![Man Eats Wife's Brain In Tacos, Uses Skull As Ashtray At Mexico - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/8/mexico.jpg.webp?itok=8E-a4i1f)
కోపంలోనో లేదా క్షణికావేశంలోనే నేరాలు చేయడం ఒకరకం. లేనిపోని అపార్థాలు, అపోహాలు కాస్త చివరికి కడతేర్చే స్థాయికి దారితీయడం మరోరకం. కానీ ఇప్పుడూ జరుగుతున్న నేరాల తీరు చూస్తే ఒక రకమైన విధంగా వొళ్లు జలదరిస్తుంది. పూర్తి కాన్షియస్‌లో ఉండే అత్యంత పాశవికంగా కడతేర్చడం వంటి ఘోరాలకు పాల్పడటం బాధకరం. అక్కడితో ఆగక చనిపోయాడన్న జాలి గానీ బాధగాని కొంచెం కూడా లేకపోగ విగతజీవిగా పడి ఉన్న ఆ మనిషి శరరంపై అతనిలో ఉన్నఘోరమైన శాడిజాన్ని, పైశాచికాన్ని వెళ్లగక్కలే దారుణాతి చర్యలకు పాల్పడటం జుగుప్సకరం. అచ్చం అలాంటి తరహాలోనే దారుణమైన అకృత్యానికి పాల్పడ్డాడో ఓ వ్యక్తి. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..యూఎస్‌లోని మెక్సికోలో 32 ఏళ్ల అల్వారో అనే వ్యక్తి జులై 2న ప్యూబ్లోని తన ఇంటిలోనే అరెస్టు అయ్యాడు. ఒక ఏడాది క్రితమే 38 ఏళ్ల మరియా మోంట్సెరాట్ అనే ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 12 నుంచి 23 సంవత్సరాల గల ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఏమైందో ఏమో గానీ వృతిరీత్యా బిల్డర్ అయిన అల్వారో జూన్ 29న తన భార్య మరియాను హతమార్చాడు. ఆ తర్వాత రెండు రోజులకే మీ అమ్మను తీసుకెళ్లాల్సిందిగా ఆమె కూతళ్లకే ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళనకు గురైన ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది.
అతడు విచారణలో చెప్పిన విషయాలు విని పోలీసులే విస్తుపోయారు. తమ కుల దేవత, ఓ దెయ్యం తనను ఈ హత్యకు ప్రేరేపించినట్లు కట్టుకథలు చెప్పాడు. మరియాను చంపి ఆమె మెదడను కూడా తిన్నానని, ఆమె పుర్రెని యాష్ ట్రైగా వాడినట్లు చెప్పుకొచ్చాడు. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా కోసి ప్లాస్టిక్ సంచిలో ఉంచినట్లు తెలిపాడు. ఐతే అల్వారో డ్రగ్స్ వాడుతుంటాడని, అతడికి ఏవో మానసిక సమస్యలు కూడా ఉన్నాయని బాధితురాలి తల్లి పోలీసుల వద్ద వాపోయింది.
తన కూతురుని కొడవలి, సుత్తితో అతి కిరాతకంగా చంపినట్లు ఆరోపించింది. అలాగే తన మనవారాళ్లను లైంగికంగా వేధించినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా అతడి ఇంట్లో చేతబడి చేసే ఓ బలిపీఠాన్ని పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే గాక హత్య చేసేందుకు దారితీసిన పరిస్థితులపై పూర్తి స్తాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు మెక్సికో పోలీసులు.
(చదవండి: గోయింగ్ సోలో! ఇద్దరు విజేతల అరుదైన కథ)
Comments
Please login to add a commentAdd a comment