
బాలీవుడ్ నటుడు గోవిందా బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. లవ్ 86 మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. తన సినీ కెరీర్‌లో పలు అవార్డులను అందుకున్నారు. అంతేకాకుండా రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన గోవిందా.. 1987లోనే సునీత అహుజాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన గోవిందా భార్య సునీతా అహుజా ఓ షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. అయితే తమకు పెళ్లైన ఏడాదికే టీనా జన్మించిందని వెల్లడించింది. కానీ.. టీనా తర్వాత మరో కూతురు కూడా పుట్టిందని సునీత తెలిపింది. కానీ నెలలు నిండకముందే బిడ్డ జన్మించడంతో ఊపిరితిత్తులు అభివృద్ధి చెందక మూడు నెలలకే చనిపోయిందని బాధాకర సంఘటనను గుర్తు చేసుకుంది.
అందువల్లే తన కొడుకు యశ్‌వర్ధన్‌ను చాలా జాగ్రత్తగా పెంచుకున్నట్లు సునీత వెల్లడించింది. అంతే కాదు తన పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లనని వివరించింది. టీనా కంటే యశ్ ఎనిమిదేళ్లు చిన్నవాడు కావడంతో చాలా గారాబంగా పెంచుకుంటున్నట్లు పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. తన పిల్లలను పాఠశాల నుంచి నేనే తీసుకువస్తానని సునీత తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment