మన వంటకాల్లో పచ్చిమిర్చి లేదా గ్రీన్ చిల్లీ లేనిదే పని జరగదు. అయితే పచ్చి మిర్చితో కేవలం గూబ గుయ్యిమనే కారం, వంటకు రుచి వస్తుంది అనుకుంటే పొరపాటే. పచ్చిమిర్చితో బోలెడు లాభాలు ఉంటాయంటున్నారు నిపుణులు. రోజూ ఉపయోగిస్తే అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుందట. అవేంటో ఈ కథనంలో చూసేద్దామా!
ఆరోగ్యానికి అద్భుతాలు చేసే పోషకాలతో నిండి ఉంటాయి పచ్చి మిరపకాయలు కేవలం 100 గ్రాముల పచ్చిమిర్చిలో 109.1 మిల్లీ గ్రాముల విటమిన్ సీ ఉంటుంది. అంటే రోజులో మనకు కావాల్సిన దానికంటే ఎక్కువే. పొటాషియం కూడా లభిస్తుంది.
పచ్చిమర్చి జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంటువ్యాధులతో పోరాడుతుంది. వీటిల్లోని బయోయాక్టివ్ రసాయనం ‘క్యాప్సైసిన్’ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. క్యాప్సైసిన్ అధిక రక్తపోటు , కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మెరుగైన రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించవచ్చు, తద్వారా గుండెపోటు స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గట్ హెల్త్‌కు మంచిది క్యాప్సైసిన్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉత్పత్తిని ప్రేరేపించి జీర్ణ ఆరోగ్యానికి సహజ నివారణగా చేస్తుంది.
బరువు తగ్గడంలో గేమ్-ఛేంజర్‌లా పనిచేస్తుంది. క్యాప్సైసిన్ జీవక్రియను వేగవంతంచేసి కేలరీల బర్న్‌ను ప్రోత్సహిస్తుంది.
విటమిన్ సీ, బీటా-కెరోటిన్‌తో నిండిన పచ్చి మిరపకాయ యాంటీఆక్సిడెంట్-రిచ్ ప్రొఫైల్, ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. కేన్సర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. జలుబు , ఫ్లూ నుండి ఉపశమనం కలిగిస్తుంది
సహజమైన 'ఫీల్-గుడ్' కెమికల్ పచ్చిమిర్చి. క్యాప్సైసిన్ ఎండార్ఫిన్‌ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అధిక విటమిన్ సి మానసిక స్థితిని నియంత్రించే సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను సంశ్లేషణ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
బీటా-కెరోటిన్ శరీరంలో విటమిన్ ఏ గా మార్చి కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది
వయస్సు-సంబంధిత కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.పచ్చి మిరపకాయల్లో యాంటీమైక్రోబయల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వివిధ చర్మ వ్యాధుల నివారణలో ప్రభావవంతంగా చేస్తాయి. క్యాప్సైసిన్ మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. చర్మానికి సహజ మెరుపునిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహం లేదా ప్రీ-డయాబెటిస్ ఉన్న వ్యక్తులు, పచ్చి మిరపకాయలను భోజనంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యమవుతుంది.
పచ్చి మిరపకాయలు విటమిన్ సితో నిండి ఉంటాయి.కనుక వి ఇనుము గ్రహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment