జీలకర్రలో కల్తీని నిమిషాల్లో ఇలా గుర్తించండి.. | How To Identify Adulterated Cumin Seeds | Sakshi
Sakshi News home page

Cumin Seeds: అలాంటి జీలకర్ర తింటే ఆరోగ్యం పాడవుతుంది,కల్తీని కనిపెట్టండి

Published Sat, Sep 23 2023 2:40 PM | Last Updated on Sat, Sep 23 2023 4:04 PM

How To Identify Adulterated Cumin Seeds - Sakshi

కల్తీని గుర్తిద్దామిలా...

ఇప్పుడు ఏది చూసినా కల్తీ అవుతోంది. కల్తీ కలిసిన జీలకర్ర తింటే ఆరోగ్యం పాడవుతుంది. అందువల్ల జీలకర్రను నాణ్యమైనదో కాదో ఇలా తెలుసుకోండి...
► కొద్దిగా జీలకర్రను తీసుకుని నలిపి చూడాలి.  నలిపినప్పటికీ  జీలకర్ర అలానే ఉంటే జీలకర్రలో ఏదీ కలవలేదని అర్థం.
► జీలకర్రను నీటిలో వేసి ఐదు నిమిషాలు నానబెట్టాలి. నీరు రంగు మారితే జీలకర్రలో ఏదో కల్తీ జరిగినట్టే.
► జీలకర్ర వాసన లేకపోతే అది స్వచ్ఛమైన జీలకర్ర కాదు. 

ఇలా చేస్తే దంతాలు ఆరోగ్యంగా..

  • వేడి నీళ్లలో బేకింగ్‌ సోడా, కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. ఈ నీటిలో టూత్‌ బ్రష్‌ను మునిగేలా వేసి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత సాధారణ నీటితో కడిగితే బ్రష్‌లో ఉన్న మురికి, బ్యాక్టీరియా పోతుంది. పదిరోజులకొకసారి బ్రష్‌లను ఇలా శుభ్రం చేసుకుంటే, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

  • రెండు టేబుల్‌ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, రెండు టేబుల్‌ స్పూన్ల బియ్యప్పిండిని కలపాలి. ఈ మిశ్రమంలో ముంచిన టిక్కాను, తరువాత గుడ్లసొనలో ముంచి డీప్‌ఫ్రై చేస్తే టిక్కా క్రిస్పీగా మరింత రుచిగా వస్తుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement