Sanjay Mehrotra భారతదేశంలోని గుజరాత్‌లో మొట్టమొదటి సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి అమెరికా చిప్ దిగ్గజం మైక్రోన్ టెక్నాలజీ కమిట్‌మెంట్‌ను పునరుద్ఘాటించిన తర్వాత సంజయ్ మెహ్రోత్రా ఇటీవల వార్తల్లో నిలిచారు. ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఈ నేపథ్యంలో సంజయ్ మెహ్రోత్రా నెట్‌వర్త్, ఆయన సక్సెస్‌స్టోరీని ఒకసారి చూద్దాం.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన సంజయ్ మెహ్రోత్రా ప్రపంచ ఐటీ పరిశ్రమ దిగ్గజాల్లో ఒకరు. నాలుగు దశాబ్దాలకు పైగా ఐటీ పరిశ్రమలో విశేష సేవలందించారు. బిట్స్ పిలానీ విద్యార్థి దేశాన్ని సెమీకండక్టర్ హబ్‌గా మార్చేలా దేశీయ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ముందంజలో ఉన్న వ్యాపార నాయకులలో ఒకరుగా ఉన్నారు ఐఐటీ, ఐఐఎం, టిపుల్ ఐటీ లాంటివి చదవకపోయినా టెక్నాలజీలో, ఐటీ ఇండస్ట్రీలో దిగ్గజంగా పేరు తెచ్చుకున్నారు సంజయ్ మెహ్రోత్రా.
1988లో ప్రముఖ బ్రాండ్ శాన్‌డిస్క్‌ని స్థాపించారు. 2011-2016 వరకు దానికి సీఈవోగా పనిచేశారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఇంటెల్, అట్మెల్ , ఇంటిగ్రేటెడ్ డివైస్ టెక్నాలజీ వంటి కంపెనీలతో కలిసి పనిచేశారు. మెహ్రోత్రా 2017లో మైక్రోన్ సీఈఓగా నియమితులయ్యారు. మైక్రాన్ టెక్నాలజీ ఇంక్ సీఈవో,ప్రెసిడెంట్‌గా ఉన్న సంజయ్ మెహ్రోత్రా ప్రస్తుత అంచనా నికర విలువ సుమారు 57.36 మిలియన్ డాలర్లుగా అంచనా. ఆయన రోజు సంపాదన రూ. 64 లక్షలు.
మెహ్రోత్రా కాన్పూర్‌లో జన్మించినప్పటికీ, పెరిగింది మాత్రం ఢిల్లీలో BITS పిలానీ నుండి B.Tech పూర్తి చేసిన తర్వాత, బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ,అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశారు.2009లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పట్టభద్రుడు.
సంజయ్ మెహ్రోత్రా 1988లో ప్రముఖ బ్రాండ్ శాన్‌డిస్క్‌ని స్థాపించారు మరియు 2011 నుండి 2016 వరకు దాని CEOగా పనిచేశారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఇంటెల్, అట్మెల్ మరియు ఇంటిగ్రేటెడ్ డివైస్ టెక్నాలజీ వంటి కంపెనీలతో కలిసి పనిచేశారు. మీడియా కథనాల ప్రకారం అతని రోజువారీ జీతం రూ.64 లక్షలు. 2023 నాటికి, సంజయ్ మెహ్రోత్రా బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మైక్రోన్ టెక్నాలజీ, CDW, సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ , ఇంజనీరింగ్ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ల బోర్డులో పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment