Cumin
-
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి : 7 ఆరోగ్య ప్రయోజనాలు
ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీరు, మధ్యాహ్నం పెరుగు, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు ఈ మూడూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతారు. పెరుగు అనేది అన్ని వయసులవారికి మంచి చేస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ లభిస్తుంది. అయితే మీరు పెరుగుతో వేయించిన జీలకర్రపొడి కలుపుకొని తిన్నారా? తద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతుందని మీకు తెలుసా. రండి తెలుసుకుందాం.జీర్ణక్రియకు మంచిదిపెరుగులో ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థనుమంచిది. ఇందులో ఉండే యాంటీబయాటిక్స్ డయేరియా, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తాయి. అయితే జీలకర్ర కడుపు నొప్పి, వికారం, అజీర్ణం, అతిసారం, అపానవాయువు మొదలైన వాటిని దూరం చేస్తుంది. సో...పెరుగు ,జీలకర్రను కలిపి రైతా లేదా మజ్జిగ రూపంలో తీసుకుంటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి కోసంపెరుగులో ప్రోబయోటిక్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా ప్రేగులకు సంబంధించిన అనేక సమస్యలను తొలగిస్తుంది. జీలకర్రలో విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి, రక్తపోటు, గుండెపోటు, వాపు మొదలైన వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. జీలకర్రను పెరుగుతో కలిపి తీసుకుంటే, విటమిన్ సీ పుష్కలంగా అంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది.చర్మానికి మెరుపుపెరుగులో జింక్, ఫాస్పరస్, విటమిన్ ఎ మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మానికి మెరుపునిచ్చి జిడ్డు చర్మాన్ని కూడా తొలగిస్తాయి. అదే సమయంలో, విటమిన్ ఇ ,యాంటీఆక్సిడెంట్ లక్షణాలు జీలకర్రలో ఉన్నాయి. ఇవి వృద్ధాప్యాన్ని నివారించడంతో పాటు, కేన్సర్, వాపు, ఇన్ఫెక్షన్ మొదలైన వాటి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. విటమిన్ ఏ, ఇ కూడా అంది, అనేక చర్మ సమస్యలనుంచి రక్షిస్తుంది.ఊబకాయానికి పరిష్కారంజీలకర్ర తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. అధిక కొవ్వు మరియు కొలెస్ట్రాల్ ఉన్నవారు వేయించిన జీలకర్రను తీసుకుంటే, సమస్య తొలగిపోతుంది. అలాగే స్థూలకాయాన్ని తొలగించడానికి పెరుగు కూడా మంచి ఎంపిక. శరీరం నుండి అదనపు కొవ్వును తొలగిస్తుంది. రక్తపోటు సమస్యతోనూ పోరాడుతుంది. పెరుగులో ఒక చెంచా వేయించిన జీలకర్ర కలిపి ప్రతిరోజూ తింటే బరువు సులభంగా తగ్గుతారు.ఆకలిని పెంచుతుందిపెరుగు ,జీలకర్ర వాడకం ఆకలిని పెంచుతుంది. యోగా, జిమ్, శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసే వారికి ఇది చాలామంది. బాడీబిల్డింగ్ చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. సన్నగా ఉన్నవారు పెరుగు, జీలకర్ర వాడితే ఆకలి పెరుగుతుంది. కాస్త ఒళ్లు చేస్తారు.కంటి ఆరోగ్యానికిపెరుగులో,జీలకర్రలో నూ విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. పెరుగు, జీలకర్రను కలిపి తీసుకుంటే, విటమిన్ ఎ లోపాన్ని తీరుస్తుంది. విటమిన్ ఏ కంటికి చాలా ముంచిది.డయాబెటిక్ రోగులకుడయాబెటిక్ రోగులకు డయాబెటిస్ సమస్యతో బాధ పడేవారు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అలాగే గుండె మంటను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. -
ఇవి కలిపితే ఆరోగ్యం పెరుగుతుంది
పెరుగు ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. పెరుగులో కొందరు పంచదార కలిపి తింటే, ఉప్పు కలిపి మరికొందరు తింటుంటారు. గతవారం మనం పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలేమిటో చెప్పుకున్నాం. పెరుగులో ఏయే పదార్థాలు కలిపి తింటే ఏయే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఈ వారం చూద్దాం.జీలకర్రతో...పెరుగు, జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒకవేళ మీరు అధిక బరువు సమస్యతో బాధపడుతుంటే, పెరుగుతో జీలకర్ర పోడిని కలిపి తింటే, దాని నుంచి మంచి ప్రయోజనం పోందుతారు. దీని కోసం ముందు జీలకర్రను కాస్త వేయించి, ఆ తర్వాత దానిని పెరుగులో కలుపుకుని తినాలి.సైంధవ లవణంతో...పెరుగు, సైంధవ లవణం కలిపి తింటే ఎసిడిటీ తగ్గుతుంది.కోడి గుడ్డుతో...పెరుగు, కోడిగుడ్డు కలిపి తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి మేలు జరుగుతుంది. మీకు పంటి నొప్పి ఉంటే, ఈ రెండు పదార్థాలను కలిపి తినండి. ఇది నోటి అల్సర్ల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. నల్ల ఉప్పుతో,,,నల్ల ఉప్పును పెరుగు లో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు, కడుపునొప్పి తగ్గుతాయి.వాముతో...కొంత వాము తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి. దీనివల్ల నోటిపూత, పంటి నొప్పి, ఇతర దంత సంబంధ సమస్య లు తొలగుతాయి.చక్కెరతో కలిపితే...పెరుగు చక్కెర... ఈ రెండింటిని కలిపి తినడం వల్ల దగ్గు తగ్గుతుంది. వంటికి తక్షణ శక్తి లభిస్తుంది.మిరియాల పోడితో...ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మలబద్దకం పోతుంది.పండ్ల ముక్కలతో కలిపితే... పెరుగులో తాజా పండ్లముక్కలు కలిపి తింటే వ్యాధి నిరోధకత పెరుగుతుంది. తేనెతో... పెరుగులో పోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. తేనెలో రోగనిరోధక శక్తి సమృద్ధిగా ఉంటుంది. ఈ రెండు పోషకాలు కలిసి ఎముకలను దృఢపరుస్తాయి కాబట్టి ఎముకల నొప్పులు ఉన్నవారు పెరుగు, తేనె కలిపి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పోందవచ్చు. ఇంకా బోలు ఎముకల వ్యాధి, రక్తం గడ్డకట్టడం, అతిసార, ఊబకాయం, కీళ్లనొప్పులు, గుండె, రక్త సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. -
జీలకర్రలో కల్తీని నిమిషాల్లో ఇలా గుర్తించండి..
కల్తీని గుర్తిద్దామిలా... ►ఇప్పుడు ఏది చూసినా కల్తీ అవుతోంది. కల్తీ కలిసిన జీలకర్ర తింటే ఆరోగ్యం పాడవుతుంది. అందువల్ల జీలకర్రను నాణ్యమైనదో కాదో ఇలా తెలుసుకోండి... ► కొద్దిగా జీలకర్రను తీసుకుని నలిపి చూడాలి. నలిపినప్పటికీ జీలకర్ర అలానే ఉంటే జీలకర్రలో ఏదీ కలవలేదని అర్థం. ► జీలకర్రను నీటిలో వేసి ఐదు నిమిషాలు నానబెట్టాలి. నీరు రంగు మారితే జీలకర్రలో ఏదో కల్తీ జరిగినట్టే. ► జీలకర్ర వాసన లేకపోతే అది స్వచ్ఛమైన జీలకర్ర కాదు. ఇలా చేస్తే దంతాలు ఆరోగ్యంగా.. వేడి నీళ్లలో బేకింగ్ సోడా, కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. ఈ నీటిలో టూత్ బ్రష్‌ను మునిగేలా వేసి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత సాధారణ నీటితో కడిగితే బ్రష్‌లో ఉన్న మురికి, బ్యాక్టీరియా పోతుంది. పదిరోజులకొకసారి బ్రష్‌లను ఇలా శుభ్రం చేసుకుంటే, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని కలపాలి. ఈ మిశ్రమంలో ముంచిన టిక్కాను, తరువాత గుడ్లసొనలో ముంచి డీప్‌ఫ్రై చేస్తే టిక్కా క్రిస్పీగా మరింత రుచిగా వస్తుంది. -
Health: జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని రోజూ పరగడుపున తాగితే..
Jeelakarra- Health, Beauty Benefits In Telugu: ప్రతి ఇంటి పోపులపెట్టెలో తప్పనిసరిగా ఉండే జీలకర్ర ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంది. బహుశ దీనిని గుర్తించబట్టే కాబోలు, పెద్దలు తిరగమోతలో జీలకర్రను చేర్చడం అలవాటు చేసి ఉంటారు. జీలకర్రను పోపు వరకే పరిమితం చేయడం వల్ల పరిమిత ప్రయోజనాలే ఉంటాయి. దానిని సరైన విధంగా వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం. ►రోజూ పరగడుపున జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని తాగితే రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. రక్తహీనతను రానివ్వదు ►రక్తంలో హీమోగ్లోబిన్ తయారవటానికి కావలసిన ముఖ్యపోషకమైన ఐరన్‌ని పుష్కలంగా కలిగి ఉంటుంది. ►శరీరంలో ఐరన్ తగ్గటం వల్ల అనీమియా వస్తుంది, ఇది ఎక్కువగా పిల్లలలో, ఆడ వాళ్ళలో, యక్తవయస్సు వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. ►ఆహారంలో జీలకర్రని కలుపుకోవటం వలన ఐరన్’ని పొందవచ్చు. జీర్ణక్రియకు ►జీలకర్ర నీటిని తాగితే జీర్ణాశయం శుభ్రపడుతుంది. గ్యాస్, అసిడిటీ, ►అజీర్తి, కడుపులో వికారం, కడుపులోని అల్సర్లు వదిలిపోతాయి. కడుపులో నులి పురుగులు చనిపోతాయి. ►కిడ్నీలోని రాళ్లు కరుగుతాయి చర్మ వ్యాధులకు ►జీలకర్రలో విటమిన్ ‘ఈ’ అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగానూ, ప్రకాశవంతంగాను చేస్తుంది. ►జీలకర్ర లేహ్యన్ని ముఖానికి పూసుకోవటం వల్ల మొటిమలు, గజ్జి, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులను త్వరగా తగ్గిస్తుంది. జుట్టు రాలకుండా చూడడంలో... ►జీలకర్ర వాడకం బట్టతలని, జుట్టు రాలిపోవటాన్ని తగ్గిస్తుంది. ►ఆలివ్ ఆయిల్, జీలకర్ర ఆయిల్ సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి జుట్టుకి రాయటం వలన వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహించి, జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. నెలసరి క్రమబద్ధం ►నెలసరిని క్రమంగా వచ్చేలా చేయడంతోపాటు నెలసరిలో వచ్చే ఇబ్బందులను తగ్గిస్తుంది. ►దీనిలో ఉండే యాంటీ–ఆక్సిడెంట్ గుణాల వల్ల శరీరం రుతుక్రమ సమయంలో ఇబ్బందులకు తట్టుకోగలుగుతుంది. రోగ నిరోధక శక్తి ►జీలకర్ర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది యాంటీ–ఆక్సిడెంట్స్‌ని కలిగి ఉండటం వల్ల శరీరంలో చేరిన మలినాలను, ఫ్రీ–రాడికల్స్’ను తొలగించి, వ్యాధులను తట్టుకొనే విధంగా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ►దీనివల్ల దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలు దరిజేరవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ►జీలకర్ర మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. ►సుఖనిద్ర కోరుకొనే వారు జీలకర్ర నీటిని సేవించడం ఉత్తమం. ►జీలకర్ర నీరు తాగేవారికి రక్తపోటు అదుపు లో ఉంటుంది. ►దీంతో రక్తసరఫరా మెరుగు పడటమే గాక రక్తనాళాల్లోని అడ్డంకులు తొలగి గుండె సమస్యలు రావు. ►మధుమేహులు జీలకర్ర నీరు తాగితే రక్తంలోని చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు ►ఇన్ని ప్రయోజనాలున్న జీలకర్రను చిన్నచూపు చూడకుండా విరివిగా ఉపయోగించడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండగలం. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! చదవండి: Athiya Shetty: బొప్పాయి గుజ్జు, రోజ్ వాటర్.. పార్టీకి వెళ్లే ముందు ఇంట్లోనే ఇలా! నా బ్యూటీ సీక్రెట్ Eye Problems: ప్రమాద సంకేతాలు.. ఉబ్బిన కళ్లు, రెప్పల మీద కురుపులు.. ఇంకా ఇవి ఉన్నాయంటే -
పాలిచ్చే తల్లులు తినాల్సినవి..!
-
Breast Milk: తల్లిపాలు పెరగాలంటే.. బొప్పాయి కూర, ఆవుపాలు, కర్బూజ, జీలకర్ర ఇంకా
Best Foods Increase Breast Milk Production: పిల్లలకు తల్లిపాలు ఎంతో ఆరోగ్యకరం. పాలిచ్చే తల్లుల ఆరోగ్యం కూడా బాగుంటుందని పెద్దలు, పరిశోధకులు ఎప్పటినుంచో చెబుతున్న విషయమే. అయితే కొందరు తల్లులకు పాలు పడవు. అలాంటివారు కొన్ని సూచనలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. గర్భిణులకు బొప్పాయి ఇవ్వకూడదని అందరికీ తెలుసు. అదే బొప్పాయి బాలింతలకు కల్పతరువులా పనిచేస్తుంది. దోరగా ఉన్న బొప్పాయికాయను కొబ్బరి కోరులా చేసి కూర వండుకుని తింటే స్తన్యవృద్ధి కలుగుతుంది. పాల ఉత్పత్తిని పెంచేందుకు మరిన్ని మార్గాలున్నాయి! ►ఆవుపాలు, కర్బూజాపండు, పాలకూర, జీలకర్ర, బార్లీజావ, బొబ్బర్లు, తెలకపిండితో చేసిన కూర, మునగాకు కూరలు చాలా మేలు చేస్తాయి. ►పట్టణ ప్రాంతాలలోని వారికి పిల్లిపెసర దొరకపోవచ్చు. కాని దాని వేళ్ళను దంచిన రసం తీయాలి. దీనిని ఎండించి దంచిన చూర్ణం రోజూ తేనెలో తీసుకుంటే పాలు పెరుగుతాయి. ఆయుర్వేద దుకాణాల్లో శతావరి పేరిట చూర్ణం దొరుకుతుంది. ఇది కూడా బాగానే పని చేస్తుంది. ►రెండు గ్లాసుల నీళ్ళలో రెండు టీస్పూన్ల పత్తిగింజల పొడి పోసి నీళ్ళు అరగ్లాసు అయ్యేంతవరకు మరిగించాలి. చల్లారిన తర్వాత దీనిని వడగట్టి తేనె కలుపుకుని తాగితే పాలవెల్లువ కల్గుతుంది. ►తామర కాడను ఎండించిన చెంచాడు చూర్ణాన్ని తేనెతో కలిపి రోజుకు మూడుసార్లు తింటే పాలు పెరుగుతాయి. ►ఆముదం ఆకులపైన ఆముదాన్ని రాసి వెచ్చ చేసి రొమ్ములకు కడితే పాలచేపు వస్తుంది. ►బాలింతలకు వాము కషాయం రోజూ తేనెతో తీసుకుంటే చక్కని పాలు పడతాయి. ►శనగలను మొలకలొచ్చేదాకా నాన బెట్టాలి. ఎండించి, పొట్టు తీసి, దోరగా వేయించి, కట్టులా కాచుకుని తాగితే బలాన్నిచ్చి మంచి ఔషధంగా పనిచేస్తాయి. మంచి రక్తాన్ని పుట్టిస్తాయి. పాలిచ్చే తల్లులకు ఇస్తే పాలు పెరుగుతాయి. ►బాలింతలకు జలుబు చేస్తుందని మంచినీళ్లు ఎక్కువ తాగనివ్వరు పెద్దలు. అలా కాకుండా తగినన్ని మంచి నీళ్లు తాగుతుండాలి. కాకపోతే చల్లటి నీళ్లు కాకుండా గోరు వెచ్చటి నీళ్లు తాగడం మంచిది. ►మజ్జిగ, పెరుగు, పాలు పుష్కలంగా తీసుకోవాలి. ►ఇవన్నీ అంతో ఇంతో పాలు పడే తల్లులకు పని చేస్తాయి. అయితే కొందరు తల్లులకు కొన్ని కారణాల వల్ల పాలు అసలు పడవు. అటువంటప్పుడు ప్రయోజనం ఏముందని పిల్లలను రొమ్ముకు దూరం పెడతారు తల్లులు. అలా చేయకూడదు. పిల్లలు రొమ్మును చప్పరించడం వల్ల తల్లిలో మాతృత్వ భావన ఉప్పొంగి హార్మోన్ల ప్రేరణతో పాలు స్రవించేందుకు అవకాశం ఉంటుందని పెద్దలతోబాటు వైద్యులు కూడా చెబుతున్నారు. చదవండి: Kiwi Fruit: కివీ పండు పొట్టు తీయకుండా తింటున్నారా? ఇందులోని ఆక్టినిడెన్ అనే ఎంజైమ్ వల్ల... -
Jeelakarra: జీలకర్ర నీటిలో నానబెట్టి తాగుతున్నారా... సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.. జాగ్రత్త!
సాధారణంగా ప్రతి వంటగదిలోనూ దర్శనమిచ్చే సుగంధ ద్రవ్యం జీలకర్ర. ప్రపంచవ్యాప్తంగా ఇది వినియోగంలో ఉంది. ఇందులో తెల్ల జీలకర్ర, నల్ల జీలకర్ర అనే రెండు రకాలు ఉంటాయి. అయితే విశేషం ఏమిటంటే... రెండింటిలోనూ పోషక విలువలు దాదాపు ఒకే తీరుగా ఉంటాయి. రోజూవారీ జీవితంలో తాలింపులోనూ, మసాలాల్లోనూ జీలకర్రను వినియోగిస్తాం. నిజానికి ఇది కేవలం సువాసనకే పరిమితం కాదు... అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుస్తుంది. జీలకర్రలో ఉండే పోషకాలు: ►జీలకర్రలో విటమిన్లు ఉంటాయి. ►ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ వంటి పోషకాలు పుష్కలం. ►జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ►క్యాన్సర్ కారక నిరోధకాలు జీలకర్రలో ఉంటాయి. జీలకర్ర వల్ల కలిగే ఆరోగ్య లాభాలు: ►జీలకర్రను అజీర్ణ సమస్యలకు చిట్కా వైద్యంగా ఉపయోగపడుతుంది. ►చర్మ సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. ►సాధారణ జలుబు, దగ్గు వంటి సాధారణ సమస్యలకు జీలకర్ర మంచి విరుగుడుగా పనిచేస్తుంది. ►గర్భాశయ, గుండె సంబంధిత వ్యాధుల ముప్పును నివారిస్తుంది. వాంతులు, వికారం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ►చెడు బాక్టీరియాతో పోరాడే గుణం జీలకర్రకు ఉంటుంది. ►రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ►బ్లడ్ షుగర్‌ను అదుపులో ఉంచుతుంది. ►జీలకర్రలో యాంటీ ఇన్ఫ్లామేటరి గుణాలు ఉంటాయి. మంటను తగ్గిస్తుంది. ►జీలకర్రను నీటిలో వేసి రాత్రిపూట నానబెట్టి... మరుసటి రోజు ఆ నీరు మరిగించి, కాస్త తేనె కలిపి ఖాళీ కడుపుతో తాగితే బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ►నాడీ వ్యవస్థ ప్రభావంతంగా పనిచేయడంలో జీలకర్ర తన వంతు పాత్ర పోషిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. ►పార్కిన్సన్ వ్యాధిని నివారించడంలో తోడ్పడుతుంది. సైడ్ ఎఫెక్ట్స్: నిజానికి జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే నాన్ టాక్సిక్(విషపూరితం కానిది) కూడా. అయితే, రోజుకు 300 నుంచి 600 మిల్లి గ్రాములు మాత్రమే తీసుకోవాలని పరిశోధకులు అంటున్నారు. మోతాదు మించితే టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గుతుందని, ఫలితంగా పురుషుల్లో సంతాన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. చదవండి: Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే.. -
పొట్టకు హుచారు
పండగ హడావుడి ముగిసింది. అయినవాళ్ల మధ్య, ఆత్మీయుల మధ్య విందులు హెవీగా సాగి ఉంటాయి. గారెలు, బూరెలు, చికెన్, మటన్... ఒకటికి నాలుగు ముద్దలు పొట్టకు ఎక్స్ట్రా పని పెట్టి ఉంటాయి. ఇక చాలు... ఒకటి రెండు రోజులు డైనింగ్ టేబుల్ని తేలిగ్గా ఉంచుదాం. జీర్ణాశయానికి విశ్రాంతినిద్దాం. అందుకు మార్గం? చారును శరణు కోరడమే. మిరియాలు, జీలకర్ర, నిమ్మకాయ, కొత్తిమీర, టొమాటో వీటన్నిటితో పొగలుగక్కే చారు చేయండి. రసంతో అజీర్తికి విరసం పలకండి. నిమ్మరసం – కొత్తిమీర రసం కావలసినవి: కంది పప్పు – పావు కప్పు (తగినన్ని నీళ్లు జతచేసి ఉడికించాలి); పసుపు – పావు టీ స్పూను. పొడి కోసం: కొత్తిమీర – అర కప్పు; జీలకర్ర – 2 టీ స్పూన్లు; మిరియాలు – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 2; అల్లం తురుము – పావు టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 5 పోపు కోసం: నువ్వుల నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఎండు మిర్చి – 2; ఇంగువ – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; నిమ్మ రసం – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ►ఉడికించిన పప్పును పప్పు గుత్తితో మెత్తగా చేయాలి ►మిక్సీలో అర కప్పు కొత్తిమీర, రెండు టీ స్పూన్ల జీలకర్ర, అర టీ స్పూను మిరియాలు, రెండు పచ్చి మిర్చి, అల్లం తురుము, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా చేసి, పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో ఒక టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, అర టీ స్పూను ఆవాలు వేసి చిటపటలాడించాలి ►కరివేపాకు, ఎండు మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ►కొత్తిమీర మిశ్రమం జత చేయాలి ∙ఇంగువ, పసుపు జత చేసి మరోమారు కలపాలి ►పప్పు, ఒకటిన్నర కప్పుల నీళ్లు జత చేసి బాగా కలియబెట్టి, ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ►సన్నని మంట మీద పది నిమిషాలు మరిగించాక, దింపేయాలి ►నిమ్మ రసం జత చేసి కలియబెట్టాలి ►కొత్తిమీరతో అలంకరించాలి. మైసూర్ రసం కావలసినవి: పొడి కోసం: ధనియాలు – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 2; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – రెండు టేబుల్ స్పూన్లు ; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు, టొమాటో తరుగు – అర కప్పు; చింతపండు రసం – ఒక కప్పు (పల్చగా ఉండాలి); కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; బెల్లం పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; ఉడికించిన కంది పప్పు – ఒక కప్పు; నీళ్లు – 2 కప్పులు; పోపు కోసం: నూనె – 2 టీ స్పూన్లు; ఆవాలు – ముప్పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఎండు మిర్చి – 2; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►స్టౌ మీద బాణలి వేడయ్యాక ధనియాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, మిరియాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి ►మంట బాగా తగ్గించి మరోమారు వేయించాలి ►కొబ్బరి తురుము జత చేసి మరి కాసేపు వేయించి దింపేయాలి ►చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙అదే బాణలిలో ముందుగా టొమాటో గుజ్జు, చింతపండు రసం వేసి ఉడికించాలి ►కరివేపాకు, పసుపు, ఉప్పు, బెల్లం పొడి జతచేసి బాగా కలిపి మరిగించాలి ►ఉడికించిన కందిపప్పు, నీళ్లు జత చేసి కొద్దిసేపు మరిగించాలి ►తయారుచేసి ఉంచుకున్న మైసూర్ రసం పొడి జత చేయాలి ►స్టౌ మీద చిన్న బాణలి ఉంచి వేడయ్యాక, నూనె వేసి కాగాక, ఆవాలు, ఇంగువ, ఎండు మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించి, మరుగుతున్న రసంలో వేసి కలపాలి ►చివరగా కొత్తిమీర వేసి బాగా కలిపి దింపేయాలి. మిరియాలు జీలకర్ర రసం కావలసినవి: మిరియాలు – అర టేబుల్ స్పూను; జీలకర్ర – అర టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); వెల్లుల్లి రెబ్బలు – 7. చింతపండు – అర టేబుల్ స్పూను (అర కప్పు గోరువెచ్చని నీళ్లలో నానబెట్టాలి); టొమాటో తరుగు – అర కప్పు; కొత్తిమీర తరుగు – పావు కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఉప్పు – తగినంత. పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు –పావు టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు. తయారీ: ►చింతపండు రసం తీసి పక్కన ఉంచాలి ►మిక్సీలో వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, మిరియాలు, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా పొడి చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి వేయించాలి ►కరివేపాకు, మిరియాల పొడి మిశ్రమం జత చేసి మరోమారు కలపాలి ►చింతపండు రసం, నీళ్లు, ఉప్పు జత చేసి, బాగా కలియబెట్టి, మంట బాగా తగ్గించాలి ►సుమారు పావు గంట సేపు మరిగించాక దింపేయాలి. పైనాపిల్ రసం కావలసినవి: కంది పప్పు – పావు కప్పు; నీళ్లు – ఒక కప్పు; పసుపు – పావు టీ స్పూను; పైనా పిల్ తరుగు – ఒక కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; రసం పొడి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత. పొడి కోసం: జీలకర్ర – 2 టీ స్పూన్లు; మిరియాలు –ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 6 పోపు కోసం: నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 3; కరివేపాకు – 4 రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా తయారీ: ►కంది పప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఆరు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి, దింపి, పప్పు గుత్తితో మెత్తగా చేసి, పక్కన ఉంచాలి ►మిక్సీలో జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు (పొడి కోసం చెప్పిన వస్తువులు) వేసి కచ్చాపచ్చాగా పొడి చేసి, తీసి పక్కన ఉంచాలి ►అర కప్పు పైనాపిల్ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, తీసి పక్కన ఉంచాలి ►పావు కప్పు టొమాటో ముక్కలు మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేసి, తీసి పక్కనుంచాలి ►స్టౌ మీద బాణలిలో ఒకటిన్నర టేబుల్స్పూన్ల నూనె వేసి కాగాక, ఆవాలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి ►మిరియాల పొడి మిశ్రమం జత చేసి కొద్దిసేపు వేయించాలి ►కరివేపాకు, ఇంగువ జత చేసి మరోమారు వేయించాలి ►టొమాటో గుజ్జు జత చేసి బాగా వేయించాలి ►పైనాపిల్ గుజ్జు జత చేసి రెండు నిమిషాల పాటు వేయించాక, ఉడికించిన పప్పు జతచేసి బాగా కలపాలి ►పైనాపిల్ తరుగు, టొమాటో తరుగు, ఉప్పు, ఒకటిన్నర కప్పుల నీళ్లు జత చేసి, బాగా కలపాలి ►రెండు టీ స్పూన్ల రసం పొడి వేసి బాగా కలియబెట్టాలి ►పదినిమిషాల పాటు మరిగించాక, కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేయాలి. పన్నీర్ రసం కావలసినవి: చింత పండు – నిమ్మకాయంత; నీళ్లు – 3 కప్పులు; రోజ్ వాటర్ (పన్నీరు) – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి మిర్చి – 3; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; మిరియాల పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; రోజ్ పెటల్స్ – కొన్ని ; ఉప్పు – తగినంత; పంచదార – తగినంత; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – అర టీ స్పూను. తయారీ: ►చింతపండును తగినన్ని నీళ్లలో నానబెట్టి, రసం తీసి పక్కన ఉంచాక, ఉడికించిన పప్పు నీళ్లు జత చేయాలి ►తగినంత ఉప్పు, పంచదార వేసి కలియబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె/నెయ్యి వేసి కాగాక ఆవాలు, పచ్చి మిర్చి, జీలకర్ర, మిరియాల పొడి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ►చింతపండు రసం జత చేయాలి ►రెండు నిమిషాల పాటు మరిగాక దింపేసి, రోజ్ వాటర్ జత చేయాలి ►కొత్తిమీర, గులాబీ రేకలతో అలంకరించి వేడివేడిగా వడ్డించాలి. టొమాటో చారు చారుకావలసినవి: బాగా పండిన టొమాటో తరుగు – 2 కప్పులు (మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేయాలి); నీళ్లు – 2 కప్పులు; నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); వెల్లుల్లి రెబ్బలు – 4; పసుపు – పావు టీ స్పూను; కొత్తిమీర – పావు కప్పు; బెల్లం పొడి – అర టేబుల్ స్పూను; చింతపండు గుజ్జు – ఒక టీ స్పూను పొడి కోసం: ఎండు మిర్చి – 2; జీలకర్ర – ఒక టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; ధనియాలు – ఒక టేబుల్ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు తయారీ: ►స్టౌ మీద బాణలి వేడయ్యాక పచ్చి సెనగ పప్పు వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి ►ధనియాలు, మెంతులు, ఎండు మిర్చి, మిరియాలు జత చేసి బాగా వేయించాక, జీలకర్ర జత చేసి మరోమారు వేయించి దింపేయాలి ►చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేస్తే, చారు పొడి సిద్ధమైనట్లే. ►స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు వేసి చిటపటలాడం మొదలయ్యాక, ఎండు మిర్చి ముక్కలు, ఇంగువ జత చేయాలి ►కరివేపాకు జత చేసి ఒక నిమిషం వేయించాక, టొమాటో గుజ్జు, పసుపు, ఉప్పు జత చేసి కొద్దిసేపు వేయించాలి ►టొమాటో గుజ్జు బాగా మెత్తబడ్డాక, వెల్లుల్లి తరుగు, చింత పండు గుజ్జు, బెల్లం పొడి జత చేసి బాగా కలియబెట్టాలి ►నీళ్లు పోసి మరిగించాక, మంట బాగా తగ్గించి, రసం పొడి జత చేయాలి ►కొత్తిమీర వేసి బాగా కలిపి దింపి, మూత ఉంచాలి ►వేడి వేడి అన్నంలోకి వేడి వేడి చారు జత చేసుకుని తింటే రుచిగా ఉంటుంది ►సూప్‌లా తాగినా కూడా రుచిగానే ఉంటుంది. -
అమ్మో! జీలకర్ర
రాయబరేలి : జీలకర్ర దాదాపు ప్రతి భారతీయ ఇంటిలో ఉపయోగించే సాధారణ మసాలా (ఔషధ) దినుసు. కాదేదీ కల్తీకి అనర్హం అని రెచ్చిపోతున్న అక్రమార్కులు పెద్దమొత్తంలో నకిలీ జీలకర్రను సరఫరా తయారు చేస్తూ పోలీసులకు దొరికారు. ఉత్తర ప్రదేశ్, రాయ్ బరేలిలో ఈ ముఠా గుట్టును రట్టు చేశారు. చిపురు పుల్ల ముక్కలు, ఎండుగడ్డి, మొలాసిస్ ఉపయోగించి తయారు చేసిన 30వేల కిలోల నకిలీ జీలకర్ర (జీరా)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని రూ. 60 లక్షలు వుంటుందని అధికారులు తెలిపారు. మహారాజ్‌గంజ్ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ వినీత్ సింగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. చీపురు ముక్కలతోపాటు ఎండు గడ్డిని చీపుర్లలా తయారు చేస్తారు. అనంతరం వీటిని వేడి వేడి మొలాసిస్‌లో ముంచి ఎండ బెడతారు. ఎండిన తర్వాత, నిజమైన జీలకర్రలా కనిపించేలా ముక్కలుగా చేసి కల్తీ చేసి వివిధ నగరాలకు రవాణా చేస్తున్నారని తెలిపారు. 80, 20 నిష్పత్తిలో కల్తి చేశారన్నారు. తద్వారా ముఠా సభ్యులు 50 నుంచి 60 రెట్లు ఎక్కువ లాభాలను ఆర్జించుకుంటారనితెలిపారు. గత ఏడాది కాలంతా ఈ ముఠా ఈ దందాను కొనసాగిస్తోందన్నారు. ఈ కేసులో ప్రశాంత్ సాడు, కమలేష్ మౌర్య, పంకజ్ వర్మ, ఇంద్రజీత్, పవన్ గుప్తా, రాజేంద్ర ప్రసాద్, చోతేలాల్పై కేసు నమోదు చేశారు. పరారీలోఉన్న వీరిని అరెస్టు చేయడానికి రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారి తెలిపారు. గత నెలలో ఢిల్లీ పోలీసులు దాదాపు ఇలాంటి భారీ రాకెట్టును ఛేదించిన సంగతి తెలిసిందే. సో.. నకిలీ ఏదో.. అసలు ఏదో నిర్ధారించుకోవాల్సిన పదార్థాల జాబితాలో జీలకర్ర కూడా చేరిందన్నమాట. ఇటీవల ఢిల్లీలో స్వాధీనం చేసుకున్న నకిలీ జీలకర్ర తయారీ దృశ్యాలు -
దహీ బల్లా
కావలసినవి: మినప్పప్పు – అర కప్పు; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; తాజా పెరుగు – 2 కప్పులు; దానిమ్మ గింజలు – అర కప్పు; గ్రీన్ చట్నీ – అర కప్పు; సెనగలు – అర కప్పు (నానబెట్టాలి); బంగాళ దుంప – 1 (పెద్దది); చాట్ మసాలా – తగినంత; వేయించిన జీలకర్ర పొడి – తగినంత; మిరపకారం – తగినంత; ఉప్పు – తగినంత తయారీ: మినప్పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి ఆరు గంటలపాటు నానబెట్టి, నీళ్లు ఒంపేసి, మినప్పప్పును గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బాలి ►జీలకర్ర, ఇంగువ జత చేసి మరోమారు గ్రైండ్ చేయాలి ►మధ్యమధ్యలో నీళ్లు జత చేయాలి ►మెత్తగా రుబ్బిన పిండిని గిన్నెలోకి తీసుకోవాలి (పిండి పల్చగా అనిపిస్తే కొద్దిగా బియ్యప్పిండి కాని బొంబాయి రవ్వ కాని జత చేయాలి) ►బాణలిలో నూనె పోసి కాగాక మంట కొద్దిగా తగ్గించాలి ►కొద్దికొద్దిగా పిండి తీసుకుని నూనెలో వడ మాదిరిగా వేసి వేయించాలి ►బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►నూనెను పేపర్ పీల్చుకున్నాక ఈ వడలను నీళ్లలో వేసి అరగంట సేపు నానబెట్టాలి ఒక పాత్రలో పెరుగు వేసి కవ్వంతో గిలకొట్టాలి ►నానబెట్టిన వడలను నీటిలో నుంచి తీసి పెరుగులో వేసి, ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచాలి ►ఒక పాత్రలో ఉడికించిన బంగాళ దుంప ముక్కలు, ఉడికించిన సెనగలు, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, దానిమ్మ గింజలు, చాట్ మసాలా, మిరపకారం, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలియబెట్టాలి ►వడలను ఫ్రిజ్‌లో నుంచి తీసి ఒక ప్లేట్లో ఉంచాలి ►బంగాళ దుంప మిశ్రమం, కొత్తిమీర తరుగులతో అలంకరించి అందించాలి. -
పాలిచ్చే తల్లులకు మేలు చేసే జీలకర్ర
జీలకర్రను మనం కేవలం ఒక సుగంధ ద్రవ్యంలాగా వాడుతాం గానీ... దీనితో కేవలం మంచి వాసనే కాదు... మంచి ఆరోగ్యం కూడా సమకూరుతుంది. జీలకర్రతో మనకు ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే... ∙ గర్భిణులు, పాలిచ్చే తల్లులు జీలకర్ర ఉండే పదార్థాలను తరచూ తీసుకోవాలి. పాలిచ్చే తల్లుల్లో పాలు ఎక్కువగా పడేలా చేస్తుంది. థైమాల్ అనే పదార్థం ఇందుకు దోహద పడుతుంది. ∙ జీలకర్రలో ఐరన్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే రుతు సమయంలో అధిక రుతుస్రావం అయ్యే మహిళలు జీలకర్ర వాడితే, వారు కోల్పోయే ఐరన్ తేలిగ్గా భర్తీ అవుతుంది. అలాగే ఎదిగే పిల్లలకూ ఐరన్ ఎక్కువగా అవసరం కాబట్టి వారికీ జిలకర చాలా మంచిది. ∙ జీలకర్రలో ఐరన్‌తో పాటు చాలా ఎసెన్షియల్ ఆయిల్స్, విటమిన్–సి, విటమిన్–ఏ, ఇతర ఖనిజలవణాలు చాలా ఎక్కువ. ఇవన్నీ సంయుక్తంగా రోగనిరోధక శక్తిని పెంపొందించి, అనేక వ్యాధులనుంచి నివారిస్తాయి. ∙ ఆస్తమా, బ్రాంకైటిస్ వంటివి రాకుండా నిరోధించే గుణం జీలకర్రకు ఉంది. శ్వాసవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ∙ జీలకర్రలో విటమిన్–ఇ ఎక్కువ. అందుకే ఇది యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. తద్వారా వయసు పెరగడం వల్ల వచ్చే మార్పులు... చర్మం వదులు కావడం, ముడుతలు, ఏజ్ స్పాట్స్ వంటి వాటిని నిరోధిస్తుంది. -
ఇలా చేస్తే 15 రోజుల్లో పొట్ట తగ్గుతుందట!
సాక్షి, హైదరాబాద్: చంకలో పిల్లాడిన్ని పెట్టకుని ఊరంతా వెతికారట!! అనే సామెత తెలిసే ఉంటుంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆరోగ్య నియమాలు పాటించకుండా దాదాపు అందరూ పొట్టలో కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడుతున్నవారే..!! అధిక బరువుతో గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నవారే..!! కానీ ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం మనం రోజూ వాడే జీలకర్రలోనే ఉందట. అందుకే చంకలో పిల్లాడు... అనే సామెత చెప్పింది. అవును ఇది నిజం. జీలకర్ర ద్రావణం గొప్ప ఆరోగ్య ఔషదమని పరిశోధనల్లో తేలింది. రోజూ ఉదయం... జీలకర్ర నీటితో కేవలం 15 రోజుల్లో శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. రోజూ పరగడుపున ఈ నీటిని తీసుకుంటే చెడు కొవ్వుని తగ్గించుకోవడంతోపాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఒక ఓ రీసెర్చ్ వెల్లడించింది. జీరా వాటర్ మలబద్దకాన్ని దూరం చేసి, జీర్ణక్రియను మెరుగు పరుస్తుందనీ.. జీవ క్రియ రేటుని పెంచుతుందని తెలిపింది. తయారీ విధానం... ఒక గ్లాసు మంచి నీటిలో టేబుల్ స్పూన్ జీలకర్రను రాత్రి మొత్తం నానబెడితే చాలు. నీరంతా జీరా గింజల్లోకి చేరడంతో వాటిలో ఉండే పోషకాలు నీటిలోకి చేరతాయి. అంతే జీరా వాటర్ రెడీ. పసుపు రంగులోకి మారిన ఆ ద్రావణంలో కేవలం 7 కాలరీలు మాత్రమే ఉండడం విశేషం. బరువు తగ్గాలనుకున్న వారికి ఇది మంచి సాఫ్ట్ డ్రింక్‌గా పనిచేస్తుందనేది పరిశోధనల సారాంశం. చెడు కొవ్వు మైనస్, మంచి కొవ్వు ప్లస్ సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, వ్యాయామం చేయకపోవడంతో జీవక్రియ మందగిస్తుంది. శరీరంలోని చక్కెరలు, కొవ్వులు ఖర్చు కావు. దాంతో శరీరంలో అధికంగా కొవ్వు పేరకుపోయే ప్రమాదం ఉంది. జీరా ద్రావణాన్ని రోజూ తీసుకోవడం వల్ల అందులో విరివిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్‌ను తొలగిస్తాయని తెలిసింది. తద్వారా జీవక్రియ మెరుగు పడి బరువు తగ్గడం తేలికవుతుందని రీసెర్జి అధికారులు అంటున్నారు. ఇది ఒంట్లోని చెడు కొవ్వుని తొలగించడంతో గుండె జబ్బుల బారిన అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇంకా శరీరానికి అవసరమైన మంచి కొవ్వుని వృద్ధి చేస్తుంది. హ్యాపీగా తినొచ్చు.. మంచి జీర్ణక్రియతో మంచి ఆరోగ్యం సాధ్యం. జీరా వాటర్ ప్రేగుల్లో కదలికలను మెరుగు పరచి, అక్కడ ఉండే ఎంజైమ్‌లపై ప్రేరకంగా పనిచేస్తుంది. తద్వారా పొట్టలో ఉబ్బరాన్ని తగ్గించి, మంచి జీర్ణక్రియ సొంతమవుతుందని పరిశోధకులు వెల్లడించారు. -
ఆకలికి భేష్...
గుడ్‌ఫుడ్ జీలకర్ర ప్రధానాహారంగా కాకపోయినా... ఆహారానికి మంచి రుచి, సువాసన (ఫ్లేవర్) రావడానికి ఉపయోగపడే దినుసు. దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో. వాటిలో కొన్ని... తాలింపులో జీలకర్ర పడగానే ఒక మంచి సువాసనతో మనకు ఆహ్లాదం చేకూరుతుంది. జీలకర్రలో ఉండే క్యుమినాల్డిహైడ్ అనే రసాయనమే దీనికి కారణం. ఇది మన లాలాజల గ్రంథులను ఉత్తేజపరచి ఆకలిని పెంచుతుంది. పైన పేర్కొన్న ప్రక్రియ జరగగానే జీలకర్ర ఉండే థైమాల్ అనే మరో రసాయనం జీర్ణప్రక్రియకు అవసరమైన బైల్, ఇతర జఠరరసాలు ఊరేలా చేస్తుంది. జీర్ణక్రియ బాగా జరిగేలా చూస్తుంది. అందుకే ఆకలి లేనివారు, అరుగుదల సమస్యలు ఉన్నవారు జీలకర్ర వాడితే ప్రయోజనం ఉంటుంది. జీలకర్ర గ్యాస్ట్రబుల్ను తగ్గిస్తుంది. త్రేన్పులు ఎక్కువగా వస్తున్నప్పుడు మనం తీసుకునే ఆహారాల్లో జీలకర్రను వాడితే గ్యాస్ సమస్య తగ్గుతుంది. జీలకర్రలో ఐరన్ పాళ్లు ఎక్కువ. అందుకే రుతు సమయంలో అధిక రుతుస్రావం అయ్యే మహిళలు జీలకర్ర వాడితే వారు కోల్పోయే ఐరన్ తిరిగి భర్తీ అవుతుంది. అలాగే ఎదిగే పిల్లలకూ ఐరన్ ఎక్కువగా అవసరం కాబట్టి వారు వాడటం కూడా అవసరం. రక్తంలో కొలెస్ట్రాల్‌ను, ట్రైగ్లిజరైడ్స్‌ను జీలకర్ర తగ్గిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది.