
మిశ్రా హ్యాట్రిక్
హరియాణా ఘన విజయం
విజయ్ హజారే ట్రోఫీ
ఆలూరు (కర్ణాటక): విజయ్ హజారే వన్డే ట్రోఫీ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో హరియాణా 10 వికెట్ల తేడాతో జమ్మూ కశ్మీర్‌ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కశ్మీర్ 22 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. పేసర్ హర్షల్ పటేల్ (5/21) చెలరేగగా, భారత లెగ్‌స్పిన్నర్ అమిత్ మిశ్రా (3/4) కెరీర్‌లో తొలిసారి హ్యాట్రిక్ నమోదు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌లోనూ హర్షల్ (29 బంతుల్లో 54 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడు ప్రదర్శించడంతో 11 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 76 పరుగులు చేసిన హరియాణా మరో 234 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకోవడం విశేషం. బెంగళూరులో జరిగిన ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో జార్ఖండ్ 5 వికెట్లతో కేరళను ఓడించింది. కేరళ 8 వికెట్లకు 236 పరుగులు చేయగా, జార్ఖండ్ 5 వికెట్లకు 240 పరుగులు చేసింది. ధోని (18) మళ్లీ విఫలమయ్యాడు.
రాజ్‌కోట్: గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ నాలుగు వికెట్లతో బెంగాల్‌ను ఓడించింది. ముందుగా బెంగాల్ 221 పరుగులకు ఆలౌటైంది. వన్డే ప్రపంచ కప్ తర్వాత తొలిసారి మైదానంలోకి అడుగు పెట్టిన బెంగాల్ పేసర్ మొహమ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం యూపీ 6 వికెట్లకు 222 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మరోవైపు హైదరాబాద్ జట్టు వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. సర్వీసెస్ జట్టుతో ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది.