![Lady Fan 72 Cr Property Transfer To Actor Sanjay Dutt](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/Actor-Sanjay-Dutt.jpg.webp?itok=F3IQ6rGN)
బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ తనదైన స్టైల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించారు. కేజీయఫ్2(KGF2)తో దక్షిణాది వారికి కూడా ఆయన దగ్గరయ్యారు. లియో, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలలో ప్రతినాయకుడిగా కనిపించారు. బాలీవుడ్‌లో ఆయనకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ముంబైకి చెందిన నిషా పాటిల్ అనే అభిమాని సంజూ కోసం ఏకంగా తన ఆస్థి మొత్తాన్ని రాసిచ్చింది. ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
సంజయ్ దత్ అంటే నిషా పాటిల్‌కు(62) చాలా అభిమానం.. దీంతో 2018 సమయం సంజయ్ దత్ పేరిటి ఆమె ఒక వీలునామా రాసింది. ఆమె మరణానంతరం రూ. 72 కోట్ల ఆస్తిని సంజయ్ దత్‌కు బదిలీ చేయాలని అందులో పేర్కొంది. అయితే, తన జీవితకాంలో ఆమె ఎప్పుడూ దత్‌ను వ్యక్తిగతంగా కలవలేదు. గృహిణిగా ఉన్న ఆమె సంజయ్ దత్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడేది. కేవలం అతని నటనా నైపుణ్యానికి నిషా పాటిల్ ఆకర్షితురాలైంది. బాలీవుడ్ ఒకప్పటి లెజెండ్స్ దివంగత సునీల్ దత్, నటి నర్గీస్‌ల కుమారుడు అని కూడా సంజయ్ దత్ మీద ప్రేమ ఉంది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/1_451.jpg)
నిషా పాటిల్ కొద్దిరోజు క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందారు. తాను మరణిస్తానని ఆమె ముందే గ్రహించి ముందే రాసి ఉంచిన కొన్ని లెటర్స్ బ్యాంకులకు పంపారు. తన ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం సంజయ్ దత్‌కు మాత్రమే బదిలీ చేయాలని అందులో పేర్కొన్నారు. వీలునామా ప్రకారం తన ఆస్తి మొత్తం సంజయ్ దత్‍కే చెందుతుందని లీగల్‌గా కూడా పత్రాలు రాసి ఉంచారు. దీంతో తన ఆస్తి అంతా సంజయ్ పేరిట ఉంది.
బ్యాంకు అధికారుల ద్వారా అసలు విషయాన్ని తెలుసుకున్న సంజయ్ దత్ ఆశ్చర్యపోయారు. నిషా పాటిల్ ఎవరో తనకు తెలియదని ఆయన అన్నారు. కానీ, ఆమె చూపిన అభిమానం పట్ల ఆయన చలించిపోయారు. ఆమెకు సంబంధించిన ఆస్తి తనకు వద్దని ఆయన సున్నితంగా తిరస్కరించారు. అంతటి అభిమానిని కలుసుకోలకపోయాననే బాధ ఉందని తెలిపారు. తన పేరుతో ఉన్న ఆస్తులన్నీ నిషా పాటిల్ కుటుంబ సభ్యులకు అందేలా లీగల్ టీమ్‌ను దత్ ఏర్పాటు చేశారు. త్వరలో ఆమె కుటుంబ సభ్యులనైనా కలుస్తానన్నారు.
బాల నటుడిగా ఎంట్రీ.. ఐదేళ్లు జైలు జీవితం
1971లో తన తండ్రి నిర్మించిన చిత్రం "రేష్మ ఔర్ షెరా"లో బాల నటుడిగా సంజయ్ దత్ ఎంట్రీ ఇచ్చాడు. సాజన్, ఖల్నాయక్, వాస్తవ్,మిషన్ కాశ్మీర్,పరిణీత మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, నామ్, ముసఫిర్,అగ్నిపథ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఆయనకు చాలామంది అభిమానులు ఉన్నారు. 1993 ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్లలో నిందితుల నుంచి అక్రమంగా ఆయుధాలు తీసుకున్నట్లు నేరం రుజువైంది. ఈ కేసులో సంజయ్ దోషిగా తేలారు. దీంతో ఆయన ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించారు. 2016లో జైలు నుంచి విడుదలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment