దహీ బల్లా | The potato mixture should be decorated with coriander leaves | Sakshi
Sakshi News home page

దహీ బల్లా

Published Wed, Mar 13 2019 1:36 AM | Last Updated on Wed, Mar 13 2019 1:36 AM

The potato mixture should be decorated with coriander leaves - Sakshi

కావలసినవి: మినప్పప్పు – అర కప్పు; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; తాజా పెరుగు – 2 కప్పులు; దానిమ్మ గింజలు – అర కప్పు; గ్రీన్‌ చట్నీ – అర కప్పు; సెనగలు – అర కప్పు (నానబెట్టాలి); బంగాళ దుంప – 1 (పెద్దది); చాట్‌ మసాలా – తగినంత; వేయించిన జీలకర్ర పొడి – తగినంత; మిరపకారం – తగినంత; ఉప్పు – తగినంత

తయారీ: మినప్పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి ఆరు గంటలపాటు నానబెట్టి, నీళ్లు ఒంపేసి, మినప్పప్పును గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బాలి

►జీలకర్ర, ఇంగువ జత చేసి మరోమారు గ్రైండ్‌ చేయాలి

►మధ్యమధ్యలో నీళ్లు జత చేయాలి

►మెత్తగా రుబ్బిన పిండిని గిన్నెలోకి తీసుకోవాలి (పిండి పల్చగా అనిపిస్తే కొద్దిగా బియ్యప్పిండి కాని బొంబాయి రవ్వ కాని జత చేయాలి)

►బాణలిలో నూనె పోసి కాగాక మంట కొద్దిగా తగ్గించాలి

►కొద్దికొద్దిగా పిండి తీసుకుని నూనెలో వడ మాదిరిగా వేసి వేయించాలి

►బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి

►నూనెను పేపర్‌ పీల్చుకున్నాక ఈ వడలను నీళ్లలో వేసి అరగంట సేపు నానబెట్టాలి  ఒక పాత్రలో పెరుగు వేసి కవ్వంతో గిలకొట్టాలి

►నానబెట్టిన వడలను నీటిలో నుంచి తీసి పెరుగులో వేసి, ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచాలి

►ఒక పాత్రలో ఉడికించిన బంగాళ దుంప ముక్కలు, ఉడికించిన సెనగలు, గ్రీన్‌ చట్నీ, స్వీట్‌ చట్నీ, దానిమ్మ గింజలు, చాట్‌ మసాలా, మిరపకారం, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలియబెట్టాలి

►వడలను ఫ్రిజ్‌లో నుంచి తీసి ఒక ప్లేట్‌లో ఉంచాలి

►బంగాళ దుంప మిశ్రమం, కొత్తిమీర తరుగులతో అలంకరించి అందించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement