యాపిల్ సంస్థకు మరో సవాల్!
యాపిల్ సంస్థకు మరో సవాల్ ఎదురైంది. ఇటీవలే ఎఫ్బీఐ అభ్యర్థనను తిరస్కరించినా ఫలితం లేకపోయింది. థర్డ్ పార్టీ సహాయంతో ఐ ఫోన్ అన్లాక్ చేయించుకునే ప్రయత్నం చేయడంతో చివరికి యాపిల్ సహాయం చేస్తానంటూ ముందుకొచ్చింది. అయితే తాజాగా మరో డ్రగ్ డీలర్ ఐ ఫోన్ తెరిచేందుకు సహకరించాలంటూ అభ్యర్ధన రావడం యాపిల్ సంస్థకు పెద్ద సమస్యగా మారింది.
యాపిల్ ఐ ఫోన్ వాడే వారిలో అధికశాతం దానిలో ఉన్న ఫీచర్స్లో ముఖ్యంగా ప్రైవసీకే ప్రాధాన్యతనిస్తారు. అయితే ప్రస్తుతం అదే విషయంలో యాపిల్ సంస్థ సవాళ్ళపై సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తోంది. అమెరికా బాంబుదాడి టెర్రరిస్టు ఐ ఫోన్ 5ఎస్ పే తెరిచేందుకు యాపిల్ సంస్థ సహాయాన్ని కోరిన ఎఫ్బీఐ.. న్యాయపోరాటాన్ని చేసింది.
అన్లాక్కు ఐఫోన్ సంస్థ నిరాకరించడంతో థర్డ్ పార్టీ సహాయంతో విజయవంతంగా తెరిచేందుకు ప్రయత్నించి సక్సెస్ అయింది. అక్కడ మొదలైన కథతో యాపిల్ ఫోన్ సీక్రెట్ను పటాపంచలు చేసేందుకు పలు సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించి, చివరికి ఓ సంస్థ ఐపీ బాక్స్ ద్వారా ఐఫోన్ను అన్లాక్ చేసి విజయం సాధించింది. అక్కడి వరకూ బాగానే ఉంది.
ఇప్పుడు తాజాగా మరో సమస్య ప్రారంభమైంది. ఓ మాదక ద్రవ్యాల డీలర్ ఐ ఫోన్ ను అన్ లాక్ చేయాలంటూ బ్రూక్లిన్లోని ఓ ఫెడరల్ న్యాయమూర్తిని ప్రాసిక్యూటర్లు కోరడంతో మళ్ళీ అన్లాక్ సమస్య తెరపైకి చ్చింది. ఇప్పటికే యాపిల్ ఐ ఫోన్లను ఛేదించలేకపోతున్నామని ఐ ఫోన్ 5ఎస్ తెరిచే విషయంలో ఎఫ్బీఐ చెప్పినా... ప్రాసిక్యూటర్లు మరోసారి అన్ లాక్ విషయం తెరపైకి తేవడం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.
అయితే ప్రభుత్వ సూచనలు, వారెంట్లు ఉన్నపుడు ఫోన్లోని డేటాను తెలుసుకునేందుకు యాపిల్ సహాయం అవసరం అవుతుందని న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రస్తుత డ్రగ్ డీలర్ కేసు విషయంలో యాపిల్ సహాయం తప్పదని, అంతేకాక కోర్టులో ఉన్న ఇంకా సుమారు 70 కేసుల్లో ఐవోఎస్ 7 రన్ చేస్తున్న ఫోన్లను డేటా కోసం తెరవాల్సిన అవసరం పడుతుందని చెప్తున్నారు. మరి.. డ్రగ్ వ్యాపారి ఫోన్ అన్లాక్ విషయంలో యాపిల్ సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.