
బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడు గోవింద పేరు తెలియని వారు ఉండరు. ఇటీవల ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తోంది. త్వరలోనే ఆయన తన పెళ్లి బంధానికి గుడ్ బై చెప్పనున్నారని బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. దీంతో తనపై వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు కూడా. కొద్దిరోజుల కిందట తన ఇంటికి చాలామంది ప్రముఖులు రావడంతో ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయని ఆయన అన్నారు. వారందరూ కూడా కేవలం వ్యాపార విషయాల గురించి మాట్లాడేందుకే వచ్చారని ఆయన తెలిపారు. తాను కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల వారందరూ వస్తున్నారని చెప్పారు.
అయితే తమపై వస్తున్న విడాకుల వార్తలపై గోవింద భార్య సునీతా అహుజా కూడా స్పందించారు. గోవిందా, తనను ఎవరూ విడదీయలేరని సునీతా అహుజా తేల్చిచెప్పారు. మేము విడివిడిగా ఉంటున్నా మాట వాస్తవమే.. కానీ గోవింద రాజకీయాల్లోకి ఉండడం వల్లే తాము దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు.. తరచుగా పార్టీకి చెందిన పలువురు మా ఇంటికి వస్తూ ఉంటారు..అందుకే మేము పక్కనే ఉన్న మరో ఇంట్లో ఉంటున్నామని తెలిపింది.
ఎందుకంటే మేమంతా ఇంట్లో ఉన్నప్పుడు షార్ట్‌లు ధరించి తిరుగుతూ ఉంటాం.. ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది.. అందుకే ఆయన ప్రత్యేకంగా ఆఫీస్ కూడా తీసుకున్నారని పేర్కొంది. ఈ ప్రపంచంలో నన్ను, గోవిందాను విడదీయడానికి ఎవరైనా ధైర్యం చేస్తే నా ముందుకు రండి అంటూ నవ్వుతూ మాట్లాడింది సునీత అహుజా. గతంలోనూ తామిద్దరం వేర్వేరు ఇళ్లలోనే నివసిస్తున్నట్లు వెల్లడించింది. మాకు రెండు అపార్ట్‌మెంట్స్ ఉన్నాయని.. ఆయనకు మీటింగ్స్ ఉండటం వల్ల మా ఇంటి ఎదురుగా ఉన్న బంగ్లాలోనే ఉంటారని తెలిపింది. కాగా.. గోవిందా, సునీత 1987లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ కుమారుడు యశ్వర్ధన్, కుమార్తె టీనా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment