![IPS Pooja Yadav success story once worked as receptionist](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/poojayadavsuccessstory.jpg.webp?itok=sm3qmgCN)
అదృష్టాన్ని నమ్ముకుంటే కలలు సాకారం కావు. కృషి, పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. విజయం సాధించాలనే సంకల్పం ఉంటే సరిపోదు.. ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా ఓపికతో కృషి చేయాలి. అలా ఆత్మవిశ్వసంతో విజయ తీరాలకు చేరుకున్న స్ఫూర్తిదాతలెందరో ఉన్నారు. అలా తన జీవితంలో ఒక బిగ్ డ్రీమ్ కోసం ఎవరూ ఊహించని విధంగా సాహసోపేతంగా ప్రతిభను చాటుకున్న ఒక ధీర గురించి తెలుసు కుందాం రండి..!
ఆమె పేరే పూజా యాదవ్. హర్యానాకు చెందిన పూజా పట్టుదలగా ఎదిగి ఐపీఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగింది. 1998లో హర్యానాలోని సోనిపట్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమె సోనిపట్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. బయోటెక్నాలజీలో బీటెక్, జీ, ఫుడ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేసింది. అందివచ్చిన అవకాశాలతో కెనడా, జర్మనీలో మంచి వేతనంతో ఉద్యోగాలు చేశారు. కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించి ఉద్యోగం చేయాల్చి వచ్చినా, ఐపీఎస్(IPS) అవ్వాలనే ఆశయం మాత్రం నిరంతరం పూజా మదిలో మెదులుతూనే ఉంది. దీనికితోడు దేశాభివృద్ధికి తోడ్పడాలనే బలమైన కోరిక ఉంది. మొదటి నుంచీ, ఆమె తన దేశానికి సేవచేయాలని కోరిక సివిల్ సర్వీసెస్ పరీక్షకు (UPSC వైపు నడిపించింది. అంతే వన్ ఫైన్‌మార్నింగ్ కీలక నిర్ణయం తీసుకుంది.
తక్షణమే ఉద్యోగం వదిలేసి భారత దేశానికి తిరిగి వచ్చింది. సివిల్స్ ప్రిపరేషన్ (మొదలు పెట్టింది. కానీ ఇది ఆమె అనుకున్నంత సులువుగా సాగలేదు. ఒకవైపు పూజా కుటుంబం ఆర్థిక పరిస్థితి, మరోవైపు చదువుకి అయ్యే ఖర్చులు ఇలా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఐపీఎస్ కావాలనే నిర్ణయానికి కుటుంబంలో అందరూ తోడుగా నిలిచారు.
ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్‌ప్రైజ్ గిప్ట్
రిసెప్షనిస్టుగా పనిచేస్తూనే,
ఒకవైపు సిపిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే,తన ఆర్థిక అవసరాల నిమిత్తం పిల్లలకు ట్యూషన్లు చెప్పింది. దీంతోపాటు రిసెప్షనిస్టుగా పనిచేస్తూ, పరీక్షలకు ప్రిపేర్ అయింది. తొలి ప్రయత్నం విఫలమైంది. అయినా పట్టువీడలేదు. నిరాశపడకుంగా, ఏకాగ్రతతో తపస్సులా చేసింది. చివరికి ఆమె కష్టం వృధా పోలేదు.సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరడం ద్వారా పౌరుల జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తోంది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/poojayadav.jpg)
2018 కేడర్‌లో IPSగా నియమితురాలు కావడం తన జీవితంలో మర్చిపోలేని రోజని సంతోషంగా చెప్పింది పూజా. 2021లో స్నేహితుడు వికల్ప్ భరద్వాజ్‌ను ముస్సోరీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో సాగిన పరిచయం పెళ్లికి దారి తీసింది. ప్రస్తుతం గుజరాత్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తున్నారు. వృత్తిబాధ్యలతోపాటు, పూజ యాదవ్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీలో 3.28 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ప్రజలతో కమ్యూనికేట్ అవ్వడానికి సోషల్ మీడియాను మించినది లేదు అని నమ్మేవారిలో పూజా యాదవ్ ఒకరు.
చదవండి: Maha Kumbh Mela అద్భుతమైన అనుభవం: నీనా గుప్తా ప్రశంసలు
Comments
Please login to add a commentAdd a comment