ded body
-
ఖబ్రస్థాన్కు దారేది..?!
ఆదిలాబాద్: గ్రామంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం మండలంలోని గూడ గ్రామ ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. గ్రామానికి చెందిన షేక్ అజీజ్ మరణించగా అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు. ఖబ్రస్థాన్కు వెళ్లే దారిలో వాగు ఉండడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఇలా దాటి వెళ్లారు. ఏళ్లు గడిచినా గ్రామంలో కనీస సౌకర్యాలు కానరావడం లేదని, అంత్యక్రియలకు సైతం అవస్థలు పడాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన నిర్మించి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. -
భార్యను ముక్కలుగా నరికి కూర వండాడు.!
మెక్సికో: ఓ కసాయి భర్త తాను మనిషిని అన్న విషయాన్ని మరచిపోయి తన మాజీ భార్యను అత్యంత క్రూరంగా హతమార్చాడు. మొదట గొంతు నులిమి చంపి, ఆ తరువాత కన్న బిడ్డల ముందే ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఈ ఒళ్లు గగుర్పొడిచే ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సెసర్ లోపేజ్, మెగ్డలీనాలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మనస్పర్థల కారణంగా ఈ జంట విడాకులు తీసుకుంది. ఇద్దరు పిల్లలు మాత్రం అప్పుడప్పుడు తండ్రి దగ్గరకు వెళ్లి వచ్చేవాళ్లు. ఈ నేపథ్యంలో ఓసారి మాజీ భర్త దగ్గర ఉన్న పిల్లలను తీసుకొచ్చేందుకు మెగ్డలీనా ...అతని ఇంటికి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెసర్ లోపేజ్ ఇంటికి వెళ్లి పరిశీలించగా మెగ్డలీనా శరీరం ముక్కలు ముక్కులగా నరికి ఉన్న దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. ఆమె కొన్ని శరీర భాగాలు ఫ్రిజ్లో, మరికొన్ని భాగాలు ప్రెషర్ కుక్కర్లో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కాగా హంతకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు పరారీలో ఉన్న సెసర్ లోపేజ్ కోసం గాలిస్తున్నారు. -
మానవత్వం మంటగలిసింది..
► శ్మశానంలో మృతదేహం ► చెరువుగట్టుపై చర్చలు మందస : మానవతా విలువలు మంట కలిసిపోతున్నాయి. మనిషి జీవితం డబ్బే ప్రధానంగా ముందుకు సాగుతోంది. అనుబంధాలు, ఆత్మీయతలకు విలువలేకుండా పోతోంది. ఇలాంటి ఘటనే మండలంలో చోటుచేసుకుంది. మందస మండలంలోని పితాతొళి గ్రామానికి చెందిన అంపోలు ప్రమీల(35) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకుందని తల్లి తులసమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా, ప్రమీల మృతిపై భిన్నాభిప్రాయాలున్నాయి. మృతదేహాన్ని శనివారం సోంపేట సామాజిక ఆస్పత్రికి పోస్టుమార్టం నిమ్తితం తరలించారు. సమయం మించిపోవడంతో వైద్యులు ఆదివారం పోస్టుమార్టం చేస్తామని చెప్పి, మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. ఆదివారం పోస్టుమార్టం జరగడంతో అంత్యక్రియలు నిమిత్తం ప్రమీల మృతదేహాన్ని పితాతొళి శ్మశాన వాటికకు తీసుకువచ్చారు. అక్కడే వివాదం మొదలైంది. ప్రమీల భర్త తిరుపతిరావు వీఆర్వోగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కుమారుల భవిష్యత్ ఆలోచించిన పెద్దలు.. తిరుపతిరావు నుంచి హామీ కావాలని పట్టుబట్టడంతో ఇరువర్గాల మధ్య బేధాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి. అప్పటికే రెండు రోజుల నుంచి ప్రమీల మృతదేహం ఉండగా.. అంత్యక్రియలు చేయకుండా గ్రామస్తులు నిలిపివేశారు. మృతురాలి వర్గం, తిరుపతిరావు వర్గం మధ్య వాగ్వాదం జరిగింది. ఉదయం వచ్చిన మృతదేహానికి మధ్యాహ్నం రెండు గంటలైనా అంత్యక్రియలు కాలేదు. శ్మశానంలో మృతదేహాన్ని ఉంచేసి, పెద్దలు పంచాయితీకే ప్రాధాన్యత ఇచ్చారు. ఒప్పందం అమలయ్యేలా బాండ్ పేపర్లు తీసుకువచ్చి, వాటిపై సంతకాలు చేయించినట్టు తెలిసింది. మృతదేహం ముందుంచుకుని డబ్బే ప్రధానంగా వాదోపవాదాలు చేసుకోవడం విస్మయపరిచిందని స్థానికులు చెప్పుకుంటున్నారు. శుక్రవారం రాత్రి మరణించిన ప్రమీలకు.. ఆదివారం మధ్యాహ్నం వరకు అంత్యక్రియలు జరగకపోవడం విచారకరం. -
ఐదురోజులుగా అత్తారింట్లోనే మృతదేహం
పాపిరెడ్డిపాళెంలో టెన్షన్ టెన్షన్ పోలీసుల అదుపులో భర్త, అత్త ఆగిన మౌనిక అంత్యక్రియలు తోటపల్లిగూడూరు: అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మౌనిక(23) దహన సంస్కారాల చిక్కుముడి ఐదవ రోజూ వీడలేదు. వివరాల్లోకి వెళ్తే.. తోటపల్లిగూడూరు మండలం పాపిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన దద్దోలు మౌనిక(23) ఈ నెల 14వ తేదీ అర్థరాత్రి మెట్టినింట్లో మృతిచెందింది. ఘటన అనంతరం మౌనిక భర్త అశోక్,అత్త సుభాషిణీలు పరారయ్యారు. భర్త, అత్తామామలే తమ బిడ్డను కొట్టి చంపి ఆపై పెట్రోలు పోసి తగలుబెట్టారంటూ మౌనిక తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. వారి బంధువుల ఇళ్లపై దాడులకు దిగారు. పరారీలో ఉన్న భర్త, అత్తలు ఇంటికి తిరిగి వస్తే కాని మౌనిక అంత్యక్రియలను నిర్వహించేదిలేదంటూ వారు పట్టుబట్టారు. అంతేకాక మౌనిక మృతదేహాన్ని అశోక్ ఇంట్లోనే ఉంచి వారు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విషయం ఐదు రోజులుగా గ్రామంలో వివాదస్పదంగా మారిపోయింది. కాగా ఆమె భర్త అశోక్, అత్త సుభాషిణీలను ఎట్టకేలకు పోలీసులు శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకొన్నారు. నిందితులు దొరకడంతో నాలుగు రోజులుగా నిలిచిన మౌనిక దహన సంస్కారాలు శనివారం జరుగుతాయనీ అందరూ భావించారు. కాని ఐదో రోజు కూడా మౌనిక దహన సంస్కారాల ఉత్కంట వీడలేదు. మౌనిక బిడ్డలకు న్యాయం జరిగేలా అస్తిపాస్తుల రిజిస్ట్రేషన్ పనులతో పెద్దలంతా శనివారం బిజీ ఆయిపోయారు. ఆదివారం ఉదయం మౌనిక అంత్యక్రియలను నిర్వహించేందుకు పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.