650 మందిని యాసిడ్‌లో ముంచి చంపాడు | Man Killed 650 People By Dipping In Acid | Sakshi
Sakshi News home page

650 మందిని యాసిడ్‌లో ముంచి చంపాడు

Published Fri, Mar 23 2018 5:24 PM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM

Man Killed 650 People By Dipping In Acid - Sakshi

యాసిడ్‌లో కరిపోగా మిగిలిన 240 మంది శరీర భాగాలు

మెక్సికో సిటీ : దాదాపు 650 మంది హత్యల కేసులో మెక్సికో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో హత్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న శాన్‌టియాగో మెజా లోపెజ్‌ అలియాస్‌ ది సోప్‌ మేకరే ఈ హత్యలను చేసినట్లు తెలిపారు. సినాలోవా డ్రగ్‌ కార్టెల్‌ అనే డ్రగ్స్‌ ముఠాలో పని చేసే సోప్‌ మేకర్‌.. తనకు అడ్డొచ్చిన 650 మందిని యాసిడ్‌లో ముంచి చంపినట్లు వివరించారు.

భారీ డ్రమ్ముల్లో యాసిడ్‌ ఉంచి అందులో బాధితులను వేసి మూత పెట్టి అతి క్రూరంగా చంపేవాడని చెప్పారు. అలా బాధితుల శరీరాలు యాసిడ్‌ కరిగిపోగా మిగిలిన పదార్థాలను గుంతల్లో పూడ్చిపెట్టాడని తెలిపారు. 2009లో సోప్‌ మేకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటివరకూ 240 మంది బాధితుల ఆనవాళ్లను మెక్సికోలోని పలు ప్రాంతాల నుంచి తవ్వి తీశారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను మెక్సికో మీడియాకు పోలీసులు అందజేశారు. కాగా, 2009 నుంచి విచారణ ఎదుర్కొంటున్న ది సోప్‌ మేకర్‌కు ఇంకా శిక్ష పడలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement