పచ్చికారం వంకాయ కూర
క్విక్ ఫుడ్
తయారి సమయం: 30 నిమిషాలు
కావలసినవి: వంకాయలు – పావుకిలో (సగానికి మధ్యలో గాట్లు పెట్టాలి) కారం – అర టీ స్పూన్ ఉల్లిపాయ – 1 నూనె – 2 టేబుల్ స్పూన్‌లు పసుపు – పావు టీ స్పూన్ బెల్లం తురుము – పావు టీ స్పూన్ జీలకర్ర – టీ స్పూన్
స్టఫింగ్ కోసం: పచ్చిమిర్చి – ఆరు కొత్తిమీర – ఒక కట్ట టొమాటోలు – రెండు (చిన్నగా కట్ చేయాలి) అల్లం తురుము–అరటేబుల్ స్పూన్ నువ్వుల పొడి – టీ స్పూన్ పల్లీల పొడి – టీ స్పూన్ ఉప్పు – సరిపడా (పై పదార్థాలన్నీ మిక్సీలో గ్రైండ్ చేసి, గాట్లు పెట్టిన వంకాయల్లో కూరాలి)
తయారి: పాత్రలో నూనె వేడయిన తరవాత జీలకర్ర వేసి వేయించిన తరవాత ఉల్లిపాయలు, పసుపు వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. కూరిన వంకాయ ముక్కలు వేసి అయిదు నిమిషాలు కలియబెట్టాలి. అర కప్పు నీరు, బెల్లం తురుము జత చేసి చిన్న మంట మీద పదిహేను నిమిషాలు ఉంచాలి. వంకాయ మిశ్రమం కాస్త దగ్గరగా అయిన తరవాత దింపేయాలి. వేడివేడి అన్నంలోకి నెయ్యి కాంబినేషన్‌తో అందిస్తే రుచిగా ఉంటుంది.