mumbai north west
-
‘జైలును తప్పించుకునేందుకే పార్టీ ఫిరాయించాను’
ముంబై: మహారాష్ట్రలోని ముంబై వాయువ్య లోక్‌సభ నియోజకవర్గ శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్, జైలును తప్పించుకునేందుకే తాను శివసేన (యూబీటీ) నుంచి ఫిరాయించానని ప్రకటించి తన పార్టీని ఇరుకున పడేశారు. జోగేశ్వరిలోని సివిక్ ప్లాట్‌లో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి సంబంధించి ఈడీ ఆయనపై పీఎంఎల్ఏ కేసు నమోదు చేసింది.ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరడం మినహా తనకు వేరే మార్గం లేదని ఒక మరాఠీ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీంద్ర వైకర్ పేర్కొన్నారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరేకు అత్యంత విధేయుడిగా రవీంద్ర వైకర్ పేరుగాంచారు. ఉద్ధవ్ థాకరే స్వయంగా వైకర్ నివాసానికి వెళ్లి బుజ్జగించారంటేనే ఆయనకు శివసేన (యూబీటీ) ప్రాధాన్యత ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు.తన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగడంతో రవీంద్ర వైకర్ దిద్దుబాటుకు ప్రయత్నించారు. ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. శివసేన (యూబీటీ) నుండి వైదొలగే ముందు తాను ఉద్ధవ్‌తో మూడు సార్లు సమావేశమయ్యానని, తన ఇబ్బందులను తెలియజేశానని చెప్పారు.కాగా ముంబై నార్త్-వెస్ట్ స్థానంలో శివసేన (యూబీటీ)కి చెందిన అమోల్ కీర్తికర్‌తో వైకర్ పోటీలో ఉన్నారు. అమోల్ తండ్రి కీర్తికర్ ప్రస్తుతం ఇక్కడ సిటింగ్ ఎంపీ. ఈ లోక్‌సభ స్థానానికి ఐదో దశలో మే 20న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
బరిలో ‘హీరో నెం 1’.. అక్కడి నుంచే పోటీ?
లోక్‌సభ ఎన్నికలు దగ్గరకొస్తున్నకొద్దీ మహారాష్ట్రలో రోజుకో కొత్త అభ్యర్థి పేరు తెరమీదకు వస్తోంది. తాజాగా బాలీవుడ్ నటుడు గోవింద ముంబై నార్త్-వెస్ట్ స్థానం నుంచి శివసేన (ఏక్నాథ్ షిండే) టిక్కెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ప్రచారం సాగుతోంది. నటుడు గోవిందా ఐదు రోజుల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలిశారు. ఈసారి ముంబై వాయువ్య స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ గజానన్ కీర్తికర్‌కు టికెట్ ఇవ్వడానికి షిండే వర్గం సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో గోవిందా ఇక్కడి నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. ‘హీరో నెం 1’గా ప్రసిద్ధి చెందిన గోవిందా అసలు పేరు గోవింద్ అర్జున్ అహుజా. 2004లో ఆయన కాంగ్రెస్ టిక్కెట్‌పై ఉత్తర ముంబై నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో సీట్ల పంపకంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. -
ఎన్నికల్లో పోటీ చెయ్యను.. రాహుల్‌కు ప్రియా లేఖ
సాక్షి, ముంబై: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచెయ్యడానికి తనకు ఆసక్తిలేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ ప్రియా దత్ తెలిపారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆదివారం లేఖ రాశారు. పోటీచెయ్యకపోవడానికి తగిన కారణాలను మాత్రం ఆమె లేఖలో వివరించలేదు. గత కొంతకాలంగా రాహుల్ గాంధీ టీమ్‌పై వరుస విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తరువాత సొంత పార్టీ నేతలపైనే ఆమె ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి సునీల్ దత్ కుమారైన ప్రియా.. ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2004, 09 ఎన్నికల్లో విజయం తెలిసిందే. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పూనం మహజన్పై ఆమె ఓటమి పాలైయ్యారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు ప్రియా సొంత సోదరి. ప్రస్తుతం ఆమె ఏఐసీసీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
ఘాటు పచ్చిమిరపకాయ పార్టీ!
ఇక ముంబాయి వీధుల్లో రాప్ వినిపించబోతోంది. రాప్ అంటే నల్లజాతీయుల సంగీతం కాదు. రాష్ట్రీయ ఆమ్ పార్టీ. సంచలన డాన్సర్, రియాల్టీ షో క్వీన్ రాఖీ సావంత్ ఈ పార్టీని పెట్టింది. ఆమె ముంబాయి నార్త్ వెస్ట్ నుంచి లోకసభకు పోటీ చేయబోతున్నారు. 'ఇక నేను రాజకీయ అనాథను కాను. నాకంటూ ఒక పార్టీ ఉంది.' అని ఆమె ప్రకటించారు. అయితే ఆమె మొదలుపెట్టిన పార్టీకి ఆమె ఉపాధ్యక్షురాలు మాత్రమే. అధ్యక్షులెవరన్నది ఇంకా తెలియరాలేదు. ఆమెతోపాటు కొందరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వారి భార్యలు మహిళా విభాగం సభ్యులు. రాప్ పార్టీ ఎన్నికల గుర్తు ఏమిటో తెలుసా. పచ్చి మిరపకాయ. 'మంచి ఘాటుగా ఉంటుంది. నా వ్యక్తిత్వానికి పచ్చిమిరపకాయ సరిగా సరిపోతుంది,' అన్నారు రాఖీ.