
అంత్యక్రియల కోసం శవంతో వాగు దాటుతున్న గ్రామస్తులు
ఆదిలాబాద్: గ్రామంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం మండలంలోని గూడ గ్రామ ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. గ్రామానికి చెందిన షేక్ అజీజ్ మరణించగా అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు.
ఖబ్రస్థాన్‌కు వెళ్లే దారిలో వాగు ఉండడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఇలా దాటి వెళ్లారు. ఏళ్లు గడిచినా గ్రామంలో కనీస సౌకర్యాలు కానరావడం లేదని, అంత్యక్రియలకు సైతం అవస్థలు పడాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన నిర్మించి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.