
లోక్‌సభ ఎన్నికలు దగ్గరకొస్తున్నకొద్దీ మహారాష్ట్రలో రోజుకో కొత్త అభ్యర్థి పేరు తెరమీదకు వస్తోంది. తాజాగా బాలీవుడ్ నటుడు గోవింద ముంబై నార్త్-వెస్ట్ స్థానం నుంచి శివసేన (ఏక్‌నాథ్ షిండే) టిక్కెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ప్రచారం సాగుతోంది.
నటుడు గోవిందా ఐదు రోజుల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలిశారు. ఈసారి ముంబై వాయువ్య స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ గజానన్ కీర్తికర్‌కు టికెట్ ఇవ్వడానికి షిండే వర్గం సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో గోవిందా ఇక్కడి నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు.
‘హీరో నెం 1’గా ప్రసిద్ధి చెందిన గోవిందా అసలు పేరు గోవింద్ అర్జున్ అహుజా. 2004లో ఆయన కాంగ్రెస్ టిక్కెట్‌పై ఉత్తర ముంబై నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏలో సీట్ల పంపకంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment