ఆధ్యాతిక పరవశం
కొనసాగుతున్న అహోబిలేశుడి బ్రహ్మోత్సవం
– వేణుగోపాల స్వామి అలంకరణలో దర్శనమిచ్చిన ప్రహ్లాదవరదుడు
-తరలివచ్చిన భక్తులు
ఆళ్లగడ్డ: అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఎగువ, దిగువ అహోబిల క్షేత్రాలు భక్తుల గోవిందా నామస్మరణ తో మార్మోగాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాదరదస్వామి శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామున నిత్య పూజల్లో భాగంగా సుప్రత సేవతో స్వామిని మేలుకొలిపిన అనంతరం అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. తర్వాత వేణుగాపాలస్వామిగా అలంకరించి వాహనంపై కూరొ్చబెట్టి మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం అభిషేకం నిర్వహించారు. రాత్రి పొన్నచెట్టు వాహనం పై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు.