Mohith
-
పోలీసులకు సవాల్..
-
పులివర్తి నానిపై మోహిత్ రెడ్డి ఫైర్
-
ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు: మోహిత్ రెడ్డి
-
టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోంది- మోహిత్ రెడ్డి
-
విచారణ పేరుతో వేధింపులు.. న్యాయ పోరాటం చేస్తా: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
సాక్షి, తిరుపతి: టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్నారు వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. కావాలనే కక్షపూరితంగా కేసులో ఇరికించారని ఆయన మండిపడ్డారు. విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, మోహిత్ రెడ్డి ఆదివారం ఉదయం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘నాపై పెట్టిన తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తాం. పులివర్తి నానిపై ఎక్కడా దాడి జరగలేదు. ఘటన జరిగిన 52 రోజుల తర్వాత ఏ-37గా నా పేరును చేర్చారు. ఈ ఘటన జరిగిన రోజు నా ఎదురుగానే జయింట్ కలెక్టర్ కూడా ఉన్నారు. సెల్‌ఫోన్ కూడా లోపలికి తీసుకెళ్లకూడదు అంటే నేను తీసుకెళ్లలేదు. నా ఫోన్‌ను నా పీఏకు ఇచ్చి నేను లోపలికి వెళ్లాను. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారు. సీఆర్‌పీఎసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలని పోలీసులు చెప్పారు. మా నాన్నను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కేసులు పెడుతున్నారు. మా నాన్నను స్ఫూర్తిగా తీసుకుని పోరాడుతాం. మేము బ్రతికి ఉన్నంత కాలం ప్రజల కోసమే పోరాడుతాం. టీడీపీ నేతలు చంద్రగిరి నియోజకవర్గంలో బీభత్సం సృష్టిస్తున్నారు. మీరు చేసే అన్ని దందాలను ప్రజలకు వివరిస్తాం. ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. తప్పుడు కేసులతో మనుగడ సాధించలేరు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిచంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. మోహిత్ రెడ్డిపై 52 రోజులు తర్వాత తప్పుడు కేసు పెట్టారు. మేము నిత్యం ప్రజల్లో ఉండే వాళ్లం. నా పోరాటం ఎలా ఉంటుందో నేను చూపిస్తా అంటున్నాడు మోహిత్ రెడ్డి. తప్పుడు కేసులతో మనుగడ సాధించలేరు. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే మెజిస్ట్రేట్ ముందు మీరు హాజరుపరచాలి. జడ్జి ముందు హాజరు పరిచే ధైర్యం లేదు. మీరు పెట్టిన తప్పుడు కేసులు చూసి వాళ్లకు ఖచ్చితంగా చివాట్లు పెడతారు.ఒక సెన్సేషనల్ కోసమే అదుపులోకి తీసుకున్నారు. 41 కింద నోటీసు ఇచ్చేందుకు తీసుకు వచ్చారు. మోహిత్ రెడ్డిపై ఏ రకంగా లుక్ అవుట్ నోటీస్ ఇస్తారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే జడ్జి ముందు ప్రవేశ పెట్టండి. ఇప్పుడు 41 నోటీస్ ఇచ్చి వదిలి పెట్టారు. తిరుపతి నగరం మొత్తం దిగ్బంధం చేశారు. భారీ ఎత్తున పోలీసులు మోహరింపు ఎందుకు?. 41 నోటీసులు ఇవ్వడానికా ఇంత రాద్దంతం చేస్తారా?. ఓటు వేసిన ప్రజల్ని వదిలేట్టే ప్రసక్తే లేదు. ప్రజలపై ఉన్న కోపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చూపిస్తున్నారు. పులివర్తి నానిపై దాడి జరగలేదు అని స్విమ్స్ డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. 37 మంది దాడి చేస్తే నానిపై ఒక్కగాయం కూడా కాలేదు. ఈ దాడిలో ఉన్నాడని ఎలా కేసు పెడతారు. కావాలనే కక్ష్య పూరితంగా కేసులో ఇరికించారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
మోహిత్‌రెడ్డి అక్రమ అరెస్ట్
తిరుపతి రూరల్ : వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని పోలీసులు శనివారం సాయంత్రం అక్రమంగా అరెస్ట్ చేశారు. దుబాయ్‌లో స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయన్ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ తర్వాత రోజు తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో పులివర్తి నాని ఉద్రిక్తతలు రేకెత్తించిన ఘటనకు సంబంధించి మోహిత్‌రెడ్డిని ఏ–37గా చేర్చారు.నిజానికి ఆ సమయంలో మోహిత్‌రెడ్డి వర్సిటీలోని స్ట్రాంగ్ రూంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర ఎన్నికల అధికారుల వద్ద ఉండటం గమనార్హం. సీసీ కెమెరాల సాక్షిగా ఇదే విషయం నిర్ధారణ అయింది. కేసు నమోదు సమయంలోనూ మోహిత్‌రెడ్డి పేరు ఎక్కడా లేదు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఘటన జరిగిన 52 రోజుల అనంతరం రాజకీయ కక్షతో మోహిత్‌రెడ్డి పేరును కేసులో చేర్చారు.ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌పై కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోఅరెస్ట్ చేయబోమని కోర్టుకు నివేదించిన పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన పులివర్తి నాని రాజకీయ కక్షలో భాగంగానే తనపై ప్రత్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని కేసులో ఇరికించి అక్రమ అరెస్టుతో పైశాచిక ఆనందం పొందుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాటకమని తేలినా కక్ష సాధింపా?తనపై హత్యాయత్నం జరిగిందని పులివర్తి నాని నాడు స్విమ్స్‌లో చేరి.. చేతులు, కాళ్లకు బ్యాండేజ్ కట్లతో చేసిన హడావుడి అంతా నాటకమని తేలింది. ఆ వ్యక్తి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు. ఎక్కడా గాయాల్లేవని ఎక్స్‌రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ద్వారా స్పష్టమైంది.ఆ రిపోర్టులు ఇటీవలే బయటపడ్డాయి. మొత్తానికి ఆ రోజు అంతా డ్రామా నడిచిందని తేటతెల్లమైంది. ఆ నాటకం వల్ల ఇప్పటికే 37 మందిని జైలు పాలు చేశారు. అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎంత మందిని శిక్షిస్తారు? తప్పుడు కేసులు పెట్టి అమాయకులను మానసిక క్షోభకు గురి చేయడం దారుణం. ఆ వ్యక్తి గాయాలన్నీ ‘కట్టు’ కథలే అని తేలినప్పటికీ, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గం.విదేశాల్లో చదివిన వాడిని వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నారు నా కొడుకు వయస్సు 25 ఏళ్లు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రజా జీవితంలోకి వచ్చాడు. అక్రమ కేసులో అరెస్ట్ చేయించారు. విదేశాల్లో చదివిన నా కొడుకుని వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు. నేను విద్యార్థి దశ నుంచే ఉద్యమాలతో పెరిగినవాడిని. నాకంటే మించి నా కొడుకు ప్రజల పక్షాన నిలబడి ప్రజా పోరాటాలు ఎలా ఉంటాయో ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసు అధికారులకు రుచి చూపిస్తారు. ప్రజల పక్షాన ఏ స్థాయి పోరాటానికైనా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం. – చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, చంద్రగిరి -
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మోహిత్ రెడ్డి
-
దేశంలోనే ఆదర్శ పాలన ఏపీలో జరుగుతోంది: మోహిత్‌రెడ్డి
-
గడప గడపకు.. కార్యక్రమంలో పాల్గొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు
-
డ్రగ్స్ కేసులో పోలీసుల కస్టడీకి మోహిత్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఘరానా ఈవెంట్ల డీజే సప్లయర్, ప్రముఖ హీరోయిన్ నేహా దేశ్‌పాండే భర్త మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరోన్ మోహిత్‌ను డ్రగ్స్ కేసులో తమ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. మూడు రోజుల క్రితం నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మోహిత్‌ను అరెస్ట్ చేసింది. తాజాగా చంచల్‌గూడ జైలు నుంచి మోహిత్‌ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ వాడుతున్న ప్రముఖుల వివరాలు, ఎక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చారనే కోణంలో పోలీసుల ప్రశ్నిచనున్నారు. గోవా కింగ్ పిన్ ఎడ్విన్‌తో మోహిత్‌కు గల సంబంధాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే అతడి కాల్ లిస్ట్, వాట్సప్ చాటింగ్‌లపైనా ప్రశ్నించనున్నారు. కాటాక్ట్ లిస్ట్‌లో మొత్తం 50 మందికిపైగా కంజూమర్స్ ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్, గోవా, ముంబైలో ఈవెంట్స్ నిర్వహించిన మోహిత్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలపై పోలీసులు విచారిస్తున్నారు. ఇదీ చదవండి: డీజే ముసుగులో డ్రగ్ పెడ్లింగ్.. సినీనటి నేహా దేశ్‌పాండే భర్త అరెస్ట్ -
నార్కోటిక్ అధికారుల అదుపులో స్మగ్లర్ మోహిత్
-
విడాకులపై స్పందించిన 'ఉరీ' నటుడు.. త్వరలోనే అది జరగనుంది..!
'ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్' నటుడు మోహిత్ రైనా దంపతులపై విడాకులు తీసుకుంటున్నారని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అతని భార్య అదితి శర్మతో విడాకులపై గాసిప్స్ గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా నటుడు మోహిత్ రైనా స్పందించారు. ఆ రూమర్లను ఆయన కొట్టిపారేశారు. 'నా మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నానని వెల్లడించారు. మోహిత్ రైనా, భార్య అదితి శర్మ విడాకుల తీసుకుంటున్నట్లు వార్తలొచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరి 1న అదితి శర్మతో తన పెళ్లిని ప్రకటించి మోహిత్ తన అభిమానులను ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో తన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ఓ మీడియాకు వివరించారు. అయితే గతంలో మోహిత్ తన సోషల్ మీడియాలో అదితితో తన పెళ్లి ఫోటోలన్నింటినీ తొలగించిన తర్వాత రూమర్లు వచ్చాయి. అంతే కాకుండా మోహిత్, అదితి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో కావడం విడాకులకు మరింత బలాన్ని చేకూర్చింది. మోహిత్ రైనా - అదితి శర్మల ప్రేమకథ: అదితి శర్మతో స్నేహం వల్లే మేమిద్దరం ఒక్కటైనట్లు మోహిత్ పేర్కొన్నాడు. కొన్నేళ్ల పాటు స్నేహితులుగా ఉన్న వీరిద్దరు.. కొవిడ్ (రెండో వేవ్)లో మోహిత్ పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. కాగా.. మోహిత్ టెలివిజన్ ధారావాహిక 'దేవోన్ కే దేవ్ మహాదేవ్'లో లార్డ్ శివగా నటించారు. అతను 'ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్', 'షిద్దత్' వంటి అనేక బాలీవుడ్ చిత్రాలతో పాటు 'కాఫిర్', 'బౌకాల్', 'ముంబయి డైరీస్ 26/11' వంటి వెబ్ సిరీస్‌లలో కూడా నటించాడు. -
మోహిత్ పాదయాత్ర చరిత్రాత్మకం
తిరుపతి రూరల్: ఏడు నెలల పాటు 2,005 పల్లెలు, 115 సచివాలయాల పరిధిలో 1.46 లక్షల ఇళ్లకు తిరుపతి ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి చేపట్టిన 1,600 కిలోమీటర్ల మహా పాదయాత్ర చరిత్రాత్మకమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రశంసించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడైన మోహిత్‌రెడ్డి చేపట్టిన గడపగడపకు మహాపాదయాత్ర శనివారం పదో రోజుకు చేరుకుంది. తిరుపతి జిల్లా తిరుచానూరులో జరుగుతున్న ఈ పాదయాత్రలో ఎంపీ మిథున్‌రెడ్డి కూడా పాల్గొని, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ఏ పనినైనా చిత్తశుద్ధితో విజయవంతంగా పూర్తి చేసే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్న మోహిత్‌రెడ్డి మంచి నాయకుడుగా ఎదుగుతారని చెప్పారు. జగనన్న స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కరమే ధ్యేయంగా మహాపాదయాత్ర చేస్తున్నట్లు మోహిత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
CWG 2022: పసిడి పట్టు.. ఆరు పతకాలతో మెరిసిన భారత రెజ్లర్లు
అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత రెజ్లర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో శుక్రవారం ఆరు పతకాలతో అదరగొట్టారు. స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, దీపక్ పూనియా, సాక్షి మలిక్ స్వర్ణ పతకాలతో సాధించగా... అన్షు మలిక్ రజతం... దివ్య కక్రాన్, మోహిత్ గ్రెవాల్ కాంస్య పతకాలు సంపాదించారు. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఈవెంట్స్‌లోనూ భారత క్రీడాకారులు రాణించి పతకాల దిశగా మరో అడుగు ముందుకేశారు. బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్లు మరోసారి తమ ‘పట్టు’ చాటుకున్నారు. రెజ్లింగ్ ఈవెంట్ తొలి రోజు బరిలో దిగిన ఆరు వెయిట్ కేటగిరీల్లోనూ పతకాలతో మెరిశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు) పసిడి పతకాలు సాధించగా... మోహిత్ గ్రెవాల్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ (62 కేజీలు) మూడో ప్రయత్నంలో కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించగా... అన్షు (57 కేజీలు) రజతం... దివ్య కక్రాన్ (68 కేజీలు) కాంస్యం సొంతం చేసుకున్నారు. కేవలం రెండు పాయింట్లు ఇచ్చి... పురుషుల 65 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ బజరంగ్‌కు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. లాచ్లాన్ మౌరిస్ మెక్నీల్ (కెనడా)తో జరిగిన ఫైనల్లో బజరంగ్ 9–2తో గెలిచి స్వర్ణం దక్కించుకున్నాడు. తొలి రౌండ్లో లోవీ బింగామ్ (నౌరూ)పై, క్వార్టర్ ఫైనల్లో జీన్ గలియాన్ (మారిషస్)పై, సెమీఫైనల్లో జార్జి రామ్ (ఇంగ్లండ్)పై బజరంగ్ గెలిచాడు. స్వర్ణం గెలిచే క్రమంలో బజరంగ్ తన ప్రత్యర్థులకు కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఇవ్వడం విశేషం. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న దీపక్ పూనియా ఫైనల్లో 3–0తో మొహమ్మద్ ఇనామ్ (పాకిస్తాన్)పై గెలిచాడు. సెమీఫైనల్లో దీపక్ 3–1తో అలెగ్జాండర్ మూర్ (కెనడా)పై, క్వార్టర్ ఫైనల్లో 10–0తో కసెబామా (సియరీ లియోన్)పై, తొలి రౌండ్లో 10–0తో మాథ్యూ ఒక్జెనామ్ (న్యూజిలాండ్)పై విజయం సాధించాడు. 125 కేజీల కాంస్య పతక పోరులో మోహిత్ గ్రెవాల్ ‘బై ఫాల్’ పద్ధతిలో ఆరోన్ జాన్సన్ (జమైకా)పై గెలుపొందాడు. సూపర్ సాక్షి... మహిళల 62 కేజీల విభాగం ఫైనల్లో సాక్షి మలిక్ ‘బై ఫాల్’ పద్ధతిలో కెనడా రెజ్లర్ అనా పౌలా గోడినెజ్‌ను ఓడించి తొలిసారి ఈ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో రజతం, 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో కాంస్యం నెగ్గిన సాక్షి మూడో ప్రయత్నంలో పసిడి పతకాన్ని ముద్దాడింది. ఫైనల్లో ఒకదశలో సాక్షి 0–4తో వెనుకబడింది. అయితే ఆ తర్వాత పుంజుకొని అనా పౌలా భుజాన్ని కొన్ని సెకన్లపాటు మ్యాట్‌కు అట్టిపెట్టి ‘బై ఫాల్’ పద్ధతిలో విజయాన్ని అందుకుంది. 57 కేజీల ఫైనల్లో అన్షు మలిక్ 3–7తో ఒడునాయో అడెకురోయె (నైజీరియా) చేతిలో ఓడిపోయింది. 68 కేజీల విభాగం కాంస్య పతక పోరులో దివ్య కక్రాన్ కేవలం 20 సెకన్లలో తన ప్రత్యర్థి టైగర్ లిలీ లెమాలి (టోంగా)పై గెలిచింది. -
మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
తిరుపతి: ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన లండన్‌లోని వార్విక్ యూనివర్సిటీ నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించి మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్నారు. బుధవారం యూనివర్సిటీలో జరిగిన కాన్వగేషన్‌కు తల్లిదండ్రులు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లక్ష్మీ, తమ్ముడు హర్షిత్ రెడ్డితో కలిసి మోహిత్ రెడ్డి హాజరయ్యారు. వార్విక్ యూనివర్సిటీ ఛాన్సలర్ నుంచి మోహిత్ రెడ్డి 'మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్'లో మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్నారు. తనయుడు మోహిత్ రెడ్డి మాస్టర్ డిగ్రీ డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించడం పట్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రిలయన్స్ సంస్థ అధినేత, టీవీఎస్ సంస్థ అధినేత, భారత దేశంలోని ఇతర పారిశ్రామిక వేత్తల పిల్లలు గతంలో ఇదే యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మాస్టర్ డిగ్రీ పట్టా పొందడం విశేషం. -
పతా.. ఈ అడ్రెస్ ఎక్కడ..?
కావలసిన వారి చిరునామా వెతుక్కుంటూ ఒకరు ‘‘ఆనందరావు ఇల్లు ఎక్కడండీ?’’ అని అడిగితే.. ‘‘ఆనందరావు ఇల్లు ఎక్కడండి’’ అని వెటకారంగా సమాధానం చెబుతారు మరొకరు. తెలుగు సినిమాల్లో బాగా పాపులర్ అయిన జోకు ఇది. స్క్రీన్ మీద నటులు పడే తంటాలు మనకు నవ్వు తెప్పిస్తే, రియల్ లైఫ్‌లో మాత్రం ముచ్చెమటలు పట్టేస్తాయి. ఇల్లు, ఆఫీస్‌ల అడ్రెస్‌ను కనుక్కోవాలంటే తిప్పలు తప్పవు. కొత్త ఏరియాలో ఒకరి అడ్రెస్ కనుక్కోవాలన్నా, మన ఆర్డర్‌ను ఇంటికి తెచ్చి ఇచ్చే డెలివరీ బాయ్‌కు మన అడ్రెస్ వివరంగా చెప్పాలన్నా, గొంతు నొప్పి పుట్టేలా అరవాల్సిందే. అందరిలాగే ఈ ఇబ్బందులన్నీ కృతికా జైన్ కు కూడా ఎదురయ్యాయి. అడ్రెస్ దొరకగానే సమస్య తీరిపోయిందిలే అనుకోలేదు. తనలా ఇబ్బంది పడేవారందరికీ ఓ చక్కని పరిష్కారం చూపాలనుకుని ‘పతా’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది కృతిక . ఇండోర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కృతికా జైన్‌కు విదేశాల్లో చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం. పాఠశాల విద్య అయిన తరువాత పైచదువులు విదేశాల్లో చదువుకుంటానని మారాం చేసింది. ‘నువ్వు ఇంకా చిన్నపిల్లవు, ఒక్కదానివి అంతదూరం వెళ్లి చదువుకోవడం కష్టం’ అని వారించారు తల్లిదండ్రులు. దీంతో డిగ్రీ అయ్యాక విదేశాలకు వెళ్తానని మరోసారి తల్లిదండ్రులను అడిగి ఒప్పించింది. విదేశాలకు వెళ్లేందుకు అన్ని పరీక్షల్లోనూ నెగ్గి, న్యూయార్క్ యూనివర్సిటీలో ‘మేనేజ్మెంట్ టెక్నాలజీ’లో మాస్టర్స్ చేసేందుకు అడ్మిషన్ సంపాదించింది. అడ్రెస్సే కెరియర్‌గా.. చదువులో భాగంగా న్యూయార్క్‌లో రెండేళ్లపాటు ఉన్న కృతికను.. అక్కడి రోడ్లు, అడ్రెస్ తెలిపే మార్కింగ్‌లు ఎంతగానో ఆకర్షించాయి. దీంతో ఈ రంగాన్ని తన కెరియర్‌గా మలచుకోవాలనుకుంది. కానీ ఇండియా వచ్చిన వెంటనే మంచి సంబంధం రావడంతో కృతికకు వివాహం అయింది. పెళ్లి తరువాత ఒకరోజు కృతిక తనకు తెలిసిన వారింటికి వెళ్లడానికి బయలుదేరింది. అడ్రెస్ దొరకక పోవడంతో, చుట్టుపక్కల వారిని అడిగింది. కానీ వారు చెప్పింది కూడా అర్థంకాకపోవడంతో.. తను వెళ్లాల్సిన అడ్రెస్‌కు చేరుకొనేందుకు చాలా ఇబ్బంది పడింది. మరోసారి ఆన్ లైన్ లో ఆర్డరిచ్చిన ప్యాకేజీ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ బాయ్‌కు తన అడ్రెస్ సరిగా అర్థం కాకపోవడంతో, ప్యాకేజీ ఇంటికి రావడానికి చాలా సమయమే పట్టింది. దీంతో న్యూయార్క్‌లో అడ్రెస్‌లకు గూగుల్ మార్కింగ్ ఉన్నట్టే, ఇండియాలో కూడా ఉంటే ఈ సమస్యలు తలెత్తవు, అనుకుని సహ వ్యవస్థాపకులు అయిన రజత్, మోహిత్ జైన్ లతో కలిసి ‘పతా’ యాప్‌ను రూపొందించింది. పతా.. అడ్రెస్‌ను ఖచ్చితంగా చూపించే యాపే ‘పతా’. మన డిజిటల్ అడ్రెస్‌ను పతా రూపొందిస్తోంది. ఇది కాంప్లెక్స్ అడ్రెస్‌కు ఒక కోడ్‌ను ఇస్తుంది. ఈ కోడ్ ఆఫీసు లేదా ఇంటి అడ్రెస్‌ను కచ్చితంగా చూపిస్తుంది. ఇంటి చుట్టుపక్కల ఉన్న భవనాలను ఫొటోలతో సహా చూపిస్తుంది. దీనివల్ల అడ్రెస్‌ను పదేపదే వివరించాల్సిన పని ఉండదు. ఇంకా అడ్రెస్‌ను మన వాయిస్‌తో ఒకసారి రికార్డు చేసి షేర్ చేయవచ్చు. ఇదంతా ఒక్క క్లిక్‌తో అయ్యేలా చేస్తుంది పతా యాప్. ఈ యాప్ కోడ్‌తోపాటు మన వాయిస్‌తో అడ్రెస్ డైరెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. పతా యాప్‌లో మన లొకేషన్స్ కు వచ్చిన కోడ్ లింక్‌ను.. మన అడ్రెస్ కావాల్సిన వారికి షేర్ చేస్తే, వారు గమ్యస్థానానికి సులభంగా చేరుకోగలుగుతారు. గతేడాది ‘అడ్రెస్ నేవిగేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీని ప్రారంభించి, దీనిద్వారా పతా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది కృతిక. ప్రస్తుతం ఈ యాప్ 50 లక్షలకు పైగా డౌన్ లోడ్స్‌తో దూసుకుపోతోంది. ‘పతా’ యాప్ సహ వ్యవస్థాపకులతో కృతిక -
వాడేసిన వంటనూనెతో బయోడీజిల్
భలేబుర్ర వేపుళ్లకు అలవాటు పడ్డ మనదేశంలో వంటనూనె వృథా అంతా ఇంతా కాదు. వాడేసిన వంటనూనెను ఇలా వృథా పోనివ్వకుండా తిరిగి ఉపయోగించు కునేలా తయారు చేయాలనుకున్నారు ముగ్గురు ఢిల్లీ ఐఐటీ విద్యార్థులు. ఆలోచన వచ్చిందే తడవుగా అభిషేక్ శర్మ, హర్షిత్ అగ్రవాల్, మోహిత్ సోనీ అనే ఈ విద్యార్థులు ప్రయోగాలు ప్రారంభించారు. ఇళ్లలోను, హాస్టళ్లలోను వాడేసిన వంట నూనెను సేకరించడం ప్రారంభించారు. దాన్ని బయోడీజిల్‌గా మార్చే ప్రక్రియపై నానా ప్రయోగాల తర్వాత ‘ఫేమ్ వన్’ పేరిట ఓ నమూనా యంత్రాన్ని రూపొం దించారు. దీంతో వంటనూనెను జీవ ఇంధనంగా తయారు చేయగలిగారు. మామూలు డీజిల్‌లో దీనిని ఏ నిష్పత్తిలో నైనా కలుపుకోవచ్చట. వంటనూనె, నీరు, ఆల్కహాల్‌తో పాటు ఒక ఉత్ప్రేరక రసా యనాన్ని వేసి ఆన్ చేస్తే చాలు... గంట సేపట్లోనే బయోడీజిల్ సిద్ధమైపోతుంది. విడతకు ఇరవై కిలోల వాడేసిన వంటనూనెతో ఇరవై కిలోల బయోడీజిల్ తయారు చేయగలుగు తున్నారు. ఈ యంత్రం రూపకల్పనకు అయిన ఖర్చు రూ. 30 వేలు మాత్రమే. కానుగనూనె వంటి వాటితో కూడా బయో డీజిల్ తయారు చేయవచ్చని చెబుతున్నారు.