ఘాటు పచ్చిమిరపకాయ పార్టీ!
ఇక ముంబాయి వీధుల్లో రాప్ వినిపించబోతోంది. రాప్ అంటే నల్లజాతీయుల సంగీతం కాదు. రాష్ట్రీయ ఆమ్ పార్టీ. సంచలన డాన్సర్, రియాల్టీ షో క్వీన్ రాఖీ సావంత్ ఈ పార్టీని పెట్టింది. ఆమె ముంబాయి నార్త్ వెస్ట్ నుంచి లోకసభకు పోటీ చేయబోతున్నారు.
'ఇక నేను రాజకీయ అనాథను కాను. నాకంటూ ఒక పార్టీ ఉంది.' అని ఆమె ప్రకటించారు. అయితే ఆమె మొదలుపెట్టిన పార్టీకి ఆమె ఉపాధ్యక్షురాలు మాత్రమే. అధ్యక్షులెవరన్నది ఇంకా తెలియరాలేదు. ఆమెతోపాటు కొందరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వారి భార్యలు మహిళా విభాగం సభ్యులు.
రాప్ పార్టీ ఎన్నికల గుర్తు ఏమిటో తెలుసా. పచ్చి మిరపకాయ. 'మంచి ఘాటుగా ఉంటుంది. నా వ్యక్తిత్వానికి పచ్చిమిరపకాయ సరిగా సరిపోతుంది,' అన్నారు రాఖీ.