![Govinda Now Discharged From Hospital](/styles/webp/s3/article_images/2024/10/4/govinda.jpg.webp?itok=LGwOTiuK)
బాలీవుడ్ సీనియర్ నటుడు, శివసేన నాయకుడు గోవిందా బుల్లెట్ గాయంతో కోలుకున్నారు. తన వ్యక్తిగత గన్ మిస్‌ఫైర్ కావడంతో రెండురోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు తెలిపారు. దీంతో ఆసుపత్రి నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యారు. అక్టోబర్ 1న ముంబైలో ఇంటి నుంచి బయలుదేరే సమయంలో తన రివాల్వర్‌ను శుభ్రం చేస్తుండగా గన్ మిస్‌ఫైర్ అయింది. దీంతో బుల్లెట్ అతని కాలిలోకి దూసుకెళ్లిడంతో తీవ్రంగానే రక్తస్రావమైంది.
ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వీల్‌ఛైర్‌లో గోవిందా బయటకు వస్తున్న సమయంలో పలువురు అభిమానులు, ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. తన ఆరోగ్యం గురించి పలు విషయాలను తెలుసుకొని పరామర్శించారు. దీంతో ఆయన కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాను క్షేమంగా ఉన్నానని బదులిచ్చారు. తన కోసం ప్రార్థించిన అభిమానులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment