govinda
-
గోవిందాతో విడాకులు.. అలాంటి వాళ్లు నా ముందుకు రండి: సునీత అహుజా
బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడు గోవింద పేరు తెలియని వారు ఉండరు. ఇటీవల ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తోంది. త్వరలోనే ఆయన తన పెళ్లి బంధానికి గుడ్ బై చెప్పనున్నారని బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. దీంతో తనపై వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు కూడా. కొద్దిరోజుల కిందట తన ఇంటికి చాలామంది ప్రముఖులు రావడంతో ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయని ఆయన అన్నారు. వారందరూ కూడా కేవలం వ్యాపార విషయాల గురించి మాట్లాడేందుకే వచ్చారని ఆయన తెలిపారు. తాను కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల వారందరూ వస్తున్నారని చెప్పారు.అయితే తమపై వస్తున్న విడాకుల వార్తలపై గోవింద భార్య సునీతా అహుజా కూడా స్పందించారు. గోవిందా, తనను ఎవరూ విడదీయలేరని సునీతా అహుజా తేల్చిచెప్పారు. మేము విడివిడిగా ఉంటున్నా మాట వాస్తవమే.. కానీ గోవింద రాజకీయాల్లోకి ఉండడం వల్లే తాము దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు.. తరచుగా పార్టీకి చెందిన పలువురు మా ఇంటికి వస్తూ ఉంటారు..అందుకే మేము పక్కనే ఉన్న మరో ఇంట్లో ఉంటున్నామని తెలిపింది.ఎందుకంటే మేమంతా ఇంట్లో ఉన్నప్పుడు షార్ట్‌లు ధరించి తిరుగుతూ ఉంటాం.. ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది.. అందుకే ఆయన ప్రత్యేకంగా ఆఫీస్ కూడా తీసుకున్నారని పేర్కొంది. ఈ ప్రపంచంలో నన్ను, గోవిందాను విడదీయడానికి ఎవరైనా ధైర్యం చేస్తే నా ముందుకు రండి అంటూ నవ్వుతూ మాట్లాడింది సునీత అహుజా. గతంలోనూ తామిద్దరం వేర్వేరు ఇళ్లలోనే నివసిస్తున్నట్లు వెల్లడించింది. మాకు రెండు అపార్ట్మెంట్స్ ఉన్నాయని.. ఆయనకు మీటింగ్స్ ఉండటం వల్ల మా ఇంటి ఎదురుగా ఉన్న బంగ్లాలోనే ఉంటారని తెలిపింది. కాగా.. గోవిందా, సునీత 1987లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ కుమారుడు యశ్వర్ధన్, కుమార్తె టీనా ఉన్నారు. -
కెరీర్లో పీక్‌లో ఉండగానే పెళ్లి, భరించలేని గృహహింస..చివరికి!
బాలీవుడ్ హీరో గోవింద -సునీత దంపతుల విడాకుల పుకార్లు అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేశాయి. 37 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్స్టాప్ పెట్టారన్నవార్తల్లో వాస్తవం లేదంటూ నటుడు ఈ ఊహగానాలను కొట్టిపడేశారు. అయితే, గోవిందతోపాటు అతని కుటుంబ సభ్యులు కూడా చాలా మంది గ్లామర్ ప్రపంచంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారని మీకు తెలుసా? స్టాండ్-అప్ కమెడియన్ కృష్ణ అభిషేక్ , టీవీ టెలివిజన్ నటి రాగిణి ఖన్నా చాలామంది నటనా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా టెలివిజన్‌లో తన తొలి సీరియల్‌తో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న నటి సౌమ్య సేథ్ గోవిందాకు మేనకోడలు. ఈమె కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్నప్పటికీ, ఏ అభిమాని ఆమెను మరచిపోలేరు. వైవాహిక జీవితంలోకి అడుగపెట్టాక అంతులేని కష్టాలు మొదలయ్యాయి. భరించలేని గృహహింస, విడాకులు ఇన్ని కష్టాల మధ్య తనను తాను నిలబెట్టుకుని రాణిస్తోంది? అయితే ఎందుకు గ్లామర్ ప్రపంచానికి దూరమైంది? సౌమ్య సేథ్ జీవితం, కెరీర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.సౌమ్య సేథ్ 1989 అక్టోబర్ 17న బనారస్‌లో జన్మించింది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో శిక్షణ పొందింది. గోవింద మేనకోడలిగా సినీ ఇండస్ట్రీలో పరిచయాలు పెరిగాయి. భాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం చిత్రంలో ఆమె ఒక అతిధి పాత్రలో నటించింది. ఆ తరువాత 2011లో ‘నవ్య… నయే ధడ్కన్ నయే సవాల్’ అనే టీవీ సీరియల్ ద్వారా కెరీర్‌ను ప్రారంభించి, నవ్య పేరుతో పాపులర్ అయింది. మహిళా విభాగంలో ఆమె బిగ్ టెలివిజన్ అవార్డులను అందుకుంది. ఆమె తరువాత దిల్ కీ నజర్ సే ఖూబ్సూరత్ అనే షోలో టైటిల్ రోల్లో నటించింది. 2013లో MTV వెబ్‌బెడ్‌ను కూడా నిర్వహించింది, తరువాత చక్రవర్తి అశోక సామ్రాట్ అనే షోలో 'కరువాకి' పాత్రను పోషించింది. ఇలా కెరీర్లో పీక్‌లో ఉండగానే2017లో అమెరికాకు చెందిన నటుడు అరుణ్ కపూర్‌ను వెస్టిన్ ఫోర్ట్ లాడర్డేల్ బీచ్ రిసార్ట్‌లో వివాహం చేసుకుంది తరువాత అమెరికాలో స్థిరపడింది. వీరికి ఒక కొడుకు ఐడెన్ పుట్టాడు.ఇదీ చదవండి: టిపినీ కాదు, చద్దన్నం : క్రేజ్ మామూలుగా లేదుగా! ఎక్కడ?“నేను అద్దం ముందు నిలబడినపుడు నన్ను నేను గుర్తుపట్టలేకపోయాను. ఒళ్లంతా గాయాలు.క డుపుతో ఉన్నా కూడా చాలా రోజులు తినలేదు. అసలు కొన్ని రోజులు అద్దం వైపు చూసే ధైర్యం చేయలేకపోయాను. ఒక దశలో చచ్చిపోదామనుకున్నా. కానీ నేను చనిపోతే నా బిడ్డ పరిస్థితి ఏంటి? తల్లి లేకుండా ఎలా బతుకుతుంది? నేను నన్ను నేను చంపుకోగలను కానీ.. బిడ్డ ఎలా? ఈ ఆలోచనే నాకొడుకు ఐడెన్, నా ప్రాణాన్ని కాపాడింది." అని తెలిపింది. చివరికి పెళ్లైన రెండేళ్లకు 2019లో విడాకులు తీసుకుని ఆ కష్టాల నుంచి బైటపడింది. మరోవైపు ఈ కష్టకాలంలో సౌమ్య సేథ్‌కు తల్లిదండ్రులు వర్జీనియాకు వెళ్లి అండగా నిలిచారు. అలా 2023లో, సౌమ్య ప్రేమకు మరో అవకాశం ఇచ్చి ఆర్కిటెక్ట్ , డిజైనర్ శుభం చుహాడియాను వివాహం చేసుకుంది. తరువాత 33 ఏళ్ల వయసులో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారి సొంత వ్యాపారాన్ని ప్రారంభించింది. వర్జీనియాలో లైసెన్స్ పొందిన రియల్టర్‌గా రాణిస్తోంది. తన తండ్రి, తాత వ్యాపార దక్షతను చూసి తాను కూడా వ్యాపారవేత్త కావాలనే కలలు కనేదాన్నని, చివరికి తన కల నెరవేరిందని ఒక సోషల్‌మీడియా పోస్ట్ ద్వారా చెప్పింది సౌమ్య.సౌమ్య సేథ్ జీవితం, కెరీర్ ఆమె ధైర్యానికి, దృఢత్వానికి చక్కటి నిదర్శనం. కెరీర్ కోల్పోయినా, జీవితంలో ఎన్ని కష్టాలొచ్చిన తలొగ్గక, తనను తాను ఉన్నతంగా నిలబెట్టుకుంది.తద్వారా లక్షలాది మందికి ప్రేరణగానిలిచింది. -
38 ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్.. నటుడు గోవిందా విడాకులు!
ఇండస్ట్రీలో పెళ్లి-విడాకులు అనేది చాలా కామన్. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం చాలా ఏళ్ల పాటు కలిసున్న కొందరు స్టార్ కపుల్స్ విడిపోతున్నారు. ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాశ్, హీరో జయం రవి.. ఇలా తదితరులు ఏళ్లకు ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్ వేశారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో సీనియర్ నటుడు చేరినట్లు తెలుస్తోంది.అప్పట్లో బాలీవుడ్ లో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్న గోవిందా.. ప్రస్తుతం పెద్దగా లైమ్ లైట్ లో లేడు. ఇతడే తన 38 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సిద్ధమయ్యాడట. గోవిందా, ఇతడి భార్య సునీత అహుజా.. గత కొన్ని రోజుల నుంచి వేర్వురుగా ఉంటున్నారట.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?)కొంతకాలంగా గోవిందా దంపతుల మధ్య విబేధాలు నడుస్తున్నాయని, దీంతో ఇక విడాకులు తప్పనిసరి అనుకున్నారని తెలుస్తోంది. మరోవైపు గోవిందా.. ఓ మరాఠీ నటితో రిలేషన్ షిప్ లో ఉన్నాడని, భార్య నుంచి విడిగా ఉండటానికి ఇది కూడా ఓ కారణమని అంటున్నారు. ఇప్పటివరకైతే ఈ జంట.. విడాకుల అంశంపై స్పందించలేదు. కానీ మీడియాలో మాత్రం టాక్ గట్టిగా వినిపిస్తోంది.కొన్నాళ్ల క్రితం ఇంటర్వ్యూలో మాట్లాడిన సునీత కూడా.. భర్త గోవిందాతో మాట్లాడి చాలా రోజులైందని చెప్పింది. ప్రస్తుతం తన కూతురు, కొడుకుతో కలిసి మాత్రమే ఉంటున్నానని పేర్కొంది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తుంటే విడిగా ఉంటున్నారని అర్థమైంది. త్వరలో విడాకుల విషయాన్ని అధికారికంగ ప్రకటిస్తారేమో చూడాలి. 1987లో వీళ్లిద్దరూ పెళ్లిచేసుకోగా.. 1988లో కూతురు పుట్టిన తర్వాతే పెళ్లి విషయాన్ని బయటపెట్టారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?) -
గోవిందాను పెళ్లి చేసుకోవాల్సిందన్న హీరోయిన్.. నటుడి భార్య రియాక్షన్ ఇదే!
బాలీవుడ్ సీనియర్ జంట గోవింద (Govinda)- సునీత అహూజ పెళ్లి చేసుకుని నాలుగు దశాబ్దాలవుతోంది. 40 ఏళ్ల కాలంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. అవన్నీ అధిగమించుకుని ఇప్పటికీ అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారు. తాజాగా సునీత (Sunita Ahuja) ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.ఇప్పుడు కూడా తీసుకెళ్లమంటాహీరోయిన్ రవీనా టండన్ (Raveena Tandon) ఇప్పటికీ ఓ మాట అంటూ ఉంటుంది. గోవిందాను నాకంటే ముందే కలిసి ఉండాల్సిందని, అప్పుడు తనే పెళ్లి చేసుకునేదని చెప్తూ ఉంటుంది. అలా అన్నప్పుడల్లా ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. తనను తీసుకెళ్లిపో, అప్పుడు అతడి గురించి నీకు అర్థమవుతుందని సరదాగా బదులిస్తుంటాను అని చెప్పుకొచ్చింది.డజను సినిమాల్లోకాగా రవీనా- గోవింద.. దుల్జే రాజా, ఆంటీ నెం.1, బడే మియా చోటే మియా, సాండ్విచ్.. ఇలా దాదాపు డజను సినిమాల్లో కలిసి నటించారు. ఇటీవల అనుకోకుండా బుల్లెట్ తగిలి గోవింద గాయపడగా.. అప్పుడు రవీనా ఆస్పత్రికి వెళ్లి అతడిని పరామర్శించింది. గోవింద ప్రస్తుతం బాహె హాత్ కా ఖేల్, పింకీ డార్లింగ్, లెన్ డెన్: ఇట్స్ ఆల్ ఎబౌట్ బిజినెస్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.చదవండి: చిరంజీవితో ఫోటో దిగితే చాలనుకున్న 'దీప్తి'కి మెగా ప్రోత్సాహం -
ఎన్నికల ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత
ముంబయి: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యాయి. జల్గావ్లోని ముక్తైనగర్, బోద్వాడ్, పచోరా, చోప్రాలలో మహాయుతి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం పచోరాలో రోడ్ షో నిర్వహిస్తుండగా గోవిందా ఛాతీ నొప్పితో బాధపడ్డారు. వెంటనే ఇతర నేతలు గోవిందాను ఆస్పత్రికి తరలించారు.మహాయుతిలోని శివసేన (షిండే వర్గం) నేత గోవిందా పచోరాలో రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో అనారోగ్యం పాలవడంతో మధ్యలోనే ప్రచార కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఈ రోడ్ షోలో గోవిందా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వాలని, బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన అధికార కూటమికి ఓటు వేయాలని ప్రజలను కోరారు.ఇటీవల ముంబైలోని తన ఇంట్లో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడం వల్ల గోవిందా కాలికి గాయమైంది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గోవిందా త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత గోవింద తొలుత వీల్ చైర్ లో కనిపించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థనను చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.నవంబర్ 20న మహారాష్ట్రలోని అన్ని స్థానాలకు ఓటింగ్ జరిగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న నిర్వహించనున్నారు. నవంబర్ 18తో ఎన్నికల ప్రచారం ముగియకముందే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో తమ సత్తా చాటాయి. ఈ క్రమంలో గోవిందా శివసేన, మహాయుతిల ప్రచారానికి వెళ్లారు. గోవిందా పాల్గొన్న రోడ్ షోను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ -
బుల్లెట్ గాయంతో కోలుకున్న గోవిందా.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
బాలీవుడ్ సీనియర్ నటుడు, శివసేన నాయకుడు గోవిందా బుల్లెట్ గాయంతో కోలుకున్నారు. తన వ్యక్తిగత గన్ మిస్‌ఫైర్ కావడంతో రెండురోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు తెలిపారు. దీంతో ఆసుపత్రి నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యారు. అక్టోబర్ 1న ముంబైలో ఇంటి నుంచి బయలుదేరే సమయంలో తన రివాల్వర్‌ను శుభ్రం చేస్తుండగా గన్ మిస్‌ఫైర్ అయింది. దీంతో బుల్లెట్ అతని కాలిలోకి దూసుకెళ్లిడంతో తీవ్రంగానే రక్తస్రావమైంది.ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వీల్‌ఛైర్‌లో గోవిందా బయటకు వస్తున్న సమయంలో పలువురు అభిమానులు, ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. తన ఆరోగ్యం గురించి పలు విషయాలను తెలుసుకొని పరామర్శించారు. దీంతో ఆయన కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాను క్షేమంగా ఉన్నానని బదులిచ్చారు. తన కోసం ప్రార్థించిన అభిమానులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. -
తుపాకీ పేలి.. గోవిందా కాలికి గాయం
ముంబై: బాలీవుడ్ నటుడు గోవిందా(60) కాలికి బుల్లెట్ గాయమైంది. ముంబైలోని జుహూ ప్రాంతంలోని ఆయన నివాసంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతుండగా ఉదయం 4.45 గంటల సమయంలో చేతిలో ఉన్న లైసెన్సుడ్ రివాల్వర్ అనుకోకుండా పేలిందని పోలీసులు తెలిపారు. ‘వైద్యులు గోవిందా కాలిలోని బుల్లెట్‌ను తొలగించారు. ఎడమ మోకాలి దిగువన 8–10 కుట్లు పడ్డాయి. ఆయన కోలుకుంటున్నారు’అని పోలీసులు తెలిపారు.ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. రివాల్వర్‌ను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేపట్టామన్నారు. ‘అభిమానులు, తల్లిదండ్రులు, ఆ దేవుని ఆశీర్వాదంతో గాయం నుంచి కోలుకుంటున్నాను. నాకు తగిలిన బుల్లెట్‌ను వైద్యులు తొలగించారు’అంటూ గోవిందా ఒక ఆడియో సందేశం విడుదల చేశారు.మంగళవారం కోల్‌కతాలో జరిగే ఓ షోలో గోవిందా పాల్గొనాల్సి ఉందని ఆయన మేనేజర్ శశి సిన్హా తెలిపారు. రివాల్వర్‌ను కప్‌బోర్డులో ఉంచే సమయంలో పొరపాటున ట్రిగ్గర్‌పై వేలు పడి, పేలి కాలికి తగిలిందని సిన్హా వివరించారు. రివాల్వర్‌ను చెక్ చేస్తుండగా చేతుల్లో జారి అనుకోకుండా పేలిందని గోవిందా సోదరుడు కృతి కుమార్ చెప్పారు. -
Actor Govinda: ఆసుపత్రిలో నటుడు గోవింద..
-
బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు
బాలీవుడ్ సీనియర్ నటుడు, శివసేన నాయకుడు గోవిందా బుల్లెట్ గాయంతో ఆస్పత్రిలో చేరారు. మంగళవారం తెల్లవారుజామున 4.45 గంటలకు ప్రమాదం జరిగింది. ముంబైలో ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక నివేదికల ప్రకారం తనకు సంబంధించిన రివాల్వర్‌ను శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బుల్లెట్ కాలిలోకి దూసుకెళ్లడంతో అధిక మొత్తంలో రక్తస్రావం అవుతుండటం వల్ల తక్షణమే ఆయన్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు ఆయనకు చికిత్స అందించి బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని గోవిందా మేజేజర్ తెలిపారు. అయితే, కొన్ని రోజులపాటు ఆసుపత్రిలో ఉండాల్సి ఉందన్నారు.గోవిందా అసలు పేరు 'గోవింద్ అర్జున్ అహుజా'. ఆయన నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు, డ్యాన్సర్, కమెడీయన్‌గా అందరికీ పరిచయమే. గోవిందా 165కు పైగా చిత్రాల్లో నటించారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర ముంబయి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గోవిందా విజయం సాధించారు. అయితే, 2009 వరకు ఎంపీగా కొనసాగిన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. 2009 సహా తర్వాతి ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. సుమారు 15 ఏళ్ల తర్వాత గోవిందా మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో శివసేన పార్టీలో ఆయన చేరారు. -
పుట్టిన మూడు నెలలకే కూతురు చనిపోయింది: స్టార్ హీరో భార్య
బాలీవుడ్ నటుడు గోవిందా బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. లవ్ 86 మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. తన సినీ కెరీర్లో పలు అవార్డులను అందుకున్నారు. అంతేకాకుండా రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన గోవిందా.. 1987లోనే సునీత అహుజాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన గోవిందా భార్య సునీతా అహుజా ఓ షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. అయితే తమకు పెళ్లైన ఏడాదికే టీనా జన్మించిందని వెల్లడించింది. కానీ.. టీనా తర్వాత మరో కూతురు కూడా పుట్టిందని సునీత తెలిపింది. కానీ నెలలు నిండకముందే బిడ్డ జన్మించడంతో ఊపిరితిత్తులు అభివృద్ధి చెందక మూడు నెలలకే చనిపోయిందని బాధాకర సంఘటనను గుర్తు చేసుకుంది.అందువల్లే తన కొడుకు యశ్‌వర్ధన్‌ను చాలా జాగ్రత్తగా పెంచుకున్నట్లు సునీత వెల్లడించింది. అంతే కాదు తన పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లనని వివరించింది. టీనా కంటే యశ్ ఎనిమిదేళ్లు చిన్నవాడు కావడంతో చాలా గారాబంగా పెంచుకుంటున్నట్లు పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. తన పిల్లలను పాఠశాల నుంచి నేనే తీసుకువస్తానని సునీత తెలిపింది. -
హీరో ఇంట్లో పనిమనిషిగా మంత్రి కూతురు.. ఏకంగా 20 రోజులు
అభిమానం వెర్రితలలు వేయడం అనే మాట వినే ఉంటారు. ప్రముఖ హీరోహీరోయిన్లపై ఇష్టంతో కొందరు ఫ్యాన్స్ వింత వింత పనులన్నీ చేస్తుంటారు. ఇలానే ఓ అమ్మాయి ఎవరూ ఊహించని పనిచేసింది. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా ఇంట్లో ఏకంగా పనిమనిషిగా చేరిపోయింది. తాజాగా ఈ విషయాన్ని సదరు నటుడి భార్య బయటపెట్టింది.అప్పట్లో హిందీలో తనదైన డ్యాన్సులతో గోవిందా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ఇలా ఎన్నో సినిమాలు చేశాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇతడి భార్య సునీత రీసెంట్గా ఓ పాడ్ కాస్ట్లో మాట్లాడుతూ.. అప్పట్లో గోవిందా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉండేదోనని ఓ సంఘటన చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీ రిలీజ్‌కి ముందే 'తంగలాన్'కి ఎదురుదెబ్బ)'ఆయనకు చాలామంది అభిమానులున్నారు. కానీ అప్పట్లో జరిగిన సంఘటనని అంత సులువుగా మర్చిపోలేను. మాకు పెళ్లయిన కొత్తలో ఓ అమ్మాయి మా ఇంటికి వచ్చింది. ఇంటి పనుల్లో సాయం చేస్తానని పనిమనిషిగా చేరింది. 20 రోజులు మాతోనే ఉంది. ఆమెకు ఇల్లు తుడవడం, గిన్నెలు తోమడం అస్సలు రాదు. షూటింగ్ నుంచి ఆలస్యంగా వచ్చే మా ఆయన కోసం నిద్ర మానుకుని మరీ ఎదురుచూసేది. ఎందుకో అనుమానమొచ్చి ఆమెని కాస్త గట్టిగా అడగ్గా అసలు సంగతి బయటపెట్టింది. నా భర్తకు వీరాభిమాని అని చెప్పింది. దీంతో ఆమె ఇంట్లో వాళ్లకు సమాచారం ఇచ్చాం. ఆమె తండ్రి నాలుగు ఖరీదైన కార్లలో మా ఇంటికి వచ్చారు. ఆయన మంత్రి అని తెలిసి షాకయ్యాం' అని చెప్పారు.ఇక సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న గోవిందా.. కెరీర్ పీక్ దశలో ఉండగానే రాజకీయాల్లోకి వచ్చారు. 2009 వరకు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు.(ఇదీ చదవండి: రూ. 2 వేల కోట్ల భారీ స్కామ్‌లో సినీ నటి అరెస్ట్) -
ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బాలీవుడ్ హీరో గోవిందా తళుక్కున మెరిశారు. దశాబ్దకాలం తర్వాత రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న ఆయన మహారాష్ట్రలోని శివసేన పార్టీలో చేరారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. శివసేన స్టార్ క్యాంపెయినర్‌గా పార్టీ ప్రచారాల్లో పాల్గొంటున్నారు. గోవిందా ఎన్నికల ప్రచార వేదికపై డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరిస్తున్నారు.ఆయన డ్యాన్స్‌ను చూసిన శివసేన నేతలు కూడా ఉత్పాహంగా ఆయనతోపాటు కాలు కదుపుతున్నారు. గోవిందా స్టైల్, ఉత్సాహం మునుపటిలానే ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 2004లో ముంబై నార్త్ లోక్‌సభ స్థానం నుంచి గోవిందా కాంగ్రెస్ టిక్కెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి, బీజేపీ సీనియర్ నేత రామ్ నాయక్‌ను ఓడించారు. అయితే ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.चुनाव प्रचार के बीच गोविंदा का जोरदार डांस◆ एक्टर को डांस करता देखकर वहां मौजूद जनता और बाकी नेता भी झूम उठे#Govinda #ActorGovinda #Maharashtra pic.twitter.com/Zdugpko9Zp— News24 (@news24tvchannel) May 9, 2024Video Credits: News24తాజాగా గోవిందా గత మార్చి లో శివసేనలో చేరారు. ఏక్నాథ్ షిండే సమక్షంలో శివసేనలో చేరినప్పటి నుంచి ఆయన ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రస్తుతానికి గోవిందా లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తారా లేదా అనేది ఖరారు కాలేదు. అయితే ముంబై నార్త్‌వెస్ట్ నుంచి ఆయనను శివసేన ఎన్నికల బరిలోకి దింపవచ్చనే టాక్ వినిపిస్తోంది. -
బరిలో ‘హీరో నెం 1’.. అక్కడి నుంచే పోటీ?
లోక్‌సభ ఎన్నికలు దగ్గరకొస్తున్నకొద్దీ మహారాష్ట్రలో రోజుకో కొత్త అభ్యర్థి పేరు తెరమీదకు వస్తోంది. తాజాగా బాలీవుడ్ నటుడు గోవింద ముంబై నార్త్-వెస్ట్ స్థానం నుంచి శివసేన (ఏక్నాథ్ షిండే) టిక్కెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ప్రచారం సాగుతోంది. నటుడు గోవిందా ఐదు రోజుల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలిశారు. ఈసారి ముంబై వాయువ్య స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ గజానన్ కీర్తికర్‌కు టికెట్ ఇవ్వడానికి షిండే వర్గం సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో గోవిందా ఇక్కడి నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. ‘హీరో నెం 1’గా ప్రసిద్ధి చెందిన గోవిందా అసలు పేరు గోవింద్ అర్జున్ అహుజా. 2004లో ఆయన కాంగ్రెస్ టిక్కెట్‌పై ఉత్తర ముంబై నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో సీట్ల పంపకంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. -
వంద కోట్ల సినిమాలో ఆఫర్.. అంత ఈజీగా ఒప్పుకోనంటున్న నటుడు
కొందరు సినిమా ఛాన్స్ వస్తే చాలనుకుంటారు, మరికొందరు మంచి రోల్ వస్తేనే చేస్తామంటారు. బాలీవుడ్ నటుడు గోవింద రెండో కేటగిరీకి చెందినవాడు. వచ్చిన అవకాశాలన్నీ చేసుకుంటూ పోయే రకం కాదు. చిన్న చిత్రమైనా, పెద్ద సినిమా అయినా తన మనసుకు నచ్చితేనే అందులో నటిస్తాడు. ఈమాటకు కట్టుబడి నాలుగేళ్లగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను దేన్నీ అంత సులువుగా అంగీకరించను. జనాలేమో నాకు అవకాశాలు రావడం లేదనుకుంటారు. కానీ వినాయకుడి ఆశీర్వాదాలు నాకెప్పుడూ ఉన్నాయి. నాకు ఛాన్సులు వస్తున్నాయి. గతేడాది నేను.. వంద కోట్లతో తెరకెక్కిన ప్రాజెక్టులను రిజెక్ట్ చేశాను. అసలు ఏ సినిమాకూ సంతకం చేయలేదు. దీంతో అద్దం ముందు నిల్చుని నన్ను నేను కొట్టుకున్నాను. నిజానికి వాళ్లు చాలా డబ్బు ఇస్తామన్నారు, కానీ నాకు ఏదిపడితే అది, పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలు చేయడం ఇష్టం లేకపోవడంతో వదిలేసుకున్నాను. ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తాను' అని చెప్పుకొచ్చాడు. కాగా గోవింద 1986లో వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టాడు. 170కు పైగా చిత్రాల్లో నటించాడు. హీరో నెం.1, షోలా ఔర్ షబ్నం, పార్ట్నర్ వంటి అనేక హిట్ చిత్రాల్లో యాక్ట్ చేశాడు. ఈయన చివరగా 2019లో వచ్చిన రంగీలా రాజా సినిమాలో నటించాడు. అప్పటినుంచి మరే చిత్రంలోనూ కనిపించలేదు. చదవండి: 6 ఏళ్ల తర్వాత సడన్‌గా ఫోటోలు లీక్.. అంటే ముందే ప్లాన్.. ఇలాంటి పనులు చేసేముందు ఆలోచించాలి.. రాహుల్ ఫైర్ -
ఆ సినిమా దెబ్బకు ఉన్న ఇల్లు కూడా అమ్మేశా: మహేశ్
బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత మహేష్ కొఠారే మరాఠీ, హిందీలో పలు చిత్రాలను తెరకెక్కించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించిన ఆయన పలు సినిమాలు నిర్మించారు. కొఠారే రాజా ఔర్ రంక్, ఛోటా భాయ్, మేరే లాల్, ఘర్ ఘర్ కి కహానీ వంటి చిత్రాలలో నటించారు. ఆ తర్వాత ధూమ్ ధడకా (1985) సినిమాతో దర్శకత్వం ప్రారంభించారు. అయితే ఆయన తాజాగా తన జీవితంలోని అనుభవాలను వివరిస్తూ ఓ పుస్తకాన్ని రచించారు. గతవారమే ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. తన జీవితంలో ఎదురైన అత్యంత క్లిష్ట పరిస్థితులను మహేశ్ కొఠారి వివరించారు. హిందీ, మరాఠీలో పలు హిట్ చిత్రాలు నిర్మించిన మహేశ్ 'యామ్ ఇట్ ఆనీ బరాచ్ కహి' పేరుతో గతవారం పుస్తకం విడుదల చేశారు. తన జీవితంలోని అత్యంత కష్టతరమైన దశ గురించి పుస్తకంలో వివరించారు. తన 60 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను ప్రస్తావించారు. మహేశ్ పుస్తకంలో వివరిస్తూ..' నేను 1962లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టా. బ్లాక్ అండ్ వైట్ సినిమా, కలర్ వన్, ఇప్పుడు డిజిటల్ సినిమాలు చేశా. నా జీవితంలో చాలా ఎత్తుపల్లాలు చూశా. నాకు చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఆ సమయంలో నేను చాలా అవమానానాలు ఎదుర్కొన్నా. నేను 1999లో లో మైన్ ఆగయా అనే హిందీ సినిమా తీశా. ఈ చిత్రంలో గోవింద మేనల్లుడు విజయ్ ఆనంద్ హీరో. అది నేను చేసిన పెద్ద తప్పు. ఆ సినిమా పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ ప్రభావం నాపై దాదాపు 15 ఏళ్లు కొనసాగింది. ఆ కష్టకాలాన్ని అధిగమించేందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఆ దెబ్బకు మా ఇంటిని కూడా అమ్మేశాం. నా కొడుకు ఎంబీఏ అడ్మిషన్ కోసం ఫీజు చెల్లించలేని పరిస్థితి. కానీ నా పరిస్థితిని కొడుకు అర్థం చేసుకుని డబ్బులు అడగలేదు. కానీ ఈ ప్రభావం నా కుటుంబంపై పడకుండా ఉండేందుకు నేను నా వంతు ప్రయత్నం చేశా.' అని వివరించారు. -
మీ వల్లే నటుడినయ్యా, మీకు పెద్ద ఫ్యాన్‌ను: పాకిస్తాన్ యాక్టర్
దుబాయ్‌లో జరిగిన ఫిలింఫేర్ మిడిల్ ఈస్ట్ అచీవర్స్ నైట్ వేడుకలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ నటుడు ఫహద్ ముస్తఫా బాలీవుడ్ నటుడు గోవిందా కాళ్లు తాకి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. మీరే నా ఇన్స్పిరేషన్ అంటూ ఎమోషనలయ్యాడు. దీంతో గోవిందా వెంటనే అతడిని మనసారా హత్తుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పక్కనే ఉన్న హీరో రణ్వీర్ సింగ్‌తో సైతం ఫహద్ మాట కలిపాడు. ఈ అవార్డుల ఫంక్షన్లో ఫహద్ ముస్తఫా మాట్లాడుతూ.. 'గోవిందా సర్ వల్లే నేను యాక్టింగ్ చేయడం మొదలుపెట్టాను. ఆయనకు నేను పెద్ద అభిమానిని. ఎప్పటికీ ఆ అభిమానం అలాగే ఉంటుంది. మా దేశంలో మీలాగా యాక్టింగ్ చేయాలనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీ ఎదుట వేదికపై నిలబడటం అదృష్టంగా భావిస్తున్నాను. కానీ ఇప్పటికీ ఇదంతా నమ్మలేకపోతున్నాను. రానున్న రోజుల్లో ఇండియా, పాకిస్తాన్ కలిసి పని చేయాలని ఆశిస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by 𝙈𝙖𝙧𝙮𝙖𝙢 𝘽𝙡𝙤𝙜𝙨 (@maryam__blogs4) చదవండి: మహేశ్‌బాబు తప్పు చేశాడా? -
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది బాలీవుడ్ ప్రముఖ సీనియర్ దర్శకుడు ఇస్మాయిల్ ష్రాఫ్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అర్థరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి బి-టౌన్లో విషాదం నెలకొంది. ఆయన మృతిపై బాలీవుడ్ సినీ ప్రముఖులు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. బాలీవుడ్ హీరో, సీనియర్ నటుడు గోవిందా స్పందిస్తూ.. ‘డైరెక్టర్ ఇస్మాయిల్ మరణం నాకెంతో బాధను కలిగిస్తోంది. నా సినీ కెరీర్ ఆయనతోనే మొదలైంది. చదవండి: నిర్మాత నిర్వాకం.. మరో మహిళతో షికారు.. భార్య రెడ్ హ్యండెడ్‌గా పట్టుకోవడంతో.. నా మీద నమ్మకం ఉంచిన మొదటి వ్యక్తి ఆయనే. ఓ సామాన్యుడైన గోవింద్‌ను స్టార్ హీరో గోవిందగా మారటంలో ఇస్మాయిల్ ష్రాఫ్ సార్ ప్రముఖ పాత్ర పోషించారు. దేవుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని కోరుకుంటున్నా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఇస్మాయిల్ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పుట్టారు. బాలీవుడ్ దర్శకుడు భీమ్ సింగ్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత ‘అగర్’ సినిమాతో దర్శకుడిగా మారారు. తోడీసీ బేవఫాయ్, బులంది, అహిస్ట అహిస్ట వంటి హిట్టు సినిమాలకు దర్శకత్వం వహించారు. తన కెరీర్లో దాదాపు 20 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన 2004లో చివరిగా ‘తోడా తుమ్ బద్లో తోడా హమ్’ అనే సినిమా దర్శకుడిగా పనిచేశారు. చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న ‘పొన్నియన్ సెల్వన్’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. -
బాలీవుడ్ నటుడితో పుష్ప భామ స్టెప్పులు.. వీడియో వైరల్
పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా మరోసారి వార్తల్లో నిలిచింది. టాలీవుడ్లో పుష్పతో ఒక్కసారిగా స్టార్డమ్ పొందిన ఈ అమ్మడు బాలీవుడ్‌లోని ఓ టీవీ షోలో తనదైన స్టెప్పులతో అదరగొట్టింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందతో కలిసి కాలు కదిపింది. పుష్ప సినిమాలో సూపర్ హిట్ సాంగ్' రా రా సామీ బంగారు సామీ' అంటూ తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. హిందీలో ప్రసారమవుతున్న సూపర్ మామ్స్-3 షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రోమోలో ఈ అమ్మడు తన స్టెప్పులతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (చదవండి: ఆ రోజు 'గుడ్ బై' చెప్పనున్న రష్మిక మందన్నా!) సూపర్ మామ్స్- 3 గ్రాండ్ ఫినాలేలో రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రోమో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది జీ టీవీ. 15 సెకన్ల వీడియోలో బాలీవుడ్ నటుడు గోవిందతో కలిసి వేదికపై సామీ సామీ స్టెప్పులతో దుమ్ము రేపింది. ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న సూపర్ మామ్స్ గ్రాండ్ ఫినాలే ఫుల్ ఎపిసోడ్లో ఈ బ్యూటీ కనిపించనుంది. ఆమె బాలీవుడ్లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన చిత్రం 'గుడ్‌బై' విడుదలకు సిద్ధమవుతోంది. కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా వరుస సినిమాలు చేస్తూ తగ్గేదే లే అంటోంది. టాలీవుడ్‌తో స్టార్డమ్ సంపాందించుకున్న ఈ అమ్మడు కోలీవుడ్, బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉంది. 'పుష్ప' మూవీతో తెలుగు, తమిళం, హిందీ ఆడియెన్స్‌ల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్లో విజయ్ నటిస్తున్న 'వారీసు' (వారసుడు) చిత్రంలో నటిస్తోంది. అలాగే 'పుష్ప 2'తోపాటు మరికొన్ని హిందీ, కోలీవుడ్ ప్రాజెక్టులు చేస్తోంది. -
కొండమీదరాయా.. గోవిందా
బుక్కరాయసముద్రం: గోవింద నామస్మరణతో బుక్కరాయసముద్రం మార్మోగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం శ్రీదేవి, భూదేవి సమేత కొండమీదరాయుడి దివ్యమంగళరూపం దర్శనంతో పులకించిపోయింది. భక్తుల జయజయ ధ్వానాలు..అర్చకుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ దేవరకొండపై వెలసిన వెంకటరమణుడు భక్తుల చెంతకే చేరేందుకు కొండ దిగిరాగా... బుక్కరాయసముద్రం ఆధ్యాత్మిక సాగరమైంది. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా బుధవారం కొండమీద రాయుని రథోత్సవం రమణీయంగా సాగింది. కమనీయం... కల్యాణం రథోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజాము 4 గంటలకే అర్చకులు బుక్కరాయసముద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో కొండమీదరాయునికి, శ్రీదేవి భూదేవికి కల్యాణ మహోత్సవం జరిపించారు. 10.30 గంటలకు కొండమీదరాయుడిని భూదేవి, శ్రీదేవిని సూర్య ప్రభ వాహనంపై కొలువుదీర్చారు. రథం ముందర బ్రాహ్మణులు హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. 11.30 గంటలకు రథోత్సవం ప్రారంభం కాగా, జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక నుంచి తరలివచ్చిన భక్తులు ‘‘కొండమీదరాయా...గోవిందా’ అంటూ దేవదేవున్ని కీర్తించారు. వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి ప్రారంభమైన రథోత్సవం పాత పంచాయతీ కార్యాలయం వరకూ సాగింది. అనంతరం సాయంత్రం వేళ పాత పంచాయతీ కార్యాలయం నుంచి ప్రారంభమై బ్రాహ్మణవీధి మీదుగా వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం దగ్గరకు చేరింది. అనంతరం భక్తులు గుమ్మడికాయలు, టెంకాయలు కొట్టి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. కొండపై వెలసిన కొండమీద వెంకటరమణస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఆలయ కమిటీవారు, దాతలు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. -
ఇలా పరువు తీసుకోకండి.. నటుడిపై ట్రోలింగ్
కమెడియన్, డైరెక్టర్, నిర్మాత, నటీనటులు, డ్యాన్సర్లు, సింగర్లు.. దాదాపు అందరూ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నవారే. కొద్దోగొప్పో పాపులారిటీ వచ్చిందంటే చాలు సొంతంగా ఛానల్ పెట్టి అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు సెలబ్రిటీలు. అయితే కొన్నిసార్లు వారు చేసే వీడియోలు ఫ్యాన్స్‌కు తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా ఇదే కోవలోకి వచ్చాడు బాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ గోవింద. 'ఆంఖెన్', 'రాజా బాబు', 'కూలీ నంబర్ 1', 'హీరో నంబర్ 1', 'దుల్హె రాజా' సినిమాల్లో నటించి కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోవింద గతేడాది గోవింద రాయల్స్ పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. ఇందులో ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ చేసిన ఆయన తాజాగా మూడో మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశాడు. హల్లో అంటూ సాగే ఈ పాటను పాడింది, డైరెక్ట్ చేసింది ఆయనే కావడం విశేషం. అంతేకాదు, నిషా శర్మతో కలిసి డ్యాన్స్ చేశాడు గోవింద. ఇక ఇది చూసిన జనాలు ఇదేందయ్యా ఇది అని ఉలిక్కిపడుతున్నారు. ఈ పిచ్చిపాటలతో మమ్మల్ని చంపుకుతినొద్దంటూ ట్రోల్ చేస్తున్నారు. 'అతడి యాక్టింగ్‌కు పెద్ద ఫ్యాన్‌ను.. కానీ ఇలాంటి పిచ్చిపిచ్చి కంటెంట్‌తో వస్తుంటే చిరాకేస్తోంది. సైకియాట్రిస్ట్‌కు చూపిస్తే మంచిదేమో..', 'నిన్ను నువ్వు ఆత్మపరిశీలన చేసుకో.. జనాలు ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. మీరింకా మంచి పాత్రలు చేయాలనుకుంటున్నారు', 'ఇలా పరువు తీసుకోకుండా మీరు రిటైర్మెంట్ తీసుకోవచ్చు కదా, మీ ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికే సిగ్గుపడేలా చేస్తున్నారు', 'ఇది 2022, ఇంకా 90లో ఉండకండి' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం 'మీ డ్యాన్స్ అదిరిపోయింది సర్', 'లెజెండ్ ఎప్పటికీ లెజెండే' అంటూ పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. -
ఆయన్ని చూసి రణ్వీర్ సింగ్ కంటతడి.. దేవుడంటూ ఎమోషనల్
Ranveer Singh Breaks Down Tears After Met Govinda: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ మాజీ క్రికెటర్ హర్యానా హరికేన్ కపిల్ దేవ్ పాత్రలో మెప్పించి ఆకట్టుకుంటున్న చిత్రం '83'. 1983 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అశేష ప్రేక్షాదరణ పొందుతుంది. ముఖ్యంగా కపిల్ దేవ్లా డిట్టు దింపేసినా రణ్వీర్ సింగ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రణ్వీర్ సింగ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇటీవల కలర్స్ అందిస్తున్న 'ది బిగ్ పిక్చర్' రియాలిటీ షోను హోస్ట్ చేశాడు రణ్వీర్. ఈ షోకు హాజరైన ప్రముఖ నటుడు గోవిందాను చూసి ఉద్వేగానికి లోనయ్యాడు రణ్వీర్ సింగ్. తర్వాత రణ్వీర్ను ఓదార్చాడు గోవిందా. ఈ షోలో ప్రేక్షకులకు గోవిందాను పరిచయం చేస్తూ 'ఈ శుభ దినాన నా దేవుడే మిమ్మల్ని కలవడానికి వస్తున్నాడు. ది వన్ అండ్ ఓన్లీ , హీరో నెంబర్ వన్ గోవిందా' అంటూ స్టేజిపైకి ఆహ్వానించాడు. అనంతరం రణ్వీర్ సింగ్.. గోవిందా కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. రణ్వీర్ సింగ్ అభిమానాన్ని చూసిన గోవిందా సంతోషపడ్డాడు. తర్వాత వీరిద్దరూ కలిసి ఇష్క్ హై సుహానా, యూపీ వాలా తుమ్కా వంటి గోవిందా హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేసి సందడి చేశారు. ఈ పోగ్రామ్‌లో గోవిందా భార్య సునీత, కుమార్తె టీనా, కుమారుడు యశ్వర్ధన్ అహుజా వీడియో కాల్ ద్వారా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) ఇదీ చదవండి: 83 చిత్రంపై రజనీ కాంత్ రియాక్షన్.. పొగడ్తలతో బౌండరీలు -
భార్యకు కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన నటుడు
Actor Govinda Gifted Costly BMW Car To His Wife Sunith Ahuja On Karwa Chauth: బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద ఆయన భార్య సునీత ఆహుజాకు ఓ బహుమతి ఇచ్చాడు. కర్వాచౌత్ పండుగ వేడుకలో భాగంగా సతీమణికి ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కానుకగా అందించాడు. ఈ మేరకు భార్యకు గిఫ్ట్‌గా ఇచ్చిన బీఎండబ్ల్యూ కారుతో దిగిన ఫొటోను షేర్ చేశాడు. ఈ సందర్భంగా.. ‘నా ప్రాణ స్నేహితురాలు.. నా జీవిత భాగస్వామి. నా ఇద్దరు అందమైన పిల్లలకు తల్లి.. నీపై నాకున్న ప్రేమ వెలకట్టలేనిది. అయినా కర్వాచౌత్‌ను పురస్కరించుకుని ఒక చిన్న బహుమతిని అందిస్తున్నాను’ అంటూ తన ప్రేమను ఈ చిన్న గిఫ్ట్‌లో చూడమంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశాడు గోవింద. కాగా ఆయనతో పాటు పలువురు బాలీవుడ్ సినీ సెలబ్రెటీలు కూడా కర్వాచౌత్ పండుగను జరుపుకున్న ఫొటోలను షేర్ చేశారు. అందులో బిగ్‌బి అమితాబ్ బచ్చన్, శిల్పా శెట్టి, వరుణ్ ధావన్, పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, మీరా కపూర్, కమెడియన్ కపిల్ శర్మ ఇతర నటీనటులు ఈ పండగ సెలబ్రెషన్స్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Govinda (@govinda_herono1) కర్వాచౌత్ అనగా.. ప్రతి ఏటా దీపావళికి పది రోజులు ముందు ఈ పండగ వస్తుంది. ఈ పండగను దక్షిణ భారతంలో కంటే ఉత్తర భారతదేశ ప్రజలు ఎక్కువగా జరపుకుంటారు. కర్వాచౌత్‌ను పురస్కరించుకుని మహిళలు తమ జీవిత భాగస్వామి, కుటుంబ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఉపవాస దీక్షకు పూనుకుంటారు. అలాగే భర్త కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని, కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ రోజంతా మహిళలు ఏం తినకుండా ఉపవాసం ఉంటారు. పెళ్లికాని అమ్మాయిలు కూడా మంచి భర్త రావాలని పూజలు చేస్తారు. అలా ఏడాదిలో రెండు రోజులు కర్వాచౌత్ పండగను జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 24, 25 తేదీల్లో ఉత్తరాది మహిళలంత కర్వాచౌత్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) -
అది అఫైర్ కాదు, ఆమె మీద నాకున్న ప్రేమ!
గోవిందా మనసారా ఇష్టపడ్డ అమ్మాయి నీలమ్. కానీ సునీతతో జీవితాన్ని పంచుకోవాల్సి వచ్చింది. ఆమెతో పెళ్లయిన ఏడాదికి గానీ ఆ విషయాన్ని నీలమ్‌తో చెప్పలేదు గోవిందా. ‘నేను చేసింది తప్పే. సునీతతో పెళ్లి విషయం నేను నీలమ్‌కు చెప్పి ఉండాల్సింది’ అని తప్పు ఒప్పుకుంటాడు గోవిందా. అయితే నీలమ్‌ను ఇష్టపడ్డం, పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పేం లేదు అనీ అంటాడు. ‘అవును.. నీలమ్ అంటే నాకు చచ్చేంత ఇష్టం. సునీతతో నిశ్చితార్థాన్ని తెంచుకునైనా నీలమ్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నాకెలాంటి అమ్మాయి భార్యగా రావాలని కోరుకున్నానో అలాంటి అమ్మాయే నీలమ్. అలాగని సునీతను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు.. పెట్టను. భర్తగా నా బాధ్యతనెప్పుడూ విస్మరించలేదు. నీలమ్ మీద ఇష్టమూ చావలేదు. ఇప్పటికీ ఆమె ఎక్కడ కనపడ్డా నా గుండె లయ తప్పుతుంది. కానీ ఎందుకో నీలమే నాతో సినిమాలు చేయడం మానేసింది. బహుశా అదే డాన్స్, అదే డైలాగ్ డెలివరీ తనకు బోర్ కొట్టి ఉండొచ్చు. తనతో మళ్లీ సినిమాలు చేయాలనుంది’ అని చెప్పాడు గోవిందా ఒక ఇంటర్వ్యూలో. ఇంకో మాటా గట్టిగా చెప్పాడు.. ‘దయచేసి మాది అఫైర్ అని కామెంట్ చేయొద్దు. అది అఫైర్ కాదు.. నీలమ్ మీద నాకున్న ప్రేమ’ అని. గోవిందా పెళ్లి విషయం తనకు తెలిసినప్పటి నుంచి అతనితో స్నేహాన్నే కాదు.. సినిమాలనూ మానేసింది. అలాగని గోవిందా పట్ల ఎన్నడూ కోపాన్ని, దురుసుతనాన్నీ ప్రదర్శించలేదు. బహుశా.. తను ఆ వ్యవహారాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదేమో అంటారు నీలమ్ సన్నిహితులు. ఆమె సినిమాల్లో రాణించాలనే లక్ష్యం వల్లా అది నిర్లక్ష్యం అయిండొచ్చు అంటారు. నీలమ్ కూడా ప్రేమలో పడింది. బాబీ డియోల్‌తో. అతనూ నీలమ్‌ను మనసులో నింపుకున్నాడు. ఆ ప్రేమను పెళ్లితో భద్రం చేసుకోవాలనీ అనుకున్నాడు. నీలమ్, బాబీ కలసి తిరుగుతున్నారు అన్న విషయం మొదట్లో ధర్మేంద్రకు తెలిసినా ఇండస్ట్రీలో అది మామూలే అని ఊరుకున్నాడ్లు. కానీ ఎప్పుడైతే కొడుకు ఆలోచన పెళ్లి దాకా వెళ్లిందని తెలిసిందో అప్పుడు సీరియస్ అయ్యాడు ఆ తండ్రి. నీలమ్ అంటే ఇష్టం లేక కాదు.. సినిమా హీరోయిన్లు తనింటి కోడళ్లుగా రావడం ఇష్టంలేక. ఆ మాటే బాబీ డియోల్కూ చెప్పాడు ధర్మేంద్ర. హతాశుడయ్యాడు బాబీ డియోల్. ఆ విషయంలో తండ్రిది మొండిపట్టే అని సన్నీ కూడా చూచాయగా మందలించాడు. అందుకు సన్నీ జీవితమే పెద్ద ఉదాహరణ. సినిమాల్లోకి వచ్చి అలాంటి ఆకర్షణలకు లోనవుతాడని తెలిసే పెళ్లి చేశాకే సన్నీని వెండితెర మీదకు తెచ్చాడు. తండ్రి ఆ ఆచరణంతా బాబీకి తెలియందేం కాదు. తండ్రి కోసం నీలమ్‌ను వదులుకోవాలనీ లేదు. తండ్రి తత్వం తెలిసీ మొండి పట్టూ పట్టలేదు. భారమైన హృదయంతోనే ఒకరోజు నీలమ్‌ను కలిశాడు బాబీ డియోల్. తండ్రికి, తనకు మధ్య జరిగిన చర్చ గురించి చెప్పాడు. మొత్తం సీన్ అర్థమైపోయింది ఆమెకు. అందుకే ఎదురు ప్రశ్నలేం వేయకుండానే ‘సరే.. ఇక్కడితో ఆపేద్దాం’ అంది. ఆ మాట అంటున్నప్పుడు నీలమ్ కళ్లల్లో నిండిన నీళ్లు బాబీ దృష్టి దాటి పోలేదు. నిస్సహాయంగా ఇద్దరూ గుడ్ బై చెప్పుకున్నారు అయిదేళ్ల ఆ అనుబంధానికి. వదంతులు.. చెక్ ఆ ఇద్దరి బ్రేకప్ మీద చాలా వదంతులు ప్రచారమయ్యాయి. ఒకసారి నీలమ్ స్టార్‌డస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ వదంతులకు చెక్ పెట్టింది. ‘వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడ్డం నాకిష్టం ఉండదు. నా లవ్ అండ్ బ్రేకప్ గురించి వస్తున్న రూమర్స్ వింటూంటే నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడక తప్పట్లేదు. నాకు, బాబీకి బ్రేకప్ అయిన మాట నిజమే. అయితే పూజాభట్ ఇన్వాల్వ్మెంట్ వల్లే మా బ్రేకప్ అయిందన్నది శుద్ధ అబద్ధం. పూజానే కాదు ఇంకే అమ్మాయి వల్లా మా బ్రేకప్ కాలేదు. మా పరస్పర అవగాహనతోనే విడిపోయాం’ అంటూ స్పష్టం చేసింది. ‘సెపరేషన్ బాధాకరమే. దాదాపు ఎమోషన్స్‌కి సర్జరీ చేసినట్టే. ఒక ఎమోషన్‌ను తీసేసి ఇంకో ఎమోషన్‌ను అనుభవించడమే. చుట్టూ ఆరోగ్యకర వాతావరణం ఉంటే ఆ గాయం నుంచి త్వరగా కోలుకోగలం. అయితే ఆ విడిపోవడం, ఎడబాటు నిజాయితీగా జరిగితేనే త్వరగా కోలుకోగలుతాం. మా బ్రేకప్ అలాంటిదే. విడిపోవాలని ఒక్కసారి నిర్ణయించుకున్నాక వెనక్కి తిరిగి ఆలోచించలేదు. కన్నీళ్లు పెట్టలేదు. ముందుకే వెళ్లాను’ అని బ్రేకప్ తర్వాత తన మానసిక స్థితినీ వివరించింది నీలమ్. తర్వాత.. బ్యాంకాక్‌కు చెందిన రిషి సేథియా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. కాని ఆ బంధం ఎన్నాళ్లో నిలువలేదు. ఆ విడాకుల తర్వాత జ్యుయెలరీ డిజైన్ మీద మనసు పెట్టింది. ఓ వైపు ఈ కొత్త వృత్తి ఇంకోవైపు సినిమాలతో బిజీగా ఉంటున్న టైమ్‌లోనే నటుడు సమీర్ సోనీతో స్నేహం కుదిరింది. ప్రేమగా మారింది. పెళ్లీ చేసుకుంది. ఒక అమ్మాయి (ఆహనా)ని దత్తత కూడా తీసుకుంది ఆ జంట. ‘కదిలిపోయిన గతం పట్ల రిగ్రెట్స్ లేవు. వర్థమానమంతా సంతోషమే. భవిష్యత్ గురించి బెంగలేదు’ అంటుంది నీలమ్. - ఎస్సార్ చదవండి: ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న గోవిందా -
ఆమెను చూడగానే మతి పోయింది: నటుడి లవ్ స్టోరీ
డాన్స్.. మాస్ అప్పీల్‌తో దేశమంతా అభిమానులను సంపాదించుకున్న నటుడు గోవిందా.. పసితనం వీడని మోము..నాజూకు మేనితో తెరమీద మెరిసిపోయిన అందాల నటి.. నీలం. మేకప్ తీసేశాక నటించడం మరిచిపోయే గోవిందా అంటే గౌరవం పెంచుకుంది ఆమె. స్థాయీభేదాల్లేకుండా మనిషిని మనిషిగానే చూసే నీలం వ్యక్తిత్వాన్ని ఇష్టపడ్డాడు అతను. అది వన్‌సైడ్ లవ్‌గా గోవిందా మనసులోనే ఉండిపోయి.. విఫల్యగాథగా మిగిలిపోయింది. అది ఎలా మొదలైందంటే... గోవిందా, నీలం జంటగా నటించిన తొలి సినిమా ‘ఇల్జామ్’. వీళ్లద్దరూ మొదటిసారి కలిసింది ప్రాణ్‌లాల్ మెహతా ఆఫీస్ (ముంబై)లో. గోవిందాను చూడగానే నవ్వుతూ ‘హలో’ అంది నీలం. బదులు చెప్పడానికి గోవిందా భయపడ్డాడు. న్యూనతగా ఫీలయ్యాడు. ఎందుకూ? ‘నా ఇంగ్లిష్ విని ఆమె నవ్వుకుంటుందేమోనని’ చెప్పాడు గోవిందా ఓ ఇంటర్వ్యూలో. ‘ఆమె ఫారిన్ రిటర్డ్న్ (హాంకాంగ్‌లో పుట్టిపెరిగింది). నేను శుద్ధ దేశీ.. పక్కా మాస్. ఆమెను చూడగానే నా మతి పోయింది. ఆ రోజు నాకింకా గుర్తు.. వైట్ డ్రెస్.. జడకాని, పోనీ కాని వేయకుండా అలా వదిలేసిన లాంగ్ హెయిర్‌తో నాకు దేవకన్యలా కనిపించింది. అంతకుముందే ఆమె యాక్ట్ చేసిన ‘జవానీ’ చూశాను. ఒక్కసారి కాదు ఎన్నిసార్లో.. కేవలం నీలం కోసమే చూశా. మర్యాదకు పోతపోసినట్టుంటుంది’ అంటూ నీలంను తలచుకున్నాడు గోవిందా అదే ఇంటర్వ్యూలో. ఇల్జామ్ విడుదలైంది. భిన్న నేపథ్యాలు, పెంపకాల గ్యాప్‌ను అధిగమించి వాళ్ల మధ్య స్నేహం కుదురుకుంది. తనకున్న హాస్య చతురతనూ బయటపెట్టేంత చనువు సాధించాడు గోవిందా.. నీలం దగ్గర. షూటింగ్లో ఏ కొంచెం టైమ్ దొరికినా తన జోక్స్‌తో తెగ నవ్వించేవాడు ఆమెను. ఆ నవ్వును చూస్తూ తన ఒత్తిడిని మరిచిపోయేవాడు. ప్రశాంతతలో మైమరిచిపోయేవాడు. ఎప్పుడూ అలా నీలం సాంగత్యంలోనే ఉంటే బాగుండు అనే భావన ప్రారంభమైంది అతనిలో. అది ప్రేమ అనీ అర్థమైంది. ఆ భావం మెదలగానే గోవిందా ఒక్కసారిగా అలెర్ట్ అయ్యేవాడు. సునీత కారణం.. అప్పటికే అతని జీవితంలో సునీత ఉంది. భార్యగా కాదు.. చిన్ననాటి స్నేహితురాలిగా.. కాబోయే జీవిత భాగస్వామిగా. నిశ్చితార్థం అయింది. గోవిందా, నీలం కాంబినేషన్లో మరిన్ని సినిమాలు సెట్స్ మీదకు వచ్చాయి. కొన్ని థియేటర్లకూ వెళ్లి మంచి కలెక్షన్స్ తెచ్చిపెడ్తున్నాయి. ప్రేక్షకుల్లోనూ బెస్ట్ పెయిర్ అనే పేరు వచ్చింది ఈ జంటకు. షూటింగ్స్ లేకపోయినా నీలంను కలవసాగాడు గోవిందా. ఆమె గురించి తెలుసుకున్న కొద్దీ ఆమె మీద ప్రేమ, గౌరవం పెరగసాగాయి అతనికి. ‘ఆమె స్ట్రెంత్ ఆఫ్ క్యారెక్టర్ ఎలాంటిదంటే.. నన్నూ చాలా మార్చేసింది. ఆమెను చూసిన ఏ మగవాడైనా ఇలాంటి స్త్రీ తన జీవితభాగస్వామి అయితే బాగుండని అనుకునేంత గ్రేట్ ఉమన్ నీలం’ అంటాడు గోవిందా. ‘నేనూ అనుకున్నాను జీవితమంతా ఆమె చేయిపట్టుకొని నడవాలని’ అని నిట్టూరుస్తాడు. అమ్మ వద్దంది.. నీలం అతని మీద ఎంత ప్రభావం చూపిందంటే గోవిందా.. సునీతను నీలంలా మారమని పోరు పెట్టేంతగా. వినీవినీ విసిగివేసారిపోయిన సునీత ఒకసారి ‘నేను నేనులా ఉండడాన్ని చూసే నన్ను ఇష్టపడ్డావన్న నిజాన్ని మరిచిపోయావా?’అంటూ హెచ్చరించిందట. అయినా తన మనసులోంచి నీలంను తప్పించలేకపోయాడు గోవిందా. ఇంట్లో వాళ్లతో ఎప్పుడూ నీలం గురించిన కబుర్లే... ‘నీలం అలా.. నీలం ఇలా.. నీలం ఇలా అంది.. అలా చూసింది.. నీలం .. నీలం’ అంటూ. ఒకసారి ఆమెను ఇంటికి పిలిచి ఇంటిల్లిపాదికీ పరిచయం చేశాడు. గోవిందా వాళ్ల నాన్న ఆమెలోని వినయానికి ముచ్చటపడ్డాడు. ‘నిశ్చితార్థం మరిచిపో.. ఈ అమ్మాయినే పెళ్లి చేసుకో’ అని సలహా కూడా ఇచ్చాడట. కానీ.. గోవిందా వాళ్లమ్మకు తండ్రీకొడుకుల తీరు నచ్చలేదు. కొడుకు నీలం మీద పెంచుకుంటున్న ప్రేమను మొగ్గలోనే తుంచేయాలనుకుంది. సమయం చూసి గోవిందాకు చెప్పింది.. ‘పెళ్లి చేసుకుంటానని సునీతకు మాటిచ్చావ్. నీలంతో ఈ వ్యవహారం ఏంటీ? మాట తప్పకు. సునీత మనసు కష్టపెట్టకు. ఆ అమ్మాయి కంటతడి పెడితే నేను ఊరుకోను. ఈ జన్మకు సునీతే నీ భార్య. నీలంతో నీ హద్దుల్లో నువ్వుండు’ అంటూ. అమ్మ మాట నెమ్మదిగానే ఉన్నా ఆ స్వరంలోని తీవ్రతను గ్రహించాడు గోవిందా. ‘అప్పుడు అనుకున్నాను సునీతకు మాటిచ్చి తప్పు చేశాను అని. నిజానికి ఆమెతో రిలేషన్ అంత సీరియస్‌గా ఉంటుందని.. పెళ్లిదాకా వస్తుందని ఊహించలేదు. జస్ట్ క్యాజువల్ ఫ్రెండ్షిప్గా మొదలైంది అంతే’ అంటూ కన్ఫెస్ చేశాడు గోవిందా. పెళ్లి.. నీలం మాత్రం తన కెరీర్‌కే ప్రాధాన్యం ఇచ్చింది. నంబర్ వన్ హీరోయిన్ కావాలన్నదే ఆమె లక్ష్యం. ఆ దిశగానే ఆమె ప్రయాణం ఉండింది. పెళ్లి గురించి గోవిందా ఎప్పుడు టాపిక్ తెచ్చినా పెద్దగా నవ్వేసేదట. అనుకున్నట్టుగానే నీలం కెరీర్ మలుపు తిరిగింది. సన్నీ డియోల్, మిథున్ చక్రవర్తి, చుంకీ పాండే వంటి హీరోల పక్కనా అవకాశాలు వచ్చాయి. గోవిందాలో అసూయ పుట్టింది. అది అణిగివున్న ఆత్మన్యూనతను ఉనికిలోకి తెచ్చింది. ఈలోపు గోవిందా వాళ్లమ్మ ఒత్తిడీ పెంచింది సునీతతో పెళ్లి గురించి. ఒప్పుకోక తప్పలేదు గోవిందాకు. చాలా నిరాడంబరంగా గుడిలో సునీతను పెళ్లి చేసేసుకున్నాడు కనీసం నీలంకూ సమాచారమివ్వకుండా. (తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే మార్చి 14న వచ్చే ఫండేలో తెలుసుకోండి) చదవండి: సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన టాలీవుడ్ దర్శకుడు ఓర చూపుతో చంపేస్తున్న రష్మీ.. మైండ్ బ్లాక్ చేస్తున్న కాజల్ -
16 పాటలు రాశావా గోవిందా.. ఏంటో అవి?!
ఒకప్పటి బాలీవుడ్ హీరో గోవింద తెగ నవ్విస్తాడు... అనేదాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ‘ఆయన పాటలు ఏమైనా రాస్తాడా?’ అనే కొచ్చెనుకు మాత్రం డౌట్ల మీద డౌట్లు వస్తాయి. పాటలకు డ్యాన్స్‌లు చేసే హీరో పాటలెందుకు రాస్తాడు? మరీ అంతగా అయితే పాటలు పాడుతాడు గానీ....అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇటీవల ఒక రియాల్టీ షోకు గెస్ట్‌గా వచ్చాడు గోవింద. ఆ షోలో 90’లలో తన సినిమాలలోని హిట్‌సాంగ్స్‌ను సింగర్స్ గానం చేస్తున్నప్పుడు గోవింద గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోవడమే కాదు... ‘నేను పీక్ స్టేజీలో ఉన్నప్పుడు 15–16 హిట్‌సాంగ్స్ స్వయంగా రాశాను’ అని చెప్పాడు. అప్పట్లో బాగా పాపులర్ అయిన ‘దీవాన మస్తానా’ అనే డైలాగ్ కూడా ఆయన రాసినదేనట. ఇంతకీ ఆ 16 సాంగ్స్ ఏమిటంటారు? కాస్త పరిశోధించాల్సిందే సుమీ! చదవండి: ఆ సినిమాలు, వెబ్ సిరీస్‌లన్నీ నెట్‌ఫ్లిక్స్‌లోనే! -
అందుకే నేను నెపో-కిడ్ కాదు: టీనా
ముంబై: బి-టౌన్లో స్టార్ కిడ్స్ హవా ఎక్కువ. అందుకే బాలీవుడ్‌ను నెపోటిజానికి కేరాఫ్‌గా చెబుతుంటారు. తల్లిదండ్రుల సపోర్టుతో సినిమాల్లోకి వచ్చి స్టార్స్‌గా ఎదిగిన అలియా భట్, రణ్‌బిర్ కపూర్, జాన్వి కపూర్, వరుణ్ దావన్, అర్జున్ కపూర్ తదితరులను టాలీవుడ్ నెపో-కిడ్స్(నెపోటిజం)గా పిలుస్తుంటారు. అయితే వీరిలో ప్రముఖ సినీయర్ నటుడు, హీరో గోవిందా గారాల పట్టి, హీరోయిన్ టీనా అహుజా పేరు మాత్రం వినిపించదు. దీనిపై ఆమె ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడారు. తాను ఎప్పుడూ నెపో-కిడ్ని కాదని, ఎందుకంటే తన సినిమాలను ప్రమోట్ చేయాలని ఆమె తండ్రి(గోవిందా) ఎప్పుడూ ఏ నిర్మాతను కోరలేదని వెల్లడించారు. మీ తండ్రి ఎప్పుడైన మీకు సినిమాల్లో సహాయం చేశారా? అని అడగ్గా ఆమె ‘ఎప్పుడు చేయలేదు. ఒకవేళ అలా చేసుంటే ఇప్పటికే నేను 30 నుంచి 40 సినిమాలకు సంతకం చేసేదాన్ని. కానీ ఆయన నాకు ఎప్పుడు సాయం చేయలేదు. నేను కూడా ఆయనను ఎప్పుడు అడగలేదు. ఒకవేళ నాకు అవసరమని భావించి ఆయనను అడిగేతే.. సహాయం చేయడానికి ఆయన సిద్దంగా ఉన్నారు. కానీ నెపో-కిడ్‌గా ముద్ర వేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నా సొంత గుర్తింపుతోనే సినిమా అవకాశాలు పొందాను. అయితే నేను ఏం చేస్తున్నాను, నా నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే రిపొర్టులను మాత్రం ఆయన పరిశీలిస్తూంటారు. అలా అని నా ప్రతి విషయంలో ఆయన జోక్యం చేసుకుంటారని కాదు. సినిమాల ఎంపికలో నా సొంత నిర్ణయాలను నాకే వదిలేస్తారు. అందుకే ఆయన నన్ను సినిమాల్లో ప్రమోట్ చేయమని ఇప్పటి వరకూ ఏ నిర్మాతను అడగలేదు. అందుకే నాకు నెపో-కిడ్(నెపోటిజం) అనే పేరు రాలేదు’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా టీనా అహుజా 2015 స్మిప్ కాంగ్ దర్శకత్వంలో వచ్చిన 'సెకండ్ హ్యాండ్ హస్బెండ్'లో హీరోయిన్గా నటించి బాలీవుడ్ అరంగేట్రం చేశారు. (చదవండి: ఆ రెండు లేకుండానే పెళ్లి: ఎందుకో చెప్పిన దియా) (నటుడి ఆత్మహత్య: భార్య, అత్తపై ఎఫ్ఐఆర్) -
గోవిందా కుమారుడికి కారు ప్రమాదం
ముంబై: బాలీవుడ్ నటుడు గోవింద కుమారుడు యశ్వర్ధన్ ఇటీవల ముంబైలోని జుహులో కారు ప్రమాదానికి గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కారులో యశ్వర్ధన్తో పాటు అతడి డ్రైవర్ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 2వ తేదీ రాత్రి ఓ పార్టీ నుంచి తిరిగి వెళ్తుండగా జూహు వద్ద యశ్‌రాజ్ ఫిలింస్ (వైఆర్ఎఫ్)కు చెందిన ఫ్యార్చ్యున్ కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని జూహు పొలీసులు తెలిపారు. (ఇది అన్యాయం) కాగా ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో సంఘటన స్థలంలోనే ఇరువర్గాలు చర్చించుకుని పరిష్కరించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గోవింద, సునీతా అహుజాకు కూమార్తె టీనా, కుమారుడు యశ్వవర్థన్‌లు ఉన్నారు. కాగా గోవింద 2018లో విడుదలైన ‘ఫ్రైడే’, ‘రంగీలా రాజా’ చిత్రాలలో నటించారు. అలాగే పలు టీవీ కార్యక్రమాల్లో అతిథిగా పాల్గొన్నారు. -
అందుకే అవతార్ ఆఫర్ తిరస్కరించా!!
ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన హాలీవుడ్ విజువల్ వండర్ అవతార్ సినిమాకు టైటిల్‌ను తానే సూచించానంటున్నాడు బాలీవుడ్ నటుడు గోవిందా. తనకు ఆ సినిమాలో ఆఫర్ వచ్చినప్పటికీ తిరస్కరించానని పేర్కొన్నాడు. పండోరా గ్రహంలోని వింత జీవులు మానవులతో చేసిన పోరాటాలు నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇంతటి భారీ చిత్రంలో నటించాలని దర్శకుడు కోరినప్పటికీ ఆ సినిమాకు సైన్ చేయలేదన్నాడు గోవిందా . మంగళవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ...‘ జేమ్స్ కామెరూన్‌కు అవతార్ టైటిల్‌ను నేనే సూచించా. కానీ అందులో ఆఫర్‌ను తిరస్కరించా. ఈ సినిమా కచ్చితంగా హిట్టవుతుందని జేమ్స్ కామెరూన్‌కు ముందే చెప్పా. అయితే విజువల్ వండర్ తెరకెక్కాలంటే సుమారు ఏడేళ్లు పడుతుందని అనగానే తనకు కోపం వచ్చింది. ఎవరూ చూడని ప్రపంచాన్ని చూపిస్తానని చెప్పి ఏలియన్స్‌తో సినిమా తీశాడు. సినిమా కోసం 410 రోజులు షూటింగ్ చేయాల్సి ఉంటుంది అన్నాడు. అయితే ఒంటి నిండా రంగులు పూసుకుని అన్ని రోజులు నేను ఉండలేను కాబట్టి నన్ను క్షమించాలని కోరాను’ అని వ్యాఖ్యానించాడు. కాగా అవతార్ బ్యాక్ ఇన్ 2012 అనే పేరుతో గోవిందా, సన్నీ డియోల్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కింది. అయితే ఆ సినిమా కనీస ప్రచారానికి కూడా నోచుకోలేదు. ఈ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వద్దామనుకున్న గోవిందాకు చేదు అనుభవమే మిగిలింది. ఈ క్రమంలో గోవిందా మాత్రం అవతార్ టైటిల్‌ను తానే సూచించానని చెప్పడంపై ప్రస్తుతం జోకులు పేలుతున్నాయి. ఇక జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన అవతార్ 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అవతార్ తొలి సీక్వెల్ అవతార్ 2 2021 డిసెంబర్ 17న ఈ సినిమా రిలీజ్ అవుతుందంటూ అవతార్ టీం ఇటీవలే ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ముందుగా ఈ సినిమా సీక్వెల్ 2020 డిసెంబర్లోనే రిలీజ్ అవుతుందని భావించినా నిర్మాణం ఆలస్యం కావటంతో ఏడాది పాడు వాయిదా పడింది. 3,4,5 భాగాలను కూడా రెండేళ్ల విరామంతో వరుసగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
‘మా ఇద్దరినీ అంతం చేయాలని చూస్తున్నారు’
గ్లామరస్ మాఫియా కారణంగానే తమ సినిమాకు థియేటర్లు దొరకలేదని, అందుకే పరాజయం చవిచూడాల్సి వచ్చిందని బాలీవుడ్ మూవీ ‘రంగీలా రాజా’ నిర్మాత, సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) మాజీ చైర్మన్ పహ్లజ్ నిహలానీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘ సెన్సార్ బోర్డు చైర్మన్‌గా ఉన్న సమయంలో కఠినంగా వ్యవహరించినందు వల్లే కొంతమంది నన్ను టార్గెట్ చేశారు. నా కారణంగా హీరో గోవిందాను ఇబ్బంది పెడుతున్నారు. నన్ను, గోవిందాను అంతం చేయాలని చూస్తున్న ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలుసు. ఇండస్ట్రీ మొత్తం కొంతమంది చేతుల్లో చిక్కుకుపోయింది. కార్పోరైటేజషన్ పేరుతో నా వంటి నిర్మాతలను అణగదొక్కాలని చూస్తున్నారు. అయినా భయపడేది లేదు. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధిస్తా’ అని వ్యాఖ్యానించారు. ఇక ఈ విషయం గురించి మాట్లాడిన గోవిందా.. ‘ గత తొమ్మిదేళ్లుగా పరిస్థితి ఇలాగే ఉంది. నా సినిమాలకు థియేటర్లు దొరకకుండా కొంతమంది అడ్డుతగులుతున్నారు. నేనేమీ రాజకీయాల్లో లేనుకదా. దయచేసి నా పనిని సక్రమంగా చేసుకోనివ్వండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా గోవిందా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రంగీలా రాజా’ సినిమా శుక్రవారం విడుదలైంది. -
నన్ను టార్గెట్ చేయొద్దు
హిందీ నటుడు గోవింద సుపరిచితమే. డిఫరెంట్ మ్యానరిజమ్, సరికొత్త డ్యాన్స్ స్టెప్స్‌తో ఆకట్టుకున్నారు ఆయన. ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లినా మళ్లీ యాక్టర్‌గా బిజీ అయ్యారు. ఆయన లేటెస్ట్గా నటించిన చిత్రం ‘రంగీలా రాజా’. ఈ చిత్రానికి సెన్సార్ బృందం 20 కట్స్ చెప్పిందట. దాంతో సెన్సార్ బృందం తన సినిమాలను కావాలనే టార్గెట్ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోవింద. ‘‘నా సినిమాలు థియేటర్ వరకూ వెళ్లడం ఇబ్బంది అవుతోంది. ఇప్పుడనే కాదు. తొమ్మిది సంవత్సరాలుగా నా సినిమాలను టార్గెట్ చేస్తున్నారు. నేను రాజకీయాలకు దూరంగానే ఉంటున్నాను. కొంతమంది నా సినిమాలను అడ్డుకుంటున్నారు. నేనేం తప్పు చేశానో తెలియడంలేదు. ఎవరు టార్గెట్ చేసినా నేను వెనక్కి తగ్గను. నా పని నేను చేసుకుంటూనే వెళ్తాను. దయచేసి నాకు పని చేసుకోవడానికి ఓ ప్లాట్‌ఫామ్ కల్పించండి’’ అని పేర్కొన్నారు గోవింద. -
మరోసారి దుమ్మురేపిన డ్యాన్సింగ్ అంకుల్
మీకు డ్యాన్సింగ్ అంకుల్ గుర్తున్నారా? గోవిందా హిట్ సాంగ్ అయిన 'ఆప్కే ఆ జానేసే' పాటకు డ్యాన్స్ చేసి ఒక్కసారిగా దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. అదిరిపోయే స్టెప్పులతో రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యారు సంజీవ్ శ్రీవాస్తవ. ఆయన డ్యాన్స్ వైరల్‌గా మారి.. సెలబ్రిటీని చేసింది. తాజాగా ఆయన మళ్లీ వార్తల్లోకి వచ్చారు. మరోసారి తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి అందరిని అదరగొట్టాడు. 1988లో రిలీజ్ అయిన 'జీతే హై హమ్ షాన్' సినిమాలో మితున్ చక్రవర్తి నటించిన 'జూలీ జూలీ' పాటకు స్టెప్పులేసి అందరిని ఆకట్టుకున్నారు సంజీవ్. ఇటీవల ఓ పెళ్లికి హాజరైన ఆయన వేసిన ఈ డ్యాన్స్ సోషల్ మీడియాలో మరోమారు వైరల్ అయింది. చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘డ్యాన్సింగ్ అంకుల్ ఈజ్ బ్యాక్’ అంటూ ప్రశంసిస్తున్నారు. ‘డాన్సింగ్ అంకుల్’గా పేరు తెచుకున్న ఈ విదిషా ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మెచ్చుకోవడమే కాక విదిషా మున్సిపల్ కార్పొరేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి అంకుల్... ఇరగదీశావ్ పో! -
డ్యాన్సింగ్ అంకుల్ ఈజ్ బ్యాక్
-
అభిమాన నటున్ని కలిసిన డాన్సింగ్ అంకుల్
డాన్సింగ్ వీడియోతో ఇంటర్నెట్లో సంచలనం సృష్టించి, ఏకంగా ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు ‘డాన్సింగ్ అంకుల్’ సంజీవ్ శ్రీవాస్తవ. ఇతనికి హీరో గోవిందా అంటే ఎంత అభిమానమో తెలిసిందే. శ్రీవాస్తవ తన అభిమాన హీరో గోవిందాను అనుకరిస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయము తెలిసిందే. శ్రీవాస్తవ చేసిన డాన్స్‌కు గోవిందా కూడా ఫిదా అయ్యాడు. ఫోన్ చేసి మరి శ్రీవాస్తవను అభినందించడమే కాక కలుస్తానని కూడా మాటిచ్చాడు. ఆ ప్రామిస్‌ను నెరవేర్చడానికి మాధురి దీక్షిత్ డాన్స్ రియాలిటీ షో ‘డాన్స్ దివానే’ కార్యక్రమం అందుకు వేదికయ్యింది. ఈ షోలో గోవిందా ‘డాన్సింగ్ అంకుల్’ కలవడమే కాక అతనితో పాటు కాలు కదిపి ప్రేక్షకులను అలరించాడు. ‘డాన్స్ దివానే షో’ ద్వారా మాధురి దీక్షిత్‌తో కూడా డాన్స్ చేసే అవకాశం లభించింది ‘డాన్సింగ్ అంకుల్’కు. ఈ షోలో మాధురి కూడా శ్రీవాస్తవ, గోవిందాలతో పాటు డాన్స్ చేసింది. ‘డాన్సింగ్ అంకుల్’గా పేరు తెచుకున్న ఈ విదిషా ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మెచ్చుకోవడమే కాక విదిషా మున్సిపల్ కార్పొరేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. -
‘సంచలన’ అభిమానిని చూసి హీరో షాక్!
లండన్/విదిషా: డాన్సింగ్ వీడియోతో ఇంటర్నెట్లో సంచలనం సృష్టించి, ఏకంగా ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ కూడా అయిపోయిన తన వీరాభిమాని, ‘డాన్సింగ్ అంకుల్’ సంజీవ్ శ్రీవాస్తవకు హీరో గోవిందా సందేశం పంపాడు. ఓ స్నేహితుడు పంపిన ఆ డాన్సింగ్ వీడియో చూసి చిన్నపాటి షాక్‌కు గురయ్యానని, ఒకరు మనల్ని అనుకరించడం ఎంతైనా ఆనందించాల్సిన విషయమేనని వెటరన్ హీరో అన్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆయన ‘ఇండియా టుడే’ వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు. మీ భార్య కూడా కాలుకదపడం చాలా బాగుంది: ‘‘ ఏదో డాన్స్ చేస్తున్నట్లు కాకుండా పూర్తిగా లీనమై స్టెప్పులు వేశారు. తెలియకుండానే నన్ను అనుకరించారు. నిజంగా ఎవరైనా మనల్ని అనుకరిస్తుంటే అంతకంటే సంతోషం ఏముంటుంది? ఈ సందర్భంగా సంజీవ్ శ్రీవాస్తవ గారికి నా సందేశమిదే.. ‘మీరు డాన్స చేసిన విధానం, ఎంజాయ్ చేసిన తీరు నిజంగా ఆనందింపజేసేలా ఉన్నాయి. కూడా మీ భార్య సైతం స్టెప్స్ వేయడం చాలా బాగుంది. ఎప్పటికీ మీరు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా..’’ అని గోవిందా అన్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం: ‘డాన్సింగ్ అంకుల్’గా ఇంటర్నెట్లో సంచలనం సృష్టించిన విదిషా వాసి, ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దగ్గర్నుంచి పెద్దపెద్ద సెలబ్రిటీలంతా పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. డాన్స్‌లో గోవిందానే తనకు ప్రేరణ అని చెప్పుకున్న సంజీవ్ని.. విదిషా మున్సిపల్ కార్పొరేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
అంకుల్ డాన్స్..సోషల్ మీడియాలో హల్ చల్!
-
అంకుల్... ఇరగదీశావ్ పో!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏదైనా హల్ చల్ చేస్తుందంటే చాలూ.. అది వార్తగా మారిపోతోంది. తాజాగా ఇండియన్ అంకుల్ డాన్స్ వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. 40 ఏళ్లు పైబడిన ఓ వ్యక్తి ఏదో వేడుకలో స్టేజీపై వేసిన స్టెప్పులకు ఇప్పుడు అంతా ముగ్ధులైపోతున్నారు. జితేంద్ర, శతృఘ్నసిన్హా, గోవిందా కాంబోలో వచ్చిన ఖుద్గర్జ్(1987) చిత్రంలోని ‘ఆప్ కే ఆ జానే సే...’ పాటకు ఆ వ్యక్తి డాన్స్ చేశాడు. అచ్చం గోవిందాను ఇమిటేట్ చేస్తూ అతను చేసిన డాన్సింగ్ మూమెంట్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. పక్కన ఉన్న ఆంటీ మాత్రం పాపం ఆయన్ని అలా చూస్తూ ఉండిపోయింది. మ్యాజిక్ స్టెప్పులకు పేరున్న గోవిందనే తలదన్నెలా స్టెప్పులేశారంటూ ఆ అంకుల్‌పై అంతా ప్రశంసలు గుప్పిస్తున్నారు. సెలబ్రిటీల దగ్గరి నుంచి సామాన్యుల దాకా దాదాపు ప్రతీ ఒక్కరూ ఈ వీడియోను సర్క్యూలేట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ గత రెండు రోజులుగా వాట్సాప్, ఫేస్బుక్.. ఇలా ఏ ఫోన్లలో ఎక్కడ చూసినా ఈ అంకుల్ సందండే. కానీ, ఇది ఎక్కడ జరిగింది? అసలా అంకుల్ ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది. అఫ్కోర్స్ అది బయటపడటానికి కూడా పెద్దగా సమయం పట్టకపోవచ్చు. -
మాల్యాపై బయోపిక్ టైటిల్ ఏంటంటే..
సాక్షి, న్యూఢిల్లీ : బయోపిక్‌ల హవా నడుస్తున్న క్రమంలో పలువురి జీవితాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. తాజాగా లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్టు సీబీఎఫ్సీ మాజీ చీఫ్ పహ్లాజ్ నిహ్లానీ వెల్లడించారు. విజయ్ మాల్యా పాత్రను ప్రముఖ నటుడు గోవింద పోషిస్తారని చెప్పారు. మాల్యా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తానని, మాల్యాగా గోవింద అలరిస్తాడని చెప్పుకొచ్చారు. సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగుతుందని, దీన్ని స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తానని నిహ్లాని తెలిపారు. ఈ సినిమా టైటిల్ రంగీలా రాజా అని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. 35 ఏళ్ల తర్వాత నిహ్లాని దర్శకత్వంలో గోవింద నటిస్తున్న ఈ మూవీలో ఇప్పటికే ఓ పాటను చిత్రీకరించారని తెలిసింది. విజయ్ మాల్యా బ్యాంకులకు రూ 9000 కోట్ల రుణాల ఎగవేత కేసులో నిందితుడై బ్రిటన్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. మాల్యా అప్పగింతపై ప్రస్తుతం బ్రిటన్ కోర్టులో విచారణ జరుగుతోంది. -
గిరిసీమలో మార్మోగిన గోవిందనామం
-కన్నుల పండువగా శ్రీనివాస కళ్యాణం -రంపచోడవరం వీధుల్లో శోభాయాత్ర రంపచోడవరం : ‘గోవిందా.. హరిగోవిందా..’ అన్న దేవదేవుని నామస్మరణతో రంపచోడవరం మారుమోగింది. అన్నమయ్య సంకీర్తనలు, కోలాటాలు, గిరిజన నృత్యాలు, భజన బృందాలతో స్థానిక పీఎంఆర్సీ నుంచి ఐటీడీఏ, అంబేడ్కర్ సెంటర్ మీదుగా శోభాయాత్ర సాగింది. పవనగిరి వ్యవస్థాపకుడు తణుకు వెంకటరామయ్య యాత్రకు నేతృత్వం వహించారు. నారాయణగిరి వెంకటేశ్వరస్వామి ప్రతిష్ఠ మహోత్సవాలలో భాగంగా ఆరో రోజు ఆదివారం శ్రీనివాసుని కల్యాణం వేదమంత్రాలు, మేళాతాళాల మధ్య ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద కల్యాణం ద్వారకా తిరుమల పండితుల మంత్రాలు, చిలకపాటి విజయయరాఘవచారి వ్యాఖ్యానంతో జరిగింది. ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై కల్యాణ వేదిక వద్దకు భక్తుల కోలాహలం నడుమ తీసుకువచ్చారు. రెండు గంటలు జరిగిన కల్యాణమహోత్సవాన్ని దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు తిలకించారు. తొలుత మంత్రి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ దంపతులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. వారికి దేవాదాయశాఖ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు స్వాగతం పలికారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 108 దేవాలయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ద్వారకా తిరుమల దేవస్థానం ఉప దేవాలయంగా ఇక్కడ వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో భక్తులకు ఉచిత భోజనం సదుపాయం కోసం సీఎంతో చర్చించానున్నట్లు తెలిపారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ గిరిజనులు భక్తిభావంతో మెలగాలని, ఏజెన్సీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. దేవాదాయశాఖ అధికారులు వేంద్ర త్రినాథరావు, హిందూధర్మరక్షణ ట్రస్ట్ చైర్మన్ పీఆర్కే ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు, సర్పంచ్ వై.నిరంజనీదేవి, ఎంపీటీసీ సభ్యురాలు కారుకోడి పూజ, సాదిక్ మాస్టార్ తదితరులు పాల్గొన్నారు. -
రమణీయం.. ప్రహ్లాదవరదుడి రథోత్సవం
– గోవిందా నామస్మరణతో మార్మోగిన అహోబిలం – ఆకట్టుకున్న సాంస్కృతిక, కార్యక్రమాలు ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో శ్రీలక్ష్మీనృసింహుని ర«థోత్సవం రమణీయంగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదో రోజు ఆదివారం దిగువ అహోబిలంలో వెలసిన శ్రీ ప్రహ్లాదవరదస్వామి రథోత్సవం అంగరంగా వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో అహోబిల ప్రాంతం మార్మోగింది. ముందుగా నిత్య పూజల్లో భాగంగా శ్రీ ప్రహ్లదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలతో ముస్తాబు చేసి కొలువుంచారు. అర్చకులు, వేదపండితులు ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈఓ మల్లికార్జునప్రసాదు, ప్రధాన అర్చకులు వేణుగోపాలన్, అర్చకులు ఉత్సవ మూర్తులను పల్లకిలో కొలువుంచి అహోబిల మఠం వద్ద పీఠాధిపతి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం రథం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అప్పటికే వివిధ రకాల పుష్పాలతో అలకంరించిన రథంపై స్వామి, అమ్మవార్లను కొలువుంచారు. అహోబిల మఠం 46వ జియర్ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్, వేదపండితులు, అర్చకులు రథాంగ పూజలు నిర్వహించారు. ఆచార్లు కొబ్బరికాయ సమర్పించి గుమ్మడికాయతో హారతిచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఉత్సవం ఎదుట భక్తి పారవశ్యంతో నిర్వహించిన కోలాటాలు, హరి భజనలు, డప్పుల వాయిద్యాలు, భాజాభజంత్రీల మంగళ వాయిద్యాల మధ్య రథోత్సవం ప్రారంభమైంది. రథంలో విహరిస్తున్న స్వామిని భక్తులు కనులారా దర్శించుకున్నారు. ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్ఐలు, ప్రత్యేక పోలీస్ బలగాలు బందోబస్తు నిర్వహించారు. రథోత్సవంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన నాయకుడు నాని తదితరులు పాల్గొన్నారు. అధికారులకు, ఆయగాళ్లకు సన్మానం రథోత్సవం కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కారకులైన అధికారులు, ఆయగాళ్లను సన్మానించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా పీఠధిపతి శ్రీరంగనాథ యంత్రీంద్రమహాదేశికన్ను ముద్రకర్త వేణుగోపాలణ్ సన్మానించి స్వామివారి ఆశీర్వాదం అందజేశారు. ముద్రకర్తకు పీఠధిపతి ఆశ్వీరాదం అందజేశారు. అనంతరం ముద్రకర్త, మణియార్ సౌమ్యానారన్కు, అర్చకులు, ఈఓ, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ, పంచాయతీ రాజ్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, బోయిలు, భజంత్రీలను పూలమాలలు వేసి, శేషవస్త్రం కప్పి సన్మానించారు. అహోబిలంలో నేడు: అహోబిల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం దిగువ అహోబిలంలో ఉదయం ఉత్సవం, తీర్థవారి చక్రస్నానం, సాయంత్రం ద్వాదశారాధనం, పుష్పయాగం, అనంతరం రాత్రి గరుడోత్సవం, ధ్వజారోహణం కార్యక్రమాలు జరుగుతాయి. -
ఆధ్యాతిక పరవశం
కొనసాగుతున్న అహోబిలేశుడి బ్రహ్మోత్సవం – వేణుగోపాల స్వామి అలంకరణలో దర్శనమిచ్చిన ప్రహ్లాదవరదుడు -తరలివచ్చిన భక్తులు ఆళ్లగడ్డ: అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఎగువ, దిగువ అహోబిల క్షేత్రాలు భక్తుల గోవిందా నామస్మరణ తో మార్మోగాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాదరదస్వామి శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామున నిత్య పూజల్లో భాగంగా సుప్రత సేవతో స్వామిని మేలుకొలిపిన అనంతరం అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. తర్వాత వేణుగాపాలస్వామిగా అలంకరించి వాహనంపై కూరొ్చబెట్టి మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం అభిషేకం నిర్వహించారు. రాత్రి పొన్నచెట్టు వాహనం పై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. -
చిక్కుల్లో పడ్డ హీరో, హీరోయిన్
రాంచీ: బాలీవుడ్ నటులు గోవిందా, శిల్పాశెట్టి చిక్కుల్లో పడ్డారు. 20 ఏళ్ల క్రితం నమోదైన పరువు నష్టం కేసుకు సంబంధించి కోర్టులో హాజరుకావాల్సందిగా జార్ఖండ్‌లోని పాకూర్ కోర్టు ఆదేశించింది. ఈ నెల 18న ఇద్దరూ కోర్టుకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. 1996లో విడుదలైన ఛోటే సర్కార్ సినిమాలో గోవిందా, శిల్పా నటించారు. బిహార్, ఉత్తరప్రదేశ్‌ను కించపరిచేవిధంగా ఈ సినిమాలో ఓ పాటను చిత్రీకరించారని ఆరోపిస్తూ స్థానిక న్యాయవాది ఒకరు కేసు వేశారు. గోవిందా, శిల్పాతో పాటు గాయకులు, దర్శకులపైనా కేసు పెట్టారు. అప్పుడు జార్ఖండ్.. బిహార్‌లో భాగంగా ఉండేది. ఆ తర్వాత జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. కోర్టు గతంలో పలుమార్లు ఆదేశించినా ఎవరూ విచారణకు హాజరుకాలేదు. దీంతో నటీనటులను కోర్టుకు తీసుకురావాల్సిందిగా ముంబై పోలీసులను ఆదేశించింది. -
గోవిందా, దావుద్ మంచి స్నేహితులు: గవర్నర్
లక్నో: తన పై విజయం సాధించడానికి నటుడు గోవిందా అండర్ వరల్డ్ సహాయం తీసుకున్నాడని ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ పేర్కొన్నారు. 1999 నుంచి 2004 వరకు రామ్ నాయక్ కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004 ఎన్నికల్లో ఉత్తర ముంబై లోక్ సభ నియోజకవర్గం నుంచి రామ్ నాయక్(బీజేపీ)పై పోటీ చేసి గోవిందా(కాంగ్రెస్) 11 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఆ ఎన్నికల్లో విజయం సాధించడానికి గోవిందా అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం, బిల్డర్ హితేన్ థాకూర్ల సహాయం తీసుకున్నాడని తాను రాసిన ఓ పుస్తకంలో వెల్లడించారు. తాను ఇటీవల మరాఠీలో రాసిన స్వీయ చరిత్ర చైర్వేతీ, చైర్వేతీ(ముందుకు సాగూ) ఏప్రిల్ 25న ఆవిష్కరించారు. మూడు సార్లు ఎంపీగా గెలుపొందిన తాను ముంబై అభివృద్ధికి ఎంతగానో కృషిచేశానని తెలిపారు. అయినా స్వల్ప ఓట్ల తేడాతో ఆ ఎన్నికల్లో ఓటమి చెందడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోయారు. తన ఓటమికి కారణాలను ఆ పుస్తకంలో ప్రస్తావించారు. గోవిందాకు దావుద్, థాకూర్ మంచి స్నేహితులు అని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో గెలుపొందడానికి వారి సహాయం తీసుకున్నాడని రామ్ నాయక్ ఆరోపించారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న రామ్ నాయక్ ఇలాంటి ఆరోపణలు చేస్తారని తాను ఊహించలేదని గోవిందా అన్నారు.'నన్పు నమ్మి నాకు విజయాన్ని ప్రజలు కట్టబెట్టారు. ఎన్నికల్లో విజయానికి నేనెవరి సహాయం తీసుకోలేదు' అని తన పై వచ్చిన ఆరోపణలపై గోవిందా వివరణ ఇచ్చుకున్నారు. అండర్ వరల్డ్‌కు అమ్ముడుపోయే వారిలా నియోజక వర్గ ప్రజలు కనిపిస్తున్నారా అని రామ్ నాయక్ పై మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలతో ప్రజలను అవమానపరచకండి అన్నారు. -
నా డాన్స్ అలా ఉండదట!
ముంబై: తాను డాన్స్ చేస్తుండగా చూసేవాళ్లంతా డాన్స్ చేస్తున్నట్టుగా అనిపించదని అందరూ అంటుంటారని బాలీవుడ్ నటుడు గోవింద వ్యాఖ్యానించాడు. డాన్స్‌లో తనదైన శైలీలో కొత్తదనాన్ని ప్రదర్శించగల నైపుణ్యం ఉన్న గోవింద.. సినీ పరిశ్రమలో నటుడిగా అద్భుతంగా రాణించాడు. డాన్స్ పట్ల తనకు ఉన్న మక్కువను ప్రస్తావించాడు. కోరియోగ్రాఫర్ సందీప్ సోపార్కర్ నిర్వహించిన '3వ ఇండియా డాన్స్ వీక్' లో పాల్గొన్న సందర్భంగా గోవింద మీడియాతో ముచ్చడించాడు. డాన్స్ చేయడంలో చాలామందికి చాలా రకాల యాంగిల్స్ తెలిసి ఉండొచ్చు. కానీ ఇకముందు డాన్స్ లోనూ కొత్త రూపాలు సంతరించుకోనున్నాయని చెప్పాడు. డాన్స్ చేయడం వల్ల కేవలం ఆరోగ్యమే కాదు.. మంచి వినోదం కూడా. డాన్స్‌లో ప్రదర్శించే యాంగిల్స్‌తో మనం ఎన్నో కొత్త విషయాలను సృష్టించవచ్చనన్నాడు. ప్రపంచంలో అందరూ తొలుత లేవగానే వ్యాయామం చేస్తుంటారు. అయితే ప్రాణాయం అనేది డాన్స్ నుంచే ఉద్భవించిందన్నాడు. స్ట్రీట్ డాన్సర్‌గా తన జీవితాన్ని ప్రారంభించిన గోవింద.. డిస్కో డాన్స్‌లతో దుమ్మురేపి నెంబర్ వన్ హీరో స్థాయికి చేరుకున్నాడు. కాగా, ఇటీవల బాలీవుడ్లో విడుదలైన పలు సినిమాలు 'కిల్ దిల్' హ్యాపీ ఎండింగ్' వంటి చిత్రాల్లో అద్భుతమైన డాన్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. -
చెంప దెబ్బకు అయిదు లక్షలు
ముంబై: బాలీవుడ్ నటుడు గోవింద 2008లో ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించిన కేసు తీర్పును సుప్రీం కోర్టు మంగళవారం వెల్లడించింది. బాధితుడు సంతోష్ రాయ్‌కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ గోవిందాను దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సంతోష్ రాయ్ ని కలిసి ముఖాముఖిగా క్షమాపణ చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం గోవిందాకు రెండు వారాల గడువు ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే... 2008లో ముంబైలోని ఫిల్మిస్థాన్ స్టూడియోస్‌లో 'మనీ హైతో హానీ హై' అనే సినిమా షూటింగ్ సందర్భంగా సంతోష్ రాయ్ అనే వ్యక్తి చెంపను గోవిందా చెళ్లుమనిపించాడు. ఒక పాట చిత్రీకరణ సందర్భంగా అనుమతి లేకుండా స్పాట్ లోకి చొచ్చుకు రావడం, అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆగ్రహంతో గోవిందా అతనిపై చేయి చేసుకున్నట్టు సమాచారం. దీంతో గోవిందా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సంతోష్ రాయ్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ఘటన జరిగిన ఏడాది తర్వాత కేసు నమోదు చేశాడన్న కారణంతో 2013లో హైకోర్టు ఈ కేసును కొట్టి వేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తాను ఐదారు లక్షలను ఖర్చు చేశానని సంతోష్ రాయ్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకు వచ్చాడు. ఈ క్రమంలో ఉన్నత ధర్మాసనం సంతోష్ రాయ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. సంతోష్ రాయ్‌కు క్షమాపణలు చెప్పాలంటూ గోవిందాకు ఆదేశాలు జారీ చేసింది. -
'చెంపదెబ్బ కొట్టినందుకు క్షమాపణలు చెప్పు'
న్యూఢిల్లీ: ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టినందుకు క్షమాపణలు చెప్పాల్సిందిగా సుప్రీంకోర్టు బాలీవుడ్ అగ్ర నటుడు గోవిందాకు సూచించింది. 'మీరు పెద్ద హీరో. పెద్ద హృదయాన్ని కూడా చాటండి' అని గోవిందాకు సలహా ఇచ్చింది. 2008లో తనను చెంపదెబ్బ కొట్టి.. బెదిరించాడని సంతోష్‌రాయ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇదే విషయమై గతంలో ఆయన వేసిన పిటిషన్‌ను బొంబాయి హైకోర్టు కొట్టివేసింది. నేరపూరిత ఉద్దేశంతోనే గోవిందా ఆయనను చెంపదెబ్బ కొట్టాడనటానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. రాయ్‌ను గోవిందా చెంపదెబ్బ కొడుతున్న వీడియోను మొబైల్లో చూసిన ధర్మాసనం.. ఆయనకు గోవిందా క్షమాపణ చెప్పాలని సలహా ఇచ్చింది. సినీతారలు బహిరంగ ప్రదేశాల్లో కొట్లాటలకు దిగకూడదని సూచించింది. రీల్‌లైఫ్‌లో చేసినట్టు ఇష్టం వచ్చినట్టు రియల్‌లైఫ్‌లో చేయడం సరికాదని హితవు పలికింది. 'మేం మీ సినిమాలను చూస్తాం. కానీ మీరు ఎవరినైనా నిజంగా చెంప ఛెళ్లుమనిపిస్తే సహించం' అని జస్టిస్ వీ గోపాల గౌడతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేసింది. -
హర్యానాలో మరో దారుణం
-
హరియాణాలో మరో దారుణం
చండీఘడ్: హరియాణాలో దళిత కుటుంబంపై దాడి, ఇద్దరు చిన్నారుల హత్య మరవకముందే రాష్ట్రంలో మరో దళిత బాలుడి మరణం కలకలం రేపింది. పావురాలు దొంగిలించాడనే నెపంతో విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ మైనర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే గొహనా గ్రామానికి చెందిన గోవింద(14) పై ... యింట్లో పావురాలు ఎత్తుకెళ్లాడని పొరుగువారు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ మరునాడు ఉదయానికి గోవింద శవమై తేలాడు. పోలీస్ స్టేషన్ కు సమీపంలోని బహిరంగ ప్రదేశంలో అతని మృతదేహాన్ని కనుగొన్నారు. కాగా బాలుడు పోలీస్ స్టేషన్ లో ఉరి వేసుకుని చనిపోయినట్లు కేసు నమోదు అయింది. అయితే పోలీసులే తమ కుమారుడిని పొట్టనబెట్టుకున్నారని గోవింద కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడిని విడిచిపెట్టడానికి పదివేల రూపాయల లంచం తీసుకుని, తమ బిడ్డను అన్యాయంగా చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మృతుని బంధువులు నిరసన చేపట్టినా అధికారులెవ్వరూ స్పందించకపోవడంతో తమ ఆందోళనను మరింత ఉదృతం చేశారు. స్థానిక రైల్వేస్టేషన్ పట్టాలపై సుమారు మూడుగంటల పాటు ధర్నా నిర్వహించారు. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్రం అంతరాయం కలిగింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సంబంధిత పోలీసు అధికారులపై హత్యానేరం కింద నమోదు చేశారు. మృతుని సోదరుని ఫిర్యాదుతో ఎస్ఐ, ఎఎస్ఐలు సుభాష్, అశోక్ లపై కేసు నమోదు చేశామని డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. -
'తెరపై తనని చూస్తే ఏడుపు ఆగలేదు'
ముంబయి : తన గారాలపట్టిని వెండితెరపై చూడగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయని బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా చెప్పాడు. ఆ సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఏడ్చేశానన్నాడు. గోవిందా కూతురు టినా అహుజా ఇటీవలే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. సుమీప్ కాంగ్ దర్శకత్వం వహించిన 'సెకండ్ హ్యాండ్ హస్బెండ్' మూవీలో తొలిసారిగా తన కూతుర్ని స్క్రీన్ మీద చూడగానే ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడట. ఇది కలయా.. నిజమా అనే సందేహం వచ్చిందన్నాడు. గిప్పి గ్రేవల్, ధర్మేంద్ర, గీతా బస్రా తదితరులు నటించిన ఈ మూవీ గత జూలైలో విడుదలైన విషయం అందరికి విదితమే. ఇండియా లీడర్ షిప్ ఎన్క్లేవ్ లో భాగంగా ఓ అవార్డును తొలి మూవీకే టినా సాధించినందుకు ఆయన చాలా గర్వపడుతున్నానని ఓ కార్యక్రమంలో చెప్పాడు. తన కుటుంబం టినా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడుతుందన్నాడు. తను మంచి నటిగానే కాదు.. మంచి కూతురుగానూ పేరు నిలుపుకుంటుందని అన్నాడు. ఆమె విజయానికి కుటుంబం ఎప్పుడు తోడుగా ఉంటుందని ఆమె మరిన్ని విజయాలు సాధించాలని సాయిబాబాని ప్రార్థిస్తానన్నాడు. -
లారీ బోల్తా..ముగ్గురికి తీవ్ర గాయాలు
గిద్దలూరు: లారీ బోల్తాపడి కర్ణాటక రాష్ట్రం సింధనూరుకు చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన నగర పంచాయతీ పరిధిలోని ఏసీ గోడౌన్ సమీపంలో నంద్యాల-ఒంగోలు రహదారిపై గురువారం జరిగింది. క్షతగాత్రులు తెలిపిన వివరాల మేరకు కాకినాడలో వరి కోతలు పూర్తి చేసుకుని వరికోత యంత్రాన్ని లారీలో ఎక్కించుకుని నంద్యాలకు వెళ్తుండగా..రంగారెడ్డిపల్లె దాటాక లారీ డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో లారీ అదుపు తప్పి కుడివైపున్న చెట్లను ఢీకొనబోయింది. డ్రైవర్ పక్కనే కూర్చుని ఉన్న యంత్రం ఓనరు హనుమంతు లారీ స్టీరింగ్‌ను ఎడమవైపునకు తిప్పడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈఘటనలో హనుమంతుతో పాటు డ్రైవర్ గోవిందా అధికారి, వరికోత యంత్రం ఆపరేటర్ ఆనంద్ మండల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ఏరియా వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. -
ఈసారైనా లక్ తగులుతుందా?
-
ఎగతాళి చేస్తారనే ఆ సినిమా చేయలేదు
బాలీవుడ్లో గోవిందాకి ఉన్న నిక్‌నేమ్ ఏంటో తెలుసా? ‘లేట్ కమర్’. ఎప్పుడైనా గోవిందా షూటింగ్‌కి తొందరగా వస్తే.. అందరూ ఆశ్చర్యపోయేవాళ్లట. దాన్నిబట్టి దర్శక, నిర్మాతలకు ఆయన ఏ స్థాయిలో చుక్కలు చూపించేవారో అర్థం చేసుకోవచ్చు. ఈ కారణంగానే గోవిందాకు సినిమాలు తగ్గిన దాఖలాలున్నాయి. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆయన నటించిన ‘కిల్ దిల్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గోవిందా మాట్లాడుతూ -‘‘ఒకప్పుడు నేను ఆలస్యంగా షూటింగ్స్‌కి హాజరైన మాట వాస్తవమే. అయితే, అది పొగరుతో చేసింది కాదు. అప్పట్లో ఏ దర్శక, నిర్మాత అడిగినా కాదనలేక, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేవాణ్ణి. ఎక్కువ సినిమాలు ఒప్పుకోవడంతో ఒత్తిడి ఎక్కువై, షూటింగ్‌కి సకాలంలో హాజరు కాలేకపోయేవాణ్ణి’’ అన్నారు. ఇప్పటివరకూ గోవిందా వదులుకున్న చిత్రాల్లో ‘తాళ్’, ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ కూడా ఉన్నాయి. ‘స్లమ్ డాగ్..’ని తిరస్కరించడానికి గల కారణం చెబుతూ -‘‘ఆ టైటిల్ నాకు నచ్చలేదు. టైటిల్ మార్చమని దర్శకుణ్ణి అడిగాను కూడా. అప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నాను. అందుకని ‘స్లమ్ డాగ్ వచ్చాడు’ అని ఎగతాళి చేస్తారనిపించింది. అందుకే, ఆ సినిమా వదులుకున్నా’’ అని చెప్పారు. -
విలన్ పాత్రలో గోవిందా...
-
ప్రేమించాడు 'గోవింద'... పెళ్లంటే గోవిందా...
విజయనగరం (మక్కువ) : ‘ప్రేమించానన్నాడు. ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. కట్నం పేరుతో ఇప్పుడు అడ్డం తిరిగాడు. కట్నం కింద రూ.పది లక్షలు, భూమిని రాసిస్తేనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు’ అంటూ మండల కేంద్రం మక్కువలోని గుళ్లమజ్జివీధికి చెందిన ఉషారాణి వాపోయింది. సోమవారం తన తల్లిదండ్రులు కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను విజయనగరంలో కంప్యూటర్ కోర్సులో కోచింగ్ తీసుకుంటుండగా రామభద్రపురం మండలం తారాపురం గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ తుమరాడ గోవిందతో ఏడాదిన్నర కిందట పరిచయమైందని చెప్పిం ది. గత ఏడాది డిసెంబర్ 8న రైల్వే పరీక్షలను రాసేందుకు విశాఖపట్నంలో వెళ్లగా గోవింద కూడా తనతో వచ్చాడని, అనంతరం విజయనగరం తీసుకెళ్లి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి లొంగదీసుకున్నాడని తెలిపింది. ఈ ఏడాది జూన్ 22న గోవింద తన కుటుంబ సభ్యులను తన ఇంటికి తీసుకొచ్చి నిశ్చితార్థం చేసుకున్నాడని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తన తల్లిదండ్రులు లక్ష రూపాయల అడ్వాన్సు కూడా అందించాని ఉషారాణి తెలిపింది. ఇంతలో గోవింద పెళ్లి ఇష్టం లేదని, నీకన్నా అందమైన అమ్మాయి, కట్నం అధికంగా ఇచ్చే వారు ఉన్నారని వేధించసాగాడని వాపోయింది. రూ.10 లక్షలకట్నం, తన పేరున ఉన్న భూమిని ఇస్తేనే పెళ్లిచేసుకుంటానని వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. గోవిందపై కేసు నమోదు చేయవద్దని, తనతో వివాహం చేస్తే చాలని ఉషారాణి విజ్ఞప్తి చేసింది. ఇదే విషయమై ఈ నెల 4న విజయనగరంలో ఎస్పీ నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చే యగా ఆ సమయంలో ఎస్పీ బయటకు వెళ్లారని తెలిపింది. దీంతో ఈ నెల 18న మళ్లీ గ్రీవెన్స్‌లో ఎస్పీకు ఫిర్యాదు చేయడంతో మక్కువ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని అక్కడ అధికారులు తెలిపినట్లు ఆమె వివరించింది. ఈ నెల 22న మక్కువ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సమస్య వివరించింది. కాగా, సోమవారం సాలూరు సీఐ దేముళ్లు మక్కువ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని విచారణ చేపట్టారు. -
గంగరాజు పాలు గరిటెడైనను...
తెల్లవారగానే పాలకార్డు పుచ్చుకుని పాల బూత్‌కి వెళ్తే పాలు దొరుకుతాయి! కాని ఆ ఇంటికి ఏ కార్డూ తీసుకువెళ్లక్కర్లేదు... అర్ధరాత్రి ఒంటి గంటకైనా సరే ఆ ఇంటికి వెళ్లి తలుపు త డితే చాలు.. పాల వంటి స్వచ్ఛమైన చిరునవ్వుతో తలుపులు తెరుచుకుంటాయి... మనకు కావలసిన కల్తీ లేని పాలు దొరుకుతాయి... మూడు తరాలుగా పాల వ్యాపారాన్ని సేవా దృక్పథంతో నడుపుతూ పాల గంగరాజుగా పేరు పొందారు ఆయన... తరవాతి తరం కూడా అదే పేరుతో అ వ్యాపారాన్ని అందిపుచ్చుకున్నారు. రాజమండ్రి టి.నగర్‌లోని ఆ వీధిలోకి అడుగు పెడుతుండగానే ఆమడ దూరం నుంచే కమ్మటి వాసనలు కమ్ముకు వస్తుంటే... అప్రయత్నంగానే మన కాళ్లు అటువైపు దారి తీస్తాయి. ఆ ఇంటి ముందు బారులు తీరిన జనం కనిపిస్తారు. ఒకరు నెయ్యి కావాలంటే, ఒకరు పాలు కావాలంటారు. ఒకరు పెరుగు కావాలంటే మరొకరు పాలకోవా కావాలంటారు. ఇంతలోనే ఇంకొకరు వచ్చి పూతరేకులు రెడీయేనా అని అడుగుతారు. అడిగిన వాటన్నింటినీ ఆలస్యం చేయకుండా అందజేస్తారు ఆ ఇంటిలోని వాళ్లు. మూడు తరాలుగా అక్కడి ప్రజలకు రుచికరమైన పాలు, పాల పదార్థాలు అందిస్తోంది పాల గంగరాజు డైరీ. తెలుగువారి అభిమాన నటుడు అక్కినేని, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ కూడా గంగరాజు పాలకోవా తిన్నవారే. ఇలా మొదలైంది...: పశ్చిమగోదావరి జిల్లా పశివేదల గ్రామం (1950) లో నిమ్మలపూడి వీరన్న అనే రైతు ఇతర ప్రాంతాల నుంచి పాలు సేకరించి విక్రయించేవారు. కుమారుడు గంగరాజు తన 24వ ఏట వీరన్న ప్రారంభించిన పాల వ్యాపారాన్ని రాజమండ్రి దాకా తీసుకువచ్చారు. అక్కడ అప్పుడప్పుడే విస్తరిస్తున్న హోటళ్లకు... పశివేదల, ఉంగుటూరు పరిసర గ్రామాల నుంచి పాలను సేకరించి రాజమండ్రిలో విక్రయించేవారు. ఆయన పాలు తేకపోతే ఆ రోజు అక్కడి హోటళ్లు ఇంక బందే. ‘‘మా నాన్నగారు అలా పాలు సరఫరా చేస్తుండటంతో ఆయన పేరు పాల గంగరాజుగా మారిపోయింది’’ అంటారు ఆయన తదనంతరం ‘గంగరాజు పాల ఖ్యాతి’ ని దేశ విదేశాలకు వ్యాపింపచేసిన ఆయన కుమారుడు గోవిందు. పాల బండి వచ్చిందంటే...: విజయవాడ నుంచి రాజమండ్రికి ఉదయం పూట ప్యాసింజరు రైలు నడిచేది. ‘‘మా నాన్నగారు రోజూ ఇదే రైలులో పాలను బిందెలతో రాజమండ్రికి తెచ్చేవారు. పశ్చిమగోదావరి నుంచి పాలు అమ్మేందుకుగాను ఇదే రైల్లో మరికొందరు రాజమండ్రి వచ్చేవారు. అందరూ ఆ రైలును పాల బండి అని పిలిచేవారు. మా నాన్నగారు అందులో వుండేవారు. మిగులు పాలతో మొదలైంది వ్యాపారం: పాల సేకరణ పరిమాణం పెంచుతూ పోవడంతో పాలు మిగిలిపోయేవి. దీంతో రాజమండ్రిలో కూడా పాలు అమ్మేవారు గంగరాజు. అలా మా తాతగారు పశివేదలలో ఉండగానే నాన్నగారు రాజమండ్రి ఇన్నీసుపేటలోని త్యాగరాజనగర్‌కు మకాం మార్చారు. తాతగారు పంపిన పాలు హోటళ్లకు పోయగా మిగిలిన పాలను ఇంటి దగ్గర కొన్ని అమ్మి, మరికొన్ని పాలను పెరుగుగా మార్చి విక్రయించేవారు. ’’ అంటూ గతాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటారు గోవిందు. స్వచ్ఛతకు కేరాఫ్ అడ్రస్...: గంగరాజు డైరీలో... పాలు, పెరుగుతోపాటు పాలకోవాకు మంచి డిమాండ్ ఉంది. ఇవే కాకుండా నెయ్యి, వెన్న, పనీరు, పచ్చి కోవా, పూతరేకులు కూడా తయారు చేస్తారు. గంగరాజు పాలకోవా అమెరికా, లండన్, గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారికి సుపరిచితం. ఫోన్లో ఆర్డర్ ఇచ్చి ఆన్లైన్లో డబ్బులు పంపితే వాళ్లు సూచించిన వారికి డెలివరీ ఇస్తారు. ఇదో కుటుంబ పరిశ్రమ: మూడు తరాల ఆ కుటుంబ పరిశ్రమ నేడు గంగరాజు డైరీ అనే వ్యవస్థకు బలమైన పునాదిగా నిలిచింది. ‘‘లీటరు 30 పైసల రేటుతో ప్రారంభమైన మా పాల సేకరణ ఇప్పుడు 52 రూపాయల ధరలో కొనసాగుతోంది’’ అంటూ తమ వ్యాపారం ఎలా అభివృద్ధి చెందిందో చెబుతారు గోవిందు.వీరు తయారుచేసే పాలకోవా విదేశాలలో ఉన్నవారిని సైతం ఆకర్షిస్తోంది. అమ్మ చేతి పాలకోవా... ‘‘ఎన్ని పాలు విక్రయించినా ఇంకా పదిహేను లీటర్ల పాలు మిగిలిపోయేవి. మా అమ్మ సత్యవతి అలా మిగిలిన పాలతో కోవా చేసేవారు. ఇంటి ముందే వాటిని అమ్మేవారు. అమ్మ చేతి ఆ స్వచ్ఛమైన పాలకోవా గంగరాజు డైరీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ విదేశాల్లో ఉండే భారతీయులు కోవాను పోస్టు ద్వారా తెప్పించుకుంటున్నారంటే అది అమ్మ చేసిన కమ్మని పాలకోవా మహిమే!’’ - గోవిందు - దేవళ్ల సూర్యనారాయణమూర్తి, సాక్షి ప్రతినిధి, రాజమండ్రి ఫొటోలు: వీరభగవాన్ తెలగరెడ్డి -
మూడేళ్లలో 30 సినిమాలకు తిరస్కారం!
శతృఘ్న సిన్హా కూతురు సోనాక్షీ సిన్హా, అనిల్‌కపూర్ కుమార్తె సోనమ్‌కపూర్, మహేష్‌భట్ తనయ ఆలియా భట్ల రంగప్రవేశం తర్వాత బాలీవుడ్లో అందరి కళ్లూ నటుడు గోవిందా కూతురు నర్మద రంగప్రవేశంపైనే ఉన్నాయి. ఇదిగో... అదిగో అంటూ గత మూడేళ్లుగా నర్మద అరంగేట్రం గురించి చాలా వార్తలు వచ్చాయి. కానీ, ఇంకా నర్మద తెరపై కనిపించనేలేదు. తను చేసే సినిమాలన్నీ ఓ స్థాయిలో ఉండాలని అనుకుంటోందట నర్మద. అందుకే కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటోందట. ఈ మూడేళ్లల్లో దాదాపు ముప్ఫయ్ సినిమాలు తిరస్కరించిందని నర్మద తల్లి సునీత ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు. దీన్నిబట్టి నర్మద ఎంత శ్రద్ధ వహిస్తోందో ఊహించవచ్చు. తన తండ్రిలానే వినోద ప్రధానంగా సాగే సినిమాల్లో నటించాలనుకుంటోందట నర్మద. పాల మీగడలా తెల్లని తెలుపు రంగులో, మంచి శరీరాకృతితో ఉన్న నర్మద అభినయపరంగా కూడా భేష్ అనిపించుకుంటుందని హిందీ చిత్రసీమవారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరి.. 30 సినిమాలు తిరస్కరించిన నర్మదకు నచ్చే కథ దొరికేదెప్పుడో? తెరపై కనిపించేదెప్పుడో కాలమే చెప్పాలి. -
'ఇండియన్ ప్రిన్సెస్'కు గోవిందా జుహీచావ్లా
-
కృతజ్ఞతతో ఉంటా!
సీనియర్ నటుడు గోవిందా అంటే రణ్‌వీర్‌సింగ్‌కు చెప్పలేనంత అభిమానం. కొన్ని కొన్ని సినిమాల్లో గోవిందా నటనను అనుకరించాడు కూడా. ఈ విషయమై గోవిందా మాట్లాడుతూ అటువంటి యువతరం కథానాయకులపట్ల తాను కృతజ్ఞతతో ఉంటానన్నాడు. తన నృత్యశైలిని అనుకరించడం ఎంతో ఆనందం కలిగిస్తుందన్నాడు. కాగా షాద్ అలీ రూపొందిస్తున్న ‘కిల్ దిల్’ సినిమాలో గోవిందాతో కలసి రణ్వీర్ స్టెప్పులు వేయనున్నాడు. సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన ‘గోలియోంకీ రాస్లీలా రాంలీలా’ సినిమాలో గోవిందా తరహాలోనే రణ్వీర్ నృత్యం చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ తర్వాత జరిగిన పురస్కార ప్రదాన కార్యక్రమంలోనూ గోవిందా మాదిరిగానే నర్తించాడు. యువప్రతిభను ప్రశంసిస్తూ ‘అవును. రాంలీలా సినిమాలో ఇష్కియా డిష్కియా పాటకు రణ్వీర్ వేసిన స్టెప్పులు చూశా. ఎంతో బాగా చేశాడు. పూర్తిగా ఫాంలో ఉన్నాడు. నా శైలి విలువైనదని భావించి దానిని అనుకరించొచ్చని భావించేవారిపట్ల కృతజ్ఞతతో ఉంటా’ అని అన్నాడు. గోవిందా, రణ్వీర్ కాంబినేషన్లో షాద్అలీ త్వరలో ఓ సినిమా తీయనున్నాడు. దీంతో వీరిరువురి స్టెప్పులను అభిమానులు పోల్చిచూసుకునే అవకాశం లభిస్తుందని ‘కిల్ దిల్’ సినిమావర్గాలు వెల్లడించాయి. ఇదిలాఉంచితే గోవిందా ఇటీవల కొద్దిగా బరువు తగ్గాడు. కిల్ దిల్ సినిమాలో గోవిందా తొలిసారిగా ప్రతి నాయకుడి పాత్ర పోషించబోతున్నాడు. ‘ఇది నేను తొలిసారిగా పూర్తిస్థాయిలో నటిస్తున్న ప్రతినాయకుడి పాత్ర. కొన్నేళ్ల క్రితం షికారి సినిమాలో విలన్ పాత్ర పోషించా. అయితే అది చిన పాత్ర మాత్రమే’ అని చెప్పాడు. -
సెమిస్టర్ పద్ధతి రద్దు చేయండి
బళ్లారి అర్బన్, న్యూస్‌లై న్ : ఐటీఐ విద్యార్థులకు ఇబ్బందికరమైన సెమిస్టర్ పద్ధతిని రద్దు చేయకపోతే తీవ్ర ఆందోళన చేస్తామని ఏఐడీఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రమోద్ హెచ్చరించారు. ఆయన గురువారం ఏఐడీవైఓ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఐటీఐ విద్యార్థులతో కలిసి స్థానిక జిల్లాధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీఐ కోర్సులకు ప్రాధాన్యత ఉందని, అయితే ప్రభుత్వం సెమిస్టర్ పద్ధతిని ప్రవేశ పెట్టడం వల్ల భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలు తక్కువగా అవుతాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఐటీఐ కోర్సులలో ఈ సెమిస్టర్ పద్ధతిని అమలుతో గందరగోళం నెలకొందన్నారు. సెమిస్టర్ పద్ధతిలో విద్యార్థులకు బోధించడంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల, గత నవంబర్ నెలలో పాఠ్యాంశాలు (సిలబస్) మార్పు చేయడం వల్ల విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. గతంలో విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేందుకు అనుకూలంగా ఉండేదని, అయితే ఈ సెమిస్టర్ పద్ధతి అమలు చేయడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. 2011లో ఎన్‌సీబీటీ 39వ సమావేశంలో సెమిస్టర్ పద్ధతిని అమలు పరిచేందుకు పాఠ్యంశాల బోధన, పరీక్ష విధానాలు, ప్రయోగశాలలో పరికరాలు సమకూర్చడం వాటిపై సరైన సమాచారం లేకపోవటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. 2013 మార్చి 14న నిపుణులు నిర్వహించిన సమావేశంలో తక్కువ వ్యవధిలో పాఠాల బోధనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. గత ఏడాది ప్రశ్నపత్రం కన్నడలో ముద్రించారు. ఈ ఏడాది ఇంగ్లిష్, హిందీలో తయారు చేయడం వల్ల విద్యార్థులు మరింత ఆందోళన కు గురవుతున్నట్లు చెప్పారు. ఈ ఆందోళనలో ఏఐడీవైఓ జిల్లా ఉపాధ్యక్షుడు రంగయ్య, ఏఐడీఎస్ఓ జిల్లాధ్యక్షుడు గోవింద, జిల్లా కార్యదర్శి ఉమేష్ పాల్గొన్నారు. -
బాలీవుడ్ హీరో గోవిందాపై కేసు కొట్టివేత
బాలీవుడ్ హీరో గోవిందాకు బాంబే హైకోర్టులో ఉపశమనం లభించింది. గోవిందాపై ఐదేళ్ల క్రితం దాఖలైన కేసును న్యాయస్థానం సోమవారం కొట్టేసింది. 2008లో గోవిందా తనను చెంపదెబ్బ కొట్టాడంటూ బాలీవుడ్ వెటరన్ సంతోష్ రాయ్ కేసు పెట్టారు. రాయ్ మొదట ముంబై మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు దాఖలు చేశారు. అయితే తనపై విచారణ జరగకుండా కేసు కొట్టివేయాలని గోవిందా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సుదీర్ఘ కాలం పాటు సాగింది. గోవిందాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలూ లేకపోవడంతో తాజాగా కేసును కొట్టేశారు. -
గోవిందు ఆత్మహత్య చేసుకున్నాడా?
ముదినేపల్లి రూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని చిగురుకోటలో ఈనెల 12న గుబ్బల గోవిందు మృతి చెందిన ఘటనపై నమోదైన కేసు మలుపులు తిరుగుతోంది. ప్రేమించిన యువతి బంధువులే గోవిందును హత్య చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యకేసుగా నమోదు చేసి, ఆ దిశగా దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. విష పదార్థం కారణంగానే గోవిందు మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో డాక్టర్లు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేయవచ్చని భావించిన పోలీసులకు దీంతో నిరాశే ఎదురైంది. రిపోర్టులో పేర్కొన్న విషపదార్థం గుళికలు కావచ్చని భావిస్తున్నారు. ఈ నివేదికపై పలువురిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గోవిందు మృతదేహాన్ని చూసినవారెవరికీ ఇలాంటి అనుమానం రాలేదు. మృతదేహం పడి ఉన్న ప్రదేశంలోనూ, పరిసరాల్లో విష పదార్థం ఏదీ లభ్యం కాలేదు. మృతదేహం నుంచి అలాంటి వాసన రాలేదు. మర్మావయవాలను గాయపరిచినందువల్లే మరణించి ఉంటాడని అందరూ భావించారు. దీనికి తోడు పోలీసు జాగిలాలు సంచరించిన తీరును బట్టి కూడా హత్యగా అనుమానించారు. ఈ కారణాల వల్లనే హత్య కేసుగా పోలీసులు నమోదు చేశారు. ఇందుకు విరుద్ధంగా పోస్టుమార్టం నివేదిక రావడంతో దీనిపై సందేహాలు తలెత్తుతున్నాయి. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కొంతమంది నాయకులు వైద్యులపై ప్రభావం చూపి నివేదికను తారుమారు చేసినట్లు గోవిందు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను పోలీసు వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ముగ్గురు వైద్యుల బృందం పోస్టుమార్టం చేసినందున ఎవరూ ప్రభావితం చేసే అవకాశం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. గోవిందు మృతదేహం వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందే ముందు గోవిందు తాను ప్రేమించిన యువతికి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ఫోన్ ద్వారా సందేశం పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఇది నిజంగా గోవిందు పంపిన సందేశమా? లేక హత్యకు పాల్పడ్డ వ్యక్తులే దానిని పంపి ఉం టారా? అనేది చర్చనీయాంశంగా మారింది. మృతుడి శరీరంలోని భాగాలను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక్కడ నుంచి వచ్చే నివేదిక లో పూర్తి వాస్తవాలు వెలుగు చూస్తాయని భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ అందరూ హత్యగా భావించిన గోవిందు కేసు ఈవిధంగా మలుపు తిరగడం స్థానికంగా తీవ్ర చర్చనీ యాంశమైంది.