులో ప్రభుత్వ యంత్రాంగాలు నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడం ప్రమాదాలకు కారణమవుతోంది. స్పీడ్‌బ్రేకర్ల వద్ద చోటు చేసుకున్న 293 ప్రమాదాల్లో 80 మంది చనిపోయినట్లు, మరో 367 మంది క్షతగాత్రులైనట్లు ఎంఓఆర్టీహెచ్ నివేదిక పేర్కొంటోంది. రోడ్లు సరిగ్గా లేకపోవడం, ప్రతికూల వాతావరణం, అననుకూల పరిస్థితుల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని సాధారణంగా భావిస్తుంటాం. అయితే రాష్ట్రంలో గుడ్ సర్ఫేస్ (ఎలాంటి లోటుపాట్లు లేని) రహదారుల్లోనే 4328 ప్రమాదాలు జరిగి 1623 మంది మృత్యువాతపడగా మరో ఐదు వేల మందికి గాయాలపాలయ్యారు. మొత్తమ్మీద ఎలాంటి మలుపులు లేకుండా సరిసరిగా ఉన్న రోడ్లలో (గుడ్ సర్ఫేస్ వాటితో కలిపి) 5631 ప్రమాదాలు జరిగి 2691 మంది చనిపోగా, 3436 మంది క్షతగాత్రులు కావడం గమనార్హం. దీని ప్రకారం రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల్లో అత్యధికం డ్రైవర్ల కారణంగా జరిగినవేనని ఎంఓఆర్టీహెచ్ స్పష్టం చేస్తోంది. గతేడాది రాష్ట్రంలో జరిగిన ప్రమాదాల్లో 70 శాతం వరకు సిగ్నల్స్, పోలీసు బూత్స్ తదితర పోలీసుల పర్యవేక్షణ, ఉనికి లేని చోట్లే జరిగాయి. ఈ ప్రాంతాల్లో 10,226 ప్రమాదాలు జరిగి 4405 మంది మృత్యువాతపడగా 8373 మంది క్షతగాత్రులుగా మారారు. ఎంఓఆర్టీహెచ్ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో లెర్నింగ్ లైసెన్స్ కలిగిన, అసలు ఎలాంటి లైసెన్స్ లేని డ్రైవర్ల కారణంగా 2833 ప్రమాదాలు జరిగి 871 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో రోడ్డు నిబంధనల అమలు, లైసెన్సుల జారీ, జరిమానాలు/శిక్షల విధింపు తదితరాలు భారత మోటారు వాహనాల చట్టాన్ని అనుసరించి జరుగుతాయి. అంటే... ఈ చట్టం కేవలం మోటారుతో కూడిన వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఎలాంటి మోటారు లేకుండా రోడ్డుపై సంచరించే వాహనాలూ రాష్ట్రంలో పదుల సంఖ్యలో ప్రాణాలు తీస్తున్నాయి. గత ఏడాది సైకిళ్లు, రిక్షాలు, మనుషులు, జంతువులు లాగే బండ్ల కారణంగా 617 ప్రమాదాలు జరిగి 177 మంది మృత్యువాతపడగా, 796 మంది క్షతగాత్రులు కావడం గమనార్హం. దేశ వ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తూ ఈ నివేదిక రూపొందించి విడుదల చేసిన ఎంఓఆర్టీహెచ్ ప్రమాదాల నిరోధానికి యాక్షన్ ప్లాన్స్ రూపొందించాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. -
ఎప్పటికప్పుడు గుంతల పూడ్చివేత
► జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కురుస్తున్న వర్షాలతో ఏర్పడుతున్న పాట్‌హోల్స్‌ను ఎప్పటికప్పుడు పూడ్చివేస్తున్నామని జీహెచ్ఎంసీ పేర్కొంది. ఇందుకుగాను 88 తక్షణ మరమ్మతు బృందాలు, 119 మాన్సూన్ యాక్షన్ టీమ్‌లు పనిచేస్తున్నాయని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ బృందాలు వర్షాలకు రోడ్లపై ఏర్పడే గుంతలను పూడ్చడంతోపాటు దెబ్బతిన్న రహదారులను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సీజన్లో 22,614 రోడ్లపై గుంతల్ని గుర్తించగా ఇప్పటివరకు 14,940 పూడ్చివేశామని పేర్కొన్నారు. 724 నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించగా 719 ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 963 సివరేజి వాటర్ డ్రెయిన్లకు మరమ్మతులు చేయాల్సి ఉండగా 673 పనులు పూర్తిచేసినట్లు , 902 మ్యాన్‌హోళ్లకు మరమ్మతులు చేయాల్సి ఉండగా 895 పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. పది ప్రాంతాల్లో గోడలు, ఇళ్లు కూలిపోగా వాటి వ్యర్థాలను తొలగించినట్లు తెలిపారు. కూలిపోయిన పది విద్యుత్ స్తంభాలను తొలగించామని పేర్కొన్నారు. ఈనెల 21 తేదీన మునిసిపల్ మంత్రి కె.తారకరామారావు జీహెచ్ఎంసీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం ఇప్పటి వరకు రోజువారీగా పూడ్చిన గుంతల వివరాలను పేర్కొన్నారు. వివరాలిలా ఉన్నాయి. తక్షణ స్పందన.. మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌జామ్ లేకుండా తమ సిబ్బంది తక్షణం స్పందించారని తెలిపారు. ముఖ్యంగా పీవీఎన్నార్ ఎక్స్‌ప్రెస్‌వే 102 పిల్లర్, నాచారం, లంగర్‌హౌస్, నాంపల్లి స్టేషన్, లక్ష్మిదాస్ బాడా, ఒలిఫెంటా బ్రిడ్జి, కర్బలా మైదానం, ఆరాంఘర్ రైల్వే బ్రిడ్జి, మొజాంజాహి మార్కెట్, రాజŒ భవన్‌రోడ్, ఖైరతాబాద్, సరూర్‌నగర్ పీ అండ్ టీ కాలనీ, కూకట్పల్లి, గుడిమల్కాపూర్, విజయనగర్‌కాలనీ, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై ఏర్పడ్డ నీటినిల్వలను తక్షణమే తొలగించారని పేర్కొన్నారు. నగరంలోని 46 ప్రాంతాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి నీటినిల్వలు ఏర్పడకుండా తక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. -
గుంత చూపండి వెయ్యి తీసుకోండి
ప్రత్యేక యంత్రాల ద్వారా పనులు మూడు నెలల్లో పూర్తి గ్రేటర్ రోడ్డుపై గుంత కనిపిస్తే మీ పంట పండినట్టే... ఎందుకనుకుంటున్నారా.. గుంత ఉన్నట్టు చూపితే వెయ్యి రూపాయలు నజరానా కూడా మీ సొంతమవుతుంది. ఇది నిజమేనండి.. కాకపోతే దీనికి మూడు నెలలు ఆగాల్సిందే. ఈ ప్రయోగాన్ని అమలు చేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. రోడ్లపై ఒక్క గుంతా లేకుండా చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇందుకు తమకు కనీసం మూడు మాసాల సమయం కావాలంటున్నారు. ఆ తర్వాత రహదారులపై పాట్‌హోల్స్ గుర్తించిన వారికి నజరానా ఇస్తామంటున్నారు. ఎక్కడ గుంతకనపడినా వెంటనే మరమ్మతులు చేసేందుకు ప్రత్యేక యంత్రాలను సమకూర్చునే పనిలో పడ్డారు. వాటిల్లో ఉండే కాంక్రీట్ మిక్స్‌తో గుం తలను ఎప్పటికప్పుడు పూడ్చివేస్తారు. వీటితో వర్షాకాలంలో సైతం పనులు చేయవచ్చు. ఢిల్లీలో ఈ విధానం అమలులో ఉంది. అక్కడ మంచి ఫలితాలు రావడంతో నగరంలో ఈ విధానాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తొలిదశలో అద్దె ప్రాతిపదికన యం త్రాలను వినియోగంలోకి తేనున్నారు. పూడ్చివేసే గుంతల పరిమాణాన్ని బట్టి కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లిస్తారు. ఒక యంత్రం ద్వారా రోజుకు దాదాపు 50 పాట్‌హోల్స్‌ను పూడ్చివేయవచ్చు. పూడ్చివేసిన గుంత ఏడాదిలోగా దెబ్బతిన్నా కాంట్రాక్టు సంస్థే తిరిగి పనిచేయాల్సి ఉంటుంది. తొలుత ప్రధాన రహదారుల్లోని పాట్హోల్స్కు మరమ్మతులు చేయాలని భావిస్తున్నారు. అనంతరం కనబడ్డ పాట్‌హోల్స్ అన్నింటికీ మరమ్మతులు చేయడమే కాక, ఎక్కడ పాట్‌హోల్ కనబడ్డా తెలియజేయాల్సిందిగా ప్రజల నుంచి ఫిర్యాదులు ఆహ్వానిస్తారు. కెమెరా లేదా సెల్‌ఫోన్ ద్వారా సదరు ఫొటోను జీహెచ్ఎంసీకి పంపిస్తే జీపీఎస్ ద్వారా వాటిని గుర్తిస్తామన్నారు. ఇందుకు అవసరమయ్యే సాంకేతిక సహకారానికి మైక్రోసాఫ్ట్ సంస్థతో సంప్రదిం పులు జరుపుతున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఇలా.. మూడు నెలలపాటు ప్రజల నుంచి స్వీకరించే ఫిర్యాదులతో సహ అన్ని పాట్‌హోల్స్ పూడ్చివేస్తారు. ఆ తర్వాత ఎక్కడ పాట్‌హోల్ ఉందో చెప్పేవారికి వెయ్యిరూపాయలు బహుమానంగా ప్రకటిస్తామని కమిషనర్ చెప్పారు. రూ. 50 కోట్లు వ్యయం.. జీహెచ్ఎంసీలో ఆరువేల కి.మీ.లకు పైగా రహదారులుం డగా.. ఏటా పాట్‌హోల్స్ పూడిక పేరిట దాదాపు 50 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనాలు వేశారు.