ఆరోగ్యం కోసం నారింజ పండ్లను తింటాం. తొందరగా శక్తి రావాలంటే ఆరెంజ్ జ్యూస్ తాగుతాం. ఎందుకంటే ఇందులో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఏ విటమిన్, మినరల్, ఫైబర్ కూడా లభిస్తాయి. అలాగే నారింజ్ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకొని సున్నిపిండిలో వాడతాం. హెర్బల్ టీలో కూడా వాడతామని మనకు తెలుసు. కానీ నారింజ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు న్నాయని మీకు తెలుసా? తెలుసుకుందాం రండి!
ఆరెంజ్ పండ్ల మాదిరిగానే, దాని గింజలు కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి మన శరీరాన్ని హైడ్రేటెడ్, తాజాగా ఉంచుతాయి. మొత్తం ఆరోగ్యాన్ని ఇవి మేలు చేస్తాయి. ఆరెంజ్ గింజల్లో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. రోజుకు మనకు కావాల్సిన దాంట్లో 116.2శాతం వీటిల్లో లభిస్తాయట. విటమిన్ సీ ఎక్కువగా తీసుకోవడం వల్ల పెద్దప్రేగు కేన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్,అసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యల నివారణలో ఉపయోగపడతాయి.
ఎనర్జీ బూస్టర్
నారింజ గింజలలో పాల్మిటిక్, ఒలీక్, లినోలిక్ ఆమ్లాలు ఉండటం వల్ల మానవ కణాలలో ఎక్కువ కాలం శక్తిని నిల్వ ఉంచుతుంది. శరీరంలో శక్తి స్థాయిని వేగవంతం చేస్తాయి.
గుండె ఆరోగ్యానికి మంచిది: ఆరెంజ్ గింజల్లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.
జుట్టు: ఆరెంజ్ గింజల నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ నూనెను జుట్టుకు కండీషనర్‌గాపనిచేస్తుంది. నారింజ గింజలలో విటమిన్ సి, బయో-ఫ్లేవనాయిడ్స్‌కు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా దృఢంగా ఉంటుంది. నారింజ గింజలలో ఉండే ఫోలిక్ యాసిడ్ జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. (నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ)
చర్మానికి మెరుపు: వీటిల్లో పుష్కలంగా లభించే విటమిన్ సీ చర్మానికి మేలు చేస్తుంది. సహజమైన మెరుపునిస్తుంది. అంతేకాదు ముడతలు, మచ్చలు తగ్గుతాయి.
కంటి ఆరోగ్యం: వీటిల్లో కెరోటినాయిడ్స్, విటమిన్ ఎ కళ్లలోని శ్లేష్మ పొరలను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వయస్సు-సంబంధిత కండరాల క్షీణతను నివారిస్తుంది.
బీపీ నియంత్రణ: ఆరెంజ్ గింజల్లో విటమిన్ బి6 అధికంగా లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తపోటును అదుపు చేయడంలో కీలక ప్రాత పోషిస్తుంది. (పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం)
కేన్సర్: ఆరెంజ్ గింజలు ప్రతిరోజు తినడం వల్ల చర్మ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయ పడతాయి.
ఇంట్లో చెడువాసన పోవాలంటే
నారింజ గింజల నీటిని, కేక్ ఐసింగ్‌కు వాడతారు. అంతేకాదు సిట్రస్ సువాసన కోసం బాత్‌టబ్‌కు దీని ఆయిల్ వాడవచ్చు. ఇంట్లో అసహ్యకరమైన వాసనను పోగొట్టేందుకు డిఫ్యూజర్ నూనెగా కూడా దీన్ని వినియోగించుకోవచ్చు.
ఆరెంజ్ విత్తనాలను ఎలావాడాలి?
చిరు చేదుగా ఉండే ఆరింజ గింజల నూనె, పొడి రూపంలో వాడుకోవచ్చు. ఇవి మార్కెట్‌లో లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment