drug dealer
-
డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: డ్రగ్ పెడ్లర్‌గా వ్యవహరిస్తున్న గుంటూరుకు చెందిన మస్తాన్ సాయిని సోమవారం తెలంగాణా ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకెళ్లింది. గుంటూరులోని మస్తానయ్య దర్గా నిర్వాహకుడు రావి రామ్మోహనరావు కుమారుడే ఈ మస్తాన్ సాయి. గతంలోనూ అతడిపై డ్రగ్స్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్ వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోనూ మస్తాన్ సాయి పేరు ప్రముఖంగా వినిపించింది. సినీ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మస్తాన్‌సాయి పేరు వెలుగులోకి వచి్చంది. మస్తాన్ దర్గాకు దర్శనం కోసం వచి్చన సమయంలో తనతో మస్తాన్‌సాయి అసభ్యంగా ప్రవర్తించినట్లు లావణ్య ఫిర్యాదు చేసింది. ఇతను దర్గాలో తలదాచుకుంటున్నట్లు సమాచారం అందడంతో నార్సింగ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించినట్లు సమాచారం. జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తరలిస్తుండగా సెబ్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో మస్తాన్‌సాయి పోలీసుల నుంచి తప్పించుకుపోయాడు. తర్వాత గుంటూరులోని మస్తాన్ దర్గాలోనే ఉంటున్నప్పటికీ గుంటూరు పోలీసులతో కుమ్మక్కు కావడంతో వారు అతడి జోలికి వెళ్లలేదని సమాచారం. -
Pune Drug Case: వీడియో బహిర్గతంతో 14 మంది అరెస్ట్
మహారాష్ట్రలోని పూణెలో ఓ పబ్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పబ్‌లో కూర్చుని కొందరు డ్రగ్స్ తీసుకోవడం దానిలో కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.అక్రమ పబ్‌లపై వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించని పబ్‌లపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూణెలోని ఫెర్గూసన్ రోడ్డులోని ఒక పబ్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కలకలం చెలరేగింది.పబ్‌లోని వాష్‌రూమ్‌లో ఇద్దరు యువకులు డ్రగ్స్ తీసుకోవడం వీడియోలో కనిపిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలలో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం ఈ కేసులో ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేసింది. వీరిలో ఆరుగురు వెయిటర్లతో మొత్తం ఎనిమిదిమంది ఉన్నారు. ఈ కేసులో నలుగురు పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. ఈ కేసులో అరెస్టయిన ఎనిమిది మందిని జూన్ 29 వరకు పోలీసు కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు.పుణె పోలీసులు పబ్ యజమాని సంతోష్ విఠల్ కమ్తే, సచిన్ కమ్తేతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. పబ్‌లోని ప్రధాన గేటును మూసివేసి, మరో గేటు ద్వారా పబ్‌లో కూర్చున్నవారికి వెయిటర్లు మత్తు పదార్థాలు అందించారని పోలీసులు గుర్తించారు. విషయం బయటకు పొక్కడంతో వెంటనే చర్యలు చేపట్టిన పోలీసులు పబ్‌కు సీల్ వేసి, డ్రగ్స్ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. -
లేడీ అనురాధ డ్రగ్స్ దందా
హైదరాబాద్: డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న లేడీ అనురాధ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో అక్రమంగా డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో లేడీ అనురాధ కీలకమని వెల్లడించారు. మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో పక్కా సమాచారంతో భారీగా డ్రగ్స్ పట్టుకున్నామని చెప్పారు. వీటి విలువ దాదాపు రూ.14 లక్షలు ఉంటుందని వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముఠాలో కీలకంగా ఉన్న లేడీ అనురాధ భర్త నుండి డైవర్స్ తీసుకుంది. రెగ్యులర్‌గా గోవాకు వెళ్తూ ఉంటుంది. గోవాలో నైజీరియాకు చెందిన జేమ్స్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. గోవాలో జేమ్స్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి రోడ్డు మార్గంలో నగరానికి తీసుకువచ్చింది. గోవాలో జేమ్స్ వద్ద గ్రామ్ పది వేలు చొప్పున డ్రగ్స్ కొనుగోలు చేసింది. నగరానికి తీసుకువచ్చి డిమాండ్‌ను బట్టి గ్రాము 20వేలకు పైగా విక్రయించింది. డ్రగ్స్ అమ్మకంలో వరలక్ష్మి టిఫిన్స్ అధినేత ప్రభాకర్ రెడ్డి ఈమెకు సహకరించాడు. గుంటూరుకు చెందిన శివ అనే వ్యక్తి కూడా అనూరాధకు డ్రగ్ అమ్మకంలో సహకరించాడు. ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని, వెహికల్స్, మొబైల్ ఫోన్స్ సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. అందులో వినియోగదారులకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నామని చెప్పారు. రిమాండ్‌కు తరలించి మళ్లీ కస్టడీలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. 48 గ్రాముల MDMA, మరొక ఎనిమిది గ్రాముల క్రషింగ్ mdma, 51 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: ‘పండగ’ నేపథ్యంలో అత్యంత అప్రమత్తం -
ఔషధ విక్రయాల్లో అక్రమాలను అరికట్టాలి
సాక్షి, అమరావతి: ఔషధాల క్రయవిక్రయాల్లో అవకతవకలు, నకిలీ, నాణ్యత లేని మందుల చెలామణి, మెడికల్ షాపుల్లో అక్రమాలను అరికట్టడానికి డీజీ స్థాయిలో తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ఔషధ నియంత్రణా విభాగంపై గురువారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఔషధ నియంత్రణా విభాగం మరింత సమర్థంగా పనిచేయాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది ఖాళీల భర్తీకి నివేదిక తయారుచేయాలని చెప్పారు. కేంద్ర ఔషధ నియంత్రణ శాఖకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులకు లేఖ రాయాలన్నారు. సీఆర్‌యూ ఫిర్యాదుల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వైద్యశాఖ ప్రత్యేక, ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఔషధ నియంత్రణ డీజీ కొల్లి రఘురామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిందితుడి అతితెలివి: పోలీసులకు చిక్కుకుండా కొరియన్‌లా సర్జరీ! కానీ..
ఇటీవలకాలంలో పలు నేరస్తులు పోలీసులకు పట్టబడకుండా ఉండేందుకు చేసే పనులు విస్మయానికి గురి చేస్తున్నాయి. అతి తెలివితో పేరు, వేషంతో సహా కొందరూ సర్జరీలతో ముఖ మార్పిడికి సిద్ధపడిపోతున్నారు. అయినప్పటికీ వారు చేసిన నేరాలే వారిని చివరికి పట్టించేస్తున్నాయి. ఎన్ని వేషాలు వేసినా.. చివరికీ కటకటాలపాలు కాక తప్పట్లేదు. వివరాల్లోకెళ్తే..థాయ్ డ్రగ్ డీలర్ పోలీసులకు చిక్కకూడదని పలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు. ఐతే అతను చేసిన ఆ ప్రయత్నాలేమి ఫలించకపోగా..అతడు పోలీసులకు పట్టుబడక తప్పలేదు. సహరత్ సవాంగ్జాంగ్ అనే వ్యక్తి కొరియన్‌లా సర్జరీ చేయించుకుని సియోంగ జిమిన్గా పేరు మార్చుకుని అసలు గుర్తింపు దాచే యత్నం చేశాడు. ఐతే అతను డ్రగ్స్‌ను ఇతరలకు కొనుగోలు చేయడం కారణంగా అతన్ని సులభంగా ట్రాక్ చేశారు పోలీసులు. దీంతో బ్యాంకాక్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న సవాంగ్జాంగ్ని పోలీసులు అందుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేగాదు దర్యాప్తులో సాక్ష్యులు అతన్ని అందమైన కొరియన్‌గా అభివర్ణించారు. ఐతే అతను క్లాస్ వన్ డ్రగ్ అయిన ఎక్స్టసీ(ఎండీఎంఏ)ని దిగుమతి చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతను పట్టబడటానికి ముందు గతంలో మూడుసార్లు అరెస్టు అయ్యాడు కూడా. గానీ ఏదోరకంగా నిర్బంధం నుంచి తప్పించుకునే వాడని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసు మేజర్-జనరల్ థీరదేజ్ తమ్మసూటీ మాట్లాడుతూ.. సవాంగ్జాంగ్ కేవలం 25 ఏళ్ల వయసులో పేరుమోసిన డ్రగ్ డీలర్‌గా మారాడని, ఇలాంటి వాళ్లు విదేశాల్లో ఎక్కువగా ఉంటున్నట్లు తెలిపారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా, ఇటీవల థాయ్ ప్రభుత్వం మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణ తదితరాలపై కొరడా ఝళిపిస్తోంది. (చదవండి: అమెరికా ఏమి ప్రపంచ ఏటీఎం కాదు! మరోసారి పాక్‌పై విరుచుకపడ్డ నిక్కీ) -
డ్రగ్స్ కేసులో పోలీసుల కస్టడీకి మోహిత్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఘరానా ఈవెంట్ల డీజే సప్లయర్, ప్రముఖ హీరోయిన్ నేహా దేశ్‌పాండే భర్త మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరోన్ మోహిత్‌ను డ్రగ్స్ కేసులో తమ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. మూడు రోజుల క్రితం నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మోహిత్‌ను అరెస్ట్ చేసింది. తాజాగా చంచల్‌గూడ జైలు నుంచి మోహిత్‌ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ వాడుతున్న ప్రముఖుల వివరాలు, ఎక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చారనే కోణంలో పోలీసుల ప్రశ్నిచనున్నారు. గోవా కింగ్ పిన్ ఎడ్విన్‌తో మోహిత్‌కు గల సంబంధాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే అతడి కాల్ లిస్ట్, వాట్సప్ చాటింగ్‌లపైనా ప్రశ్నించనున్నారు. కాటాక్ట్ లిస్ట్‌లో మొత్తం 50 మందికిపైగా కంజూమర్స్ ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్, గోవా, ముంబైలో ఈవెంట్స్ నిర్వహించిన మోహిత్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలపై పోలీసులు విచారిస్తున్నారు. ఇదీ చదవండి: డీజే ముసుగులో డ్రగ్ పెడ్లింగ్.. సినీనటి నేహా దేశ్‌పాండే భర్త అరెస్ట్ -
డీజే ముసుగులో డ్రగ్ పెడ్లింగ్.. సినీనటి భర్త అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఘరానా ఈవెంట్ల డీజే సప్లయర్ మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరోన్ మోహిత్‌ను డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్– న్యూ) అధికారులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఆయన భార్య నేహా దేశ్‌పాండే పలు టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్గా నటించారు. అతడు డీజే నిర్వాహకులతోపాటు ఈవెంట్లలో మాదకద్రవ్యాలు సరఫరా చేసేవాడని, గోవాకు చెందిన డ్రగ్స్ డాన్ ఎడ్విన్ నుంచి వీటిని ఖరీదు చేసేవాడని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కొండాపూర్ ప్రాంతానికి చెందిన మోహిత్ 2014లో ‘ది అన్‌స్క్రిప్టెడ్’పేరుతో సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్, ముంబై, గోవా, బెంగళూరుల్లో జరిగే అనేక ఈవెంట్లు, పబ్స్‌కు డీజేలు సరఫరా చేస్తున్నాడు. గోవాలో సన్‌బర్న్ బీచ్ క్లబ్ సహా అనేక భారీ ఈవెంట్స్ నిర్వహించాడు. ఆయా పబ్స్ నిర్వాహకులతో కలిసి వాటిలో ప్రత్యేకంగా రేవ్ పార్టీలు నిర్వహించే వాడు. దీనికోసం ఎడ్విన్‌సహా దాదాపు 50 మంది డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారి నుంచే కొకైన్ ఖరీదు చేసి సరఫరా చేసేవాడు. ‘క్రూయిజ్’లో ఆధారాల్లేక.. గతేడాది అక్టోబర్ 2న ఎన్సీబీ అధికారులు ముంబై క్రూయిజ్ డ్రగ్ పార్టీపై దాడి చేసి షారూఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ సహా పలువురిని డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మోహిత్ కూడా అదే క్రూయిజ్‌లో ఉన్నా ఇతడి వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరక్కపోవడం, ఆర్యన్‌తో సంబంధాలపై ఆధారాలు లేకపోవడంతో అధికారులు విడిచిపెట్టారు. గోవాకు చెందిన డ్రగ్స్ డాన్ ఎడ్విన్‌ను హెచ్–న్యూ అధికారులు గతేడాది నవంబర్ 5న అరెస్టు చేసి విచారించగా మోహిత్ పేరు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడు గోవా, ముంబైల్లో తలదాచుకున్నాడు. హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ పి.రాజేశ్ నేతృత్వంలోని బృందం అతడి కోసం వివిధ ప్రాంతాల్లో గాలించింది. మోహిత్ ‘డిసెంబర్ 31’న గోవాలో రూ.2 కోట్లు వెచ్చించి భారీ ఈవెంట్ నిర్వహించినట్లు సమాచారం అందుకున్న హెచ్–న్యూ బృందం అక్కడికి వెళ్లగా త్రుటిలో తప్పించుకుని విమానంలో హైదరాబాద్ వచ్చేశాడు. వేట కొనసాగించిన హెచ్–న్యూ ఎట్టకేలకు అతడిని పట్టుకుంది. అతడి వద్ద నుంచి గ్రాము కొకైన్ స్వాధీనం చేసుకుంది. రామ్‌గోపాల్‌పేట ఠాణాలో ఉన్న ఎడ్విన్ కేసులోనూ రిమాండ్‌కు తరలించింది. విచారణలో నగరానికి చెందిన అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులతో అతడికి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. అయితే వారిలో ఎందరు డ్రగ్స్ ఖరీదు చేశారు? ఏఏ పబ్స్ నిర్వాహకులతో అతడికి ఒప్పందాలు ఉన్నాయనే వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికోసం వారం రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ దందాలో మోహిత్ భార్య నేహా దేశ్‌పాండేకు ఏమైనా లింకు ఉందా? అనే అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేహా దేశ్‌పాండే ‘ది కిల్లర్, దిల్ దివానా, బెల్స్’తదితర సినిమాల్లో హీరోయిన్గా నటించారు. ఇదీ చదవండి: సర్వం ‘త్రిమూర్తుల’ కనుసన్నల్లోనే! -
డ్రగ్ కేసు: గోవాలో కీలక సూత్రధారి ఎడ్విన్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గోవా డ్రగ్ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్ నూనిస్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా కేంద్రంగా దేశ్యావ్యాప్తంగా డ్రగ్స్ సరాఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలో ఎడ్విన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. గత 15 రోజులుగా ఎడ్విన్ కోసం గోవాలో పోలీసులు గాలిస్తుండగా.. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శనివారం రోజు రాత్రి వరకు అతన్ని హైదరాబాద్ తీసుకురానున్నారు. కాగా ఎడ్విన్ గోవా కర్లీస్ రెస్టారెంట్, పబ్ యజమాని. ఇక ఇదే కేసులో మూడు నెలల క్రితం నారాయణ బోర్కర్‌ను హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బోర్కర్ గోవా నుంచి డ్రగ్స్ తీసుకొని హైదరాబాదులో సరాఫరా చేస్తుంటాడు. ఇతను గోవాలోని అంజునా బీచ్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో ఏళ్లుగా డ్రగ్స్ దందా చేస్తూ దాదాపు 600 మంది కస్టమర్లు కలిగి ఉన్నాడు. ఈ ఘరానా పెడ్లర్ ప్రీతీష్ నారాయణ్ బోర్కర్‌ను హెచ్–న్యూ ఆగస్టు 17న పట్టుకుంది. ఇతడికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న స్టీవెన్, ఎడ్విన్ నూనిస్‌లకు బీజేపీ నేత, టిక్‌టాక్ స్టార్ సొనాలీ ఫోగాట్ హత్య కేసుతోనూ సంబంధాలు బయటపడ్డాయి. అయితే నారాయణ బోర్కర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా గోవాలో పలువురుపై నార్కోటిక్ విభాగం పోలీసులు నిఘా పెట్టారు ఈ క్రమంలోనే మూడురోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఎడ్విన్‌ను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు అనుమానాస్పద మృతి.. హత్యకేసుగా.. -
ప్రేయసి ముద్దే.. పోలీసులకు పట్టించింది
అతనొక భయంకరమైన నేరస్తుడు. సుమారు 200 దేశాల మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. 196 దేశాల్లో ఇంటర్‌పోల్ అతని అరెస్ట్ కోసం రెడ్ వారెంట్ జారీ చేసింది. ఏళ్ల తరబడి తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే ప్రియురాలి అత్యుత్సాహంతో ఎట్టకేలకు బుక్కైపోయాడు. ఆమెకు ముద్దు పెట్టి పోలీసులకు దొరికిపోయాడు. అదెలాగంటే.. మెక్సికన్ డ్రగ్ లార్డ్, సినాలోవా కార్టెల్ మాఫియా ముఖ్యనేత జోవాక్విన్ గుజ్మన్ అలియాస్ ఎల్ చాపో గుర్తున్నాడా? ప్రస్తుతం అతను జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అతని ముఖ్య అనుచరుడు, ఎల్ పిట్ గా పేరొందిన ‘బ్రియాన్ డొనాసియానో ఒలుగ్విన్ వెర్డుగో’ మాత్రం పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అంతేకాదు ఇప్పటికీ డ్రగ్స్లావాదేవీలు, అక్రమ రవాణా కొనసాగిస్తూ.. ఎల్ చాపోనే మించిపోయాడు. అలా 39 ఏళ్ల ఎల్ పిట్‌పై.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్ పోల్ వారెంట్లు జారీ అయ్యాయి. చివరికి.. అతగాడి గాళ్ ఫ్రెండ్ అత్యుత్సాహమే అతన్ని పట్టించింది. కొన్నిరోజుల కిందట ఫేస్ బుక్ లో అమెరికా డ్రగ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ అధికారులకు ఓ ఫొటో కంటబడింది. ఓ పర్యాటక ప్రాంతంలో ఓ జంట ముద్దు పెట్టుకుంటున్న ఫొటో అది. ఆ ఫొటోలో ఉన్నది ఎల్ పిట్ అని గుర్తించిన అమెరికా డ్రగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అతడు కొలంబియాలో ఉన్నట్టు కనిపెట్టారు. పక్కా స్కెచ్‌తో.. వెంటనే కొలంబియా అధికారులకు సమాచారం అందించారు. దాంతో పక్కా ప్లాన్ వేసిన కొలంబియా పోలీసులు క్యాలీ నగరంలోని ఓ విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఎల్ పిట్ ను అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి అతడు కొలంబియాలోనే ఉంటున్నాడట. మెక్సికో, అమెరికా దేశాలకు వేల కోట్ల విలువైన కొకైన్ ను తరలించేందుకు కొలంబియాలోని (రివల్యూషనరీ ఆర్మ్ డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా) 'ఫార్క్' గెరిల్లా దళాల సాయం కోరేందుకు అతడు కొలంబియాలో మకాం వేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో.. మెక్సికోలో మోడల్ అయిన తన గర్ల్‌ఫ్రెండ్‌తో క్యాలీలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో దిగినట్లు తెలిసింది. ఆపై ఆమె ప్రఖ్యాత టూరిస్టు కేంద్రం లాస్ క్రిస్టాలెస్ కు తీసుకువచ్చింది. అక్కడ పర్వతంపై ముద్దు పెట్టుకుంటూ ఇద్దరూ సెల్ఫీ దిగారు. ఆ ఫొటోను ఆమె సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా.. దొరికిపోయాడు. ఇదే మెక్సికోలో అయి ఉంటేనా? అయితే దాడుల సమయంలో తనను అరెస్ట్ చేయవద్దంటూ ఎల్ పిట్ కొలంబియా పోలీసులకు 2,65,000 డాలర్ల లంచం ఇచ్చే ప్రయత్నం చేశాడట. అంతేకాదు, ఇదే ఘటన మెక్సికోలో జరిగుంటే తన సాయుధ దళాలు కొద్దిసేపట్లోనే తనను విడిపించి ఉండేవని పోలీసులతో చెప్పాడట. గట్టి భద్రత మధ్య అతడిని పలు కేసుల విచారణ నిమిత్తం అమెరికాలోని కాలిఫోర్నియాకు తరలించనున్నారు. -
ఇంటర్నెట్లో అండర్ వరల్డ్‌గా డార్క్ వెబ్!
...ఇటీవల కాలంలో బయటపడిన ఈ రెండు ఉదంతాలే కాదు... నగరంలో జరుగుతున్న డ్రగ్స్ దందాలో సగానికి పైగా డార్క్ నెట్ ద్వారానే సాగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం మహేష్ బ్యాంక్ కేంద్రంగా చోటు చేసుకున్న రూ.12.48 కోట్ల స్కామ్‌లోనూ డార్క్ వెబ్ పాత్ర ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిపై పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హెచ్–న్యూలో పని చేస్తున్న సిబ్బంది, అధికారులకు ఈ కోణంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించడానికీ సన్నాహాలు జరుగుతున్నాయి. సాక్షి హైదరాబాద్: మాదకద్రవ్యమైన ఎల్ఎస్డీ బ్లాట్స్ డార్క్ నెట్ నుంచి ఖరీదు చేసి, నగరంలో విక్రయిస్తున్న షాబాజ్నగర్, కూకట్పల్లి ప్రాంతాలకు చెందిన సయ్యద్ ఆసిఫ్ జిబ్రాన్, పి.తరుణ్‌లను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు గత నెల 24న పట్టుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందా గుట్టును హెచ్–న్యూ ఫిబ్రవరి 26న రట్టు చేసింది. దీనికి సూత్రధారిగా ఉన్న విద్యార్థి నిమ్మగడ్డ సాయి విఘ్నేష్ డార్క్‌నెట్ నుంచి ఎల్ఎస్డీ బ్లాట్స్ ఖరీదు చేసి విక్రయించాడు. అదో ‘అక్రమ’లోకం డార్క్ నెట్ లేదా డార్క్ వెబ్‌తో సమాజానికి, ఏజెన్సీలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. మాఫియా ప్రపంచంలో మాదిరిగానే ఆన్‌లైన్‌లోనూ అధోజగత్తు ఉంది. కనిపించే అండర్‌వరల్డ్‌లో మాఫియా డాన్లు రాజ్యమేలితే... ఇంటర్నెట్లోని డార్క్‌నెట్/వెబ్‌గా పిలిచే అండర్‌గ్రౌండ్ వెబ్‌లో డ్రగ్స్, ఆయుధాలు, మనుషుల అక్రమ రవాణా వంటి వ్యాపారాలు సాగుతుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటూ అక్రమ దందాలకు డార్క్ వెబ్ అడ్డాగా మారిపోయింది. నిఘాకు చిక్కకుండా ఉండేందుకు... కంప్యూటర్లలో వినియోగించే విండోస్ ఆపరేటింగ్ సిస్టం, వివిధ చిరునామాలతో ఇంటర్నెట్లో ఉండే వెబ్సైట్లు అందరికీ తెలిసినవే. ఇటీవల కాలంలో అనేక ఈ–కామర్స్ వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చి, అగ్గిపెట్టె నుంచి ఆడి కారు వరకు క్రయవిక్రయాలను ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చాయి. వీటి ద్వారా మాదకద్రవ్యాలు, ఆయుధాలు వంటివి విక్రయానికి పెడితే పోలీసు, నిఘా వర్గాలు గుర్తించి పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి నిఘాకు చిక్కకుండా, ‘తమ వినియోగదారుల’ మినహా మిగిలిన వారికి కనిపించకుండా అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాలు ఇంటర్నెట్లోని అండర్ వరల్డ్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. దీన్ని సాంకేతికంగా ‘డీప్ వెబ్’, ‘అండర్‌గ్రౌండ్ వెబ్’, ‘డార్క్ వెబ్’ అని పిలుస్తారు. ‘ఎంట్రీ’ సైతం ఈజీ కాదు.. ఏ వినియోగదారుడైనా విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ డీప్ వెబ్‌లోకి చొరబడటం సాధ్యం కాదు. ఈ అధోజగత్తులో అడుగుపెట్టాలంటే టెయిల్స్‌గా పిలిచే ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టంను ఇన్స్టాల్ చేసుకోవాలి. దీంతో పాటే టోర్స్ అనే ఆపరేటింగ్ సిస్టం సైతం ఇన్స్టాల్ అవుతుంది. వీటిని తమ కంప్యూటర్లలో ఏర్పాటు చేసుకుంటున్న పెడ్లర్లు తమ దందా కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ల్యాప్‌టాప్, కంప్యూటర్ ద్వారానే యాక్సస్ చేసే డార్క్ వెబ్‌ను ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల నుంచీ ఆపరేట్ చేసేస్తున్నారు. ఇందులో ఉండే అనేక వెబ్సైట్, గ్రూపులను సంప్రదించి డ్రగ్స్, మారణాయుధాల సహా ఏదైనా ఖరీదు చేసేయవచ్చు. పోస్టు లేదా కొరియర్ ద్వారా వచ్చే ఈ ‘మాల్’ను అందుకోవడానికి తప్పుడు చిరునామాలు ఇచ్చి నేరుగా ఆయా ఆఫీసులకు వెళ్లి..నకిలీ ధ్రువీకరణలు చూపించి డెలివరీ తీసుకుంటూ తమ ఉనికి బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బిట్ కాయిన్స్ రూపంలో చెల్లింపులు... డీప్ వెబ్‌లోని వెబ్సైట్లలో ఆర్డర్ ఓ ఎత్తయితే దీనికి సంబంధించిన చెల్లింపులు మరోఎత్తు. ఈ లావాదేవీలు సైతం ఆన్లైన్లోనే క్రిప్టోకరెన్సీగా పిలిచే బిట్‌కాయిన్స్ రూపంలోనే సాగుతాయి. దీనికోసమూ ఇంటర్నెట్లో కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. వాటిలోకి లాగిన్ కావడం ద్వారా ఓ ఖాతా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా నగదు చెల్లించి బిట్ కాయిన్స్‌ను తమ ఖాతాలోకి జమ చేసుకుంటారు. ‘డీప్ వెబ్’లో కొనుగోలు చేసిన ‘మాల్’కు అవసరమైన చెల్లింపులన్నీ ఈ బిట్‌కాయిన్స్ రూపంలోనే చేస్తారు. ఈ వ్యవహారంలో ఎక్కడా విక్రయిస్తున్న, ఖరీదు చేస్తున్న వ్యక్తుల వివరాలు వేరొకరికే కాదు... ఒకరికొకరికీ తెలిసే అవకాశం ఉండదు. హెచ్–న్యూకు చిక్కిన పెడ్లర్స్ ఈ రకంగానే దందా చేస్తూ ఎల్ఎస్డీని ఖరీదు చేసి నగరంలోని వారికి సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. సర్వర్లను కనిపెట్టడమూ అసాధ్యమే ‘డీప్ వెబ్’కు సంబంధించిన సర్వర్లు, వాటి చిరునామాలతో పాటు నిర్వహిస్తున్న వారి వివరాలూ బయటకు తెలిసే అవకాశాలు లేవు. ఇదే అసాంఘిక శక్తులకు కలిసి వస్తున్న అంశంగా మారిపోయింది. ఈ తరహా కేసులు గతంలో ఇతర నగరాల్లో ఎక్కువగా వెలుగులోకి వచ్చినా... ఇటీవల కాలంలో నగరంలోనూ పెరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఇలా ఆర్డర్ చేసిన డ్రగ్స్‌లో కొన్ని విదేశాల నుంచి మరికొన్ని ఉత్తరాది నుంచి వస్తున్నట్లు ఆధారాలు సేకరించామన్నారు. (చదవండి: డీజే.. డ్రగ్స్ రిస్క్!) -
ఇప్పుడు టోనీ.. అప్పుడు చుక్స్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ టోనీని న్యాయస్థానం అనుమతితో ఐదు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుని విచారించిన పంజగుట్ట పోలీసులు కీలకాంశాలను గుర్తించారు. దేశవ్యాప్తంగా డ్రగ్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న అతగాడు భారీ మాఫియానే నడిపాడని తేల్చారు. గతంలో టోనీ కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉన్నట్టు, ఎక్సైజ్ పోలీసులకు సంబంధించిన రెండు కేసుల్లో వాంటెడ్ అయినట్టు తేల్చారు. ఈ వివరాలు దర్యాప్తు అధికారులు గురువారం నాంపల్లి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పొందుపరిచారు. 2013 నుంచి దేశంలో అక్రమంగా నివసిస్తున్న టోనీ అనేక ప్రాంతాల్లో సంచరించాడు. తొలుత ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందా.. టోనీ ఒక్కొక్కచోట ఒక్కొక్క పేరు, గుర్తింపుతో నివసించాడు. తొలుత ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందా చేశాడు. ఇతడి అనుచరులు అక్కడ అరెస్టు కావడంతో తన మకాం బెంగళూరుకు మార్చాడు. ఆ నగరంలోనూ కొన్నాళ్లు డ్రగ్స్ దందా చేసిన ఇతగాడు ఎక్కడా తన ఉనికి బయటపడనీయలేదు. ఆ నగరంలోనూ మాదక ద్రవ్యాల కేసుల్లో ఇతడి అనుచరులే పట్టుబడ్డారు. దీంతో 2019లో హైదరా బాద్‌కు వచ్చిన టోనీ టోలిచౌకిలోని అద్దె ఇంట్లో నివసించాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఎస్కే చుక్స్ పేరుతో చెలామణి అయ్యాడు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పిస్తూ తన అనుచరులైన ఐవరీ కోస్ట్ జాతీయులు పాట్రిక్స్, అబ్దుల్యా, కెన్యాకు చెందిన సులేమాన్ ఇబ్రహీంలతో అమ్మించాడు. ఆ ఏడాది గోల్కొండ, నాంపల్లి ఎక్సైజ్ పోలీసులు వేర్వేరు సందర్భాల్లో ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు. ఆ కేసుల్లో చుక్స్గా టోనీ పేరు నమోదైంది. ఇప్పటికీ ఆ రెండు కేసుల్లోనూ ఇతడు వాంటెడ్‌గానే ఉన్నాడు. నిఘా పెరగడంతో ముంబైకి.. ఇలా హైదరాబాద్‌లోనూ టోనీపై నిఘా పెరగ డంతో మళ్లీ ముంబైకి మకాం మార్చాడు. గతంలో నివసించిన ప్రాంతానికి దూరంగా అడ్డా ఏర్పాటు చేసుకున్నాడు. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దందా చేస్తూ హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. టోనీ ఐదు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో పంజగుట్ట పోలీసులు అతనితో పాటు తాజాగా అరెస్టయిన ముగ్గురు అనుచరులనూ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిం చారు. ఈ సందర్భంగా న్యాయస్థానానికి సమర్పిం చిన రిమాండ్ రిపోర్ట్‌లో టోనీకి సంబంధించి కీలకాంశాలు పొందుపరిచారు. వీటి ఆధారంగా ఎక్సైజ్ పోలీసులు టోనీనీ పీటీ వారెంట్‌పై ఆ కేసుల్లో అరెస్టు చేయనున్నారు. ఆపై కోర్టు అనుమతితో టోనీని తమ కస్టడీలోకి తీసుకుని విచారించడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
స్వయం కృతాపరాధం: డ్రగ్స్‌తో అలంకరించి ఫోటోలు తీశాడు... అంతే చివరికి!!
Drug Dealer Decorated Christmas Tree With Cash And Cocaine: కొంతమంది అత్యుత్సహం లేదా వింతగా చేయాలనో చేసే పనులు వాళ్లను ఏ స్థితికి తీసుకువెళ్లుతుందో కూడా చెప్పలేం. ఒకచోట ఒక కుటుంబం క్రిస్మస్ చెట్టుని మంచి విద్యుత్ బల్బులతో అలంకరించి పెద్ద అగ్నిప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. అయితే ఈ వ్యక్తి విన్నూతనంగా క్రిస్మస్ చెట్టును అలంకరించి తనను తానే పోలీసులకు పట్టుబడేలా చేసుకున్నాడు. (చదవండి: పోలీస్ కమిషనర్ పేరుతో పోలీసులనే బురిడి కొట్టించాడు!!) అసలు విషయలోకెళ్లితే.... యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మార్విన్ పోర్సెల్లి అనే ఒక డ్రగ్ డీలర్ క్రిస్మస్ చెట్టుని డబ్బులతోనూ, మాదక ద్రవ్యాలతోనూ అందంగా అలంకరించాడు. పోనీ అక్కడితే ఆగకుండా వాటిని తన మొబైల్ ఫోన్‌తో ఫోటోలు తీశాడు. అంతే ఆ ఫోటోలు కాస్త ఇంగ్లాండ్‌లోని మెర్సీసైడ్ పోలీసులకు చేరడంతో పోర్సెల్లిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీసులు ఆ క్రిస్మస్ చెట్టు ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పైగా డ్రగ్స్‌కి బానిసైతే వారి అభిరుచి ఇంతటి విచిత్రమైన అలంకరణకు పురిగొలుపుతుందని చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు ఆ వ్యక్తి నుంచి సుమారు రూ 37 లక్షలు విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాం అని అన్నారు. అంతేకాదు ఓవర్‌బోర్డ్ అనే పేరుతో ఒక సంవత్సరం పాటు సాగిన ఆపరేషన్‌లో పోర్సెల్లిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ సమయంలో పోర్సెల్లి తోపాటు మరో ఎనిమిది మందిని కూడా అరెస్టు చేసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. (చదవండి: ఆ సమయంలో కూడా సేవలందించిన సూపర్ ఉమెన్లు) Can you imagine our surprise when we searched the mobile of Wavertree drug dealer Marvin Porcelli and found this?! 😮 pic.twitter.com/CvLOiFOwyJ — Merseyside Police (@MerseyPolice) December 20, 2021 We also caught eight other (un)wise men as part of Overboard and found lots of interesting parcels under the tree (as well as in other parts of their houses), namely drugs worth £1.3m pic.twitter.com/PeHOv8n4RO — Merseyside Police (@MerseyPolice) December 20, 2021 -
డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నటుడు
Singham 2 Actor Arrested For Smuggling Drugs: డ్రగ్స్ వినియోగిస్తూ నటుడు మెల్విన్ పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాల ప్రకారం..సూర్య హీరోగా నటించిన సింగం-2 సినిమాలో నటించిన నైజీరియన్దేశస్థుడు, నటుడు చాక్విమ్ మాల్విన్ గుర్తున్నాడు కదా.. ఆ సినిమాలో అక్రమంగా డ్రగ్స్ సప్లై చేసే ముఠాకు సంబంధించిన వాడిగా నటించాడు మాల్విన్. సీన్ కట్ చేస్తే నిజ జీవితంలో కూడా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. చదవండి : అరెరె.. కత్రినా కైఫ్‌కు జిరాక్స్ కాపీలా ఉందే.. నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 15లక్షల వరకు ఉంటుందని సమాచారం. 15 గ్రాముల MDMAతో పాటు 250 మిల్లీలీటర్ల హ్యాష్ ఆయిల్ సహా మొభైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో మెల్విన్ డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే మెల్విన్‌తో సినీ పరిశ్రమకు చెందిన ఎవరితో అయినా సంబంధాలు ఉన్నాయి?అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా కన్నడ, తమిళ, హిందీ భాషల్లో మెల్విన్ పలు చిత్రాల్లో నటించాడు. చదవండి: ‘డ్రైవింగ్ లైసెన్స్’ తీసుకోనున్న అక్షయ్‌కుమార్ -
గోవాలో హైదరాబాదీపెడ్లర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గోవా డ్రగ్ రాకెట్లో హైదరాబాద్ యువకుడు పట్టుబడటం సంచలనం రేపుతోంది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) వారం రోజులు జల్లెడ పట్టి డ్రగ్స్ దందా సాగిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసింది. వీరిలో హైదరాబాద్‌కు చెందిన సిద్దిఖ్ అహ్మద్ కూడా ఉన్నాడు. ఇప్పటికే డ్రగ్స్‌కు సంబంధించిన ఒక కేసులో టాలీవుడ్‌కు చెందిన 12 మంది సినీ ప్రముఖులను ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారించింది. అదే కేసులో మనీలాండరింగ్ అనుమానంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా దర్యాప్తు జరిపింది. ఇంతలోనే గోవాలో సిద్దిఖ్ పట్టుబడటంతో.. డ్రగ్స్ మాఫియాలో హైదరాబాద్ లింకు మరోసారి చర్చనీయాంశమయ్యింది.. ఛత్తీస్‌గఢ్ వ్యక్తితో కలిసి.. సిద్దిఖ్ అహ్మద్ అరెస్టుకు సంబంధించి గోవా ఎన్సీబీ అధికారులను ఆరా తీయగా సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నౌమాన్ సవేరీతో కలిసి సిద్దిఖ్ గోవాలో డ్రగ్స్‌ను (ఎల్ఎస్డీ, ఎమ్డీఎమ్ఏ) సరఫరా చేస్తున్నాడు. గత బుధవారం సవేరీని ఎన్సీబీ అరెస్టు చేసి విచారించగా తనతో పాటు ప్రధాన భాగస్వామి సిద్దిఖ్ అహ్మద్ ముంబయితో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాలకు డ్రగ్స్ రవాణా (పెడ్లింగ్) చేస్తున్నాడని వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే శనివారం అర్ధరాత్రి సిద్దిఖ్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. పుట్టి పెరిగిందంతా ఇక్కడే... సిద్దిఖ్ అహ్మద్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే అని ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం గోవాలోని సియోలిమ్ బీచ్ ప్రాంతంలో సెటిల్ అయ్యాడని, ఆ బీచ్ కేంద్రంగానే డ్రగ్ పెడ్లర్‌గా మారి ప్రధానంగా ముంబయి, బెంగళూరు తర్వాత హైదరాబాద్‌కు మాదకద్రవ్యాలైన లైసర్జిక్ యాసిడ్ డైతల్మైడ్ (ఎల్ఎస్డీ), మిథలిన్ డయాక్సీ మెథమాపెటమైన్ (ఎండీఎమ్ఏ) సరఫరా చేస్తున్నట్టు విచారణలో బయటపడిందని తెలిపారు. అయితే సిద్దిక్ హైదరాబాద్ నుంచి గోవాకు ఎందుకు మకాం మార్చాడన్న దానిపై ఎన్సీబీ దృష్టి పెట్టింది. గోవా కేంద్రంగా భారీ స్థాయిలోనే నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ఉంటాడా? అనే కోణంలో విచారణ సాగిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఎండీఎమ్ఏ తయారీ? సిద్దిఖ్ విచారణలో కొన్ని ఆందోళన కల్గించే అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముంబయికి చెందిన డ్రగ్స్ మాఫియా హైదరాబాద్‌లోని కొన్ని పారిశ్రామిక కంపెనీల్లో ఎండీఎమ్ఏ డ్రగ్‌ను తయారు చేయిస్తోందని, అక్కడి నుంచే గోవా, బెంగళూరు, ముంబయి ప్రాంతాలకు రవాణా అవుతోందని అతను వెల్లడించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సిద్దిఖ్ దగ్గరున్న వివరాల ఆధారంగా ముంబయి డ్రగ్స్ తయారీ మాఫియాను గుర్తించేందుకు దర్యాప్తు అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. రంగంలోకి స్థానిక అధికారులు సిద్దిఖ్ హైదరాబాద్‌లో పుట్టి పెరగడం, నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ఉండటం.. హైదరాబాద్ ఎన్సీబీ అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. సిద్దిఖ్ నివాసం ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం, అతడితో కాంటాక్ట్‌లో ఉండి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని గుర్తించేందుకు ఇప్పటికే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఎండీఎమ్ఏ తయారీ అంశం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ప్రధానంగా దీనిపైనే దృష్టి సారించి దర్యాప్తు జరుపుతున్నట్టు తెలుస్తోంది. గోవా నుంచే ఈవెంట్లకు డ్రగ్స్! హైదరాబాద్‌లో ఉన్న పరిచయాలు, బెంగళూరులో ఉన్న స్నేహితులు, ముంబయిలో ఉన్న డ్రగ్స్ మాఫియా ద్వారా సిద్దిఖ్ పలు ప్రత్యేక ఈవెంట్లకు ఎల్ఎస్డీ సరఫరా చేస్తున్నట్టు గోవా ఎన్సీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. పార్టీలకు పేరొందిన (మోస్ట్ హ్యాపెనింగ్) మెట్రో సిటీల్లో వీకెండ్ హంగామాకు అంతేలేదు. పబ్ కల్చర్ విపరీతంగా ఉన్న నగరాలు కావడం వరుసగా డ్రగ్ కేసులు వెలుగులోకి రావడం ఎన్సీబీని కలవరపెడుతోంది. గోవా కేంద్రంగా ఎల్ఎస్డీని ఈ మూడు ప్రాంతాలకు సిద్దిఖ్ చేరవేస్తున్నట్టు అనుమానిస్తోంది. -
టాలీవుడ్ డ్రగ్స్ డీలర్ కెల్విన్
-
అసలు డ్రగ్స్ సూత్రధారులను పట్టుకోవాలి: నారాయణ
సాక్షి, హైదరాబాద్: సినీ ప్రముఖులపై ఈడీ విచారణ మంచి పబ్లిసిటీతో రక్తి కట్టిస్తుందని, అసలు డ్రగ్స్ సూత్రధారులను పట్టుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దేశసరిహద్దుల్లో ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టడం, డ్రగ్ మాఫియాను అణిచివేయడం, ఎన్నికల్లో నల్లధనాన్ని ఆపడమే ధ్యేయంగా ప్రధాని మోదీ నోట్లరద్దుని ప్రకటించారని మరి ఆ లక్ష్యం ఇప్పుడు నెరవేరిందా అని ప్రశ్నించారు. గతంలో డ్రగ్స్ వినియోగించిన వారిపై తెలంగాణ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించిందని, విచారించిన రిపోర్టు బుట్టదాఖలైందని మండిపడ్డారు. ఇప్పటి విచారణ కూడా కళాకారులను ఏడిపించేదిగా ఉంది తప్ప అసలు మాఫియాను పట్టుకునేదిగా కనపడటం లేదని విమర్శించారు. -
మొదట తక్కువ ధరకు అమ్ముతారు.. బానిసగా మారిన తర్వాత..
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ముగ్గురు స్నేహితులు డ్రగ్స్ దందాను ‘వ్యూహాత్మకంగా’ నిర్వహించారు. తాము విక్రయించే హష్ ఆయిల్‌కు ఎదుటి వారు బానిసలయ్యే వరకు తక్కువ రేటుకు అమ్మారు. ఇది తీసుకోకుండా ఉండలేని స్థితికి వాళ్లు చేరిన తర్వాత భారీ మొత్తానికి విక్రయించడం మొదలెట్టారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి దాడి చేశారు. ఇద్దరిని పట్టుకుని వీరి నుంచి హష్ ఆయిల్‌తో కూడిన 25 చిన్న డబ్బాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చక్రవర్తి గుమ్మి మంగళవారం వెల్లడించారు. దందా అంతా ఓ ప్లాన్ ప్రకారం ► బోరబండ పద్మావతి నగర్‌కు చెందిన మహ్మద్ మహబూబ్ అలీకి ఘరానా నేరచరిత్ర ఉంది. గతంలో కొందరిపై కాల్పులు జరపడంతో ఇతడికి షూటర్ ఎజాజ్ అనే పేరూ వచ్చింది. ఇతగాడిపై విజయవాడలోనూ కేసు ఉంది. దాని విచారణ కోసం నిత్యం అక్కడి కోర్టుకు వెళ్లేవాడు. అక్కడే ఇతడికి అరకు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వ్యక్తితో పరిచయమైంది. అతడు ఇచ్చిన సమాచారంతో గంజాయి, దాని నుంచి తీసే హష్ ఆయిల్ ఏజెన్సీలో దొరుకుతాయని తెలిసింది. ► ఇతడి స్నేహితులైన బోరబండ వాసి మహ్మద్ ఇబ్రహీం ఖాన్, యూసుఫ్‌గూడ వాసి మహ్మద్ ఖాజా ముబీనుద్దీన్‌తో కలిసి వీటిని తీసుకువచ్చి వినియోగించేవాడు. ఆపై తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ఈ ముగ్గురూ వాటి దందా మొదలెట్టారు. ► వ్యక్తిగత వాహనాలు లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో అక్కడకు వెళ్లే ఈ త్రయం హష్ ఆయిల్‌ను ఖరీదు చేసి తీసుకువస్తోంది. అక్కడ 5 ఎంఎల్ రూ.వెయ్యికి కొని.. నగరంలో రూ.2,500 వరకు విక్రయిస్తోంది. ఒక్కోసారి రూ.5 వేలకు అమ్ముతోంది. తమ వద్దకు కొత్తగా వచ్చిన కస్టమర్‌కు వీళ్లు హష్ ఆయిల్‌ను తక్కువ రేటుకు అమ్ముతారు. అలవాటు పెరిగి అతడు దీనికి బానిసగా మారిన తర్వాత హఠాత్తుగా ఎక్కువ మొత్తానికి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటారు. ► భారీస్థాయిలో ఈ దందా చేస్తుండటంతో హైదరాబాద్, సైబరాబాద్ పరిధుల్లో నివసించే అనేక మంది డ్రగ్స్ వినియోగదారులకు వీరి పేర్ల సుపరిచితంగా మారాయి. దీంతో యథేచ్ఛగా హష్ ఆయిల్ విక్రయాలు చేస్తున్నారు. దీనిపై సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్రకు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, వి.నరేందర్, మహ్మద్ థకియుద్దీన్, కె.చంద్రమోహన్ సోమవారం వలపన్నారు. ► ఇబ్రహీం ఖాన్, ఖాజా చిక్కగా.. షూటర్ ఎజాజ్ పరారయ్యాడు. చిక్కిన ద్వయంతో పాటు వీరి నుంచి స్వాధీనం చేసుకున్న హష్ ఆయిల్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎస్సార్ నగర్ ఠాణాకు అప్పగించారు. చదవండి: ఇద్దరితో యువకుడి ప్రేమ.. వధువు కోసం లాటరీ! -
ఏం ఐడియా రా బాబు.. వంటింటినే ల్యాబ్‌గా మార్చి..
సాక్షి, సిటీబ్యూరో: బాలానగర్‌లో ఉన్న నివాస ప్రాంతంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న సుధాకర్ అనే వ్యక్తి అందులో ఆల్ఫాజోలమ్ మాదకద్రవ్యం తయారు చేస్తున్నాడు. వంటింటినే ల్యాబ్‌గా మార్చి ఈ నిషేధిత డ్రగ్ ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నాడు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బృందాలు శని, ఆదివారాల్లో జరిపిన దాడుల్లో ఈ విషయం బహిర్గతమైంది. సుధాకర్ సహా అయిదుగురు నిందితుల్ని అరెస్టు చేసిన అధికారులు 3.25 కేజీల మాదకద్రవ్యం, రూ.12.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాయి. తడవకు 5 కిలోల చొప్పున.. ► సుధాకర్ స్నేహితుడికి సాధారణ ఔషధాల తయారీకి సంబంధించిన లైసెన్స్ ఉంది. బాలానగర్‌కు చెందిన సుధాకర్‌తో కలిసి దీన్ని దుర్వినియోగం చేసిన ఇతగాడు తన కంపెనీ పేరుతో చిన్న పరిమాణంలో ఉన్న ఫ్లాస్క్, రియాక్టర్, డ్రయ్యర్ కొనుగోలు చేశాడు. వీటిని సుధాకర్ వంటింట్లో బిగించారు. ఆల్ఫాజోలమ్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలకు వివిధ మార్గాల్లో సేకరిస్తున్న ఈ ద్వయం వాటిని వినియోగించి ఒక్కో తడవకు 4 నుంచి 5 కేజీల ఆల్ఫాజోలమ్ తయారు చేస్తోంది. దీన్ని స్థానికంగా ఉన్న ముఠాలతో పాటు కర్ణాటకలోని బెంగళూరు సహా వివిధ ప్రాంతాలకు చెందిన వారికి విక్రయిస్తున్నారు. ►ఇటీవలే 3.25 కేజీల డ్రగ్ ఉత్పత్తి చేసిన సుధాకర్ దాన్ని బెంగళూరుకు చెందిన నరేష్‌కు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. సరుకు తీసుకోవడానికి డబ్బు తీసుకుని శనివారం రాత్రి హైదరాబాద్‌కు రమ్మని సూచించాడు. దీనిపై బెంగళూరు ఎన్సీబీ జోనల్ యూనిట్‌కు సమాచారం అందింది. అక్కడ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక బృందంతో పాటు హైదరాబాద్ సబ్–జోనల్ యూనిట్ అధికారులూ హైదరాబాద్–మెదక్ రహదారిలోని గండి మైసమ్మ వద్ద ఉన్న ఉజ్వల గ్రాండ్ హోటల్ సమీపంలో కాపుకాశారు. ► సరుకు తీసుకుని ఓ కారులో వచ్చిన సుధాకర్‌తో పాటు మరో వ్యక్తిని, మరో కారులో వచ్చిన నరేష్ సహా ఇద్దరిని అదుపులోకి తీసుకుని నగదు, డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. వీరి విచారణలోనే సుధాకర్ ఇంట్లో ఈ డ్రగ్ తయారవుతున్నట్లు వెలుగులోకి రావడంతో అక్కడా దాడి చేసి ఉపకరణాలు సీజ్ చేశారు. ఈ దందాను మరింత పెంచాలనే విస్తరించాలనే ఉద్దేశంతో సుధాకర్ ఇటీవలే తన పక్క ఇంటినీ అద్దెకు తీసుకున్నాడని, అందులో కొత్తగా రియాక్టర్, డ్రయ్యర్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆ ఇంటినీ సీజ్ చేసిన ఎన్సీబీ టీమ్ ఔషధాల తయారీ లైసెన్స్ కలిగిన సుధాకర్ స్నేహితుడినీ అరెస్టు చేసింది. బాలానగర్‌లోని ఇంటి కేంద్రంగా దాదాపు అయిదేళ్లుగా ఆల్ఫాజోలమ్ తయారీ చేస్తున్నట్లు తేల్చారు. -
రూ.21 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇం టెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. జాంబియాకు చెందిన మహిళ మాదకద్రవ్యాలు తీసుకొ స్తున్నట్లు నిఘావర్గాల ద్వారా డీఆర్ఐకి సమా చారం అందింది. ఖతార్ ఎయిర్వేస్ ద్వారా జోహన్నెస్‌బర్గ్, దోహా మీదుగా సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న విమానంలో ఆమె హైదరాబాద్ చేరుకుంది. లగేజీని తనిఖీ చేయగా, అధికారులకు అనుమానాస్పద పొడి లభించింది. దాన్ని పరీక్షించి హెరాయిన్ అని నిర్ధారించారు. 3.2 కిలోల బరువున్న దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.21 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. గతనెలలో జూన్ 6న ఇద్దరు ఆఫ్రికా మహిళల నుంచి రూ.78 కోట్ల విలువైన, జూన్ 21న జాంబియాకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.20 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టివేత
-
Assam Home Guard: నిజాయితీకి దక్కిన సత్కారం
గువాహటి: కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాల సరఫరాలో తమకు సహకరిస్తే భారీ నజరానా ఇస్తామని డ్రగ్ డీలర్లు ఆశజూపినా.. నిజాయితీకే కట్టుబడ్డాడు ఆ హోం గార్డు. అతని నిజాయతీకి, నిఖార్సయిన విధి నిర్వహణకు ప్రతిఫలంగా అస్సాం ప్రభుత్వం ఆయనను కానిస్టేబుల్ ఉద్యోగంతో సత్కరించింది. శనివారం ఆ హోంగార్డు బోర్సింగ్ బేకు కానిస్టేబుల్ నియామక పత్రాన్ని రాష్ట్ర సీఎం హిమంత స్వయంగా అందజేశారు. జూన్ 21న కార్బి అంగ్లాంగ్ జిల్లాలోని ఓ చెక్‌పోస్టు వద్ద మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోంది. అక్కడే విధుల్లో ఉన్న హోం గార్డు బస్సులో అక్రమ రవాణాను పసిగట్టాడు. అయితే, పోలీసులను ఏమార్చేందుకు, తమకు సాయపడేందుకు ఒప్పుకుంటే భారీ స్థాయిలో లంచమిస్తామని హోం గార్డు బోర్సింగ్కు డ్రగ్ డీలర్లు ఆశపెట్టారు. అందుకు బోర్సింగ్ ససేమిరా ఒప్పుకోలేదు. బస్సులో ఉన్న రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంలో పోలీసులకు సాయపడ్డాడు. దీంతో, హోం గార్డు నిజాయతీకి మెచ్చి సీఎం అతనికి కానిస్టేబుల్ ఉద్యోగనియామక పత్రం అందజేశారు. -
‘అవును.. నేరాలు చేశా, ఘోరాలకు పాల్పడ్డా’
వాషింగ్టన్ : మెక్సికన్ డ్రగ్ బాస్(మాజీ) వాకిన్ ‘ఎల్ చాపో’ గుజ్మన్ భార్య ఎమ్మా కరోనెల్ ఎస్పూరో ఎట్టకేలకు నేరాల్ని అంగీకరించింది. జీవిత ఖైదు, పది మిలియన్ల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందన్న నేపథ్యంలో వాషింగ్టన్ కోర్టు ముందు గురువారం ఆమె తలవంచింది. ఈ తరుణంలో ఆమె శిక్షను పదేళ్ల కాలానికి తగ్గించే అవకాశం ఉండొచ్చనేది న్యాయ నిపుణుల మాట. కాగా, ఆమె భర్తైన 63 ఏళ్ల గుజ్మన్ మనీ లాండరింగ్, డ్రగ్ అక్రమ రవాణా ఆరోపణ, హత్యలు-అత్యాచారాల నేరాలపై కొలరాడో జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినాలోవా డ్రగ్ కార్టెల్.. అమెరికాలో అతిపెద్ద డ్రగ్ సప్లయర్. దాని ఆర్థిక వ్యవహారాలన్నీ కరోనెల్ చూసుకున్నట్లు, మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు, అక్రమంగా మాదకద్రవ్యాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటితోపాటు 2015లో మెక్సికో జైలు నుంచి పారిపోవడానికి గుజ్మన్ ప్రయత్నించినప్పుడు కరోనెల్ సహకరించిందనే ఆరోపణలన్నీ ఆమె చిరునవ్వుతో ఒప్పుకుంది. ‘ఆమె జైలుకు వెళ్లడానికి సంతోషంగా సిద్ధమైంది. ఎల్‌చాపో అరెస్ట్ అయ్యాక.. తనను అరెస్ట్ చేయరని ఆమె అనుకుంది. కానీ, ఆమె బ్యాడ్‌లక్’ అని ఆమె అటార్నీ లిట్చ్‌మన్ మీడియాకు వెల్లడించాడు. అయితే శిక్ష తగ్గింపు ఒప్పందం మేరకే ఆమె నేరాల్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. అప్సరసలాంటి కరోనెల్ ఎమ్మా కరోనెల్ ఎస్పూరోకి యూఎస్-మెక్సికన్ పౌరసత్వం ఉంది. ఆమె చాలా అందగత్తె. అంతేకాదు మాజీ బ్యూటీ క్వీన్ కూడా. జర్నలిజం చదివిన కరోనెల్.. పదిహేడేళ్ల వయసులో ఓ డ్యాన్స్ ప్రోగ్రాంలో ఎల్ చాపోని కలిసింది. ఆ తర్వాత అతనితో సహజీవనం చేస్తూ కవలల్ని కనింది. ఆ తర్వాతే వాళ్ల పెళ్లి జరిగింది. అయితే డ్రగ్స్ దందాలో భార్య కరోనెల్ అందాల్ని ప్రత్యర్థులకు ఎరగా వేసి హతమార్చేవాడని ఎల్ చాపోపై ఒక అపవాదు ఉంది. గుజ్మన్ న్యూయార్క్ జైల్లో ఉన్నప్పుడు మూడు నెలలపాటు రోజూ ఆమె అతన్ని కలిసింది. ఆ తర్వాత 31 ఏళ్ల వయసున్న కరొనెల్ను డలాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ రవాణా ఆరోపణలపై అరెస్ట్ చేసి.. వర్జీనియా జైలుకు తరలించారు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో.. సినాలోవా రాష్ట్రం(మెక్సికో)లో ఓ పేద కుటుంబంలో పుట్టిన ఎల్‌చాపో గుజ్మన్.. డ్రగ్స్ దందాతో ప్రపంచ కుబేరుల జాబితాకు చేరిన విషయం తెలిసిందే. డబ్బు, పరపతి మోజులో ఎమ్మా కరోనెల్ అతనితో చేతులు కలిపింది. ఈ ఇద్దరూ కలిపి చేసిన నేరాలు ఒళ్లు గగ్గురు పొడిచే విధంగా ఉంటాయని చెప్తుంటారు. అంతేకాదు ఎల్ చాపో, ఎమ్మా కరొనెల్ జంటను స్టయిల్ ఐకాన్స్‌గా భావిస్తారు. 'ఎల్ చాపో గుజ్మన్' బ్రాండ్‌తో బిజినెస్ చేస్తున్నారు కూడా. అలాగే ఎల్‌చాపో మరో కూతురు(వేరే భార్య కూతురు) అలెగ్జాండ్రినా గుజ్మన్ కూడా తండ్రి పేరు మీద బట్టల వ్యాపారం చేస్తోంది. అంతేకాదు ఈ కరోనా టైంలో తండ్రి పేరు మీదుగా ఆమె సహాయక కార్యక్రమాలు చేస్తుండడం విశేషం. చదవండి: ఇంటర్వ్యూతో దొరికాడా? -
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కేసు కలకలం
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసు హైదరాబాద్‌లో మరోసారి సంచలనం సృష్టిస్తోంది. ఎక్సైజ్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రముఖులకు డ్రగ్స్ పంపించిన డీలర్ డాడీ బాయ్‌కి సంబంధించిన డెలివరీ బాయ్ జేమ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. నాలుగేళ్ల కిత్రం వరకు హైదరాబాద్‌లో డాడీ బాయ్ డ్రగ్స్ బిజినెస్ నిర్వహించాడు. ప్రస్తుతం గోవా, బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ దందా నడుపుతున్నాడు. గతంలో డ్రగ్స్ డీలర్ డాడీ బాయ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లో ప్రముఖులకు డ్రగ్స్ డెలివరీ చేసేందుకు ప్లాన్ చేశాడు. నగరంలో గుడ్ స్టఫ్ అంటూ ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా మెసేజ్‌లు పంపించాడు. ఫోన్ నంబర్లు ఇవ్వకుండా వాట్సాప్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ డ్రగ్స్ దందాను ఆపరేట్ చేశాడు. ఈనెల 14న బస్సు ద్వారా అతడు పంపిన డ్రగ్స్ హైదరాబాద్ చేరాయి. ఈ డ్రగ్స్ జేమ్స్ అనే నైజీరియన్ ద్వారా డెలివరీ అవుతున్నయి. పక్కా సమాచారంతో డెలివరీ బాయ్ జేమ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. బల్క్ ఆర్డర్ చేసిన ప్రముఖులపై ఎక్సైజ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రముఖ హోటల్స్, నెక్లస్రోడ్ , చెక్‌పోస్ట్, డ్రైవ్ ఇన్ లే డెలివరీ స్పాట్స్‌ను పోలీసులు గుర్తించారు. ఒకేసారి 153గ్రాముల కొకెయిన్, ఎండీఎంఏ దొరకడంతో డ్రగ్స్ వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ సీరియస్‌గా ఉంది. చదవండి: అన్న సమక్షంలోనే వదినపై లైంగిక దాడి -
స్మగ్లర్ కిషన్ సింగ్ భారత్‌కు అప్పగింత
లండన్: పేరుమోసిన మాదక ద్రవ్యాల స్మగ్లర్ కిషన్ సింగ్‌ను(38) బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న కిషన్ సింగ్ భారత్‌లో వాంటెడ్ నేరగాడిగా పోలీసు రికార్డులక్కాడు. లండన్ మెట్రోపాలిటన్ పోలీసు శాఖ అతడిని ఇండియాకు అప్పగించింది. రాజస్తానీ మూలాలున్న కిషన్ సింగ్ బ్రిటీష్ పౌరుడు. 2016–17లో ఇండియాలో మెఫాడ్రోన్ (వైట్ మ్యాజిక్), మ్యావ్ మ్యావ్, కెటామైన్ అనే మాదక ద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేసినట్లు అతడిపై కేసు నమోదయ్యింది. 2018లో లండన్‌లో అక్కడి పోలీసులు కిషన్ సింగ్‌ను అరెస్టు చేశారు. ఎవరీ కిషన్ సింగ్? రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా రేవంత్ గ్రామం కిషన్ సింగ్ జన్మస్థలం. త్వరగా డబ్బు సంపాదించాలనే కలతో అతడు 2009 లో లండన్ వెళ్లి అక్కడ విండో-తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కిషన్ 2013 లో భారతదేశానికి వచ్చి రాజస్థాన్‌లో వివాహం చేసుకుని మళ్లీ లండన్‌కు వెళ్లాడు. ఆరేళ్లపాటు లండన్‌లో ఉన్న తరువాత కిషన్ సింగ్ 2015 లో యునైటెడ్ కింగ్డమ్ పౌరుడు అయ్యాడు. 2016 నుంచి అతడి చీకటి వ్యాపారాలు బట్టబయలయ్యాయి. ముంబైలోని ఏజెంట్ల ద్వారా మహారాష్ట్ర నుంచి మత్తు పదార్థాలను సరఫరా చేసినట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలోనూ ఏజెంట్లను నియమించుకుని యూఏఈ, యూకే, యూఎస్ఏ, మలేసియా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో డ్రగ్స్ దందా సాగించినట్టు ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ సంజీవ్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా 2017, ఫిబ్రవరి 15న ముగ్గురు మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ. 50 కోట్లు విలువ చేసే ‘మ్యావ్ మ్యావ్’ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. లండన్‌లో ఉన్న కిషన్ సింగ్ ఆదేశాలకు అనుగుణంగా తాము డ్రగ్స్ సరఫరా చేస్తున్నామని పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. -
సీజ్: లెహెంగా చాటున కోట్ల దందా
న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక రూపంలో మాదక ద్రవ్యాలు జనబాహుళ్యంలోకి వస్తున్నాయి. తాజాగా అమ్మాయి డ్రెస్‌లో డ్రగ్స్ పెట్టి విదేశాలకు ఎగుమతి చేయాలనుకున్నారు. ఈ మేరకు డ్రెస్‌లో కోటి 70 లక్షల విలువైన డ్రగ్స్ పెట్టి తపాలా నుంచి ఆస్ట్రేలియాకు పంపించాలనుకున్న ప్రయత్నం బెడిసికొట్టింది. వారిని ఢిల్లీ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి అందమైన లెహెంగను ఆస్ట్రేలియాకు పంపేందుకు ఢిల్లీ సరిహద్దులోని నోయిడాలో ఉన్న విదేశీ పోస్టాఫీస్‌కు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న నిఘా వర్గాలు పోస్టాఫీస్ అధికారులను అప్రమత్తం చేశారు. ఆయన తీసుకువచ్చిన లెహెంగాను పరిశీలించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఆ డ్రెస్‌ను నిశితంగా పరిశీలించగా అందులో రూ. కోటి 70 లక్షలు విలువ చేసే 3,900 గ్రాముల డ్రగ్స్ బయటపడ్డాయి. ఇది చూసి అధికారులు ఖంగు తిన్నారు. డ్రగ్స్ సరఫరా చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతడు సరఫరా చేయాలనుకున్న డ్రగ్స్ చాలా ప్రమాదకరమని, కాలేయం, మూత్రపిండాలు, గుండెపై తీవ్ర ప్రభావం చూపుతాయని అధికారులు తెలిపారు. మొత్తం 7 లెహెంగాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్‌లో మూలాలు ఉన్నాయని తెలుస్తోంది. -
డ్రగ్స్ అడ్డాగా పాన్‌షాప్.. ప్రముఖులే కస్టమర్లు
ముంబై: హిందీ చిత్ర పరిశ్రమలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో సినీ ప్రముఖులతో పాటు ఇతర వ్యాపారులు, పలువురు ప్రముఖులు ఉన్నారని తెలుస్తోంది. తాజాగా శనివారం (జనవరి 9) ప్రముఖ పాన్ వ్యాపారి అరెస్టవడంతో కీలక మలుపు తీసుకుంది. మొత్తం మత్తు పదార్థాల ఆయన పాన్‌షాప్ నుంచి వెళ్తున్నాయని నార్కోటిక్స్ నియంత్రణ బోర్డు (ఎన్సీబీ) గుర్తించింది. దీంతో అతడికి ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. 1970లో దక్షిణ ముంబైలో మొదలైన పాన్‌షాప్ కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తుందని పోలీస్ అధికారులు గుర్తించారు. ముచ్చడ్ పాన్‌వాలాగా గుర్తింపు పొందిన పాన్ వ్యాపారి మనోజ్ తివారీ తన ఇద్దరు సోదరులతో కలిసి ఈ పాన్షాప్ను ఏర్పాటుచేశాడు. ఆకులు చుట్టుకుంటు ఉన్న మనోజ్ తివారీ ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. ప్రముఖులతో సత్సంబంధాలు పెంచుకోవడంతో ఈ పాన్‌షాప్ ప్రజలతో కిటకిటలాడేది. అయితే పాన్‌షాప్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీస్ అధికారులు ఆ దుకాణంలో జరుగుతున్న వ్యవహారం గుర్తించి.. సుశాంత్ సింగ్ కేసుకు లింక్‌లు ఉన్నాయని నిర్ధారణ చేసుకున్నారు. ఈ క్రమంలో శనివారం మనోజ్ తివారీతో పాటు మరో ఇద్దరు మహిళలు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు బ్రిటన్‌కు చెందిన కరణ్ సజ్నాని ఉన్నారు. శనివారం అరెస్ట్ చేసిన వారి వివరాలను సోమవారం ముంబై అధికారులు మీడియా ముఖంగా వెల్లడించారు. ముచ్చడ్ పాన్‌వాలాగా గుర్తింపు పొందిన మనోజ్ తివారీ వద్ద హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన వారితో పాటు వ్యాపారవేత్తలు, ఇతర పారిశ్రామికవేత్తలు కస్టమర్లుగా ఉన్నారు. అరెస్టయిన మహిళల్లో బ్రిటీష్ జాతీయురాలు కరణ్ సజనాని కాగా, మరొకరు రహీలా ఫర్నీచర్‌వాలా ఉన్నారు. రహీలా గతంలో ఓ బాలీవుడ్ హీరోయిన్‌కు మేనేజర్‌గా పని చేసింది. రహీలా సోదరి సైష్టా గతంలోనే డ్రగ్స్ కేసులో అరెస్టయ్యింది. మొత్తం 200 కిలోల వివిధ రకాల మత్తుపదార్థాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. విలువైన వాటిని కరణ్ సజాని తీసుకున్నారు. కరణ్ సజాని అత్యంత సంపన్నులకు డ్రగ్స్ సరఫరా చేస్తుండేది. వీటిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు నార్కోటిక్స్ ముంబై జోనల్ కమిషనర్ సమీర్ వాంఖడే తెలిపారు. వారి నుంచి మొత్తం 200 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు.. వారితో సంబంధం ఉన్న వారికి సమన్లు జారీ చేసినట్లు వెల్లడించారు. -
పీహెచ్డీ చదివి ఈజీ మనీ కోసం..
సాక్షి, హైదరాబాద్: కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసిన ఓ ఉన్నత విద్యావంతుడు సులువుగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారి తొక్కాడు. సొంత ల్యాబ్ ఒకటి ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ తయారీ మొదలుపెట్టాడు. ఈ బాగోతాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) బయటపెట్టింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేసి కొద్దికాలం ఓ ఫార్మా కంపెనీలో పనిచేశాడు. ఆ తర్వాత డబ్బు మీద ఆశతో డ్రగ్స్ తయారీ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రూ.63.12 లక్షల విలువైన 3.156 కిలోల మెఫిడ్రిన్‌ను మరో వ్యక్తికి విక్రయిస్తుండగా డీఆర్ఐ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. తర్వాత సదరు వ్యక్తి ల్యాబ్‌పై దాడులు చేసి రూ.12.40 లక్షల నగదు, 112 గ్రాముల మెఫిడ్రిన్ శాంపిల్స్, 219.5 కిలోల ముడి మెఫిడ్రిన్ సరుకును స్వాధీనం చేసుకున్నారు. ముంబై మాఫియా దోస్తీతో.. పట్టుబడిన వ్యక్తి ల్యాబ్‌లో డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టగా..ఆ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో అవసరమైన పరికరాలు, సరంజామాను ఇంట్లోనే చూసి డీఆర్ఐ అధికారులు కంగుతిన్నారు. డబ్బు మీద అత్యాశతో ముంబై మాఫియాతో చేతులు కలిపిన అక్రమ మార్గం ఎంచుకున్నట్లుగా గుర్తించారు. ఇప్పటిదాకా ఇతడు 100 కిలోల మెఫిడ్రిన్‌ను విక్రయించినట్లుగా అధికారులు గుర్తించారు. దీని విలువ దాదాపు రూ.2 కోట్లకుపైగానే ఉంటుం దని సమాచారం. మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. -
ఓ వైపు అమ్మాయిలు మరోవైపు డ్రగ్స్
సాక్షి, హైదరాబాద్ : రాజధానిలో భారీగా డ్రగ్స్ పట్టివేత మరోసారి కలకలం రేపింది. గోవా నుంచి పెద్ద మొత్తంలో హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను తీసుకువస్తున్న ఇద్దరు వ్యక్తులను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ పబ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న సల్మాన్‌తో పాటు హైమద్ అనే వ్యక్తిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. సల్మాన్ ద్వారా పది పబ్ లకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న పబ్స్ డాటాను పోలీసులు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం డ్రగ్స్ మాత్రమే కాకుండా మరొకవైపు ఈశాన్య రాష్ట్రాలతో పాటు గోవా నుంచి అమ్మాయిలను కూడా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. అమ్మాయిల ద్వారా పబ్‌కు వచ్చే వారికి అమ్మాయిల ద్వారా పబ్ కు వచ్చే వారికి డ్రగ్స్ సరఫరా చేసిన సల్మాన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. అంతేకాకుండా అమ్మాలయితో వీరిద్దరూ వ్యభిచారం సైతం నడిపిస్తునట్లు విచారణ ద్వారా తెలుస్తోంది. -
సుశాంత్ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ కోణం వెలుగు చూడటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆ దిశగా విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం నటుడు అర్జున్ రాంపాల్ ప్రియురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ సోదరుడిని అరెస్టు చేసింది. అతనికి కూడా డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు తేలడంతో ఎన్సీబీ అతనిని రిమాండ్‌లోకి తీసుకుంది. ఇక దక్షిణాఫ్రికా జాతీయుడైన అగిసిలాస్‌ను డ్రగ్ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నాడన్న ఆరోపణలతో అరెస్ట్ చేసిన ఎన్సీబీ స్థానిక కోర్టులో హాజరు పరిచారు. అనంతరం అతనిని కస్టడీకి పంపారు. ఇప్పటికే సుశాంత్ కేసులో ఆయన ప్రేయసి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్‌ను, సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండా, పర్సనల్ స్టాఫ్ దీపేశ్‌సావంత్ తదితరులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రియా ఈ కేసులు 28రోజుల జైలు జీవితం గడిపి బెయిల్‌పై విడుదలయ్యింది. వీరినే కాకుండా ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, సారా ఆలీఖాన్, శ్రద్ధాకపూర్ లాంటి వారిని కూడా ఎన్సీబీ విచారించింది. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ముంబాయిలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసు పలు మలుపులు తిరుగుతోంది. మాదకద్రవ్యాలకు సంబంధించిన పలు ఆరోపణలు తెరపైకి వచ్చిన తరువాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థన మేరకు ఎన్సీబీ కేసు నమోదు చేసింది. చదవండి: ప్రముఖ టీవీ ఛానెల్‌పై రూ.200 కోట్ల దావా -
సంజన ఇంట్లో కీలక సాక్ష్యాలు
బెంగళూరు : డ్రగ్స్ దందాలో దక్షిణ ఆఫ్రికా పౌరులే శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో సూత్రధారులని సీసీబీ అనుమానిస్తోంది. ముఖ్య నిందితుడు లూమ్ పెప్పర్ సాంబాను సీసీబీ పోలీసులు 15 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. పెప్పర్ వెల్లడించిన సమాచారం ప్రకారం బెనాల్డ్ ఉడేన్నా అనే ఆఫ్రికన్న అరెస్ట్ చేశారు. అతడు అన్ని వివరాలూ వెల్లడించాడు. కన్నడ సినిమారంగానికి చెందిన సెలబ్రిటీలకు తామే మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఉడేన్నా ఆదిత్య ఆళ్వాకు చాలా సన్నిహితుడని, డ్రగ్స్ నిందితులు రవిశంకర్, వీరేన్ ఖన్నాలు ఉడేన్నాతో నిత్యం సంప్రదించేవాడని తెలిసింది. బెంగళూరుతో పాటు చుట్టు ప్రక్కల రిసార్ట్‌లో మధ్యరాత్రి వరకు జరిగే పార్టీలకు మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. (నా పరువు తీస్తున్నారు!) జైల్లో పుస్తక పఠనంలో నటీమణులు జ్యుడిషియల్ కస్టడీ కింద నటీమణులు రాగిణి, సంజనలను పరప్పన అగ్రహార జైలుకు తరలించి అక్కడ క్వారంటైన్లో ఉంచారు. జైలులో పెట్టిన టిఫిన్, భోజనాలను ఇద్దరూ ఆరగించారు. కొంతసేపు నిద్రపోతూ, మరికొంత సేపు పుస్తకాలను చదువుతూ పొద్దుపుచ్చుతున్నారు. రాగిణికి వెన్నునొప్పి సమస్య ఉండటంతో జైలు వైద్యులు ఔషధాలను అందించారు. రాగిణి, తల్లి, న్యాయవాదులను అధికారులు కలవనివ్వడం లేదు. ఫోన్లో మాట్లాడడానికి అవకాశమిచ్చారు. కింగ్పిన్లతో నటీమణులకు లింక్‌లు దీని ఆధారంగా ఆదిత్య ఆళ్వకు చెందిన రిసార్ట్‌పై సీసీబీ పోలీసులు దాడి చేశారు. లూమా, ఉడేన్నాలు బెంగళూరులో మత్తు పదార్థాలను సరఫరా చేస్తుండగా వీరి వెనుక కూడా ఒక పెద్ద తలకాయ ఉన్నట్లు సీసీబీ గుర్తించింది. వీరిద్దరిని అరెస్ట్ చేస్తుండగానే ముగ్గురు కింగ్పిన్లు పరారు కావడంతో కేసుపై సీసీబీ గోప్యత పాటిస్తోంది. ఈ ముగ్గురు దొరికితే మరెంతోమంది క్లయింట్ల పేర్లు బయట పడవచ్చు. ఈ కింగ్పిన్లు నటీమణులు రాగిణి, సంజనలతో కలిసి పార్టీల్లో పాల్గొన్నట్లు సీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. ఆదిత్య ఆళ్వ విదేశాలకు పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. సంజన ఇంట్లోని వస్తువులే ముఖ్య సాక్ష్యాలు? 14వ నిందితురాలు సంజన హై–ఫై పార్టీలలో పాల్గొనడంతో పాటు ప్రకాశ్ రాంకా, రాహుల్‌తో కలిసి బెంగళూరు, గోవా, కేరళ, శ్రీలంకలో పబ్, బార్, అపార్ట్మెంట్ పార్టీలకు డ్రగ్స్‌ను గుట్టుగా సరఫరా చేసేవారని సీసీబీ చెబుతోంది. సెలబ్రిటీలకు కూడా మత్తు పదార్థాలను పంపేవారమని రాంకా ఒప్పుకున్నాడు. సంజన ఇంటిలో 9 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా ఆమె డ్రగ్స్ మాఫియాలో పాల్గొన్నట్లు సీసీబీ అనుమానిస్తోంది. సిమ్‌కార్డ్, ఐఫోన్, ప్రోమాక్స్ కంప్యూటర్, సీసీ కెమెరాల డీవీఆర్‌లను స్వాధీనం చేసుకొని సమాచారం సేకరించగా ఆసక్తికర సాక్ష్యాలు బయట పడినట్లు తెలిసింది. నేడు సంజనా బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగుతుంది. కేసు విచారణలో ఉంది, నేనేం మాట్లాడను : ఐంద్రిత డ్రగ్స్ కేసుపై నేను ఏమీ మాట్లాడకూడదు, సీసీబీ అధికారులు విధించిన నియమాలను పాటించాలి అని నటి ఐంద్రితా రై అన్నారు. విచారణ జరుగుతున్నందున తను మీడియాతో మాట్లాడితే నియమోల్లంఘన కిందకు వస్తుందన్నారు. దిగంత్ సినిమా షూటింగ్‌లకు వెళ్లవచ్చని, కానీ బెంగళూరు విడిచి వెళ్లరాదని చెప్పారన్నారు. ఒకటి రెండురోజుల్లో ఐంద్రిత దంపతులకు మరోసారి నోటీసులు పంపవచ్చని సమాచారం. కాగా, రాధారమణ సీరియల్ నటి శ్వేతాప్రసాద్ తనపై తప్పుడు ప్రచారం చేయవద్దని మీడియాను కోరారు. డ్రగ్స్ కేసులో జైలుకెళ్లిన ఒక నటితో కలిసిఉన్న పోటో వైరల్ అయ్యింది. ఆ ఫోటో మీద అసభ్యంగా పోస్టింగ్‌లు పెట్టవద్దన్నారు. -
‘సుశాంత్ రోజుకు 5 సార్లు డ్రగ్స్ తీసుకునేవాడు’
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని, అతని తమ్ముడిని నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్సీబీ వద్ద రియా తమ్ముడు షోవిక్ చక్రవర్తి అనేక విషయాలు వెల్లడించాడు. తాను అనేక సార్లు సుశాంత్ సింగ్‌కు మరిజువానా, హాష్, వీడ్ సరఫరా చేసినట్లు పేర్కొన్నాడు. లాక్‌డౌన్‌కు ముందు, లాక్డౌన్లో కూడా ఇచ్చినట్లు తెలిపాడు. దానికి సంబంధించిన బిల్లులు అన్ని రియా కార్డు నుంచే చెల్లించినట్లు అధికారులకు తెలిపాడు. ఇప్పటికే ఎన్సీబీ అరెస్టు చేసిన డ్రగ్స్ పెడ్లర్లు బసిత్ పరిహార్, సూర్దీప్ మల్హోత్రా తనకు డ్రగ్స్ అందించేవారని షోవిక్ వెల్లడించాడు. సుశాంత్ డ్రగ్స్ వాడతాడని శ్యామ్యూల్ మిరండా, సిద్దార్థ్ పితానీ తనతో చెప్పారాని తెలిపాడు. రియా, బసిత్ పరిహార్ వాట్సప్ చాట్‌ను షోవిక్ నిర్ధారించారు. ‘నేను మార్చి 16, 2020లో సుశాంత్ తనతో డ్రగ్స్ గురించి మాట్లాడాడని చెప్పగా సుశాంత్ రోజుకు 5 సార్లు వీడ్ తీసుకుంటాడని రియా చెప్పింది. అందుకే తనకి నేను ఐదు గ్రాముల వీడ్‌ను ఏర్పాటు చేశాను. అది 20 సార్లు వాడొచ్చు. అప్పుడు నేను బసిత్‌ను కలిశాను’ అని తెలిపారు. చదవండి: ఏ తండ్రీ భరించలేడు.. నేను చచ్చిపోవాలి -
అమీర్‌పేట్‌లో డ్రగ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్ : అమీర్‌పేట్‌లో డ్రగ్స్ కలకలం రేపింది. ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి ఎక్సైజ్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్ డ్రగ్స్ సరఫరా చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు చేరవేస్తున్న బంటీ ముఠాను బుధవారం నగరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఎక్స్ స్టసి పిల్స్ 46 గ్రాములు, 2 గ్రాముల MDMA, 10 గ్రాముల చరస్ స్వాధీనం చేసుకున్నారు. బంటీతో పాటు నగరానికి చెందిన రోహిత్, నవీన్‌రాజ్ డ్రగ్స్ కోసం గోవాకు వెళ్లినట్లు తెలుస్తోంది. గోవాకు చెందిన కునాల్, రఫీ పరార్ ఇద్దరు ముఠా సభ్యులు బంటీ గ్యాంగ్‌కు డ్రగ్స్ సరపర చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు వాడిన టూ వీలర్, కార్‌ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. -
డ్రగ్స్ వాడినట్లు నిరూపిస్తే.. ముంబై విడిచి పోతా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మాదకద్రవ్యాల వినియోగం తెర మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు నటి కంగనా రనౌత్. ఈ క్రమంలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కంగనా డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపించారు. అధ్యాయన్ సుమన్‌తో తనకు సంబంధాలున్నాయని, తాను డ్రగ్స్ తీసుకుంటానని, అతడిని కూడా బలవంతం చేసినట్లు ఒక ఇంటర్యూలో కంగనా చెప్పారని అనిల్ దేశ్ ముఖ్ ఆరోపణలు చేశారు. ముంబై పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తారని అసెంబ్లీలో ఎమ్మెల్యే సునీల్ ప్రభు అడిగిన ప్రశ్నకు తాను సమాధానం చెప్పినట్లు ఆయన తెలిపారు. దాంతో కంగనా దీనిపై స్పందించారు. ఈ క్రమంలో తాను డ్రగ్స్ వాడినట్లు నిరూపిస్తే ముంబైని విడిచిపోతానని సవాలు చేశారు కంగనా రనౌత్. (చదవండి: ‘క్వీన్’కు కేంద్రం రక్షణ! ) I am more than happy to oblige @MumbaiPolice @AnilDeshmukhNCP please do my drug tests investigate my call records if you find any links to drug peddlers ever I will accept my mistake and leave Mumbai forever, looking forward to meet you 🙂 https://t.co/gs3DwcIOvP — Kangana Ranaut (@KanganaTeam) September 8, 2020 డ్రగ్స్ పరీక్షకు తాను సిద్ధమే అన్నారు కంగనా. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, ముంబై పోలీసుల ఆదేశాలను తాను సంతోషంగా స్వీకరిస్తానన్నారు. తనకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని, తన ఫోన్ కాల్స్ రికార్డులు పరిశీలించి డ్రగ్స్ డీలర్స్‌తో సంబంధాలున్నట్లు ఆధారాలు చూపాలన్నారు కంగనా. అలా చేస్తే తన తప్పును ఒప్పుకుని ముంబైని శాశ్వతంగా వదిలిపోతానని చెప్పారు. దీని కోసం మిమ్మల్ని కలిసేందుకు ఎదురు చూస్తున్నానంటూ మంగళవారం ట్వీట్ చేశారు కంగనా. దీన్ని నిరూపిస్తే ముంబైని శాశ్వతంగా వీడుతానని చెప్పారు. -
సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక ట్విస్ట్
సాక్షి, ముంబై : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. రియానే డ్రగ్స్ తీసుకురమ్మందని ఆమె సోదరుడు షోవిక్ అధికారులకు తెలిపాడు. ఇక ఈ కేసులో వచ్చిన మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలకు సంబంధించి అరెస్ట్‌ల పర్వం ప్రారంభమయ్యింది. శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు సుశాంత్ మాజీ మేనేజర్ శామ్యూల్ మిరాండాను అరెస్ట్ చేశారు. అతడితో పాటు డ్రగ్ డీలర్లు జైద్ విలాత్ర, బిసిత్ పరిహార్‌లను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్సీబీ అధికారులు షోవిక్‌తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా గంజాయి అమ్మకంలో భాగస్వాములని అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఎన్సీబీ అధికారులు షోవిక్‌తో పాటు శ్యాముల్ మిరాండాల ఇళ్లలో ఏక కాలంలో దాడులు చేశారు. (చదవండి: ‘సుశాంత్‌కు తెలియకుండా డ్రగ్స్ ఇచ్చారు’) ఇక ఇప్పటికే డ్రగ్ డీలర్ అబ్దుల్ బాసిత్ పరిహార్‌ను సెప్టెంబర్ 9 వరకు ఎన్సీబీ కస్టడీకి పంపారు. జైద్ విలాత్రా విచారణ ఆధారంగా బాసిత్ పరిహార్‌ను దర్యాప్తులో చేర్చిన సంగతి తెలిసిందే. బాసిత్, జైద్ ఇద్దరూ డ్రగ్స్ పెడ్లింగ్ కేసులో పాల్గొన్నట్లు చెప్పారు. శామ్యూల్ మిరాండా సుశాంత్ సింగ్ ఇంటిలో హౌస్ కీపింగ్ మేనేజర్‌గా పని చేసేవాడు. ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడే చూసుకునేవాడు. గత ఏడాది మేలో రియా అతనిని సుశాంత్ ఇంటిలో మేనేజర్‌గా నియమించింది. మొదటి నుంచి సుశాంత్ కుటుంబ సభ్యులు అతనిపై ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్ డబ్బును కాజేయడంలో రియాకు అతడు సహాయం అందించాడని వారు ఫిర్యాదు చేశారు. ఇక శామ్యూల్‌తో పాటు ముంబైకు చెందిన జైద్ విలాత్రాను కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వారు జరుపుకునే పార్టీలలో డ్రగ్స్ సరఫరా చేసేవాడనే ఆరోపణలు ఉండటంతో జైద్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
సుశాంత్ సింగ్ కేసులో ఎన్సీబీ అదుపులో మరొకరు
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధం ఉన్న మరో అనుమానితుడు బాసిత్ పరిహార్‌ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సిబి) ప్రశ్నిస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఇప్పటికే అరెస్టు అయిన జైద్ విలాత్రా ని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా, ఆయన్ను సెప్టెంబర్ 9 వరకు ఎన్సీబీ కస్టడీకి అప్పగించారు. జైద్ విచారణ సందర్భంగా బాసిత్ పరిహార్ పేరు బయటపడింది. రాజ్‌పుత్ కేసులో రియాచక్రవర్తిపై నమోదైన మాదకద్రవ్యాల కేసుకి, బాసిత్‌కి సంబంధం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. రియాచక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ మొబైల్ చాట్స్‌లో బాసిత్ ప్రస్థావన ఉన్నట్లు వారు చెప్పారు. షోవిక్‌ని, రాజ్‌పుత్ మేనేజర్ సామ్యూల్ మిరందాని మాదకద్రవ్యాల కేసు విచారణకు పిలవనున్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, గోవా, ఢిల్లీలోని మరికొంత మంది మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాపై నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు చదవండి: సుశాంత్ డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్ -
సుశాంత్ డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్ కేసులో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బుధవారం అరెస్ట్ చేసింది. ముంబై బాంద్రాకు చెందిన అబ్దుల్ బాసిత్ పరిహార్‌ను అరెస్టు చేసినట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ సందర్భంగా ఎన్సీబీ అధికారులు మాట్లాడుతూ, ‘అతనికి శామ్యూల్ మిరాండాతో సంబంధం ఉంది. షోవిక్ చక్రవర్తి (రియా చక్రవర్తి సోదరుడు) సూచనల మేరకు మిరాండా డ్రగ్స్ సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి’ అని తెలిపారు. శామ్యూల్ మిరాండా సుశాంత్ సింగ్ ఇంటిలో హౌస్ కీపింగ్ మేనేజర్‌గా పని చేసేవాడు. ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడే చూసుకునేవాడు. గత ఏడాది మేలో రియా అతనిని సుశాంత్ ఇంటిలో మేనేజర్‌గా నియమించింది. మొదటి నుంచి సుశాంత్ కుటుంబ సభ్యులు అతనిపై ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్ డబ్బును కాజేయడంలో రియాకు అతడు సహాయం అందించడాని వారు ఫిర్యాదు చేశారు. ఇక శామ్యూల్‌తో పాటు ముంబైకు చెందిన జైద్ విలాత్రాను కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వారు జరుపుకునే పార్టీలలో డ్రగ్స్ సరఫరా చేసేవాడనే ఆరోపణలు ఉండటంతో జైద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక సుశాంత్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు రియా చక్రవర్తి తల్లిదండ్రులను బుధవారం విచారించారు. ఈ కేసులో మొదటిసారిగా రియా తల్లిదండ్రులు సీబీఐ ముందు హాజరయ్యారు. ఇక గతవారం రియా తమ్ముడు షోవిక్‌ను కూడా విచారించిన సంగతి తెలిసిందే. సుశాంత్ డబ్బును కాజేసి అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు అంటూ సుశాంత్ కుటుంబసభ్యులు రియా కుటుంబ సభ్యులందరిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇక రియాను సీబీఐ అధికారులు నాలుగు రోజులలో 35 గంటల పాటు విచారించారు. చదవండి: ‘సుశాంత్‌కు తెలియకుండా డ్రగ్స్ ఇచ్చారు’ -
‘సుశాంత్‌కు తెలియకుండా డ్రగ్స్ ఇచ్చారు’
ముంబై: హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి విషయంలో రోజుకొక కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆమెకు డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటూ కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా సుశాంత్ తండ్రి తరపున వాదిస్తున్న న్యాయవాది రియాపై మరో ఆరోపణ చేశారు. రియా, సుశాంత్‌కు తెలియకుండా అతనికి నిషేధించిన డ్రగ్స్‌ను ఇచ్చిందని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు తెలిపారు. ఈ విషయం గురించి లాయర్ కేకేసింగ్ మాట్లాడుతూ, ‘సుశాంత్‌కు తెలియకుండా కొన్ని నిషేధిత డ్రగ్స్‌ను ఆయనకు ఇచ్చారు. ఇదే అతడు చనిపోవడానికి కారణమయ్యింది. మొదటి నుంచి కూడా సుశాంత్‌కు తనకు తెలియకుండానే ఏదో మందులు ఇస్తున్నారని కుటుంబ సభ్యులకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాన్ని ఎఫ్ఐఆర్లో కూడా పేర్కొన్నాం. సుశాంత్‌కు తెలియకుండానే డాక్టర్లు రాసి ఇవ్వని డ్రగ్స్‌ను సుశాంత్‌కు ఇచ్చారని అందులో ఫిర్యాదు చేశారు’ అని తెలిపారు. ఒకవేళ అలాంటి డ్రగ్స్ ఇచ్చి సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారా లేదా హత్య చేయడానికి ప్రయత్నించారా అన్న అనుమానాలను సుశాంత్ తండ్రి తరుపు న్యాయవాది అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అలాంటి డ్రగ్స్ వాడటం చట్టవిరుద్దమని ఆయన తెలిపారు. ఇంకా సుశాంత్ ఆత్మహత్య విషయంలో అనేక విషయాలు బయటపడ్డాయి. సుశాంత్ ఫస్ట్ ఫ్లోర్లో నిద్రపోయేవాడని రియా పై అంతస్తులో పార్టీలు చేసుకునేదని ఇంట్లో ఉండే పనివాళ్ల ద్వారా తెలిసింది. అలాగే రియా డ్రగ్ డీలర్స్‌తో మాట్లాడినట్లు, వాళ్లకు మెసేజ్‌లు చేసినట్లు కొన్ని ఆధారాలను ఈడీ డిపార్ట్మెంట్ సీబీఐకు అందించింది అనే కథనాలు బయటకు వచ్చాయి. డ్రగ్స్ లింక్ గురించి రియా తరుపు న్యాయవాది మాట్లాడుతూ రియాకు కావాలంటే రక్త పరీక్ష నిర్వహించవచ్చని, రియా తన జీవితంలో డ్రగ్స్ తీసుకోలేదని తెలిపారు. చదవండి: సుశాంత్ కేసు: ఆ అంబులెన్స్‌లు ఎందుకు వచ్చాయి? -
రూ. 100 కోట్ల డ్రగ్స్ పట్టివేత!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో భారీ డ్రగ్స్ రాకెట్ బయటపడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు రూ.100 కోట్ల విలువైన 501 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశారు. పంద్రాగస్టు రోజు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మునిగి ఉంటుందని, ఎలాంటి నిఘా ఉండదనుకొని భారీగా డ్రగ్స్ సరఫరాకు పూనుకున్న డ్రగ్ మాఫియా ఎత్తులు ఊహించని విధంగా చిత్తయ్యాయి. ఈ నెల 15న హైదరాబాద్ నుంచి ముంబైకి భారీగా డ్రగ్స్ సరఫరా కానుందని డీఆర్ఐ అధికారులకు ఉప్పందింది. అప్రమత్తమైన డీఆర్ఐ అధికారులు హైదరాబాద్ శివారులోని ఓ ఫ్యాక్టరీ, ముంబైలోని లేబొరేటరీపై నిఘా పెట్టారు. హైదరాబాద్, ముంబై నగరాల్లోని పలు ప్రాంతాల్లో మూడురోజులపాటు అత్యంత రహస్యంగా, పకడ్బందీగా ఆపరేషన్ నిర్వహించారు. (ఇంకా వరద బురదలోనే..) హైదరాబాద్ నుంచి ముంబైకి భారీగా మెఫిడ్రోన్స్ డ్రగ్స్ లోడుతో వెళ్తున్న ప్రయాణికులు లేని ప్రైవేటు ప్యాసింజర్ బస్సును డీఆర్ఐ అధికారులు వెంటాడి పంద్రాగస్టు ఉదయం ముంబైలో పట్టుకున్నారు. అక్కడి లేబొరేటరీ నుంచి భారీగా మెఫిడ్రోన్, కెటమైన్, ఎఫిడ్రిన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో 2017లో డ్రగ్స్ కేసులో అరెస్టయిన వ్యక్తే ఈ రాకెట్ సూత్రధారి అని డీఆర్ఐ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన డ్రగ్స్‌ను ముంబైలోని లేబొరేటరీలో ప్యాక్ చేసి దేశం నలుమూలలా సరఫరా చేసేవారు. (కరోనా నేపథ్యం... కార్డులు తెగ వాడేస్తున్నారు) ఏమేం దొరికాయంటే..? నగర శివారులోని ఫ్యాక్టరీని, ముంబైలోని లేబొరేటరీని అధికారులు సీజ్ చేసి 210 కిలోల మెఫిడ్రోన్, 31 కిలోల ఎఫిడ్రిన్, 10 కిలోల కెటమైన్‌ను స్వాధీనం చేసకున్నారు. ఈ మూడింటి విలువ రూ.47 కోట్లు. ఇక 250 కిలోల మెఫిడ్రోన్ ముడిసరుకు విలువ రూ.50 కోట్లు. వీటికితోడు రూ.45 లక్షల నగదు, అమెరికా, యూరో కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి రూ.100 కోట్లకుపైగా విలువైన 501 కిలోల డ్రగ్స్‌ను, విదేశీ మారకాన్ని డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. మాదకద్రవ్యాల కార్యకలాపాల నియంత్రణ చట్టం 1985 ప్రకారం.. కేసు నమోదు చేసిన డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 250 కిలోల మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మత్తుమందు ఏపీడ్రున్, కేటమైన్, మేపిడ్రీన్‌లను డీఆర్ఐ( డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ ఏక కాలంలో ముంబై, హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ముంబైకి కార్గో బస్సులో మత్తు మందు రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డీఆర్ఐ అధికారులు కార్గో బస్సుని వెంటాడి పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని ఒక ఫార్మా కంపెనీలో రూ. 100 కోట్ల విలువైన మత్తు మందును తయారు చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఈ మత్తుమందును సరఫరా చేసేందుకు ఈ డ్రగ్ మాఫియా ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు. 2017లో అరెస్ట్ అయిన ఒక డ్రగ్ డీలర్‌ను అధికారులు తిరిగి పట్టుకున్నారు. 28 కోట్ల రూపాయల విలువైన 142 కిలోల మెఫిడ్రిన్‌ను, 50 కోట్ల విలువైన రా మెటిరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.45 లక్షల నగదును స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. (వరదలపై అధికారులను అప్రమత్తం చేసిన హరీశ్ రావు) -
డ్రగ్స్ రాకెట్లో చిరువ్యాపారులు!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో మళ్లీ డ్రగ్స్ రాకెట్ కలకలం రేపుతోంది. తాజాగా ఈ రాకెట్లో చిరువ్యాపారులు భాగస్వాములు కావడం సంచలనం సృష్టిస్తోంది. నగరంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇటీవల నిర్వహిస్తున్న వరుస దాడుల్లో ముంబై కేంద్రంగా పని చేస్తున్న బడా డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టయింది. అక్రమార్కులు నగరంలోని కొందరు చిరు వ్యాపారులు, కొందరు నైజీరియన్లు, నిరుద్యోగులకు డబ్బు ఎరవేసి డ్రగ్స్ సరఫరాలో వారి సేవలను వినియోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల బోయిన్పల్లి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో టైల్స్ వ్యాపారి హనుమాన్ రామ్ కారును తనిఖీ చేయగా.. రూ.1.20 లక్షల విలువైన ఓపియం డ్రగ్‌ను తరలిస్తున్న వైనం వెలుగుచూసింది. రాజస్థాన్‌కు చెందిన ఇతను పదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి జీడిమెట్లలో టైల్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో వ్యాపారంలో నష్టాలు రావడంతో అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని ఇలా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్టు పోలీసుల విచారణలో ఇతను వెల్లడించడం గమనార్హం. కాగా ఇటీవల కాలంలో నగరంలో తరచు నమోదవుతున్న డ్రగ్స్ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. సిటీలోతరచు డ్రగ్స్ కలకలం.. ఇటీవల నగరంలోని తార్నాక చౌరస్తాలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు రట్టుచేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1.64 లక్షల విలువ చేసే 104 గ్రాముల కొకైన్‌తోపాటు ఒక యమహా ఎఫ్‌జడ్ బైక్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియాకు చెందిన జడీ పాస్కల్(35),అతని గర్ల్‌ఫ్రెండ్ ఎబిరె మోనికా(30) తార్నాక నాగార్జుననగర్‌లో ఇటీవల ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వీరికి ముంబై కేంద్రంగా డ్రగ్స్‌రాకెట్ నడుపుతున్న ఎరిక్,బెన్,» బెంగళూరుకు చెందిన బనార్డ్‌లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ జంట వారు సరఫరా చేసిన కొకైన్ ను గ్రాము రూ.8 వేలు చొప్పున నగరంలో పలువురికి విక్రయిస్తోంది. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలకు సైతం ఈ జంట మాదకద్రవ్యాలను సరఫరా చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సెలబ్రిటీలకు సరఫరాపై అనుమానాలు.. నగరంలో సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వీఐపీలు, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకొని నగరంలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు ఇటీవల వరుసగా పట్టుబడుతున్న డ్రగ్స్ రాకెట్ ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. ముంబై, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న బడా డ్రగ్స్ మాఫియా పలువురు నైజీరియన్లకు, చిరువ్యాపారులు, నిరుద్యోగులకు డబ్బును ఎరగా చూపి ఈ వ్యాపారంలోకి దించుతూ..నగరంలో వినియోగదారులకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్టు స్పష్టమౌతోంది. తాజా కేసు ఇలాంటి కోవకే చెందినది కావడం గమనార్హం. ఎక్సైజ్ పోలీసులు నగరంలో ప్రత్యేకంగా కాల్‌సెంటర్ ఏర్పాటుచేసి సమాచారం అందిన వెంటనే డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేయాలని సిటీజన్లు కోరుతున్నారు. -
విజయవాడ: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం
-
మాఫియా డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు అయ్యింది. ఆదివారం అమీర్‌పేట్ ప్రాంతంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు తనిఖీలు నిర్వహించి పలు రకాల నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 105 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్, 25 గ్రాముల హషిష్ ఆయిల్, 4 బ్లాట్స్ ఎల్ఎస్డీ, 250 డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 కార్లు, ఒక బైక్, 7 మొబైల్ ఫోన్ల స్వాధీనంతోపాటు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ రాకెట్‌కు సూత్రధారిగా భావిస్తున్న మధురానగర్‌కు చెందిన భరత్ తుక్రాల్(48)తోపాటు బల్కంపేట్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాణాప్రతాప్(29), షేక్ ఫిరోజ్ అహ్మద్(29)ను అరెస్టు చేశారు. డ్రగ్స్ రవాణాకు వినియోగించిన రెండు కార్లను, ఓ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎండీఎంఏ డ్రగ్స్‌ను బెంగళూరుకు చెందిన జేమ్స్, ఢిల్లీకి చెందిన జెమీ, చెన్నైకు చెందిన అబ్దుల్ వద్ద కొనుగోలు చేసినట్లు నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. జేమ్స్, జెమీ, అబ్దుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నార న్నారు. కేసు తదుపరి విచారణ కోసం అమీర్ పేట్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజి రెడ్డి తెలిపారు. కాగా, నిందితులు నగరంలోని పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలకు నిషే ధిత డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. -
అంతా ఆన్లైన్లోనే..!!
సాక్షి, గుంటూరు: రాజధాని జిల్లాలో డ్రగ్స్ కేసులో విదేశీయుడైన నిందితుడిని అరెస్టు చేయడం సంచలనంగా మారింది. గంజాయి, కొకైన్, హెరాయిన్ తదితర మత్తు పదార్థాలు తనిఖీల్లో పట్టుపడటంతో పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని ఆదర్శనగర్‌లో ఓ అపార్టుమెంట్లో కొంతకాలంగా అద్దెకు ఉంటున్న సౌదీ దేశానికి చెందిన డ్రగ్స్ వ్యాపారి షాజీ అలియాస్ మహమ్మద్‌ని సినీఫక్కీలో వెంటాడి శుక్రవారం రాత్రి నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ముందుగా విదేశీయుడితో సంబంధాలు ఉన్న వారి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ముఠా సభ్యుల అన్వేషణ కోసం ప్రత్యేక బృందాల్ని అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇప్పటికే గుంటూరులోని ఓ ప్రముఖ బిర్యానీ హోటల్ నిర్వాహకుడి కుమారుడితో పాటు మరో యువకుడితో నిందితుడికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విదేశీయుడు షాజీ పాస్‌పోర్టును బెంగళూరు ఎయిర్పోర్ట్ పోలీసులు సీజ్ చేసినట్లు గుర్తించి వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఎందుకు సీజ్ చేశారు..ఎప్పుడు సీజ్ చేశారు.. అనే అంశాల గురించి తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి పరారీ ఐదు నెలల కిందట షాజీ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటూ డ్రగ్స్ వ్యాపారం చేసేవాడు. అక్కడ పోలీసుల నిఘా పెరిగినట్లు అనుమానించాడు. అప్పటికే అతని కోసం రెక్కీ కొనసాగుతున్న విషయాన్ని పసిగట్టి అక్కడ నుంచి పరారయ్యాడు. ఆపై గుంటూరుకు చేరుకొని డ్రగ్స్ ముఠా సభ్యుల సహకారంతో ఆదర్శనగర్‌లోని అపార్ట్మెంట్లో ఉంటూ గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్నాడని విశ్వసనీయంగా తెలిసింది. పూర్వ విద్యార్థుల గురించి ఆరా నిందితుడి కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. అధికంగా పలు యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థుల ఫోన్ నంబర్లు ఉన్నట్లు గుర్తించారు. గతంలో నిందితుడితో పాటు చదువుకున్న విద్యార్థులతో పాటు ప్రస్తుతం చదువుతున్న స్థానిక విద్యార్థుల గురించి వివరాలు సేకరిస్తున్నారు. షాజీతో పరిచయాలు ఉన్న వ్యక్తులు, విద్యార్థులు, అతన్ని తరచూ కలిసే ముఠా సభ్యుల వివరాల కోసం నిందితుడిని విచారిస్తున్నారు. అయితే, ఇదంతా ముందుగానే ఊహించిన షాజీ పోలీసుల నుంచి తప్పించుకొని పరారయ్యేందుకు యత్నించిన సమయంలోనే ఫోన్‌ను పగులకొట్టి పడేసిన ప్రాంతంలో అది దొరకడంతో విచారణ కొనసాగుతోంది. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తు్తన్నప్పటికీ నిందితుడు సరైన వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిసింది. తెలుగు మాట్లాడితే తిరిగి అందులో సమాధానం చెప్పలేక పోతున్నప్పటికీ అడిగిన ప్రతి ప్రశ్నను అర్థం చేసుకుంటున్నాడని.. తిరిగి పొడిపొడిగా ఇంగ్లిష్‌లో సమాధానం చెబుతున్నట్లు సమాచారం. పూర్తి స్థాయిలో షాజీని విచారిస్తే డ్రగ్స్ మాఫియా బయట పడే అవకాశం ఉంది. డ్రగ్స్‌ను నిందితుడు గోవా నుంచి గుంటూరుకు పార్సిల్ రూపంలో తరిలిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గోవాలో డ్రగ్స్ మాఫియాతో మంచి పరిచయాలు ఉన్న కారణంగానే అక్కడ నుంచి పార్సిల్స్ వస్తున్నట్లు అనుమానిస్తున్నారు. నిందితుడి గురించి ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ, డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో మాట్లాడి తదుపరి చర్యలు చేపట్టారు. అంతా ఆన్లైన్లోనే... షాజీ ఆన్లైన్లో విద్యార్థులు, యువతతో పరిచయాలు చేసుకుని, అందులో వచ్చే ఆర్డర్ ప్రకారం డబ్బు చెల్లించిన తర్వాతే డ్రగ్స్‌ను సరఫరా చేస్తుంటాడు. చాప కింద నీరులా ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా నగరంలో సరఫరా చేస్తుంటాడు. స్థానిక నివాసాల్లో పోలీసులు ఆరా తీయగా.. ఎప్పుడూ అతనికి ఆన్లైన్ పార్సిల్స్ వస్తుంటాయని, ఎక్కువగా బయటకు రాడని చెప్పారు. ఒకవేళ బయటకు వస్తే భయంకరమైన వస్తువులు తీసుకువచ్చి భయభ్రాంతులకు గురి చేస్తుంటాడని తెలిపారు. నిందితుని గదిలో పలు రాష్ట్రాలకు చెందిన ద్విచక్ర వాహన, కారు నంబరు ప్లేట్లు ఉండటాన్ని గుర్తించి పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. గదిని సీజ్ చేసి మరింత నిఘా ఏర్పాటు చేశారు. షాజీతో పాటుగా ఉన్న యువతి ఏమైంది? ఎక్కడ ఉంది? అనే వివరాలు కూడా నిందితుడు చెప్పేందుకు నిరాకరించడంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. -
విజయవాడలో డ్రగ్స్ గంజాయి ముఠా గుట్టురట్టు
-
ఆ మహిళకు అదేం బుద్ధి..
సాక్షి, న్యూఢిల్లీ : దశాబ్ధాల తరబడి డ్రగ్ దందా సాగిస్తున్న 88 ఏళ్ల వృద్ధురాలిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 1990 ప్రాంతంలో డ్రగ్స్ వ్యాపారం నడుపుతున్న భర్త మరణించడంతో చీకటి దందాను తన చేతుల్లోకి తీసుకున్న రాజ్‌రాణి అనే మహిళ 1996 నుంచి మూడు సార్లు ఢిల్లీ పోలీసులకు చిక్కినా తన ధోరణి మార్చుకోలేదు. రాజ్‌రాణి కదలికలపై పక్కా సమాచారంతో ఢిల్లీ పోలీసులు ఇందర్‌పురి ప్రాంతంలో మాటువేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌రాణి వద్ద నుంచి హెరాయిన్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్, యూపీలోని డ్రగ్ డీలర్లతో ఆమెకు సంబంధాలున్నాయని పోలీసులు వెల్లడించారు. జైలు జీవితానికీ అలవాటుపడిన రాజ్‌రాణి చట్టంలోని లొసుగులతో ప్రతిసారీ బెయిల్ తెచ్చుకుంటారని చెబుతున్నారు. మరోవైపు తాను డ్రగ్ దందా చేపట్టడం వెనుక పెద్దకథే ఉందని ఆమె పోలీసులకు తెలిపినట్టు సమాచారం. చిన్న వయసులోనే తనకు డ్రగ్ డీలర్‌తో వివాహమై ఏడుగురు పిల్లలు పుట్టారని వారిలో ఆరుగురు డ్రగ్స్ బారినపడి, మరికొందరు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారని చెప్పుకొచ్చారు. రాజ్‌రాణిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వ్యభిచారం... బోనస్‌గా డ్రగ్స్ దందా
సాక్షి, హైదరాబాద్: ఖరీదైన ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని కింది భాగంలో తాముంటూ, పైభాగంలో వ్యభిచార బాగోతం నడిపించారు ఆ దంపతులు. ఇది చాలదన్నట్టు కొందరు విటులు డ్రగ్స్ తీసుకుని రావడాన్ని గమనించి, తామే డ్రగ్స్ సరఫరా ఎందుకు చేయకూడదని ఆలోచించి నైజీరియన్లను ఆశ్రయించారు. వారి దగ్గరి నుంచి కొకైన్, ఓపీఎం, ఎండీఎంఏ లాంటి మత్తుపదార్థాలను కొనుగోలు చేసి అధిక ధరలకు తమ వద్దకు వచ్చే విటులకు విక్రయించారు. ఆ జంట గుట్టును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రట్టు చేశారు. ఇద్దరినీ అరెస్టు చేసి మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో ఈనెల 2వ తేదీన ఫిలింనగర్, రోడ్డునంబర్ 5లో ఉన్న ఓ ఇంటిపై దాడి చేసిన ఎక్సైజ్ అధికారులు 7 గ్రాముల కొకైన్, 2 గ్రాముల ఓపీఎం, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.1.13 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు బి.సంతోష్, మహ్మద్ మసూద్లను అరెస్టు చేశారు. అయితే ఆ సమయంలో ఆ ఇంటిని వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్న నిర్వాహకుడు షేక్ ఫహద్ అలియాస్ మదన్ తన కారులో పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డిని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సి.వివేకానందరెడ్డి నియమించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి. అయితే, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 12లోని సాయిబాబా ఆలయం వద్ద ఓ కారులో కొకైన్ అమ్మకానికి సిద్ధంగా ఉందని ఎక్సైజ్ అధికారులకు విశ్వసనీయ సమాచారం వచ్చింది. అక్కడకు వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కారులో షేక్ ఫహద్ అలియాస్ మదన్ (37), ఆయన భార్య సలీమా రబ్బాయి షేక్ (27)లు కూడా తారసపడ్డారు. వెంటనే వీరిని అదుపులోనికి తీసుకుని 9 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరి దగ్గరి నుంచి రూ.3 లక్షల నగదు, 4 మొబైల్ఫోన్లు, ఒక స్వైపింగ్ మెషీన్, స్విఫ్ట్ కారు, ఈనెల 2న పారిపోవడానికి ఉపయోగించిన ఐ10 కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. వ్యభిచారం నుంచి.. విచారణలో తేలిన వివరాల ప్రకారం... ఫహద్ ఎనిమిదేళ్ల క్రితం నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో వ్యభిచారం నిర్వహించేవాడు. 2018 జనవరిలో అరెస్టు చేసి కేసు కూడా నమోదు చేశారు. దీంతో ఫిలింనగర్ రోడ్డు నంబర్ 5కు మకాం మార్చిన ఫహద్ అక్కడ నెలకు రూ.75వేల కిరాయితో ఇల్లు తీసుకున్నాడు. కింద భాగంలో తానుంటూ పైభాగంలోని గదులలో వ్యభిచారం నిర్వహించేవాడు. అయితే, వ్యభిచారం కోసం వచ్చే కొందరు విటులు డ్రగ్స్ తీసుకుని రావడాన్ని ఫహద్ గమనించాడు. దీంతో ఆ డ్రగ్స్‌ను కూడా తానే సరఫరా చేయాలని నిర్ణయించుకుని సన్‌సిటీ ప్రాంతంలో ఒక నైజీరియన్ నుంచి రూ.6వేలకు గ్రాము చొప్పున కొకైన్ కొనుగోలు చేసి రూ.7,500కు అమ్మేవాడు. స్నేహితులు సంతోష్, సురేశ్, మహ్మద్ మసూద్లను ఉపయోగించుకోవడంతో పాటు తన భార్య సహకారంతో ఈ దందాలు నడిపేవాడు. కొకైన్‌తో పాటు ఓపీయం, ఎండీఎంఏలు కూడా విక్రయించేవాడు. వీరిపై మాదకద్రవ్యాల నిరోధక చట్టం సెక్షన్–27 ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేశారు. -
హైదరబాద్ శివారు ప్రాంతంలో పట్టివేత
-
వెలుగులోకి వస్తున్న ఇంకెమ్ ఎండీ లీలలు
సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటక రాజధాని బెంగళూరులో చిక్కిన అంతర్జాతీయ కేటమైన్ రాకెట్లో నగరానికి చెందిన ఇంకెమ్ ఇండస్ట్రీస్ ఎండీ వెంకటేశ్వర్లు పాత్ర కీలకమని వెలుగులోకి వచ్చింది. 2009లో ఎఫిడ్రిన్ తయారీ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు (ఎన్సీబీ) చిక్కిన ఇతను జైలుకు వెళ్లాడు. ఇప్పుడు కేటమైన్ కేసులో మరోసారి కటకటాల్లోకి చేరాడు. గత గురువారం ఎన్సీబీకి బెంగళూరులో పట్టుబడిన ఇద్దరు నిందితుల విచారణలో వెంకటేశ్వర్లు పేరు వెలుగులోకి రావడంతో నగరానికి వచ్చిన ప్రత్యేక బృందం ఇక్కడి ఎన్సీబీ యూనిట్ సాయంతో నాచారంలో దాడులు నిర్వహించింది. ఫలితంగా ఇంకెమ్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఏకంగా 477 కేజీల కేటమైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన ఎన్సీబీ అధికారులు సోమవారం అతడిని అరెస్టు చేశారు. ఇక్కడి కోర్టులో హాజరుపరిచి ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్‌పై బెంగళూరుకు తరలించారు. డేట్ డ్రగ్, రేప్ డ్రగ్, సెక్స్ డ్రగ్‌గానూ పిలిచే కేటమైన్ వాడకంతో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ప్రధానంగా స్టడ్ ఫామ్స్‌లో గుర్రాలకు దీనిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. బెంగళూరులోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) యూనిట్‌కు గత మంగళవారం కేటమైన్ స్మగ్లింగ్‌పై కీలక సమాచారం అందడంతో అక్కడి మూవీలాండ్ థియేటర్ సమీపంలో దాడి చేసిన అధికారులు కేటమైన్ స్వాధీనం చేసుకున్నారు. లోతుగా ఆరా తీసిన నేపథ్యంలో బెంగళూరులోని కెంగేరి శాటిలైట్ టౌన్ ప్రాంతానికి చెందిన శివరాజ్ ఆ డ్రగ్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అతడి ఇంటిపై దాడి చేసిన ఎన్సీబీ టీమ్ అక్కడ ఓ కేటమైన్ తయారీ యంత్రాన్ని స్వాధీనం చేసుకుంది. శివరాజ్ విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలు ఆధారంగా ఈ డ్రగ్‌ను ఖరీదు చేస్తున్న చెన్నై వాసి జె.కన్నన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. శివరాజ్ విచారణలోనే హైదరాబాద్‌కు చెందిన ఇంచెమ్ సంస్థ ఎండీ వెంకటేశ్వర్లు ద్వారా ఈ కేటమైన్ తయారీ తనకు తెలిసిందని వెల్లడించాడు. అతడి ఫ్యాక్టరీలో ఇలాంటి తయారీ యంత్రం మరోటి ఉన్నట్లు చెప్పడంతో బెంగళూరు నుంచి గత గురువారం వచ్చిన ప్రత్యేక ఎన్సీబీ టీమ్ హైదరాబాద్ యూనిట్ అధికారులతో కలిసి నాచారంలో ఉన్న ఇంకెమ్ సంస్థపై దాడి చేసింది. ఈ సందర్భంగా 477 కేజీల కేటమైన్తో పాటు తయారీ యంత్రాన్ని స్వాధీనం చేసుకుని సంస్థను సీజ్ చేసింది. ఈ సంస్థకు చెందిన రిజిస్టర్డ్ కార్యాలయం సనత్‌నగర్‌లో ఉండటంతో అక్కడకు వెళ్లిన అధికారులు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. ఎన్సీబీ దాడి చేసిన సమయంలో ఇంకెమ్లో మొత్తం 17 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. అందులో ఎనిమిది మంది రెగ్యులర్, మిగిలిన వారు కాంట్రాక్ట్ కార్మికులు. వీరిలో ఎవ్వరికీ తాము నిషేధిత డ్రగ్‌ను తయారు చేస్తున్నామనే విషయం తెలియదు. దీంతో ఎన్సీబీ అధికారులు వీరిని విచారించి వదిలేశారు. శివరాజ్‌కు కేటమైన్ తయారీకి అవసరమైన ముడిసరుకును వెంకటేశ్వర్లు సరఫరా చేస్తున్నట్లు ఎన్సీబీ గుర్తించింది. ఫార్మా రంగానికి చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పేరుతో లైసెన్స్ తీసుకుని ఇంకెమ్ సంస్థను ఏర్పాటు చేసిన వెంకటేశ్వర్లు దాని ముసుగులో డ్రగ్ తయారు చేస్తున్నాడు. దేశీయ మార్కెట్లో కేజీ రూ.3.5 లక్షలు ఉండగా అంతర్జాతీయ మార్కెట్లో ఈ ధర రూ.35 లక్షల వరకు ఉంటోంది. ఈ డ్రగ్ మాఫియా ఉత్పత్తి చేసిన కేటమైన్‌ను చెన్నై మీదుగా దక్షిణాసియా దేశాలతో పాటు ఆస్ట్రేలియా, మలేషియాలకు అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎన్సీబీ అధికారులు అనుమానిస్తున్నారు. -
రిసార్ట్‌లో హంగామా పోలీసు స్టేషన్‌కు యువతులు..
సాక్షి, చెన్నై: ఈసీఆర్ మార్గంలో ఓ రిసార్ట్‌లో మత్తులో యువత తూలారు. అర్ధరాత్రి వీరు సృష్టించిన హంగమా ఏకంగా నేర విభాగం ప్రత్యేక డీజీపీ దృష్టికి చేరింది. తిరువళ్లూరు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీల నేతృత్వంలోని రెండు వందల మంది పోలీసులు ఆ రిసార్ట్‌ను చుట్టుముట్టారు. మత్తుకు చిత్తై ఉన్న 150 మందికి పైగా యువకులు, యువతులు, బౌనర్లను అరెస్టు చేశారు. ఐదు మంది నిర్వాహకుల మీద కేసు నమోదు చేశారు. ఇటీవల కాలంగా రిసార్టుల్లో వీకెండ్ పార్టీలు జోరుగా సాగుతున్నాయి. మత్తులో యువత తూలే దిశగా మద్యం, గంజాయి, మాత్రలు వంటి వాటిని సరఫరా చేసే వాళ్లు పెరగడంతో వీటికి ఆకర్షితులయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. గత వారం పొల్లాచ్చిలోని ఓ రిసార్ట్‌లో సాగిన వీరంగంతో పోలీసులు కొరడా ఝుళిపించారు. అక్కడ పట్టుబడ్డ యువతను హెచ్చరించి పంపించారు. నిర్వాహకుల మీద మాత్రం కేసులు పెట్టారు. అరెస్టులు చేశారు. అయినా, తాము తగ్గేది లేదన్నట్టుగా రిసార్టులు, యువ సమూహం మత్తుకు చిత్తయ్యే పనిలో పడ్డాయి. ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో మహాబలిపురం సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు రిసార్ట్‌లో సాగుతున్న హంగమా నేర విభాగం ప్రత్యేక డీజీపీ విజయకుమార్ దృష్టికి చేరింది. ఆయనకు వచ్చిన ఫిర్యాదుతో కాంచీపురం పోలీసుల్ని అప్రమత్తం చేశారు. ఆ జిల్లా ఎస్పీ సంతోష్ సెలవులో ఉండటంతో తిరువళ్లురు ఎస్పీ పొన్నిని రంగంలోకి దించారు. ఫేస్‌బుక్‌తో ఏకం.. విందుతో మజా తిరువళ్లురు ఎస్పీ పొన్ని నేతృత్వంలోని డీఎస్పీ సుబ్బరాజు, ఏడీఎస్పీ శిలంబరసన్తో పాటుగా రెండు వందల మంది పోలీసులు ఆ రిసార్ట్‌ను అర్ధరాత్రి వేళ చుట్టుముట్టారు. ఎవ్వరూ లేనికి వెళ్లలేనంతగా అక్కడ నిర్వాహకులు భద్రతా ఏర్పాట్లు చేసుకుని ఉండటంతో కాసేపు బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి. అక్కడ యాబైకు పైగా ఖరీదైన కార్లు ఉండటంతో వాటిలో తనిఖీలు చేపట్టారు. ఎట్టకేలకు పోలీసులు అతి కష్టం మీద లోనికి వెళ్లారు. ఈ సమయంలో పోలీసులతో అక్కడ మత్తుకు చిత్తైన వాళ్లు తిరగబడే యత్నం చేశారు. కొందరు అయితే, అక్కడ హోరెత్తుతున్న సంగీతంతో పోలీసుల్ని సైతం పట్టించుకోకుండా నృత్యాలు చేస్తుండటం గమనార్హం. దీంతో అక్కడున్న స్పీకర్లను పోలీసులు తొలగించారు. దీంతో ఆగ్రహించిన అక్కడున్న వాళ్లు తిరగబడే రీతిలో వ్యవహరించడంతో పోలీసులు తమదైన శైలిలో రుచి చూపించే యత్నం చేశారు. దీంతో అక్కడున్న అనేక మంది భయంతో బయటకు పరుగులు పెట్టే యత్నం చేసినా, ముందుగానే పోలీసులు అన్ని దార్లను మూసివేయడంతో శరణు కోరక తప్పలేదు. తామంతే ఫేస్బుక్, ట్విటర్ల ద్వారా ఏకం అయ్యామని, తరచూ ఇక్కడకు వచ్చి విందు, వినోదాలతో గడుపుతామని పోలీసులకు వారు వివరణ ఇచ్చుకున్నారు. అయితే, ఆ పరిసర వాసులకు ఇబ్బంది కల్గించే రీతిలో స్పీకర్లు ఏర్పాటు చేయడంతో పాటుగా అక్కడ పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లే కాదు, పది గ్రామలు, ముప్పై గ్రాములు చొప్పున గంజాయి ప్యాకెట్లు లభించడం, అనేక రకాల మాత్రలు సైతం ఉండటంతో అందర్నీ అదుపులోకి తీసుకున్నారు. వేకువజామున వీరందర్నీ సమీపంలోని ఓ కల్యాణ మండపంలో ఉంచి విచారించారు. అందరి వద్ద తలా రూ.మూడు వేలు చొప్పున వసూళ్లు చేసిన నిర్వాహకులు ఐదు మంది మీద కేసు నమోదు చేశారు. మిగిలిన వారికి తీవ్ర హెచ్చరికలు చేసి పంపించేందుకు నిర్ణయించారు. తల్లిదండ్రులకు చీవాట్లు.. మొత్తంగా 150 మంది యువకులు, ఏడుగురు యువతులు, పది మంది బౌనర్లు, ఐదు మంది నిర్వాహకులు అక్కడ పట్టుబడ్డారు. యువతుల్ని మాత్రం మహిళ పోలీసు స్టేషన్‌కు తరలించి, వారి వివరాలను సేకరించారు. మత్తుకు చిత్తై ఉన్న ఆ యువతుల తల్లిదండ్రుల్ని పిలిపించి తీవ్రంగా మందలించారు. ఏదేని జరగరానిది జరిగిన పక్షంలో పోలీసుల్ని నిందిస్తారంటూ తల్లిదండ్రులకు చీవాట్లు పెట్టారు. -
సినిమా అవకాశాల కోసం ముంబై వెళ్లి డ్రగ్ పేడ్లర్‌గా..
-
అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో మరోసారి డ్రగ్స్ ముఠా హల్చల్ చేసింది. డ్రగ్స్ విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కమతిపురాకు చెందిన ఇష్క్ మొయినుద్దిన్ అనే కీలకవ్యక్తితో పాటు మరో నలుగురిని అరెస్ట్‌చేసినట్లు తెలిపారు. సినిమా అవకాశాల కోసం ముంబై వెళ్లిన మొయినుద్దిన్ డ్రగ్ పేడ్లర్‌గా మారి అమ్మకాలు చేస్తున్నాడని పేర్కొన్నారు. ముంబై వాసి అభిషేక్‌తో పరిచయం కావడం.. మరికొంత మంది ముఠాగా మారడంతో విక్రయాలు సాగిస్తున్నట్లు తెలిపారు. వీరివద్ద నుంచి 28 గ్రాముల హెరాయిన్, ఆరు మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. హెరాయిన్‌కు మార్కెట్లో మంచి ధర ఉండటంతో సప్లై చేస్తున్నారన్నారు. సమద్ రైస్ ఖాన్, ఇష్క మొయినుద్దిన్, ఖాజా, వాజీద్, అభిషేక్ పారికర్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సయ్యద్ అమీర్, షేక్ వహీద్, ఉస్మాన్ షేక్‌లు పరారీలో ఉన్నారని తెలిపారు. పరారీలో ఉన్న అభిషేక్ ముంబైలో ఉంటూ మొయినుద్దిన్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. -
గోవా టు హైదరాబాద్
హిమాయత్‌నగర్: హైదరాబాద్ నగరంలో మరోసారి మాదకద్రవ్యాలు కలకలం రేపాయి. సోమాజిగూడలోని ఓ హోటల్లో మాదక ద్రవ్యాలను విక్రయించేందుకు యత్నిస్తున్న ఘనా దేశానికి చెందిన యువతిని ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి 50గ్రాముల కొకైన్, 10 గ్రాముల ఎక్ట్ససీ, నోకియా మొబైల్‌ను స్వాధీనం చేసుకుని, ఆమె పాస్‌పోర్ట్‌ను సీజ్ చేశారు. గురువారం నారాయణగూడలోని ఎక్సైజ్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి వివరాలు వెల్లడించారు. పశ్చిమ ఆఫ్రికాలోని ‘ఘనా’కు చెందిన ‘జెనెవివే అలాండో ఒకేట్చ్’ టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చింది. కొన్నాళ్లపాటు గోవాలో ఉన్న ఆమెకు అక్కడ టూరిస్ట్ గైడ్‌గా పని చేస్తున్న మహారాష్ట్రకు చెందిన ‘ఓబో’తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి ముంబై, ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాలకు ఆర్డర్‌పై మాదకద్రవ్యాలను సరఫరా చేసేవారు. వారం రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి ‘కొకైన్, ఎక్ట్ససీ’ అందజేస్తే రూ.20వేలు ఇస్తానని చెప్పడంతో ఓబో చెప్పడంతో ఆమె నగరానికి వచ్చింది. ‘ఓయో’ యాప్ ద్వారా సోమాజీగూడలోని ఓ హోటల్లో 20, 21వ తేదీల్లో బస చేసేందుకుగాను గదిని బుక్ చేసుకుంది. 20న ఉదయం బస్సులో నగరానికి చేరుకున్న ఆమె అదే రోజు సాయంత్రం రాజ్‌భవన్ సమీపంలో కొందరు కస్టమర్లకు ‘కొకైన్, ఎక్ట్ససీ’ అందజేస్తుండగా టాస్క్‌ఫోర్స్ సీఐ కరుణ తన బృందంతో దాడి చేసి జెనెవివే అలాండో ఒకేట్చ్ను అదుపులోకి తీసుకున్నారు. మూడు నెలల క్రితం కూడా సరఫరా మూడు నెలల క్రితం కూడా ఓబో సూచన మేరకు నగరానికి వచ్చిన జెనెవివే అలాండో ఒకేట్చ్ ‘50గ్రాముల కొకైన్, పది గ్రాముల ఎక్ట్ససీ’ని వినియోదారులకు సరఫరా చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ప్రధాన నిందితుడు ఓబోకు నగరంలో పదిమంది కస్టమర్లు ఉన్నట్లు సమాచారం. తరచూ గోవా నుంచి ఆఫ్రికాకు చెందిన యువతులను హైదరాబాద్‌కు పంపుతూ వారికి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. సరుకు అందేవరకు లైవ్ ఫోన్ కాన్ఫరెన్స్ సరుకు తీసుకుని నగరానికి వచ్చిన యువతులతో ఓబో ఫోన్ టచ్‌లో ఉంటాడు. కొనుగోలు దారులకు నేరుగా ఫోన్ చేసే అతను వారితో మాట్లాడుతూనే సరుకు తీసుకువచ్చిన యువతితో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాడు. సదరు యువతి సూచన మేరకు ఆమె బస చేసిన హోటల్ వద్దకు చేరుకుంటారు. ఆమె మాదకద్రవ్యాలను తీసికెళ్లి వారి చేతికి ఇవ్వగానే ఫోన్‌కాల్ కట్ చేస్తాడు. దీంతో సరుకు తీసుకు వచ్చిన యువతులకు కొనుగోలుదారులకు సంబందించి ఎలాంటి వివరాలు తెలియవు. ఓబో చెప్పినట్లు చేస్తేనే డబ్బులు ఇస్తాడని జెనెవివే అలాండో ఒకేట్చ్ విచారణలో వెల్లడించినట్లు డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం జెనెవివే అలాండో ఒకేట్చ్ కాల్ లిస్ట్‌లో ఎవరైనా సినీప్రముఖులు ఉన్నారా? అంటూ మీడియా ప్రశ్నించగా అందుకు ఆధారాలు లేవని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. కేవలం కొందరు యువకులకు వీటిని విక్రయించేందుకు ఆమె నగరానికి వచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. ప్రస్తుతానికి సినీప్రముఖల పేర్లు, ఫోన్ నంబర్లు జెనెవివే అలాండో ఒకేట్చ్’ కాల్ లిస్ట్‌లో లేవన్నారు. త్వరలో ఓబోను పట్టుకుని మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం
-
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల వేళ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ సరఫరాపై నిఘా పెట్టిన పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. జోసెఫ్ అలమేధ, శంకర్ అనే ఇద్దరు అంతరాష్ట్ర డ్రగ్స్ మాఫియా సభ్యులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10లక్షల విలువైన 89 గ్రాముల కొకైన్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ఈ డ్రగ్స్ మాఫియా నైజీరియన్స్‌ను నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు తెలిపారు. గోవా కేంద్రంగా ఈ దందా సాగిస్తున్నట్టు పేర్కొన్నారు. వీరు ఒక గ్రాము కొకైన్‌ను మూడువేల రూపాయలకు కొనుగోలు చేసి దానిని 6 నుంచి 7వేల రూపాయలకు విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. -
డ్రగ్స్ పడగ!
సమాజంపై చిమ్మే అతి ప్రమాదకరమైన విషం మాదకద్రవ్యం. ఆనందం కోసం అంటూ తొలుత పరిచయమయ్యే డ్రగ్స్.. వ్యసనంగా మారుతుంది.. బానిసను చేస్తుంది.. జీవితాన్ని చిదిమేస్తుంది.. అంతిమంగా మరణశాసనం రాసేస్తుంది. అమరావతి రాజధానిపై మాదకద్రవ్యాల ముఠాలు విషం చిమ్మేందుకు పడగవిప్పాయి. యువతే లక్ష్యంగా డ్రగ్స్ వ్యాపారం చాపకిందనీరులా విస్తరిస్తోంది. ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నిఘా వర్గాలు.. పోలీసు శాఖ, యువత అప్రమత్తం కాకుంటే బెజవాడ నగరం డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకోవడం ఖాయం. సాక్షి, అమరాతిబ్యూరో : అమరావతి రాజధానిలో మాదకద్రవ్యాల ముఠా జాడ కలకలం రేపుతోంది. ఈ ముఠా వెనుక పశ్చిమ బెంగాల్, ముంబై, హైదరాబాద్‌కు చెందిన కరుడుగట్టిన డ్రగ్స్ ముఠాల నేపథ్యం కనిపిస్తోంది. విజయవాడకు దిగుమతి చేసిన మాదకద్రవ్యాలు అక్కడి నుంచే వచ్చినవి కావడం ఇందుకు నిదర్శనం. తాజాగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ ముఠాను అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సంపన్న కుటుంబాలు, యువతే లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా తమ కార్యకలాపాలను ఇక్కడ విస్తరించాలని యత్నించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యార్థులను ఈ ఉచ్చులోకి దించి తద్వారా భారీ మొత్తంలో సొమ్ము చేసుకోవాలని పక్కా ప్రణాళికతో ఈ ముఠా సభ్యులు నగరంలోకి ప్రవేశించినట్లు సమాచారం. గంజాయి.. అల్పాజోలాం.. ఎల్ఎస్డీ. బ్రౌన్‌షుగర్.. కొకైన్.. హెరాయిన్.. ఇలా పేరు ఏదైనా మత్తే ప్రధానం. వీటిని ఆస్వాదిస్తున్న వారికి గుట్టుచప్పుడు కాకుండా సరఫరా జరుగుతోంది. ముంబై, హైదరాబాద్, గోవా కేంద్రంగా విజయవాడలోకి డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యేకించి సంపన్న వర్గాలు, సినిమా, రాజకీయ రంగాలకు సంబంధించిన ప్రముఖులే కాదు.. విద్యార్థులను టార్గెట్ చేసుకుంటున్న డ్రగ్స్ ముఠాలు వివిధ మార్గాల ద్వారా నగరానికి వాటిని చేరవేస్తున్నారు. నగరంలోని కొన్ని ప్రముఖ కళాశాలు గంజాయి, కొకైన్, హెరాయిన్ విక్రయాలకు అడ్డాగా మారినట్లు పోలీసులు భావిస్తున్నారు. కొన్ని కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్లే డ్రగ్స్ విక్రయదారులు నగరాన్ని తమ వ్యాపార కేంద్రంగా ఎంచుకున్నట్లు సమాచారం. పోలీసులు గట్టి నిఘా పెట్టకపోతే అమరావతి రాజధాని డ్రగ్స్‌కు అడ్డాగా మారుబోతుందనడంలో సందేహం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నూతన సంవత్సర వేడుకలే టార్గెట్.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో వివిధ రకాల ఈవెంట్ల పేరుతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు క్లబ్‌లు, హోటళ్లు, రిసార్ట్లు వివిధ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకల్లో తినడం.. తాగడం అనేది కల్చర్‌లో ఓ భాగంగా భావిస్తున్న యుతను డ్రగ్స్ మత్తులో ముంచేందుకు చాపకింద నీరులా ముందుకు సాగుతున్నాయి కొన్ని ముఠాలు. ఈ నేపథ్యంలో ముందుగా ఇక్కడ డ్రగ్స్ విక్రయాలు అంచనా వేయడానికి ముందుగా కొద్ది మొత్తంలో కొకైన్.. హెరాయిన్‌ను నగరానికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ ముఠా సభ్యులు వివిధ వేషాలతో మత్తు మందులను దిగుమతి చేసే అవకాశముందన్న సమాచారంతో నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులకు శనివారం పచ్చిమ బెంగాల్ ముఠా సభ్యులు చేతికి చిక్కారు. -
డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
-
డ్రగ్స్‌పై ఉక్కుపాదం : 140 మంది అంతం
ఢాకా : బంగ్లాదేశ్ ప్రభుత్వం మత్తు మందు వ్యాపారులపై(డ్రగ్ డీలర్స్) ఉక్కుపాదం మోపింది. కేవలం మూడువారాల్లోనే 140 మంది డ్రగ్ డీలర్స్ను అంతమొందించింది. మరో 18 వేల మందిని అదుపులోకి తీసుకుంది. దేశంలో నాటుకుపోయిన డ్రగ్ మాఫియాను నామారూపాల్లేకుండా చేయాలని ప్రధాని హసీనా కంకణం కట్టుకున్నారు. గత నెలలో ఆమె మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి డ్రగ్స్ సరఫరా చేసే వారిపై పోలీసులు దాడులు చేస్తున్నారు. కాగా, డ్రగ్స్ డీలర్స్ మరణాలపై మానవ హక్కుల కార్యకర్తలు ఐకరాజ్యసమితిని(యూఎన్) సంప్రదించారు. దీనిపై స్పందించిన యూఎన్ ఈ హత్యలను తీవ్రంగా ఖండించింది. ఈ రక్తపాతాన్ని ఆపాల్సిందిగా బంగ్లా ప్రభుత్వాన్ని కోరింది. ఈ ఘటనలను బంగ్లాదేశ్ పోలీసులు సమర్ధించుకున్నారు. ముఠా తగాదాల వల్ల చాలా మంది చనిపోయినట్టు వారు పేర్కొన్నారు. వారిపై వస్తున్న విమర్శలకు ఫిలిప్పైన్స్‌లో డ్రగ్ మాఫియాపై జరిగిన దాడులను ఉదహరించారని ఇంటర్నెషనల్ డ్రగ్ పాలసీ కన్సార్టియమ్ యూఎన్‌కు నివేదించింది. హింసతో, దాడులతో డ్రగ్ మాఫియాను తుదముట్టించలేమని కూడా తెలిపింది. ప్రధాని హసీనా మాత్రం ఈ మారణకాండపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. వీటికి ప్రజల నుంచి మద్దతు లభించడం.. 2018 చివర్లో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరుగుతుండటంతో హసీనా ఈ విధమైన ధోరణి అవలంభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టె అధికారంలోకి వచ్చాక వేలాదిమంది డ్రగ్ డీలర్లపై ఉక్కుపాదం మోసి అంతమొందించిన సంగతి తెలిసిందే. -
మత్తు మందు చల్లి ప్రొద్దుటూరులో చోరీ
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక మైదుకూరు రోడ్డులోని బాలాజీనగర్–2లో నివాసం ఉంటున్న కాఫీడే డిస్ట్రిబ్యూటర్ ప్రదీప్‌రెడ్డి ఇంట్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. నిద్రపోతున్న వ్యక్తిపై మత్తు మందు చల్లి అతని వద్ద ఉన్న తాళం చెవి తీసుకొని ఇంట్లోకి చొరబడ్డారు. టూ టౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రదీప్‌రెడ్డి కాఫీడే డిస్ట్రిబ్యూటర్‌గా పని చేస్తున్నాడు. అతను రెండు రోజుల క్రితం ఏజెన్సీ పనిపై క్యాంప్‌నకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన తండ్రి నరసింహారెడ్డి ప్రధాన ద్వారానికి తాళం వేసి మంగళవారం మిద్దెపై పడుకున్నారు. ప్రదీప్‌రెడ్డి భార్య శశికళ, కుమార్తె అనితశ్రీలు ఇంట్లోని రెండో బెడ్రూంలో పడుకున్నారు. ఈ క్రమంలో మిద్దెపై పడుకున్న నరసింహారెడ్డి మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో నిద్రలేచి చూడగా దిండు కింద తాళాలు, సెల్‌ఫోను ఉన్నాయి. బుధవారం వేకువ జామున 3.30 గంటలకు మెలకువలోకి వచ్చిన ఆయన దిండు కింద చూసుకోగా తాళాలు, సెల్‌ఫోన్ కనిపించలేదు. దీంతో కంగారుగా అతను కిందికి వెళ్లగా ఇంటి ప్రధాన ద్వారం తెరచి ఉంది. ఇంట్లో ఉన్న బీరువా కూడా తెరవబడి, అందులోని వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. రోజూ హాల్లోని ఫ్రిజ్‌పై మొదటి గది తాళం చెవి, బీరువా తాళాలు పెట్టే అలవాటు ఉందని, వాటిని తీసుకొని దుండగులు గదిలోకి ప్రవేశించారని నరసింహారెడ్డి తెలిపారు. తనపై మత్తు మందు చల్లడంతోనే వేకువ జాము వరకూ మెలుకువ రాలేదని, ఇప్పుడు కూడా మత్తుగా ఉందని ఆయన అన్నారు. విషయం తెలియడంతో డీఎస్పీ శ్రీనివాసరావు, వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి, ఎస్ఐ మధుమళ్లేశ్వరరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీం అధికారులు కూడా సంఘటనా స్థలం లో వేలి ముద్రలు సేకరించారు.కేసు నమో దు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
మత్తుబిళ్లలిచ్చి.. ఏమార్చి
విజయవాడ: మత్తు బిళ్లలు ఇచ్చి బంగారం దొంగతనానికి పాల్పడే నిందితురాలని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆమె నుంచి 112 గ్రాముల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఒన్‌టౌన్ శివాలయం ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితురాలు గుంటూరు జిల్లా రాజాగారి తోటకు చెందిన పాతిన సురేఖ అలియాస్ బుజ్జి (33) విచారణలో తేలింది. టైలరింగ్ పని చేస్తున్న ఆమెకు ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నారు. భార్యాభర్తలిద్దరికి పనులు దొరకడం లేదు. దీనికి తోడు తేలికంగా డబ్బు సంపాదించాలనే అతి ఆశతో 15 రోజుల క్రితం ఆమె విజయవాడకు చేరింది. విజయవాడ బస్టాండ్ వద్ద వృద్ధురాలిని మాటలు చెప్పి, ఆటో ఎక్కించుకుని బందర్ రోడ్డులో ఆయుర్వేద హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. మంచి మందులు ఇప్పిస్తానని నమ్మబలికి తేనెలో కలిపిన మత్తు బిళ్లలు వృద్ధురాలితో మింగించింది. తరువాత బంగారం వస్తువులను అపహరించుకుపోయింది. ఈ క్రమంలో గవర్నర్‌పేట పోలీసుస్టేషన్లో నమోదైన కేసు మేరకు సీసీఎస్ పోలీసులు విచారణ జరిపి నిందితురాలిని అరెస్టు చేశారు. -
650 మందిని యాసిడ్‌లో ముంచి చంపాడు
మెక్సికో సిటీ : దాదాపు 650 మంది హత్యల కేసులో మెక్సికో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో హత్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న శాన్టియాగో మెజా లోపెజ్ అలియాస్ ది సోప్ మేకరే ఈ హత్యలను చేసినట్లు తెలిపారు. సినాలోవా డ్రగ్ కార్టెల్ అనే డ్రగ్స్ ముఠాలో పని చేసే సోప్ మేకర్.. తనకు అడ్డొచ్చిన 650 మందిని యాసిడ్‌లో ముంచి చంపినట్లు వివరించారు. భారీ డ్రమ్ముల్లో యాసిడ్ ఉంచి అందులో బాధితులను వేసి మూత పెట్టి అతి క్రూరంగా చంపేవాడని చెప్పారు. అలా బాధితుల శరీరాలు యాసిడ్ కరిగిపోగా మిగిలిన పదార్థాలను గుంతల్లో పూడ్చిపెట్టాడని తెలిపారు. 2009లో సోప్ మేకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటివరకూ 240 మంది బాధితుల ఆనవాళ్లను మెక్సికోలోని పలు ప్రాంతాల నుంచి తవ్వి తీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మెక్సికో మీడియాకు పోలీసులు అందజేశారు. కాగా, 2009 నుంచి విచారణ ఎదుర్కొంటున్న ది సోప్ మేకర్‌కు ఇంకా శిక్ష పడలేదు. -
రక్తపోటు మందుతో దీర్ఘాయుష్షు?
రక్తపోటుకు వేసే మాత్రతో వయసు పెరుగుతుందా? మనుషుల సంగతి ఏమో తెలియదుగానీ.. సీ– ఎలిగాన్స్ (రౌండ్ వర్మ్) అనే సూక్ష్మజీవుల విషయంలో మాత్రం ఇది నిజమే అంటున్నారు యూటీ సౌత్ వెస్ట్రర్న్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు. అమెరికాలో అందుబాటులో ఉన్న ఈ మందు పేరు హైడ్రాలజీన్. కణాలకు తక్కువ కేలరీలు అందినట్టుగా భ్రమింప జేసే వ్యవస్థ ద్వారా ఈ మందు సీ–ఎలిగాన్స్ ఆయుష్షును 25 శాతం వరకూ పెంచిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ హమీద్ మిర్జాయి తెలిపారు. రెండు రకాల సూక్ష్మజీవులపై తాము ప్రయోగాలు జరిపామని, పసుపులోని కర్క్యుమిన్, మధుమేహ చికిత్సలకు వాడే మెట్ఫార్మిన్ కంటే మెరుగ్గా ఇది ఆయువు పెంపునకు కృషి చేస్తుందని ఆయన అన్నారు. హైడ్రాలజీన్ను వాడుతున్నంత కాలం రౌండ్ వర్మ్లలో చురుకుదనం కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. మన కణాల్లోని ఎన్ఆర్ఎఫ్2 అనే వ్యవస్థ శరీరానికి హాని చేసే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షణ కల్పిస్తూంటుందని, వయసు పెరిగే కొద్దీ ఈ వ్యవస్థ పనితీరు దెబ్బతినడం వల్ల అల్జైమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు వస్తూంటాయని ఆయన వివరించారు. ఈ వ్యవస్థను చైతన్యవంతం చేయడం ద్వారా హైడ్రాలజీన్ పనిచేస్తూందని.. మానవుల్లోనూ ఎస్కేఎన్–1 రూపంలో ఇలాంటి వ్యవస్థ ఉన్న కారణంగా తమ పరిశోధన ఆయా వ్యాధుల నివారణతోపాటు ఆయుష్షు పెంపునకూ ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. -
జీవీకే బయోకు షాక్!
-
జీవీకే బయోకు షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాంట్రాక్ట్ రీసెర్చ్ సేవల్లో ఉన్న హైదరాబాదీ కంపెనీ జీవీకే బయోసైన్సెస్‌కు పెద్ద దెబ్బే తగిలింది. కంపెనీకి అతిపెద్ద క్లయింట్ అయిన యూకే ఫార్మా దిగ్గజం గ్లాక్సో స్మిత్‌క్లైన్ (జీఎస్కే) తీవ్రమైన షాక్ ఇచ్చి ఓ భారీ కాంట్రాక్టు నుంచి మధ్యలోనే వైదొలిగిందని విశ్వసనీయంగా తెలిసింది. దీంతో జీవీకే బయో రూ.200 కోట్లకుపైగా ఆదాయం కోల్పోయినట్లు సమాచారం. సంస్థ ఆదాయంలో ఇది 25%కి పైగా ఉండడంతో సంస్థకు ఎటూ పాలుపోవటం లేదు. జీఎస్కేలో కీలక బాధ్యతల్లో ఇటీవల చేరిన ఉన్నతాధికారి ఒకరు ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలతో ఉన్న కాంట్రాక్టులను సమీక్షిస్తున్నారు. ఇందులో భాగమే తాజా పరిణామమని తెలిసింది. జీవీకే బయోపై పలు నియంత్రణ సంస్థలు అలర్ట్ విధించడం తెలిసిందే. జీవీకే బయోతో తమకు బలమైన బంధం ఉందని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీఎస్కే ఆర్అండ్డీ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ వాలెన్స్ చెప్పడం గమనార్హం. అయితే తాజా సమీక్ష పూర్తయిన తర్వాత జీవీకే బయోకు తిరిగి కాంట్రాక్టు దక్కే అవకాశాలు లేవనే చెబుతున్నారు. ఆందోళనలో ఉద్యోగులు.. గతేడాది జీవీకే వార్షిక ఆదాయం రూ.750 కోట్లు. ఇందులో జీఎస్కే కాంట్రాక్టు విలువ రూ.400 కోట్లకు పైమాటే. ఇందులో 6 నెలల కాంట్రాక్టు పూర్తయింది. తాజా పరిణామంతో జీవీకే రూ.200 కోట్ల దాకా కోల్పోతోందని తెలిసింది. జీవీకే బయోలో 2,300 మంది దాకా ఉద్యోగులున్నారు. డ్రగ్ డిస్కవరీలో 1,400 మంది నిమగ్నం కాగా... ఒక్క జీఎస్కే సైంటిఫిక్ బిజినెస్ ప్రాజెక్టుపైనే 300 దాకా పనిచేస్తున్నట్టు తెలిసింది. వీరిలో 50 మందిని వివిధ విభాగాల్లో సర్దుతున్నారని, మరో 250 మందికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలన్న డైలమాలో కంపెనీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. జీతాల భారం పెరుగుతుండడంతో వీరిపై వేటు వేయాలా? అన్న భావనలో కంపెనీ ఉన్నట్టు చెబుతున్నారు. ఇదే జరిగితే ఫార్మాకు పెద్ద కుదుపే. కొత్త కాంట్రాక్టు వస్తే ఉద్యోగుల భవితవ్యానికి ఢోకా ఉండకపోవచ్చు. జీవీకే ఔషధ పరీక్షల్లో లోపాలున్నాయంటూ యూరప్ ఔషధ నియంత్రణ సంస్థ 2014లో సంచలన ప్రకటన చేయటం తెలిసిందే. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆఫ్ మెడిసిన్స్, హెల్త్ ప్రొడక్ట్స్(ఏఎన్ఎస్ఎం) నివేదికలో ఇది తేలడంతో జీవీకే అధ్యయనం చేసిన వందలాది జనరిక్ ఔషధాలకు విక్రయ అనుమతులను ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, లక్సెంబర్గ్ ఔషధ నియంత్రణ సంస్థలు రద్దు చేశాయి కూడా. -
‘డ్రగ్ మాఫియా నిర్మూలనకు కీలక నిర్ణయాలు..!’
మనీల: ఫిలిపైన్స్ పోలీసు కాల్పులో 32 మంది అనుమానిత డ్రగ్ డీలర్లు మృతిచెందారు. మరో 107 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ మాఫియాను నిర్మూలించే క్రమంలో దేశాధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు సుమారు 66 చోట్ల సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా పలువురు పోలీసులపైకి కాల్పులకు దిగడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. పెద్ద మొత్తంలో మెటాంఫెటామైన్, మారిజునా అనే డ్రగ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక 34 ఆయుధాలను కూడా సీజ్ చేశారు. -
డ్రగ్స్... వద్దురా..సోదరా!
హైదరాబాద్: ‘యువతా మేలుకో... డ్రగ్స్‌ను వదులుకో’... డ్రగ్స్ మాఫియా పనిపడదాం.. అంటూ విద్యార్థి లోకం నినదించింది. జీవితాలను నాశనం చేస్తున్న మత్తుకు దూరంగా ఉందాం అంటూ అవగాహన ర్యాలీలు నిర్వహించింది. శనివారం నగరంలోని పలు కళాశాలలు, స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ వద్దురా.. సోదరా’ అంటూ నినాదాలు చేశారు. బాచుపల్లి వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల విద్యార్థులు నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు. బ్యానర్లు, ప్లకార్డులను పట్టుకొని మత్తు ప్రభావంతో కలుగుతున్న అనర్థాలపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ ధనుంజయనాయుడు, కళాశాల ప్రెసిడెంట్ డీఎన్ రావు, సెక్రటరీ శరత్ గోపాల్, ఐటీ హెచ్‌వోడీ డాక్టర్ జి.సురేష్, శ్రీరామ్, ప్రొఫెసర్ మల్లిక, విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. నగరంలోని దిల్సుఖ్నగర్ బస్టాండ్, మోహిదీపట్నం, జేఎన్టీయూ, మలేషియా టౌన్ షిప్, ఉస్మానియా మెడికల్ కాలేజీ, పంజగుట్ట సర్కిల్, కేబీఆర్ పార్కు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, పిపుల్స్ ప్లాజా తదితర ప్రాంతాల్లో మానవహారాలు నిర్వహించారు. -
నాకు సిగరెట్ అలవాటే లేదు!
♦ అలాంటిది డ్రగ్స్ఎలా తీసుకుంటా?: సిట్ అధికారులతో కెమెరామన్ శ్యామ్ కె.నాయుడు ♦ కెల్విన్‌తో సంబంధాలు, పార్శిళ్లపై ప్రశ్నల వర్షం ♦ నేడు సిట్ ముందుకు నటుడు సుబ్బరాజు సాక్షి, హైదరాబాద్: మాదకద్రవ్యాల కేసు విచారణలో భాగంగా గురువారం సిట్ బృందాలు కెమెరామన్ శ్యామ్ కె.నాయుడును ప్రశ్నించాయి. కెల్విన్‌తో సంబంధాలు, కొరియర్ సంస్థ నుంచి వచ్చిన పార్శిళ్లపై ఆరు గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించాయి. ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్న శ్యామ్ కె.నాయు డును శ్రీనివాస్ రావు బృందం విచారించింది. డ్రగ్స్ తీసుకునే అలవాటు ఎప్పుడు మొదలైం దని ప్రశ్నించగా.. ఆ అవసరం తనకు రాలేదని ఆయన సమాధానమిచ్చినట్టు తెలిసింది. కెల్విన్‌తో ఎలాంటి పరిచయం ఉంది? ఎందుకు అతడితో ఫోన్లో మాట్లాడారని అధికారులు ప్రశ్నించగా.. సినిమా ఫంక్షన్లకు ఈవెంట్ మేనేజర్‌గా చేసే సందర్భంలో పరిచయం అయ్యాడని, అంతకు మించి అతడితో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పినట్టు సిట్ వర్గాలు తెలిపాయి. డ్రగ్స్ వాడితే అది ఎవరి నుంచి కొనుగోలు చేశారు? మీకు డ్రగ్స్ అలవాటు చేసిందెవరని సిట్ వర్గాలు ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. అయితే తనకు సిగరెట్ అలవాటు కూడా లేదని, డ్రగ్స్ తీసుకోవడం తెలియదని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. పదేపదే ఓ ప్రముఖ కొరియర్ కంపెనీ నుంచి పార్శిల్స్ వచ్చాయని, వాటిల్లో డ్రగ్స్ తెప్పించుకున్నట్టు కెల్విన్ తమ విచారణలో చెప్పాడని శ్యామ్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు. పార్శిల్లో వచ్చినవన్ని డ్రగ్స్ అనుకుంటే దానికి తానేం చేయలేనని శ్యామ్ అన్నట్టు సమాచారం. విచారణలో ఆయన పెద్దగా ఎలాంటి సమాధానాలు చెప్పలేదని తెలిసింది. సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండటం వల్ల తనకు పెద్దగా సమయం ఉందని, ప్రైవేట్ వ్యక్తులతో కలసి పబ్బులు, క్లబ్బులకు తిరిగే అలవాటు కూడా లేదని శ్యామ్ స్పష్టం చేసినట్టు సమాచారం. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో పరిచయం, డ్రగ్స్ వ్యవహారాల్లో ఆయనతో లింకులున్నాయా అని ప్రశ్నించగా.. పూరి సినిమాలకు తాను పని చేశానని, అయితే ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టు తెలియదని శ్యామ్ అన్నట్టు తెలిసింది. ఉదయం 10.15 గంటలకు ప్రారంభమైన విచారణలో 11.45కు టీ బ్రేక్, 1.35 గంటలకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత 2.15 గంటల నుంచి 3.50 గంటల వరకు మళ్లీ విచారించింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన తన వాహనంలో ఇంటికి వెళ్లిపోయారు. ఆ కొరియర్లపై నిఘా పెంచండి: సిట్ డ్రగ్స్ సరఫరాకు పెడ్లర్లు వాడుకుంటున్న కొరియర్ మార్గాన్ని నియంత్రించడంపై సిట్ అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రముఖ కొరియర్ కంపెనీలైన బ్లూడార్ట్, ఫెడెక్స్, డీహెచ్ఎల్ ప్రతినిధులతో అధికారులు భేటీ అయ్యారు. డ్రగ్స్ సరఫరాపై నిఘా పెంచాలని, ఈ మేరకు డ్రగ్స్ కొరి యర్లను గుర్తించేందుకు సిట్ రూపొందించిన సూచనల కాపీలను ఆ కంపెనీల ప్రతినిధులకు అందజేశారు. నేడు విచారణకు సుబ్బరాజు సిట్ అధికారులు శుక్రవారం సినీ నటుడు సుబ్బరాజును ప్రశ్నించనున్నారు. విచారణలో కెల్విన్ వెల్లడించిన వివరాల ఆధారంగా సుబ్బరాజును విచారించనున్నట్టు అధికారులు తెలిపారు. లోతుగా విచారిస్తున్నాం: ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ డ్రగ్స్ వ్యవహారంపై విచారణ లోతుగా సాగుతోందని రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్ చెప్పారు. గురువారం అబ్కారీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసును ఆషామాషీగా కాకుండా అన్ని కోణాల్లో విచారిస్తున్నామన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో సంబంధం ఉన్న కొందరికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, మరికొందరికి త్వరలో అందిస్తామని వివరించారు. శ్యామ్ కె.నాయుడు విచారణకు పూర్తిగా సహకరించారన్నారు. నోటీసులు అందుకున్న వారు దర్యాప్తు అధికారులకు సహరించాలని సూచించారు. ఈ నెల 24 నుంచి 28 వరకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో బెంగళూరులో జరిగే డ్రగ్స్ నియంత్రణ శిక్షణకు డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి నేతృత్వంలో ఆరుగురు అధికారుల బృందం వెళ్లనున్నట్టు చంద్రవదన్ తెలిపారు. -
ఈ మత్తు లోకల్!
- ఎల్ఎస్డీ తరహాలో డ్రగ్‌ను తయారు చేసిన పీయూష్ అనే యువకుడు - నగరంలో వెలుగులోకి వచ్చిన కొత్త మత్తు దందా సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో కొత్త ‘లోకల్’ డ్రగ్బయటపడింది.. ఎల్ఎస్డీ తరహాలో ఇక్కడే తయారు చేసిన కొత్త మత్తు పదార్థం వెలుగు చూసింది. వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన పీయూష్ అనే యువకుడు.. వయాగ్రా, గంజాయి, యాంటీ డిప్రెషన్ మందులు, నిద్ర మాత్రలు కలిపి ఈ డ్రగ్‌ను రూపొందించాడు. తన మీద తానే ప్రయోగాలు చేసుకుంటూ దానిని ఎల్ఎస్డీ తరహాలో తయారు చేశాడు. దానికంటే తక్కువ ధరలో వందల మంది యువతకు సరఫరా చేస్తున్నాడు. ఎక్సైజ్ యాంటీ నార్కోటిక్ టీమ్ అధికారులు ఈ దందాను ఛేదించి.. పీయూష్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి ‘లోకల్’ఎల్ఎస్డీని, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఎక్సైజ్ డీసీ వివేకానందరెడ్డి, టీమ్ లీడర్ అంజిరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దుతో.. హైదరాబాద్‌లోని వెస్ట్‌మారేడుపల్లికి చెందిన పీయూష్ 2010లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేశాడు. అనంతరం జంటాక్ కంపెనీలో ఉద్యోగంలో చేశాడు. తర్వాత ఓ ప్రైవేటు కంపెనీలో చేరాడు. కానీ పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో ఆ కంపెనీ కొందరు ఉద్యోగులను తొలగించింది. వారిలో పీయూష్ కూడా ఉన్నాడు. అయితే ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే గంజాయి అలవాటున్న పీయూష్‌కు.. ఓ రేవ్‌పార్టీలో ఎల్ఎస్డీ డ్రగ్ పరిచయమైంది. ఉద్యోగం పోయిన బాధలో పూర్తిగా ఆ డ్రగ్‌కు బానిసయ్యాడు. దానికి వేల రూపాయలు ఖర్చు చేయలేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తి... డ్రగ్స్ సరఫరా దారుడిగా మారాడు. డార్క్‌నెట్ ద్వారా విదేశాల నుంచి ఎల్ఎస్డీ డ్రగ్స్ తెప్పించి అమ్మాడు. ఆ డ్రగ్ ఖరీదు ఎక్కువగా ఉండడంతో తానే డ్రగ్ తయారు చేశాడు. ఎలా చేశాడంటే..? స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌పై మంచి పట్టున్న పీయూష్ నార్కోటిక్ డ్రగ్స్, వాటి స్వభావంపై దాదాపు రెండు నెలల పాటు ఇంటర్నెట్లో శోధించాడు. ఎల్ఎస్డీకి కావాల్సిన ముడి పదార్థాలు, మోతాదులు, ఆ డ్రగ్‌ను తీసుకున్న వ్యక్తి మానసిక పరిస్థితి తదితర అంశాలపై అధ్యయనం చేశాడు. ఆయా ముడి పదార్థాలను సేకరించి డ్రగ్ తయారు చేశాడు. తనపైనే ప్రయోగాలు చేసుకుని.. పనిచేస్తోందని నిర్ధారించుకున్నాడు. నెదర్లాండ్స్ నుంచి కొరియర్ సర్వీస్ ద్వారా బ్లాటింగ్ పేపర్లు తెప్పించాడు. తాను తయారు చేసిన రసాయనాన్ని బ్లాటింగ్ పేపర్‌పై వేసి.. దానిపై వృత్తాకారాలను ముద్రించాడు. ఒక్కొక్క ‘లోకల్’డ్రగ్ స్లిప్‌ను రూ.800 నుంచి రూ.1000 చొప్పునæ విక్రయించాడు. తక్కువ ధరకే డ్రగ్ దొరకటంతో ఎక్కువ మంది యువత దానివైపు మళ్లినట్టు అధికారులు చెబుతున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్నవి ► 2,746 స్ట్రిప్పుల కెమికల్ కోటెడ్ ఎస్ఎస్డీ ► 20 గ్రాముల గంజాయి ► 40 గ్రాముల తెలుపు రంగులోని పొడి ► 4 వెన్లార్ –ఆర్ఎక్స్ 75 ఎంజీ టాబ్లెట్లు ► 5 వెన్లార్ –ఆర్ఎక్స్ 150 ఎంజీ టాబ్లెట్లు ఒక ల్యాప్‌టాప్ -
రైల్లో మత్తుమందు ఇచ్చి దోపిడీ
యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన కాజీపేట: యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు గుర్తుతెలియని వ్యక్తులు మత్తుమందు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొంతమంది కూలీలు తమ ప్రాంతానికి వెళ్లేందుకు సోమవారం రాత్రి యశ్వంతా పూర్లో పాట్నా వెళ్లే రైలు ఎక్కారు. యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ఎక్కిన వీరి వద్ద డబ్బులున్నట్లుగా దొంగలు గుర్తించారు. రైలు కొద్దిదూరం ప్రయాణం చేసిన తర్వాత వీరితో కలసి ప్రయాణం చేస్తున్నట్టుగా నటించి వీరికి మాయమాటలు చెప్పి మామిడి రసం ప్యాకెట్లను అందించారు. సదరు కూలీలు ఆ జ్యూస్ తాగి నిద్రమత్తులోకి జారుకున్న తర్వాత దొంగలు ఈ కూలీల వద్ద ఉన్న రూ.27 వేల నగదును అపహరించుకు వెళ్లారు. రైలు కర్నూల్‌కు వచ్చిన తర్వాత పక్కబోగీలో ఉన్న సహచర కూలీల్లో ఒకరు వచ్చి చూడగా బోగీలో పడిపోయి ఉన్నారు. మంగళవారం రైలు కాజీపేటకు రాగానే బాధితులందరినీ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
హవ్వా.. మత్తులో ఇలా కూడా చేస్తారా..?
సిడ్నీ: మద్యం, పొగ, మత్తుపదార్థాలు సేవించడం ఆరోగ్యానికి హానీకరం అంటారు. ఆరోగ్యమే కాదు.. అది ఆలోచనకు కూడా వినాశిని. విచక్షణ కోల్పోయి ఎప్పుడు నిర్మలంగా ప్రశాంతంగా ఉండే మనసును కకావికలం చేసి మొత్తాన్ని ఎదుటివారి వినాశనానికో లేద తన నాశనానికో దారి తీస్తుంది. ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తికి అదే అనుభవం ఎదురైంది. అప్పటి వరకు తమ కళ్ల ముందున్న స్నేహితుడు కనిపించకుండా పోయిన పరిస్థితి ఎదురై చివరకు చనిపోయాడులే అని నిర్ణయించుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. తీవ్రంగా మత్తుపదార్థాలతో నిండిన పొగతాగడం మూలంగా ఓ ఆస్ట్రేలియన్ వికృత ఆలోచన చేసి బలయ్యాడు. ఏకంగా మొసలితో సంపర్కాన్ని కోరుకుని దాని నోట్లు ఇరుక్కుని చేతులారా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని ఓ 26 ఏళ్ల యువకుడు తన ఐదుగురు స్నేహితులతో కలిసి బీచ్ దగ్గర రిసార్ట్ దగ్గర పార్టీ చేసుకుంటూ ఫుల్లుగా మద్యం సేవించి అనంతరం మత్తుపొగను తాగాడు. దాంతో అప్పటి వరకు క్రమబద్ధంగా ఉన్న ఆ వ్యక్తి కాస్త అదుపు తప్పాడు. వెంటనే తన మనసులో మాట బయటకు చెప్పి వారి మత్తు దిగిపోయేలా చేశాడు. తనకు మొసలితో అలాంటి పనిచేయాలని ఉందంటూ బిత్తరపోయేట్లు చేశాడు. వారి వద్దని వారిస్తున్నా వారిపైకి సీరియస్‌గా చూస్తూ ఓ సైకోలాగా చేస్తూ అదే మాటను పదేపదే చెప్పాడు. స్నేహితుడు కావడంతో వారి మరోసారి అతడిని వారించే ప్రయత్నం చేసినా వారి నుంచి విడిపించుకొని బీచ్ వెంట పరుగులు తీయడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే అతడికి మొసలి కనిపించిందో వెంటనే తన దుస్తులన్నీ విప్పేసి దాని దగ్గరకు వెళ్లాడు. ఏమాత్రం భయపడకుండా వెళ్లి నేరుగా దానిని అక్కున చేర్చుకునే ప్రయత్నం చేశాడు. ఇదంతా కూడా ఆ స్నేహితులకు కొద్ది మీటర్ల దూరంలోనే జరిగింది. వారు అతడిని నివారించేలోగానే వెంటనే ఆ ముసలి అతడిని అందుకొని నీళ్లలోకి వెళ్లిపోయింది. అతడు చనిపోయాడా బతికాడా అనే విషయం ఇప్పటి వరకు తెలియరాలేదు. అతడికోసం తనిఖీలు నిర్వహించిన గస్తీ బలగానికి కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో అతడు చనిపోయాడని నిర్దారణకు వచ్చారు. అసలు అతడలా వికృతంగా ఎలా ఆలోచించాడని ఆరా తీయగా వారు సేవించిన మత్తుపదార్థాల్లో విపరీతంగా లైంగిక వాంఛలు పెంచేందుకు అనువైన ఐస్ అనే పదార్థం ఉందని తెలిసింది. ఇలా మత్తులో పడి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడనే సోయి కూడా లేకుండా నిండూ జీవితాన్ని బలి తీసుకున్నాడు. -
డ్రగ్స్ కంపెనీలో అప్రెంటీస్లకు దరఖాస్తుల ఆహ్వానం
బుట్టాయగూడెం : హెటిరో డ్రగ్స్ కంపెనీలో అప్రెంటీస్‌గా పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని ఐటీడీఏ పీవో ఎస్.షణ్మోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 350 ఉద్యోగాలకు వివిధ కేటగిరీలలో అవకాశాలు ఉన్నాయన్నారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వారికి 100 పోస్టులు, బీఎస్సీ కెమిస్ట్రీ వారికి 100 పోస్టులు, ఎంఎస్సీ కెమిస్ట్రీ ఆర్గానిక్ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీకి 100 పోస్టులు, ఐటీఐ చదివిన వారికి 50 పోస్టులు ఉన్నాయన్నారు. 26 సంవత్సరాలలోపు వయసు కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 3 నుంచి ఐటీడీఏలోని యువత శిక్షణ కేంద్రంలో వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు వైటీసీ కోఆర్డినేటర్ ఎస్వీ సత్యనారాయణ 9959536789 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
డెడ్లీ..డ్రైవింగ్
► డ్రంకన్ డ్రైవింగ్‌లతో పరేషాన్ ► మందు బాబుల దూకుడు.. ►మందు బాబుల దూకుడు.. ► వరుస ఘటనలతో పోలీసులకు సవాల్ సాక్షి, సిటీబ్యూరో: మద్యం మత్తులో తూలుతూ.. వాహనాలు నడుపుతున్న మందుబాబుల దూకుడుతో జనం ప్రాణాలు గాలిలో దీపంలా మారుతున్నాయి. మద్యం మత్తులో కారు నడిపి ఇటీవల నగరం నడిబొడ్డున పంజగుట్టలో చిన్నారి రమ్య ప్రాణాలను బలిగొన్న ఉదంతం మరవక ముందే..తాజాగా పెద్ద అంబర్పేట్ వద్ద ఆదివారం రాత్రి మద్యం మత్తులో కారు నడిపిన ముగ్గురు యువకులు సంజన(5)అనే చిన్నారిని తీవ్ర గాయాలపాలుచేసి పారిపోవడం ఆందోళనకు గురిచేసింది. పవిత్రమైన గాంధీజయంతి రోజునే ఈ ఘటన జరగడం సిటీజన్లను కలచివేసింది. తాగి వాహనాలను నడపరాదని, 21 ఏళ్లలోపున్న యువకులకు మద్యం విక్రయించరాదని నిబంధనలున్నా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. యువత దూకుడుకు కళ్లెం వేయలేకపోతున్నాయి. ఇటీవలి కాలంలో ట్రాఫిక్ పోలీసులు పట్టపగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ మందుబాబుల ఆగడాలకు చెక్పడడంలేదు. మహానగరంలో నిత్యం సుమారు 46 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఇవి కాక బయటి ప్రాంతాలనుంచి సుమారు 5 లక్షల వాహనాలు నగర రహదారులను ముంచెత్తుతాయి. ఇందులో అరకొర డ్రైవింగ్ నైపుణ్యం ఉన్న యువత శాతం 30 శాతానికి పైమాటే. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మత్తు దిగక..ముంచుకొస్తున్న ముప్పు! ప్రధానంగా 18–30 ఏళ్ల మధ్యన ఉన్న యువత మద్యం సేవించిన తరవాత మితిమీరిన వేగంతో కార్లు, ద్విచక్రవాహనాలను నడుపుతున్నారు. ఎదురుగా మనుషులు, జంతువులు, వాహనాలు వచ్చినా డ్రైవింగ్ వాహనాలను అదుపుచేయలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. కాగా కొందరు మిత్రులతో పందెం కాసి వేగంగా వెళుతుండగా..మరికొందరు రహదారులపై పలు వాహనాలను ఓవర్టేక్ చేయడం ద్వారా తామే అందరికన్నా మిన్న అని చాటుకునేందుకు మితిమీరిన వేగంతో వెళుతున్నారు. మరికొందరు త్వరగా గమ్యస్థానాలకు చేరే క్రమంలో ప్రమాదాలకు కారణమవుతున్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒకచేత్తో స్టీరింగ్..మరో చేత్తే మద్యం సీసాలు పట్టుకొని పాటలు వింటూ..మిత్రులతో పిచ్చాపాటీగా మాట్లాడుకుంటూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న మందుబాబులు సైతం అమాయకుల ఉసురు తీస్తుండడం పలువురి కుటుంబాల్లో విషాదం నింపుతోంది. కళ్లుండీ చూడలేని యంత్రాంగం.. మితిమీరిన వేగంతో వెళ్లేవారు..మద్యం మత్తులో ప్రధాన రహదారులపై దూసుకెళుతున్నప్పటికీ ఆర్టీఏ, ట్రాఫిక్, పోలీసు, ఆబ్కారీ విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నగరంలోకి ప్రవేశించే ప్రతి ప్రధాన రహదారిపై విధిగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మందుబాబులు, లైసెన్సులేనివారు, మితిమీరిన వేగంతో వెళ్లేవారిని కట్టడిచేయడంలో ఆయా విభాగాల అధికారులు విఫలమౌతున్నారని వరుస ప్రమాదాలు రుజువు చేస్తున్నాయి. మరోవైపు కాలం చెల్లిన వాహనాలు రోడ్డెక్కుతున్నా రవాణాశాఖ అధికారులు చోద్యం చూస్తుండడం ప్రమాదాలకు కారణమవుతోంది. తాగి నడిపితే లైసెన్స్ సస్పెండ్ చేస్తాం... మద్యం సేవించి వాహనాలు నడిపితే మోటారు వాహన చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేస్తాం. ఇప్పటికే నగరంలో వెయ్యికి పైగా డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేశాం. వరుసగా పట్టుబడిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. లైసెన్సు సస్పెన్షన్‌లో ఉండి కూడా మద్యం సేవించి వాహనాలను నడిపితే ఆయా వ్యక్తుల లైసెన్సులను రద్దు చేస్తాం. -– రఘునాథ్, జేటీసీ, హైదరాబాద్ -
బిగుసుకుంటున్న ‘మత్తు’ ఉచ్చు
మహబూబ్‌నగర్ క్రై ం : జిల్లా కేంద్రంలో కలకలం రేపుతున్న ‘డ్రగ్స్’ వ్యవహారం రోజురోజుకూ వేడెక్కుతోంది. యువతకు మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న తిరుమల ఫార్మా ఏజెన్సీని శనివారం జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు పూర్తిగా జల్లెడ పట్టారు. ఇక్కడి నుంచి బయటికి వెళ్లిన ప్రతి డ్రగ్ వివరాలను, బిల్లులను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఈ తనిఖీలను ఆపించడానికి అధికారులకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు కాల్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏజెన్సీలో జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు దినేశ్‌కుమార్, బాలకృష్ణ రోజంతా తనిఖీలు చేశారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడుతూ ప్రసన్న మెడికల్ దుకాణంలో జరిగిన వ్యవహారానికి కొనసాగింపుగా తిరుమల ఏజెన్సీపై దాడులు నిర్వహించామన్నారు. దీంట్లో గత ఏడాది నుంచి అమ్మిన డ్రగ్స్, కొనుగోలు చేసిన వివరాలు సమగ్రంగా సేకరిస్తున్నామన్నారు. ఈ ఏజెన్సీ ద్వారా జిల్లాలోని ఏ మెడికల్ షాపునకు డ్రగ్స్ సరఫరా అయినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుమల ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు సైతం మందులు సరఫరా అయినట్లు తమ తనిఖీలలో బయటపడిందన్నారు. నిందితులు ఆరుగురిపై 1940 ఔషధ నియంత్రణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశామని, లక్ష్మీప్రసన్న మెడికల్ యజమాని వెంకట్రమణపైనా కేసు నమోదు చేశామన్నారు. దర్యాప్తు చేసిన తర్వాత వీరందరిపై కోర్టులో చార్జిషీటు దాఖలు చే స్తామన్నారు. -
డ్రగ్ డీలర్లను హత్య చేయిస్తున్నదెవరు?
ఫిలిప్పీన్స్ ప్రజలకు నిక్ నేమ్‌లు సర్వ సాధారణం. కొందరిని చిన్నప్పటి నుంచే నిక్ నేమ్‌లతో పిలిచే అలవాటుండగా, కొందరికి యవ్వనంలో వారు చేసే పనులను బట్టి నిక్ నేమ్‌లు వస్తాయి. అలాగే ఫిలిప్పీన్స్ జాతీయ పోలీస్ చీఫ్ రొనాల్డ్ డెలా రోసాను కూడా 'బాటో' అనే నిక్నేమ్తోనే అక్కడి పోలీసులు, ప్రజలు పిలుస్తున్నారు. బాటో అంటే వారి భాషలో రాయి అని అర్థం. అంటే రాయిలాగా చెక్కు చెదరని వ్యక్తి లేదా బండ అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంతకు చెప్పేది ఏమిటంటే.. డ్రగ్ మాఫియాపై తెరవెనక నుంచి తూటాల వర్షం కురిపిస్తున్నది ఈ 'బాటో'యేనట. 'చట్టాలను చేతుల్లోకి తీసుకోండి.. డ్రగ్ డీలర్లు కనిపిస్తే కాల్చేయండి!' అంటూ వివాదాస్పద పిలుపునిచ్చిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డూటర్టీకి ఈ బాటో చాలా దగ్గరివారు. డ్రగ్ మాఫియాను సమూలంగా నాశనం చేయడమే తన లక్ష్యమని బాటో చెబుతున్నారు. తాను మాజీ మిలటరీ వ్యక్తినని, ఫిలిప్పీన్స్ మిలటరీ అకాడమీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నానని, తన శరీరం గట్టిగా రాయిలా ఉండటంతో పైఅధికారులు తనను బాటో అని పిలిచేవారని, అప్పటినుంచి ఆపేరు నిక్‌నేమ్‌గా నిలిచిపోయిందని పోలీసు చీఫ్ మీడియాకు తెలిపారు. గుండ్రంగా తళతళలాడే బట్టతలతో విశాలమైన ఛాతీతో దిట్టంగా రాయిలాగా కనిపిస్తారు బాటో. తన జన్మస్థలం కూడా బారంగే బాటో అంటూ నవ్వారు. దేశాధ్యక్షుడు డూటర్టీకి తాను మూడు దశాబ్దాల నుంచి చాలా సన్నిహితుడనని, తమ ఇద్దరి మధ్య నేరుగా మాట్లాడుకునేందుకు ప్రత్యేక టెలిఫోన్ కనెక్షన్ కూడా ఉందని, తాము ఒకరికొకరు విశ్వాసపాత్రలమని బాటో తెలిపారు. 'నా సామర్ధ్యం ఏమిటో ఆయనకు తెలుసు. ఆయనకు ఏంచేసి పెట్టాలో నాకు తెలుసు. మేము మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. టెలిపతి ద్వారా ఆయన ఆలోచనలు నాకు తెలుస్తాయి. నా ఆలోచనలు ఆయనకు తెలుస్తాయి. ప్రపంచంలో ఇంతవరకు ఆయనంత గొప్ప అధ్యక్షుడిని నేను చూడలేదు' అని బాటో వ్యాఖ్యానించారు. డూటర్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 300 మందికి పైగా డ్రగ్ సరఫరాదారులను వీధుల్లో కాల్చి చంపడం పట్ల ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో వెనక నుంచి ఈ హత్యలు చేయిస్తున్న పోలీసు పాత్రధారి ఎవరని అంతా వెతకడం మొదలుపెట్టారు. దాంతో బాటోకు ప్రాధాన్యం పెరిగింది. ఈ ఎన్కౌంటర్లను అమెరికా అధికారులు ప్రశ్నించినందుకే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను డూటర్టీ బండబూతులు తిట్టిన విషయం తెల్సిందే. -
అక్కడ ఆడవాళ్లతో హంతక ముఠాలు
మనీలా: ఫిలిప్పీన్స్ వీధులన్నీ ఇప్పుడు నిత్యం రక్తమోడుతున్నాయి. దేశంలోని ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, ఏదో ఒక సంధులో ఓ శవం రక్తం మడుగులో పడి కనిపిస్తోంది. ‘మత్తు పదార్థాలు అమ్ముతున్నందుకు ఈ శిక్ష’ అన్న అక్షరాలు కలిగిన చిన్న అట్టముక్క శవం పక్కనే పడి ఉంటుంది. ఈ హత్యలు ప్రత్యక్షంగా చేస్తున్నదీ పోలీసులు కాదు. మహిళా హంతకులు. ఒక్కో హంతక ముఠాలో ముగ్గురు లేదా నలుగురు సభ్యులు ఉంటారు. వారంతా ఆడవాళ్లే. వారి భర్తలో, పిల్లలో మత్తు పదార్థాలకు బానిసలయ్యారనే ఆగ్రహంతోనో, ఆక్రోశంతోనో వారీ హత్యలు చేయడం లేదు. కేవలం పోలీసులిచ్చే డబ్బులకు ఆశపడి ఈ హత్యలకు పాల్పడుతున్నారు. ఒక్క హత్య చేసినందుకు వారికి 29 వేల రూపాయలు లభిస్తాయి. వాటిని వారు తమ బృందంలోని ముగ్గురు లేదా నలుగురు సమంగా పంచుకుంటారు. వారితో ఈ హత్యలు చేయిస్తున్నది ఫిలిప్పీన్స్ పోలీసు అధికారులే. ఇలాంటి ఓ హంత క ముఠాకు నాయకత్వం వహిస్తున్న మనీలాలోని మరియాను మీడియా కలసుకొని ఇంటర్వ్యూ చేసింది. తాను ఇంతవరకు ఐదు హత్యలు చేశానని, మొదటిసారి హత్య చేసినప్పుడు తీవ్ర భయాందోళనలకు గురయ్యానని మరియా తెలిపారు. ఆ తర్వాత ప్రతి హత్యకు ముందు అదే తాను చేసే ఆఖరి హత్య కావాలని కోరుకునేదాన్నని, అయితే హంతక ముఠా నుంచి తామెవరం బయటకు వెళ్లిపోయినా తమను చంపేస్తామని తమ పోలీసు బాస్ తీవ్రంగా బెదిరించారని, వారి బెదిరింపులకు భయపడి హత్యలు మీద హత్యలు చేస్తూ పోతున్నామని ఆమె తెలిపారు. ‘నా హంతక ముఠాలో ఎవరు ఎన్ని హత్యలు చేశారో నేను గుర్తుంచుకోదల్చుకోలేదు. హత్య చేసిన వెంటనే ఆ హత్య గురించి మరచి పోవడం అలవాటు చేసుకున్నాం. నేను మాత్రం స్వయంగా ఇప్పటి వరకు ఐదు హత్యలు చేశాను. ప్రతి వ్యక్తి తలకు గురిపెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపాను. మాకు తుపాకులు ఇచ్చిందీ కూడా మా పోలీసు బాసే. నా భర్త ద్వారా నాకు ఇలాంటి హత్యలు చేయడం అలవాటు అయింది. ఆయనచేత కూడా పోలీసులు డబ్బులు ఎరవేసి హత్యలు చేయించేవారు. అయితే మగవాళ్లను డ్రగ్ డీలర్లు, మాఫియా సులభంగా అనుమానించే అవకాశం ఉండడంతో ఇప్పుడు పోలీసులు ఎక్కువగా ఆడవాళ్లనే హంతక ముఠాలో చేర్చుకుంటున్నారు’ అని మరియా వివరించారు. ‘కోర్టులు శిక్షించాల్సిన మనుషులను నేను చంపేస్తున్నందుకు నాకు పశ్చాత్తాపం కలుగిన సందర్భాలు లేకపోలేదు. మీరు ఏం ఉద్యోగాలు చేస్తున్నారు ? ఇంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వస్తున్నది ? అని నా పెద్ద పిల్లవాడు మమ్మల్ని ఇద్దరిని ఉద్దేశించి ప్రశ్నించినప్పుడు నాకు ఆందోళన కలుగుతున్నది. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. మేము ఏం చేస్తున్నామో ఎప్పటీకీ మా పిల్లలకు తెలియకూడదని కోరుకుంటున్నాం. ఎంతకాలం దాచగలమో తెలియదు. ఈ రొంపిలో పడి ఇలా కొట్టుకుపోతున్నాం. మేము చంపిన వ్యక్తుల కుటుంబాలు మాత్రం మమ్మల్ని వెంటాడకపోతే చాలుననుకొని ఇలా బతికేస్తున్నాం’ అని మరియా తన గురించి మీడియాకు వివరించారు. మరియా లాంటి హంతక ముఠా నుంచి తప్పించుకు తిరుగుతున్న చిన్నపాటి డ్రగ్ డీలర్ రోగర్‌ను కూడా కలసుకొని మీడియా ఇంటర్వ్యూ చేసింది. ‘నన్ను మృత్యు భయం అణుక్షణం వెంటాడుతోంది. ఎప్పుడు, ఏ దిశ నుంచి వచ్చి మృత్యువు నా మీద పడుతుందో తెలియక ఉన్న చోట ఉండకుండా ఇలా వీధులు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాను. నేనేదో కాయకష్టం చేసుకొని నా మానాన నేను బతికే వాడిని. తోటి వారి వల్ల నేను డ్రగ్స్‌కు బానిసయ్యాను. దాన్ని సంపాదించే ప్రయత్నంలో భాగంగా చిన్నపాటి డీలర్‌గా మారిపోయాను. డ్రగ్స్ కోసం లేదా డ్రగ్స్ మత్తులో దొంగతనాలు, దోపిడీలకు, కొన్ని సందర్భాల్లో హత్యలకు కూడా పాల్పడతారని ప్రజలు అనుకుంటారు. నేను మాత్రం ఇంతవరకు చిన్నపాటి దొంగతనం కూడా చేయలేదు. నన్ను చంపేందుకు పోలీసులు టార్గెట్ చేశారని తెలిసి ఇలా తప్పించుకు తిరుగుతున్నాను. నా భార్యా పిల్లలను మారుమూల గ్రామానికి తరలించాను. నేను మాత్రం ప్రాణ భయంతో ఊళ్లు పట్టుకొని తిరుగుతున్నాను. లొంగిపోదామంటే పోలీసులు కచ్చితంగా చంపేస్తారని తెలుసు. నాలాంటి చిన్న వాళ్ల వెంట పడే పోలీసులు మత్తు పదార్థాలను తయారు చేస్తున్న బడా వ్యాపారులను ఎందుకు అరెస్ట్ చేయరో, వారిపై ఎందుకు చర్య తీసుకోరో అర్థం కావడం లేదు’ అని రోగర్ అన్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా రోడ్రిగో డ్యూడర్త్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశంలో దాదాపు రెండు వేల మంది డ్రగ్ సరఫరా దారులను హత్య చేశారు. వీరిలో 756 మందిని పోలీసులు ఎన్కౌంటర్ చేయగా, మిగతా వారందరిని మరియా లాంటి హంతక ముఠాలు హత్య చేశాయి. డ్రగ్ సరఫరాదారులు ఎక్కడ కనిపిస్తే అక్కడ వారిని కాల్చేయమని, ఎలాంటి కేసులు లేకుండా తాను చూసుకుంటానని డ్యూడర్త్ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. అధికారంలోకి వచ్చిన అరు నెలల్లోపలే డ్రగ్ మాఫియాతో సహా లక్ష మంది క్రిమినల్స్‌ను అంతం చేస్తానని కూడా ఆయన శపథం చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చనిపోయిన రెండు వేల మందిలో 98 శాతం మంది మురికి వాడల్లో నివసించే పేదవాళ్లే. మత్తుపదార్థాలను దేశంలో విరివిగా ఉత్పత్తి చేస్తూ దేశంతోపాటు మొత్తం ఆసియా దేశాలకు సరఫరా చేస్తున్న ఒక్క బడా వ్యక్తిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఇంతవరకు పదివేల మంది డీలర్లను పోలీసులు అరెస్ట్ చేయగా వారిలో ఎక్కువ మంది మధ్య, దిగువ స్థాయి డీలర్లు మాత్రమే ఉన్నారు. ఐదుగురు పోలీసు జనరళ్లు, ఉన్నత పౌర అధికారులు, జడ్జీలు, రాజకీయ నాయకలు...ఇలా ఉన్నత స్థాయిలో డ్రగ్ మాఫియాతో కుమ్మక్కయినవాళ్లు ఎందరో ఉన్నారు. ఆ చైన్‌ను బ్రేక్ చేయకుండా చిన్నస్థాయి డ్రగ్ సరఫరా దారులను, బానిసలు చంపేస్తే ప్రయోజనం ఏం ఉంటుంది? ఫిలీప్పీన్స్‌లో డ్రగ్‌ను ఐస్, క్రిస్టల్ మిత్, షాబు అని పిలుస్తారు. పూర్తి స్వచ్ఛమైన సరకును షాబు అని కోడ్ భాషలో చెబుతారు. స్మోకింగ్, ముక్కుతో పీల్చడం, ఇంజెక్షన్, నీళ్లలో కలుపుకోవడం ద్వారా ఈ డ్రగ్‌ను తీసుకుంటారు. -
అక్కడ ఆడవాళ్లతో హంతక ముఠాలు
-
తాగినడిపితే తాట తీస్తారు
సాక్షి, సిటీబ్యూరో/మన్సూరాబాద్: మందు తాగి వాహనాలు నడిపేవారు ఇకపై జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్ ఈస్ట్ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో అమలులోకి తేనున్న ఎంవీ యాక్ట్ 2016 ప్రకారం డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ. 10 వేల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారన్నారు. ఈ కేసులో జైలుకెళితే కన్విక్షన్(నేరం)గా పరిగణిస్తారని తెలిపారు. సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్, అమృత పౌండేషన్, మిషన్ స్మార్ట్ రైడ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఎల్బీనగర్లోని గోటేటీ కల్యాణ మండపంలో డ్రంకన్ డ్రైవ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... డ్రంకన్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదాలను నియంత్రించేందుకు పగటి పూట కూడా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయినా ఈ ఏడాది ఇప్పటివరకు 5879 మంది డ్రంకన్ డ్రైవింగ్ కేసులు నమోదుకావడం దారుణమన్నారు. ఇందులో 202 మందికి జైలు శిక్ష పడిందన్నారు. ఎక్సైజ్ శాఖతో కలిసి మల్కాజిగిరి, ఎల్బీనగర్ జోన్ పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్లు, సిట్టింగ్ పర్మిట్ ఉన్న మద్యం దుకాణాలలో బ్రీత్ఎన్లైజర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బార్ అండ్ రెస్టారెంట్లు, సిట్టింగ్ పర్మిట్ ఉన్న మద్యం దుకాణాల యజమానులు 30 ఎండీ కన్నా ఎక్కువ మద్యం సేవించిన వారిని గుర్తించి వారు వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం 30ఎండీ కన్నా మద్యం సేవించి వాహనం నడుపుతూ మొదటిసారి చిక్కితే 6 నెలలు జైలుశిక్ష లేదా రూ.2 వేల జరిమానా విధిస్తున్నారని, నూతన చట్టంలో రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10వేల జరిమానా ఉంటుందన్నారు. మైనర్లు పట్టుబడితే వారి కళాశాల, పాఠశాల యజామాన్యాలకు తెలియజేసి వారి అడ్మిషన్లు రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అతిగా మద్యం సేవించి వాహనం నడిపితే వారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శాఖాపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం పరిధిలో 500 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హరికృష్ణ మాట్లాడుతూ...మైనర్లు మద్యం తాగకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మైనర్లకు మద్యం అమ్మే బార్లు, రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటున్నామని, భర్త పట్టుబడితే భార్య, యువకుడు పట్టుబడితే తల్లిదండ్రులను తీసుకొని కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. ఫస్ట్ టైమ్ డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీ రైడ్... మద్యం తాగడం వల్ల జరిగే అనర్ధాలపై అమృత పౌండేషన్, మిషన్ స్మార్ట్ రైడ్ అవగాహన కల్పించాయి. మందుబాబులు మిషన్ స్మార్ట్ రైడ్ రూపొందించిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే తొలి రైడ్ ఉచితంగా అందజేస్తామని మిషన్స్మార్ట్ రైడ్ ప్రతినిధి నాగేశ్వర్రావు తెలిపారు. ఆ తర్వాత యాప్ ద్వారా బుక్ చేసుకుంటే తమ సంస్థతో టై అప్ అయిన ఉబెర్ క్యాబ్‌లు సర్వీసు అందిస్తాయన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ దివ్యచరణ్రావు, డీసీపీ తప్సీర్ ఇక్బాల్, ఏసీపీ వేణుగోపాల్‌రావు ట్రాఫిక్ డీసీపీ రమేష్‌నాయుడు, సీఐ కాశిరెడ్డి, అమృత పౌండేషన్ ప్రతినిధి డా. దేవిక, తదితరులు పాల్గొన్నారు. -
పైలేరియా మందుల పంపిణీని విజయవంతం చేయాలి
జాతీయ ఆరోగ్య మిషన్ రీజినల్ డైరెక్టర్ అనురాధ నర్మెట : ప్రభుత్వం చేపట్టిన పైలేరియా మందుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ మేడోజు అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో గురువారం నులిపురుగుల నివారణ మందుల పంపిణీని ఆమె పరిశీలించారు. తొలుత ఆర్డీ అనురాధ స్థానిక పీహెచ్‌సీలోని రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బోదకాలు నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. దోమకాటుతో వచ్చే బోదకాలు నివారణ మాత్రలు ప్రతీ ఒక్కరూ వేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి, వరంగల్‌లో మాత్రమే బోదకాలు వ్యాధి తీవ్రత ఉందని, దీనిపై వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వరంగల్ జిల్లాలో 17 పీహెచ్‌సీల పరిధిలో మాత్రమే సమస్య ఉందన్నారు. ప్రజలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి ఆమె నులి పురుగుల నివారణ మాత్రలు వేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్పీహెచ్ఓ పి.కరుణాకర్‌రాజు, క్లస్టర్ ఇ¯Œæచార్జి వీరబాబు, ఫాతిమాబేగం, రహమాన్, ఏఎన్ఎంలు సునంద, కరుణ, ఆశకార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మందుల మాయ !
జిల్లాలో సీజనల్ మెడిసిన్ కరువు కమీషన్ల కోసం కాలయాపన ఇబ్బందులు పడుతున్న రోగులు సాక్షి, హన్మకొండ : జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లో రెండిళ్లలో ఒకరు వంతున మంచం పట్టారు. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీజనల్ మందులు అందుబాటులో ఉండడం లేదు. ఈ మందుల కొనుగోలుకు సంబంధించి కమీషన్ల వ్యవహారం కొలిక్కిరాకపోవడం వల్లే కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. జ్వరం గోలీలూ కరువే.. జిల్లాలో 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 12 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 3 ఏరియా ఆస్పత్రులు, 12 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఈ ఆస్పత్రులకు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి క్రమం తప్పకుండా అన్ని రకాల ఔషధాలు సరఫరా కావాలి. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత సాధారణంగా జ్వరాలు పెరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఉంటుంది. ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని రకాల మందులను కొనుగోలు చేసి ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతారు. జిల్లాలో రెండు నెలలుగా జ్వరాల తీవ్రత పెరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర ఔషధాలు అందుబాటులో లేవు. ముఖ్యంగా జ్వరం, నొప్పులు, వాంతులు, విరేచనాలకు ఉపయోగించే ఫ్యురాజోలిడిన్, మెట్రోజిల్, డైక్లోఫెనాక్, పారాసిటమాల్ మాత్రలు కరువయ్యాయి. చివరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అరకొరగానే ఉంటున్నాయని సమాచారం. కమీషన్ల కక్కుర్తే కారణం.. ప్రభుత్వ ఆస్పత్రులలో మందుల కొరతకు కమిషన్ల వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో కీలకపాత్ర పోషిస్తున్న ఓ ఫార్మసిస్టు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత సీజన్లో అవసరమైన మందులు తెప్పించకుండా కేవలం కమీషన్ అధికంగా వచ్చే మందులు కొనుగోలు చేస్తున్నట్లు ఆ శాఖ వారే చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడంతో సదరు ఉద్యోగి లీలలు శృతి మించుతున్నాయి. ఆఖరికి నెల రెండు నెలల్లో కాలం చెల్లిపోయే ఔషధాలను కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి మందులనే పీహెచ్‌సీలకు సరఫరా చేస్తున్నారు. అధికారులకు చెప్పలేక.. ఆన్ సీజన్ ఔషధాలను రోగులకు పంపిణీ చేయలేక క్షేత్రస్థాయిలో పని చేసే వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాలపరిమితి ముగిసిన ఔషధాలను గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ ఆçస్పత్రుల ప్రాంగణం సమీపంలో గుంత తీసి పాతిపెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఈ వ్యవహారం కొంతకాలంగా నిరాటంకంగా సాగుతోంది. ఇదీ పరిస్థితి... పది నెలలుగా డైక్లోఫెనాక్ ట్యాబ్లెట్ల సరఫరా లేదు. పారాసిటమాల్ టాబ్లెట్లు డిమాండ్‌కు సరిపడా లేవు. రెండు నెలలుగా ప్యురాజోలిడిన్, మెట్రోజిల్ మందుల సరఫరా లేదు. ఇరవై రోజుల క్రితం నల్లబెల్లి మండలంలో ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రలో ఇటీవల మందులు పాతిపెట్టినట్లు తెలుస్తోంది. మలేరియా రోగులకు అందించే క్లోరోక్విన్, ఫిట్స్ రోగులకు అందించే క్లోబోజామ్ వంటి ఔషధాలు సైతం ఆస్పత్రులలో అందుబాటులో లేవు. నొప్పుల ఉపశమనానికి అందించే డ్రేమడాల్ ఔషధాలతో పాటు థైరాయిడ్ మాత్రలు సైతం లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్రోజిల్ స్టాక్ లేదు సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో మూడు రోజులుగా మెట్రోజిల్, డైక్లోఫెనాక్ మందుల నిల్వ లేదు. ఆరు నెలలుగా ఫ్యురాజొలిడిన్ ట్యాబ్లెట్ల సరఫరా లేదు. పారాసిటమాల్ టాబ్లెట్ స్టాకు ఉన్నాయి, కానీ అవి తీసుకెళ్లడంలో పీహెచ్సీ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు. – వెంకటస్వామి, సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఫార్మసిస్టు -
ఆ ఇంజక్షన్ నాసిరకం
నిర్ధారించిన ఔషధ నియంత్రణ శాఖ ఎంజీఎం (వరంగల్): వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో మరో నాసిరకం ఇంజక్షన్ వెలుగుచూసింది. క్రిమి సంహారక మందు తాగి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడే రోగులకు యాంటీడోస్‌గా అందించే హిమాలయ మేడిటేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ ఇంజక్షన్ నాసిరకంగా ఉందని ఔషధ నియంత్రణాధికారులు గుర్తించారు. హెచ్ఎల్ఐ 540ఎల్ బ్యాచ్‌కు చెందిన ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ యూంపిల్స్‌ను రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో వినియోగించకూడదని డ్రగ్ కంట్రోల్ డిప్యూటీ డెరైక్టర్ సురేంద్రనాథ్ సాయి ఆదేశాలు జారీ చేశారు. వెలుగు చూసింది ఇలా.... వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నాసిరకం ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ యూంపిల్ నాసిరకంగా ఉందని వైద్య సిబ్బంది ఆదివారం గుర్తించి రోగులకు అందించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, పరిపాలనాధికారుల ఆదేశాలతో విషయం బయటకు రానీయకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయం రోగుల ద్వారా బయటకు పొక్కింది. దీంతో డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ఆదివారం రాత్రి ఎంజీఎం ఆస్పత్రిలో శాంపిల్స్ కోసం ప్రయత్నించగా, సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచి సరఫరా అయిన యాంపిల్స్ మాత్రమే చూపించి, స్థానికంగా కొనుగోలు చేసిన యూంపిల్స్‌ను బయటకు రానీయలేదు. వాస్తవానికి స్థానికంగా కొనుగోలు చేసిన యూంపిల్స్లోనే ఫంగస్ వచ్చింది. ఆస్పత్రి సిబ్బందిలోని కొందరు ఫంగస్ వచ్చిన యూంపిల్స్ ఫొటోలను డ్రగ్ అధికారులకు పంపించడంతో అసలు విషయం తెలిసింది. -
ఇంతకంటే దారుణాన్ని వినలేదు
ఈ బెంచ్‌పై మూడున్నరేళ్లు ఉన్నాను.. ఇన్ని రోజుల్లో ఈ కోర్టుకు వచ్చిన కేసుల్లో అత్యంత దారుణమైన కేసు ఇదే. ఓ తల్లి చేసిన దారుణం గురించి హామిల్టన్ కౌంటీ కోర్టు జడ్జి లెస్లీ ఘిజ్ చేసిన వ్యాఖ్యలివి. నిందితురాలు కొర్కొరన్కు 51 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. ఇంత భారీ శిక్ష పడటానికి ఆమె చేసిన నేరం ఏంటంటే.. కొర్కొరన్ డ్రగ్స్‌కు బానిసైంది. హెరాయిన్ తీసుకోకుంటే రోజు గడిచేదికాదు. అయితే డ్రగ్స్ కొనేందుకు ఆమె వద్ద సరిపడా డబ్బు ఉండేదికాదు. అలాగని డ్రగ్స్ అలవాటు మానులేకపోయింది. రెండేళ్ల క్రితం కొర్కొరన్ డబ్బుల కోసం తన 11 ఏళ్ల కుమార్తెను డ్రగ్ డీలర్ వద్ద కుదువ పెట్టి అప్పు తీసుకుంది. ఇంతకంటే దారుణమేంటంటే తన కూతురును అత్యాచారం చేసేందుకు డ్రగ్ డీలర్‌కు అనుమతిచ్చింది. ఆ నీచుడు అభంశుభం తెలియని బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయిని హింసించి తన వాంఛలు తీర్చుకునేవాడు. కొన్నిసార్లు ఈ దృశ్యాలను వీడియోలు తీసేవాడు. కొర్కొరన్ తన కూతురును ఇంతటితో వదిలిపెట్టలేదు. కుమార్తెకూ బలవంతంగా డ్రగ్స్ ఇచ్చేది. పాపం ఆ చిన్నారి ప్రతిసారి వాంతి చేసుకునేంది. ఐదు నెలల పాటు ఆ అమ్మాయి చిత్రహింసలు అనుభవించింది. ఈ విషయం వెలుగు చూడటంతో కొర్కొరన్, డ్రగ్ డీలర్ షాండెల్ విల్లింగామ్పై కేసు నమోదు చేశారు. న్యాయస్థానం వీరిద్దరినీ దోషులుగా ప్రకటించింది. తప్పు చేసినందుకు కొర్కొరన్లో కొంచెం కూడా పశ్చాత్తాపం కనిపించలేదని న్యాయమూర్తి అన్నారు. ఆమెకు కఠిన కారాగార శిక్ష వేయగా, షాండెల్కు శిక్ష ఖరారు చేయాల్సివుంది. బాధితురాలు ప్రస్తుతం తన తండ్రి, సవతి తల్లి దగ్గర ఉంటోంది. విషాదం తాలుకు జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు చిన్నారికి చికిత్స అందిస్తున్నారు.