మారుతున్న జీవన శైలి రీత్యా అధిక బరువు, ఊబకాయం చాలామందిన వేధిస్తున్న సమస్య. అధిక బరువుతో బాధపడేవారికి ఏ ఆహారం తీసుకోవలన్నా భయంగానే ఉంటుంది. ఇది తింటే ఎన్ని కేలరీల బరువుపెరిగిపోతామో అని ఆందోళనపడుతూ ఉంటారు. అలాంటి వాటిల్లో ఒకటి పెరుగు. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. కొవ్వును కరిగించే గుణాలుంటాయి. జీవక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో వేగంగా బరువు తగ్గుతారు
బరువు తగ్గాలని, ఆహారం తక్కువగా తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. పోషకాలు ఎక్కువగా అందే ఆహారంపై దృష్టి పెట్టాలి. అధిక బరువు తగ్గాలనుకునే వారు పెరుగు తినొచ్చు. పెరుగు తింటే బరువు బాధ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెరుగులో ఉండే క్యాల్షియం శరీరంలోని కొవ్వును తగ్గించి స్లిమ్ గా ఉండేలా చేస్తుంది. పెరుగులోని ప్రొటీన్స్ శరీరానికి కావాల్సిన పోషక విలువలను అందిస్తాయి.
పెరుగులో డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ తినవచ్చు. దీంతో కడుపు నిండి ఉంటుందిన. పోషకాలు అందుతాయి. కీర, పుదీనా కలిపి తీసుకోవచ్చు. అలాగే కప్పు పెరుగుకు నల్ల మిరియాల పొడి కలిపి తీసుకుంటే ఇంకా మంచిది. వేడి చేసినపుడు పెరుగు, చక్కెర కలుపుకొని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు పెరుగు డీహైడ్రేషన్‌నుంచి కాపాడుతుంది. చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది.
ఇలాంటి కొన్ని చిట్కాలతోపాటు రెగ్యులర్ వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంఊ జంక్ ఫుడ్ ,ఆయిలీ ఫుడ్ జోలికి పోకూడదు. ఒత్తిడి లేని జీవనశైలికి అలవాటుపడాలి. సరిపడా నీళ్ళు నిద్రకూడా చాలా అవసరం అనేది గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment