భార్యను ముక్కలుగా నరికి కూర వండాడు.! | man kills his ex wife and cooked her body | Sakshi
Sakshi News home page

భార్యను ముక్కలుగా నరికి కూర వండాడు.!

Published Sat, Jan 27 2018 7:59 PM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

man kills his ex wife and cooked her body - Sakshi

మెక్సికో: ఓ కసాయి భర్త తాను మనిషిని అన్న విషయాన్ని మరచిపోయి తన మాజీ భార్యను అత్యంత క్రూరంగా హతమార్చాడు. మొదట గొంతు నులిమి చంపి, ఆ తరువాత కన్న బిడ్డల ముందే ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఈ ఒళ్లు గగుర్పొడిచే ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే.. సెసర్ లోపేజ్‌, మెగ్డలీనాలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మనస్పర్థల కారణంగా ఈ జంట విడాకులు తీసుకుంది. ఇద్దరు పిల్లలు మాత్రం అప్పుడప్పుడు తండ్రి దగ్గరకు వెళ్లి వచ్చేవాళ్లు. ఈ నేపథ్యంలో ఓసారి మాజీ భర్త దగ్గర ఉన్న పిల్లలను తీసుకొచ్చేందుకు మెగ్డలీనా ...అతని ఇంటికి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు.  దీంతో అనుమానం వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు సెసర్ లోపేజ్‌ ఇంటికి వెళ్లి పరిశీలించగా మెగ్డలీనా శరీరం ముక్కలు ముక్కులగా నరికి ఉన్న దృశ్యాన్ని చూసి షాక్‌ అయ్యారు. ఆమె కొన్ని శరీర భాగాలు ఫ్రిజ్‌లో, మరికొన్ని భాగాలు ప్రెషర్ కుక్కర్‌లో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కాగా హంతకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు పరారీలో ఉన్న సెసర్‌ లోపేజ్‌ కోసం  గాలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement