బేబీ జాన్‌లో అతిథిగా సల్మాన్‌ ఖాన్‌ | Baby John: Salman Khan Shoots Cameo With Varun Dhawan and Atlee Directing Massive Action Sequence | Sakshi
Sakshi News home page

బేబీ జాన్‌లో అతిథిగా సల్మాన్‌ ఖాన్‌

Published Mon, Oct 7 2024 6:14 AM | Last Updated on Mon, Oct 7 2024 10:50 AM

Baby John: Salman Khan Shoots Cameo With Varun Dhawan and Atlee Directing Massive Action Sequence

‘బేబీ జాన్‌’కు అతిథి అయ్యారు సల్మాన్‌ ఖాన్‌. వరుణ్‌ ధావన్‌ హీరోగా తమిళ దర్శకుడు కాలీస్‌ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘బేబీ జాన్‌’. హిందీలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ తొలి చిత్రంలో నటి వామికా గబ్బి మరో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. కాగా ‘బేబీ జాన్‌’లో సల్మాన్‌ ఖాన్‌ అతిథిపాత్రలో నటిస్తున్నారని, ప్రస్తుతం సల్మాన్‌–వరుణ్‌ ధావన్‌ కాంబినేషన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని బాలీవుడ్‌ సమాచారం.

అంతేకాదు... సల్మాన్‌ ఖాన్‌–వరుణ్‌ ధావన్‌లపై వచ్చే యాక్షన్‌ సీన్స్‌ని మాత్రం ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన దర్శకుడు అట్లీ తీస్తున్నారట. ఇక తమిళంలో విజయ్‌ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన హిట్‌ మూవీ ‘తేరీ’కి హిందీ రీమేక్‌గా ‘బేబీ జాన్‌’ రూపొందుతోందనే టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న ‘సికందర్‌’ చిత్రం వచ్చే ఏడాది ఈద్‌ సందర్భంగా విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement