green chilli
-
పచ్చిమిర్చితో బోలెడు ఆరోగ్యప్రయోజనాలు : కొవ్వును కరిగిస్తుంది కూడా
మన వంటకాల్లో పచ్చిమిర్చి లేదా గ్రీన్ చిల్లీ లేనిదే పని జరగదు. అయితే పచ్చి మిర్చితో కేవలం గూబ గుయ్యిమనే కారం, వంటకు రుచి వస్తుంది అనుకుంటే పొరపాటే. పచ్చిమిర్చితో బోలెడు లాభాలు ఉంటాయంటున్నారు నిపుణులు. రోజూ ఉపయోగిస్తే అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుందట. అవేంటో ఈ కథనంలో చూసేద్దామా! ఆరోగ్యానికి అద్భుతాలు చేసే పోషకాలతో నిండి ఉంటాయి పచ్చి మిరపకాయలు కేవలం 100 గ్రాముల పచ్చిమిర్చిలో 109.1 మిల్లీ గ్రాముల విటమిన్ సీ ఉంటుంది. అంటే రోజులో మనకు కావాల్సిన దానికంటే ఎక్కువే. పొటాషియం కూడా లభిస్తుంది. పచ్చిమర్చి జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంటువ్యాధులతో పోరాడుతుంది. వీటిల్లోని బయోయాక్టివ్ రసాయనం ‘క్యాప్సైసిన్’ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. క్యాప్సైసిన్ అధిక రక్తపోటు , కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మెరుగైన రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించవచ్చు, తద్వారా గుండెపోటు స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.గట్ హెల్త్‌కు మంచిది క్యాప్సైసిన్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉత్పత్తిని ప్రేరేపించి జీర్ణ ఆరోగ్యానికి సహజ నివారణగా చేస్తుంది.బరువు తగ్గడంలో గేమ్-ఛేంజర్‌లా పనిచేస్తుంది. క్యాప్సైసిన్ జీవక్రియను వేగవంతంచేసి కేలరీల బర్న్‌ను ప్రోత్సహిస్తుంది.విటమిన్ సీ, బీటా-కెరోటిన్‌తో నిండిన పచ్చి మిరపకాయ యాంటీఆక్సిడెంట్-రిచ్ ప్రొఫైల్, ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. కేన్సర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. జలుబు , ఫ్లూ నుండి ఉపశమనం కలిగిస్తుందిసహజమైన 'ఫీల్-గుడ్' కెమికల్ పచ్చిమిర్చి. క్యాప్సైసిన్ ఎండార్ఫిన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అధిక విటమిన్ సి మానసిక స్థితిని నియంత్రించే సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను సంశ్లేషణ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.బీటా-కెరోటిన్ శరీరంలో విటమిన్ ఏ గా మార్చి కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందివయస్సు-సంబంధిత కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.పచ్చి మిరపకాయల్లో యాంటీమైక్రోబయల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వివిధ చర్మ వ్యాధుల నివారణలో ప్రభావవంతంగా చేస్తాయి. క్యాప్సైసిన్ మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. చర్మానికి సహజ మెరుపునిస్తుంది.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహం లేదా ప్రీ-డయాబెటిస్ ఉన్న వ్యక్తులు, పచ్చి మిరపకాయలను భోజనంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యమవుతుంది.పచ్చి మిరపకాయలు విటమిన్ సితో నిండి ఉంటాయి.కనుక వి ఇనుము గ్రహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. -
మంట ధరల మంట! టమాటా, పచ్చిమిర్చి చోరీ
డోర్నకల్: అధిక ధర పలుకుతున్న టమాటా, పచ్చిమిర్చి, చామగడ్డలపై దొంగల కళ్లు పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కూరగాయల మార్కెట్లోని పలు దుకాణాల్లో ఇటీవల కూరగాయలు చోరీకి గురవుతున్నాయి. గాంధీసెంటర్లోని కూరగాయల మార్కెట్లో రాత్రి వేళల్లో దుకాణాలకు తాత్కాలిక నెట్ ఏర్పాటు చేస్తారు. మార్కెట్‌కు నైట్‌వాచ్‌మన్ లేకపోవడం, ఇటీవల కూరగాయల ధరలు పెరగడంతో రాత్రి వేళల్లో పలు దుకాణాల్లోని కూరగాయలు చోరీకి గురవుతున్నట్లు వ్యాపారులు గుర్తించారు. బుధవారం ఉదయం కూరగాయల వ్యాపారి లక్పతి తన దుకాణం తెరిచి చూడగా అధిక ధర పలుకుతున్న టమాటా, పచ్చిమిర్చి, చామగడ్డతోపాటు ఇతర కూరగాయలు చోరీ అయినట్టు గుర్తించి లబోదిబోమన్నాడు. కర్ణాటకలో టమాటా పంట చోరీ యశవంతపుర: కాయగూరల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాటా ధరలు కిలో వంద రూపాయలను దాటాయి. దీంతో అందరి కళ్లు ఇప్పుడు టమాటాలపై పడ్డాయి. కర్ణాటకలో హసన్ జిల్లా బేలూరు తాలూకా గోణి సోమనహళ్లి గ్రామంలో టమాటా పంటను దొంగలు ఎత్తుకుపోయారు. మంగళవారం రాత్రి తోటలోకి ప్రవేశించి, దాదాపు 60 సంచుల టమాటాలను కోసుకెళ్లారు. రైతు పొలంలోకి వెళ్లి చూడగా పంట మొత్తం మాయం కావడంతో హళేబీడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోయిన పంట ధర రూ.1.5 లక్షల వరకూ ఉంటుందని తెలిపాడు. టమాటా తోటకు సీసీ కెమెరా రక్షణ కర్ణాటకలోని హావేరి జిల్లా హానగల్ తాలూకా అక్కి ఆలూరు గ్రామంలో రైతు మల్లప్ప తన టమాటా తోటకు సీసీ కెమెరాలతో రక్షణ ఏర్పాటు చేసుకున్నాడు. ధరలు పెరగటంతో దొంగలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉందని, అందుకే జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పాడు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అటువైపు దొంగలు రాకుండా కాపలా కాస్తున్నట్లు తెలిపాడు. -
కూరగాయలు, పండ్ల నిల్వలో విప్లవం.. 2 నెలల వరకు చెక్కు చెదరవు!
పండ్లు, కూరగాయల నిల్వ పద్ధతిలో విప్లవాత్మక మార్పు వచ్చింది. అస్సాంలోని గౌహతి ఐఐటీ శాస్త్రవేత్తలు ఉద్యాన పంటల రైతులకు తీపికబురు చెప్పారు. విస్తృత పరిశోధనల ఫలితంగా సముద్రపు నాచు వంటి సహజ పదార్థాలతో ఓ సేంద్రియ లేపన పదార్థాన్ని ఆవిష్కరించారు. ఈ ద్రావణంలో కూరగాయలు, పండ్లను ముంచి తీసి పక్కన పెడితే సరి. లేదంటే ఈ పదార్థంతో కవరును తయారు చేసి అందులో పండ్లు, కూరగాయలను నిల్వ చేసినా చాలు. వారం, రెండు వారాలు కాదు.. ఏకంగా రెండు నెలల వరకు చెక్కు చెదరకుండా నిల్వ ఉంటాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కుళ్లిపోయిన టమాటోలు, ఉల్లిపాయలు, పండ్లను చెత్తకుప్పల్లో పారబోయాల్సిన దుస్థితికి కాలం చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనిపిస్తోంది. అంతేకాదు.. ‘పచ్చి సరుకు’ కాబట్టి తక్కువ ధరకే తెగనమ్ముకోవాల్సిన దుస్థితి నుంచి ఉద్యాన రైతులు విముక్తి పొందే రోజు కూడా దగ్గర్లోనే ఉందని చెప్పొచ్చు! కూరగాయలు, పండ్లను పొలంలో పండించడానికి రకాన్ని బట్టి 3 నుంచి 12 నెలల సమయం పడుతుంది. ఇంతా కష్టపడి పెంచి చెట్ల నుంచి కోసిన తర్వాత, ప్రజలకు అందించేలోగా, కొద్ది రోజుల్లోనే వడలిపోతుంటాయి. ఇంకొన్ని రోజులైతే కుళ్లి పనికిరాకుండా పోతుంటాయి కూడా. ఈ క్రమంలో ఉద్యాన పంటల రైతులకు, చిరు వ్యాపారులకు తీవ్రనష్టం జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల కూరగాయలు, పండ్లకైతే అత్యధికంగా 20% వరకు నష్టం జరుగుతోంది. ధర మరీ పతనమైతే పారబోయాల్సిన దుస్థితి. ఈ కష్టాల నుంచి రైతులను, వ్యాపారులను గట్టెక్కించే సరికొత్త సేంద్రియ లేపన పదార్థాన్ని గౌహతిలోని ఐఐటీకి చెందిన రసాయన ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్లు, పరిశోధకులు కనుగొన్నారు. తాజాదనాన్ని, పోషకాలను, రంగును, రూపురేఖలను కోల్పోకుండా పండ్లు, కూరగాయలను నిల్వ చేయొచ్చు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు వంటి వాటిని మెత్తబడిపోకుండా, మొలక రాకుండా చూసుకోవచ్చు. ఏకంగా రెండు నెలల వరకూ కాపాడుకోవచ్చని ఐఐటీ నిపుణులు చెబుతున్నారు. సేంద్రియ పదార్థాలతో తయారు చేసిన ఈ లేపనం పూసిన పండ్లు, కూరగాయలను తిన్న వారికి ఎటువంటి హానీ జరగదని శాస్త్రీయ పరీక్షల్లో రుజువైందంటున్నారు. బంగాళాదుంపలు, టొమాటోలు, పచ్చి మిరపకాయలు, స్ట్రాబెర్రీలు, ఖాసీ మాండరిన్ రకం నారింజ పండ్లు, ఆపిల్స్, పైనాపిల్స్, కివీ పండ్లపై ఈ పదార్థాన్ని ఇప్పటికే పరీక్షించి.. వీటిని దాదాపు రెండు నెలల పాటు తాజాగా ఉంచగలిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనా బృందానికి కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ విమల్ కటియార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వైభవ్ వి గౌడ్ మార్గదర్శకత్వం నెరిపారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సస్టైనబుల్ పాలిమర్స్‌కు చెందిన పరిశోధకులు తబ్లీ ఘోష్, కోన మొండల్, మాండవి గోస్వామి, శిఖా శర్మ, సోను కుమార్ విజయవంతంగా పరిశోధనలు నిర్వహించారు. లేపనంలో ఏముంది? డునాలియెల్లా టెర్టియోలెక్టా అనే సముద్రపు నాచు సారానికి పాలీసాకరైడ్లను కలిపి ఈ లేపన పదార్థాన్ని రూపొందించారు. ఈ సముద్రపు నాచు యాంటీఆక్సిడెంట్లతో పాటు.. కెరోటినాయిడ్లు, ప్రోటీన్లు వంటి వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఒమేగా–3 కొవ్వు ఆమ్లంను ఉత్పత్తి చేయడానికి, అదే విధంగా జీవ ఇంధనం ఉత్పత్తికి కూడా ఈ సముద్రపు నాచును ఉపయోగిస్తున్నారు. ఒమేగా–3 కొవ్వు ఆమ్లంను వెలికితీసిన తర్వాత మిగిలే అవశేషాలను వ్యర్థాలుగా భావించి పారేసేవారు. అయితే, గౌహతి ఐఐటి పరిశోధకులు ఈ అవశేషాలను చిటోసాన్ అనే పిండి పదార్థంతో కలిపి లేపన పదార్థాన్ని రూపొందించే పద్ధతిని కనుగొన్నారు. సూక్ష్మక్రిములు, శిలీంధ్రాల నాశని లక్షణాలు కలిగిన ఈ పదార్థాలతో తయారైన లేపన పదార్థం తిన్న వారికి ఎటువంటి నష్టం కలగదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. (క్లిక్: ఇంటి పంట: రూఫ్‌టాప్ పొలం.. 5.7 ఎకరాలు!) ఈ విధంగా తయారు చేసిన లేపన పదార్థంలో మనుషుల ఆరోగ్యానికి మేలు చేసే మెరుగైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఇది 40 డిగ్రీల వరకు వేడికి తట్టుకుంటుంది. లేపనం రాసిన తర్వాత చెదిరిపోకుండా ఉంటుంది. పండ్లు, కూరగాయల్లో నుంచి నీటి ఆవిరి బయటకుపోకుండా అడ్డుకుంటుంది. కాంతిని అడ్డుకునే శక్తి దీనికి ఉందని అనేక పరీక్షల ద్వారా నిర్థారణైందని పరిశోధకులు తెలిపారు. పరిశోధకులు ఈ పూతను జీవ భద్రత కోణంలోనూ పరీక్షించారు. వివిధ జీవ ప్రక్రియల అధ్యయనానికి ప్రయోగశాల ప్రమాణంగా పరిగణించే ‘బిహెచ్కె21 సెల్ లైన్’ ద్వారా పరీక్షించి చూశారు. ఈ లేపన పదార్థం విషపూరితమైనది కాదని, తినదగిన ఆహార ప్యాకేజింగ్ పదార్ధంగా సురక్షితంగా ఉపయోగించవచ్చని పరీక్షల్లో తేలిందన్నారు. (క్లిక్: నెలకు 3 లక్షల రూపాయల జీతం వదిలేసి..) ఈ అధ్యయన ఫలితాలు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ అడ్వాన్సెస్, అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన ‘ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ సహా అనేక ప్రతిష్టాత్మక శాస్త్రీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పండ్లు, కూరగాయల వృథాను అరికట్టడంతో పాటు, రైతుల వెతలను తగ్గించి మంచి ఆదాయాన్నిచ్చే ఈ అద్భుత లేపనం త్వరలోనే అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఆకృతి, రంగు, రుచి, పోషకాలు చెక్కుచెదరవు! భారత వ్యవసాయ పరిశోధనా మండలి అంచనా ప్రకారం 5 నుంచి 16 శాతం పండ్లు, కూరగాయలు కోసిన తర్వాత నిల్వ సామర్థ్యం లేక వృథాగా పాడైపోతున్నాయి. వాస్తవానికి ఈ నష్టం బంగాళాదుంప, ఉల్లిపాయలు, టొమాటో వంటి కొన్ని పంటల్లో కోత అనంతర నష్టం 19% వరకు ఉండొచ్చు. ప్రజలు ఎక్కువగా తినే ఈ కూరగాయల ధర ఆ మేరకు పెరిగిపోతోంది. ఈ లేపన పదార్ధాన్ని పెద్దఎత్తున ఉత్పత్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. 40 డిగ్రీల సెల్షియస్ వరకు కాంతిని, వేడిని, ఉష్ణోగ్రతను ఈ లేపనం చాలా స్థిరంగా తట్టుకుంటుంది. తిన్న వారి ఆరోగ్యానికి ఎటువంటి హానీ జరగదు. సురక్షితమైనది. లేపనం చేసిన పండ్లు, కూరగాయల ఆకృతి, రంగు, రుచి, పోషక విలువలు చెక్కుచెదరదు. ఈ లేపన పదార్థాన్ని నేరుగా కూరగాయలు, పండ్లపై పూయవచ్చు లేదా ఈ పదార్థంతో కవర్‌ను తయారు చేసి కూరగాయలు, పండ్లను అందులో నిల్వ చేయవచ్చు. ఈ రెండు పద్ధతుల్లో ఎలా ఉపయోగించినా కూరగాయలు, పండ్ల నిల్వ సామర్థ్యాన్ని పొడిగించవచ్చు. ఇది సాధారణ ‘డిప్ కోటింగ్ టెక్నిక్’. పెద్దగా ఖర్చు పెట్టకుండానే పంట కోత అనంతరం దిగుబడులను సులభంగా దీర్థకాలం నిల్వ చేసుకోవచ్చు. – ప్రొ. విమల్ కటియార్, అధిపతి, కెమికల్ ఇంజనీరింగ్ విభాగం, ఐఐటి, గౌహతి, vkatiyar@iitg.ac.in -
మండిపోతోన్న పచ్చిమిర్చి.. ధర ఎంత పెరిగిందంటే?
సాక్షి, హైదరాబాద్ : పచ్చి మిర్చి ధర మండిపోతోంది. ప్రధాన మార్కెట్లో వారం రోజుల క్రితం కిలో పచ్చిమిర్చి రూ. 40– 50 ఉండగా.. ప్రస్తుతం రూ.80– 100 పలుకుతోంది. గుడిమల్కాపూర్ బోయిన్‌ల్లి మాదన్నపేట ఎల్బీనగర్ మార్కెట్లతో పాటు రైతు బజార్లకు సైతం సరఫరా బాగా తగ్గింది. దీంతో నగర అవసరాలకు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. శివారు జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో పచ్చిమిర్చి దిగుబడి తగ్గడంతో నగర మార్కెట్ భారీగా దిగుమతులు తగ్గాయి. మరోవైపు తర రాష్ట్రాల నుంచి దిగుమతులు జరగడంతో టాన్స్‌పోర్టు ఖర్చు కూడా ఎక్కువ కావడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెప్పారు. బుధవారం నగరానికి కేవలం 900 క్వింటాళ్ల పచ్చిమిర్చి మాత్రమే రావడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. అదే మాములు రోజుల్లో రోజూ మార్కెట్లకు 1800– 2000 క్వింటాళ్ల పచ్చిమిర్చి దిగుమతి అయ్యేదని హోల్‌సేల్ వ్యాపారులు అంటున్నారు. (క్లిక్: వంట నూనెల సలసల.. 15 రోజుల్లో భారీగా పెరిగిన ధర, ఇలా అయితే కష్టమే!) -
ఇంటిప్స్
అలా చేయడం వల్ల అందు లో నీళ్లన్నీ ఎండిపోయి పచ్చళ్ళు బూజుపట్టకుండా ఎక్కువ కాలం నిలవ ఉంటాయి. ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో కొద్దిగా కిరోసిన్ వేస్తే ఈగలు, దోమలు రావు.ఉడెన్ ఫర్నిచర్‌ను పేపర్‌తో తుడిస్తే పాలిష్ చేసినట్లు మెరుస్తాయి. పేపర్‌తో తుడవడం వల్ల సందుల్లోని దుమ్ము పూర్తిగా వదలదు కాబట్టి ముందుగా మెత్తటి క్లాత్‌తో తుడిచి, తర్వాత పేపర్‌తో తుడవాలి.పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు చేతులకు కొంచెం ఆయిల్ రాసుకుంటే మండకుండా ఉంటాయి. వంటగదిలో అలోవెరా మొక్కను పెట్టుకుంటే మంచిది. చిన్న చిన్న గాయాలు తగిలినపుడు అలోవెరా ఆకును తెంపి ఆ జెల్‌ను గాయమైన చోట రుద్దితే ఉపశమనం కలుగుతుంది. -
పచ్చికారం వంకాయ కూర
క్విక్ ఫుడ్ తయారి సమయం: 30 నిమిషాలు కావలసినవి: వంకాయలు – పావుకిలో (సగానికి మధ్యలో గాట్లు పెట్టాలి) కారం – అర టీ స్పూన్ ఉల్లిపాయ – 1 నూనె – 2 టేబుల్ స్పూన్లు పసుపు – పావు టీ స్పూన్ బెల్లం తురుము – పావు టీ స్పూన్ జీలకర్ర – టీ స్పూన్ స్టఫింగ్ కోసం: పచ్చిమిర్చి – ఆరు కొత్తిమీర – ఒక కట్ట టొమాటోలు – రెండు (చిన్నగా కట్ చేయాలి) అల్లం తురుము–అరటేబుల్ స్పూన్ నువ్వుల పొడి – టీ స్పూన్ పల్లీల పొడి – టీ స్పూన్ ఉప్పు – సరిపడా (పై పదార్థాలన్నీ మిక్సీలో గ్రైండ్ చేసి, గాట్లు పెట్టిన వంకాయల్లో కూరాలి) తయారి: పాత్రలో నూనె వేడయిన తరవాత జీలకర్ర వేసి వేయించిన తరవాత ఉల్లిపాయలు, పసుపు వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. కూరిన వంకాయ ముక్కలు వేసి అయిదు నిమిషాలు కలియబెట్టాలి. అర కప్పు నీరు, బెల్లం తురుము జత చేసి చిన్న మంట మీద పదిహేను నిమిషాలు ఉంచాలి. వంకాయ మిశ్రమం కాస్త దగ్గరగా అయిన తరవాత దింపేయాలి. వేడివేడి అన్నంలోకి నెయ్యి కాంబినేషన్‌తో అందిస్తే రుచిగా ఉంటుంది. -
ఘాటు తగ్గిన పచ్చి మిర్చి
► కిలో రూ.3 కూడా పలకని వైనం ► మార్కెట్లో వదిలి వెళ్లిపోతున్న రైతులు వరంగల్‌సిటీ: వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో ఆదివారం పచ్చి మిర్చి ధర దారుణంగా పడిపోయింది. కిలోకు రూ.3 చొప్పున కూడా ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో రైతులు మార్కెట్లోనే పడేసి వెళ్లిపోయారు. ఒక్కో మిర్చి బస్తా మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు రవాణ ఖర్చు రూ. 25, మిరపకాయలు ఏరడానికి రోజుకు రూ.150 చొప్పున ఖర్చవుతోందని, తీరా మార్కెట్‌కు తీసుకొస్తే కనీస ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కిలోకు రూ.3 కూడా చెల్లించని వ్యాపారులు రిటైల్ వర్తకులకు కిలో రూ.8 చొప్పున అమ్ముతున్నారని చెప్పారు. మిర్చి బస్తాలను ఇంటికి తీసుకెళ్తే మళ్లీ రవాణా ఖర్చులు అవుతాయని, అందుకే మార్కెట్లోనే పడేసి వెళ్తున్నామని తెలిపారు. అయితే, పచ్చి మిర్చికి డిమాండ్ లేకపోవడం వల్లే తాము కొనుగోలు చేయడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. -
పచ్చిమిర్చి సెంచరీ నాటౌట్
హైదరాబాద్: నడి వేసవిలో ఎండలకు తోడు పచ్చిమిర్చి ధర కూడా మండిపోతోంది. వినియోగదారులకు తినకుండానే కంటతడి పెట్టిస్తోంది. ఇప్పటికే కొండెక్కిన నిత్యావసర సరకుల జాబితాలోకి మిర్చి కూడా చేరిపోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా మిర్చి ధర పెరిగింది. కిలో పచ్చిమిర్చి ధర బహిరంగ మార్కెట్లో వంద నుంచి నూటముప్పై రూపాయలు పలుకుతోంది. రైతు బజార్లలో కూడా పావు కిలో మిర్చి ముప్పై రూపాయల వరకు తీసుకుంటున్నారు. మిర్చి లేకుండా ఏ వంట చేయలేని పరిస్థితి ఉండడంతో ధర ఎంతైనా కొనాల్సి వస్తుందని మహిళలు వాపోతున్నారు. దీనిపై సామాన్య, దిగువ మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంద గ్రాములతో సరిపెట్టుకుంటున్నాం గతంలో ప్రతి వారం కూరగాయలు కిలోల చొప్పున, పచ్చిమిర్చి పావు కిలో చొప్పున కొనే వారిమని మహిళలు చెప్పుతున్నారు. కానీ భారీగా పెరిగిన కూరగాయల ధరల వల్ల కూరగాయలు పావు కిలో, పచ్చిమిర్చి వంద గ్రాములతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. రైతులకు కాసుల పంట ఇకా ఎప్పుడూ గిట్టుబాటు ధర రాక అల్లాడే రైతన్నలకు మిర్చి ఈ సారి మెదక్ జిల్లా గంగాపూర్ రైతులకు కాసుల పంట పండించింది. గంగాపూర్ గ్రామంలో 450 కుటుంబాలు 300 ఎకరాల్లో మిర్చి పంట సాగుచేశారు. తీవ్ర ఎండాల కారణంగా బోర్లు అడుగంటినా కొద్ది పాటి నీటితో స్ప్రింక్లర్లు, నీటి గుంతలు, ఫాంపాండ్ల పద్ధతుల ద్వారా పంటలను సాగు చేసి లాభాలను అర్జించారు. మిర్చికి మంచి గిట్టుబాటు ధర వస్తుండటంతో అధిక శాతం మంది రైతులు మిర్చి పంటను సాగు చేస్తున్నారు. గత సంవత్సరం మిర్చికి ధర లేకపోవడంతో కొంత నష్టాలు చూసిన రైతులు ఈ సారి అధిక రేటు వస్తుండటంతో లాభాలను ఆర్జిస్తున్నారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు సమారు 8 వందల బస్తాలు వస్తున్న ఈ మార్కెట్లో రోజుకు రూ. 15 లక్షల వ్యాపారం జరుగుతుండడంతో గ్రామ పంచాయతీకి కూడా మంచి ఆదాయం వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. -
ఘాటు పచ్చిమిరపకాయ పార్టీ!
ఇక ముంబాయి వీధుల్లో రాప్ వినిపించబోతోంది. రాప్ అంటే నల్లజాతీయుల సంగీతం కాదు. రాష్ట్రీయ ఆమ్ పార్టీ. సంచలన డాన్సర్, రియాల్టీ షో క్వీన్ రాఖీ సావంత్ ఈ పార్టీని పెట్టింది. ఆమె ముంబాయి నార్త్ వెస్ట్ నుంచి లోకసభకు పోటీ చేయబోతున్నారు. 'ఇక నేను రాజకీయ అనాథను కాను. నాకంటూ ఒక పార్టీ ఉంది.' అని ఆమె ప్రకటించారు. అయితే ఆమె మొదలుపెట్టిన పార్టీకి ఆమె ఉపాధ్యక్షురాలు మాత్రమే. అధ్యక్షులెవరన్నది ఇంకా తెలియరాలేదు. ఆమెతోపాటు కొందరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వారి భార్యలు మహిళా విభాగం సభ్యులు. రాప్ పార్టీ ఎన్నికల గుర్తు ఏమిటో తెలుసా. పచ్చి మిరపకాయ. 'మంచి ఘాటుగా ఉంటుంది. నా వ్యక్తిత్వానికి పచ్చిమిరపకాయ సరిగా సరిపోతుంది,' అన్నారు రాఖీ.