మోహిత్‌ పాదయాత్ర చరిత్రాత్మకం | YSRCP Mithun Reddy Praises Mohith Reddy Padayatra | Sakshi
Sakshi News home page

మోహిత్‌ పాదయాత్ర చరిత్రాత్మకం

Published Sun, Oct 16 2022 4:16 AM | Last Updated on Sun, Oct 16 2022 4:16 AM

YSRCP Mithun Reddy Praises Mohith Reddy Padayatra - Sakshi

పథకాలను వివరిస్తున్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి, ఎంపీపీ మోహిత్‌రెడ్డి

తిరుపతి రూరల్‌: ఏడు నెలల పాటు 2,005 పల్లెలు, 115 సచివాలయాల పరిధిలో 1.46 లక్షల ఇళ్లకు తిరుపతి ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి చేపట్టిన 1,600 కిలోమీటర్ల మహా పాదయాత్ర చరిత్రాత్మకమని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రశంసించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడైన మోహిత్‌రెడ్డి చేపట్టిన గడపగడపకు మహాపాదయాత్ర శనివారం పదో రోజుకు చేరుకుంది.

తిరుపతి జిల్లా తిరుచానూరులో జరుగుతున్న ఈ పాదయాత్రలో ఎంపీ మిథున్‌రెడ్డి కూడా పాల్గొని, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ఏ పనినైనా చిత్తశుద్ధితో విజయవంతంగా పూర్తి చేసే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్న మోహిత్‌రెడ్డి మంచి నాయకుడుగా ఎదుగుతారని చెప్పారు.

జగనన్న స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కరమే ధ్యేయంగా మహాపాదయాత్ర చేస్తున్నట్లు మోహిత్‌రెడ్డి తెలిపారు.  ప్రభుత్వ విప్, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement