సాక్షి, ప్రకాశం: ఏపీలో ప్రజల మద్దతుతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆశిస్తున్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్‌ను సీఎం చేయడానికి కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.
మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ప్రకాశం జిల్లాలో ఘనంగా జరిగాయి. ఒంగోలు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకలకు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల పక్షపాతి, సంక్షేమ సారధి అయిన వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల మద్దతుతో వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. వైఎస్ జగన్‌ను సీఎం చేసే వరకు కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ చుండూరి రవిబాబులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమంది పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన రక్తదాన కార్యక్రమానికి కార్యకర్తల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది.
మరోవైపు.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గవ్యాప్తంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పాకాల మండలంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారం ఉన్నా, లేకున్నా ప్రజల పక్షనా వైఎస్సార్‌సీపీ నిలుస్తుంది. కూటమి ప్రభుత్వం అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. హామీల అమలు చేయకపోతే పాకాల నుంచే పోరాటాలు ప్రారంభిస్తాం. కూటమి నాయకుల దౌర్జన్యాలకు సరైన గుణపాఠం నేర్పుతాం అని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment