ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీరు, మధ్యాహ్నం పెరుగు, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు ఈ మూడూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతారు. పెరుగు అనేది అన్ని వయసులవారికి మంచి చేస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ లభిస్తుంది. అయితే మీరు పెరుగుతో వేయించిన జీలకర్రపొడి కలుపుకొని తిన్నారా? తద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతుందని మీకు తెలుసా. రండి తెలుసుకుందాం.
జీర్ణక్రియకు మంచిది
పెరుగులో ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థనుమంచిది. ఇందులో ఉండే యాంటీబయాటిక్స్ డయేరియా, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తాయి. అయితే జీలకర్ర కడుపు నొప్పి, వికారం, అజీర్ణం, అతిసారం, అపానవాయువు మొదలైన వాటిని దూరం చేస్తుంది. సో...పెరుగు ,జీలకర్రను కలిపి రైతా లేదా మజ్జిగ రూపంలో తీసుకుంటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కడుపు ఆరోగ్యంగా ఉంటుంది.
రోగనిరోధక శక్తి కోసం
పెరుగులో ప్రోబయోటిక్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా ప్రేగులకు సంబంధించిన అనేక సమస్యలను తొలగిస్తుంది. జీలకర్రలో విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి, రక్తపోటు, గుండెపోటు, వాపు మొదలైన వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. జీలకర్రను పెరుగుతో కలిపి తీసుకుంటే, విటమిన్ సీ పుష్కలంగా అంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది.
చర్మానికి మెరుపు
పెరుగులో జింక్, ఫాస్పరస్, విటమిన్ ఎ మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మానికి మెరుపునిచ్చి జిడ్డు చర్మాన్ని కూడా తొలగిస్తాయి. అదే సమయంలో, విటమిన్ ఇ ,యాంటీఆక్సిడెంట్ లక్షణాలు జీలకర్రలో ఉన్నాయి. ఇవి వృద్ధాప్యాన్ని నివారించడంతో పాటు, కేన్సర్, వాపు, ఇన్ఫెక్షన్ మొదలైన వాటి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. విటమిన్ ఏ, ఇ కూడా అంది, అనేక చర్మ సమస్యలనుంచి రక్షిస్తుంది.
ఊబకాయానికి పరిష్కారం
జీలకర్ర తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. అధిక కొవ్వు మరియు కొలెస్ట్రాల్ ఉన్నవారు వేయించిన జీలకర్రను తీసుకుంటే, సమస్య తొలగిపోతుంది. అలాగే స్థూలకాయాన్ని తొలగించడానికి పెరుగు కూడా మంచి ఎంపిక. శరీరం నుండి అదనపు కొవ్వును తొలగిస్తుంది. రక్తపోటు సమస్యతోనూ పోరాడుతుంది. పెరుగులో ఒక చెంచా వేయించిన జీలకర్ర కలిపి ప్రతిరోజూ తింటే బరువు సులభంగా తగ్గుతారు.
ఆకలిని పెంచుతుంది
పెరుగు ,జీలకర్ర వాడకం ఆకలిని పెంచుతుంది. యోగా, జిమ్, శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసే వారికి ఇది చాలామంది. బాడీబిల్డింగ్ చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. సన్నగా ఉన్నవారు పెరుగు, జీలకర్ర వాడితే ఆకలి పెరుగుతుంది. కాస్త ఒళ్లు చేస్తారు.
కంటి ఆరోగ్యానికి
పెరుగులో,జీలకర్రలో నూ విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. పెరుగు, జీలకర్రను కలిపి తీసుకుంటే, విటమిన్ ఎ లోపాన్ని తీరుస్తుంది. విటమిన్ ఏ కంటికి చాలా ముంచిది.
డయాబెటిక్ రోగులకు
డయాబెటిక్ రోగులకు డయాబెటిస్ సమస్యతో బాధ పడేవారు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అలాగే గుండె మంటను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment