
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఘరానా ఈవెంట్ల డీజే సప్లయర్, ప్రముఖ హీరోయిన్ నేహా దేశ్‌పాండే భర్త మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరోన్ మోహిత్‌ను డ్రగ్స్ కేసులో తమ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. మూడు రోజుల క్రితం నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ మోహిత్‌ను అరెస్ట్ చేసింది. తాజాగా చంచల్‌గూడ జైలు నుంచి మోహిత్‌ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ వాడుతున్న ప్రముఖుల వివరాలు, ఎక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చారనే కోణంలో పోలీసుల ప్రశ్నిచనున్నారు.
గోవా కింగ్ పిన్ ఎడ్విన్‌తో మోహిత్‌కు గల సంబంధాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే అతడి కాల్ లిస్ట్, వాట్సప్ చాటింగ్‌లపైనా ప్రశ్నించనున్నారు. కాటాక్ట్ లిస్ట్‌లో మొత్తం 50 మందికిపైగా కంజూమర్స్ ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్, గోవా, ముంబైలో ఈవెంట్స్ నిర్వహించిన మోహిత్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలపై పోలీసులు విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: డీజే ముసుగులో డ్రగ్ పెడ్లింగ్.. సినీనటి నేహా దేశ్‌పాండే భర్త అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment