SanDisk
-
రోజుకు రూ. 64 లక్షలు: ఇన్స్పిరేషనల్ సంజయ్ సక్సెస్ స్టోరీ తెలుసా?
Sanjay Mehrotra భారతదేశంలోని గుజరాత్లో మొట్టమొదటి సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి అమెరికా చిప్ దిగ్గజం మైక్రోన్ టెక్నాలజీ కమిట్మెంట్ను పునరుద్ఘాటించిన తర్వాత సంజయ్ మెహ్రోత్రా ఇటీవల వార్తల్లో నిలిచారు. ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఈ నేపథ్యంలో సంజయ్ మెహ్రోత్రా నెట్‌వర్త్, ఆయన సక్సెస్స్టోరీని ఒకసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన సంజయ్ మెహ్రోత్రా ప్రపంచ ఐటీ పరిశ్రమ దిగ్గజాల్లో ఒకరు. నాలుగు దశాబ్దాలకు పైగా ఐటీ పరిశ్రమలో విశేష సేవలందించారు. బిట్స్ పిలానీ విద్యార్థి దేశాన్ని సెమీకండక్టర్ హబ్‌గా మార్చేలా దేశీయ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ముందంజలో ఉన్న వ్యాపార నాయకులలో ఒకరుగా ఉన్నారు ఐఐటీ, ఐఐఎం, టిపుల్ ఐటీ లాంటివి చదవకపోయినా టెక్నాలజీలో, ఐటీ ఇండస్ట్రీలో దిగ్గజంగా పేరు తెచ్చుకున్నారు సంజయ్ మెహ్రోత్రా. 1988లో ప్రముఖ బ్రాండ్ శాన్డిస్క్ని స్థాపించారు. 2011-2016 వరకు దానికి సీఈవోగా పనిచేశారు. తన సుదీర్ఘ కెరీర్లో ఇంటెల్, అట్మెల్ , ఇంటిగ్రేటెడ్ డివైస్ టెక్నాలజీ వంటి కంపెనీలతో కలిసి పనిచేశారు. మెహ్రోత్రా 2017లో మైక్రోన్ సీఈఓగా నియమితులయ్యారు. మైక్రాన్ టెక్నాలజీ ఇంక్ సీఈవో,ప్రెసిడెంట్‌గా ఉన్న సంజయ్ మెహ్రోత్రా ప్రస్తుత అంచనా నికర విలువ సుమారు 57.36 మిలియన్ డాలర్లుగా అంచనా. ఆయన రోజు సంపాదన రూ. 64 లక్షలు. మెహ్రోత్రా కాన్పూర్‌లో జన్మించినప్పటికీ, పెరిగింది మాత్రం ఢిల్లీలో BITS పిలానీ నుండి B.Tech పూర్తి చేసిన తర్వాత, బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ,అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశారు.2009లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పట్టభద్రుడు. సంజయ్ మెహ్రోత్రా 1988లో ప్రముఖ బ్రాండ్ శాన్డిస్క్ని స్థాపించారు మరియు 2011 నుండి 2016 వరకు దాని CEOగా పనిచేశారు. తన సుదీర్ఘ కెరీర్లో ఇంటెల్, అట్మెల్ మరియు ఇంటిగ్రేటెడ్ డివైస్ టెక్నాలజీ వంటి కంపెనీలతో కలిసి పనిచేశారు. మీడియా కథనాల ప్రకారం అతని రోజువారీ జీతం రూ.64 లక్షలు. 2023 నాటికి, సంజయ్ మెహ్రోత్రా బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మైక్రోన్ టెక్నాలజీ, CDW, సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ , ఇంజనీరింగ్ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ల బోర్డులో పనిచేస్తున్నారు. -
ఐఫోన్ లోమెమొరీకి చెక్‌పెట్టే ఫ్లాష్ డ్రైవ్
ఖరీదైన ఐఫోన్ చేతిలో ఉన్నా....ఇంటర్నల్ మెమొరీ తక్కువగా ఉంఉండి ఇబ్బంది పడుతున్నారా?అందమైన ఫోటోలను, వీడియోలను స్టోర్ చేయలేక అసహనానికి గురవుతున్నారా. ఇక ఆభాధలన్నటినీ ఒక పీడకలగా మర్చిపోండి. సాన్ డిస్క్ సంస్థ ఐ ఫోన్ వినియోగదారులకు ఓ తీపికబురు అందిస్తోంది. ఐ ఫోన్లోని పరిమిత ఇంటర్నల్ మెమొరీ ఇబ్బందులకు చెక్ పట్టే సరికొత్త ఫ్లాష్‌డ్రైవ్ ఇపుడు అందుబాటులోకి తెచ్చింది. అదే సాన్‌డిస్క్ సంస్థ రూపొందించిన ఐ ఎక్స్పాండ్ ఫ్లాష్ డ్రైవ్. ఇతర స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే... ఐ ఫోన్ లో మెమొరీ కార్డు ఎక్స్ పాండ్ చేసుకునే సదుపాయం ఇప్పటివరకు లేదు. అయితే.. ఆ సమస్యకు పరిష్కారంగా సాన్‌డిస్క్ ‘ఐఎక్స్‌పాండ్’ అనే ఫ్లాష్డ్రైవ్ను తయారు చేసింది. దీని ద్వారా , ఫోటోలను, వీడియోలు నేరుగా ఈ ఫ్లాష్డ్రైవ్లోకే వెళ్లేలా ‘ఐఎక్స్‌పాండ్’ యాప్‌తో సెట్ చేసుకోవచ్చు.కేబుల్ ద్వారా ఐఫోన్.. ఐప్యాడ్‌తో కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాదు.. ఈ ఫ్లాష్డ్రైవ్లో ఎన్క్రిప్షన్ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. దీంతో ఐఫోన్లో ఉన్నట్లే డాటా పూర్తి భద్రంగా ఉంటుందని సాన్‌డిస్క్ చెబుతోంది. పాస్ వర్డ్ భద్రతతో పాటు, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ వెబ్సైట్లలో డైరెక్టుగా షేర్ చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం 16జీబీ.. 32 జీబీ.. 64 జీబీ.. 128జీబీ సామర్థ్యంతో ఈ ఫ్లాష్డ్రైవ్లు మార్కెట్లోకి వచ్చాయి. ఐపాడ్ మినీ, ఐ పాడ్ ఎయిర్ 1,ఎయిర్ 2 , ప్రోలతో పాటు ఐఫోన్ 5 తరువాత మోడళ్లు, ఫిప్త్ జనరేషన్ ఐ పాడ్ లాంటి దాదాపు 15 మోడళ్లకు ఈ సాన్ డిస్క్ ను అనుసంధానం చేసుకోవచ్చు. బెస్ట్ బై.కామ్, అమెజాన్, సాన్ డిస్క్.కామ్ ద్వారా ఈ సరికొత్త ఫ్లాష్ డ్రైవ్ అందుబాటులో ఉంది. -
ఫొటో తీయగానే స్టోరేజీలోకి
♦ శాన్డిస్క్ నుంచి కనెక్ట్ వైర్లెస్ స్టిక్ ♦ మూడు గ్యాడ్జెట్లకు సంధానించే వీలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్లో తీసిన ఫొటోలు, వీడియోలు సాధారణంగా ఇంటర్నల్ మెమరీ లేదా మైక్రో ఎస్డీ కార్డులో నిక్షిప్తమవుతుంటాయి. ఫ్లాష్ స్టోరేజ్ సొల్యూషన్స్‌లో ఉన్న శాన్డిస్క్ సంస్థ... కనెక్ట్ వైర్లెస్ స్టిక్ పేరిట వైఫైతో పనిచేసే చిన్న పరికరాన్ని రూపొం దించింది. ఫొటోలు, వీడియోలు తీసిన వెంటనే ఆటో బ్యాక్ అప్ ఫీచర్‌తో ఈ స్టిక్లోకి వెంటనే వచ్చి చేరిపోతాయి. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్.. ఇలా ఒకేసారి మూడు గ్యాడ్జెట్లనూ శాన్డిస్క్ యాప్ డౌన్లోడ్ చేయటం ద్వారా అనుసంధానించవచ్చు. దీనివల్ల ఈ మూడు గాడ్జెట్లకూ ఈ స్టిక్ ఆటో బ్యాకప్‌గా పనిచేస్తుంది. అంతేకాక స్టిక్‌లో నిక్షిప్తమై ఉన్న ఫొటోలు, పాటలు, వీడియోలను ఈ మూడు గ్యాడ్జెట్లను వాడుతున్నవారూ ఒకేసారి ఎంజాయ్ చేయవచ్చు. హెచ్డీ వీడియోను ఎటువంటి అడ్డంకి లేకుండా మూడింటిలోనూ వీక్షించవచ్చు. బిల్ట్ ఇన్ వైఫైతో తయారైన ఈ స్టిక్ 150 అడుగుల దూరం వరకు పనిచేస్తుంది. 16జీబీ మొదలు 200 జీబీ సామర్థ్యం వరకు ఉన్న ఈ స్టిక్స్ ధర ల శ్రేణి రూ.2,390 నుంచి రూ.9,990 వరకూ ఉంది. టాప్ రిటైల్ దుకాణాలతోపాటు ఆన్లైన్లో లభిస్తాయి. అధిక సామర్థ్యమున్నవే.. దేశంలో శాన్డిస్క్ 37 శాతం వాటాతో అగ్ర స్థానంలో ఉందని కంపెనీ భారత్, సార్క్ దేశాల మార్కెటింగ్ డెరైక్టర్ జగనాథన్ చెల్లయ్య మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. భారత్‌లో 2015లో వివిధ కంపెనీలు రిటైల్ ప్యాక్‌లలో 9 కోట్ల యూనిట్ల యూఎస్బీ, మైక్రో ఎస్డీ, కెమెరా కార్డులు విక్రయించాయని చెప్పారు. తమ ఉత్పత్తుల అభివృద్ధిలో బెంగళూరు ఆర్అండ్డీ కేంద్రం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. 2 జీబీ, 4జీబీ మైక్రోఎస్డీ కార్డుల విక్రయాలను భారత్‌లో నిలిపివేశామని, 8 జీబీ ఆపైన సామర్థ్యమున్నవే అందుబాటులో ఉంచామని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గతేడాది 200 కోట్ల యూనిట్లను శాన్డిస్క్ విక్రయించిందని తెలిపారు. ఆపిల్ ఫోన్ల కోసం అన్ని ఫార్మాట్స్‌ను సపోర్ట్ చేసే ఐ-ఎక్స్పాండ్ ఫ్లాష్ డ్రైవ్‌ను 16-128 జీబీ సామర్థ్యంలో శాన్డిస్క్ రూపొందించింది. ధరల శ్రేణి రూ.4,490-10,990 మధ్య ఉంది.