'ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్' నటుడు మోహిత్ రైనా దంపతులపై విడాకులు తీసుకుంటున్నారని వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అతని భార్య అదితి శర్మతో విడాకులపై గాసిప్స్ గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా నటుడు మోహిత్ రైనా స్పందించారు. ఆ రూమర్లను ఆయన కొట్టిపారేశారు. 'నా మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నానని వెల్లడించారు. మోహిత్ రైనా, భార్య అదితి శర్మ విడాకుల తీసుకుంటున్నట్లు వార్తలొచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన స్పష్టం చేశారు.
ఈ ఏడాది జనవరి 1న అదితి శర్మతో తన పెళ్లిని ప్రకటించి మోహిత్ తన అభిమానులను ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో తన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ఓ మీడియాకు వివరించారు. అయితే గతంలో మోహిత్ తన సోషల్ మీడియాలో అదితితో తన పెళ్లి ఫోటోలన్నింటినీ తొలగించిన తర్వాత రూమర్లు వచ్చాయి. అంతే కాకుండా మోహిత్, అదితి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో కావడం విడాకులకు మరింత బలాన్ని చేకూర్చింది.
మోహిత్ రైనా - అదితి శర్మల ప్రేమకథ: అదితి శర్మతో స్నేహం వల్లే మేమిద్దరం ఒక్కటైనట్లు మోహిత్ పేర్కొన్నాడు. కొన్నేళ్ల పాటు స్నేహితులుగా ఉన్న వీరిద్దరు.. కొవిడ్ (రెండో వేవ్)లో మోహిత్ పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. కాగా.. మోహిత్ టెలివిజన్ ధారావాహిక 'దేవోన్ కే దేవ్ మహాదేవ్'లో లార్డ్ శివగా నటించారు. అతను 'ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్', 'షిద్దత్' వంటి అనేక బాలీవుడ్ చిత్రాలతో పాటు 'కాఫిర్', 'బౌకాల్', 'ముంబయి డైరీస్ 26/11' వంటి వెబ్ సిరీస్‌లలో కూడా నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment