ఐఫోన్ లోమెమొరీకి చెక్పెట్టే ఫ్లాష్ డ్రైవ్
ఖరీదైన ఐఫోన్ చేతిలో ఉన్నా....ఇంటర్నల్ మెమొరీ తక్కువగా ఉంఉండి ఇబ్బంది పడుతున్నారా?అందమైన ఫోటోలను, వీడియోలను స్టోర్ చేయలేక అసహనానికి గురవుతున్నారా. ఇక ఆభాధలన్నటినీ ఒక పీడకలగా మర్చిపోండి. సాన్ డిస్క్ సంస్థ ఐ ఫోన్ వినియోగదారులకు ఓ తీపికబురు అందిస్తోంది. ఐ ఫోన్‌లోని పరిమిత ఇంటర్నల్ మెమొరీ ఇబ్బందులకు చెక్ పట్టే సరికొత్త ఫ్లాష్‌డ్రైవ్ ఇపుడు అందుబాటులోకి తెచ్చింది. అదే సాన్‌డిస్క్ సంస్థ రూపొందించిన ఐ ఎక్స్పాండ్ ఫ్లాష్ డ్రైవ్.
ఇతర స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే... ఐ ఫోన్ లో మెమొరీ కార్డు ఎక్స్ పాండ్ చేసుకునే సదుపాయం ఇప్పటివరకు లేదు. అయితే.. ఆ సమస్యకు పరిష్కారంగా సాన్‌డిస్క్ ‘ఐఎక్స్‌పాండ్’ అనే ఫ్లాష్‌డ్రైవ్‌ను తయారు చేసింది. దీని ద్వారా , ఫోటోలను, వీడియోలు నేరుగా ఈ ఫ్లాష్‌డ్రైవ్‌లోకే వెళ్లేలా ‘ఐఎక్స్‌పాండ్’ యాప్‌తో సెట్ చేసుకోవచ్చు.కేబుల్ ద్వారా ఐఫోన్.. ఐప్యాడ్‌తో కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
అంతేకాదు.. ఈ ఫ్లాష్‌డ్రైవ్‌లో ఎన్‌క్రిప్షన్ సాఫ్ట్‌వేర్ కూడా ఉంటుంది. దీంతో ఐఫోన్‌లో ఉన్నట్లే డాటా పూర్తి భద్రంగా ఉంటుందని సాన్‌డిస్క్ చెబుతోంది. పాస్ వర్డ్ భద్రతతో పాటు, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ వెబ్సైట్లలో డైరెక్టుగా షేర్ చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం 16జీబీ.. 32 జీబీ.. 64 జీబీ.. 128జీబీ సామర్థ్యంతో ఈ ఫ్లాష్‌డ్రైవ్‌లు మార్కెట్‌లోకి వచ్చాయి. ఐపాడ్ మినీ, ఐ పాడ్ ఎయిర్ 1,ఎయిర్ 2 , ప్రోలతో పాటు ఐఫోన్ 5 తరువాత మోడళ్లు, ఫిప్త్ జనరేషన్ ఐ పాడ్ లాంటి దాదాపు 15 మోడళ్లకు ఈ సాన్ డిస్క్ ను అనుసంధానం చేసుకోవచ్చు. బెస్ట్ బై.కామ్, అమెజాన్, సాన్ డిస్క్.కామ్ ద్వారా ఈ సరికొత్త ఫ్లాష్ డ్రైవ్ అందుబాటులో ఉంది.