Best Evening Snacks Recipes: How To Prepare Maramarala Pakoda Recipe In Telugu - Sakshi
Sakshi News home page

Snack Recipe: బంగాళదుంప, శనగపిండి, బియ్యప్పిండితో మరమరాల పకోడా!

Published Sun, Nov 13 2022 12:31 PM | Last Updated on Sun, Nov 13 2022 1:00 PM

Easy Snacks Recipes In Telugu Maramarala Pakoda - Sakshi

మరమరాలు, బంగాళదుంప, శనగపిండి, బియ్యప్పిండితో ఇలా పకోడాలు తయారు చేసుకోండి.
మరమరాల పకోడా తయారీకి కావలసినవి:
►మరమరాలు – రెండున్నర కప్పులు
►ఉల్లిపాయ ముక్కలు – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు
►పచ్చిమిర్చి ముక్కలు – రెండు టీ స్పూన్లు
►బంగాళదుంప – 1 (ఉడికించి, ముద్దలా చేసుకోవాలి)

►కొత్తిమీర తురుము – పావు కప్పు
►అల్లం తురుము – అర టీ స్పూన్‌
►శనగపిండి – పావు కప్పు, 

►బియ్యప్పిండి – రెండున్నర కప్పులు
►వేరుశనగలు – టేబుల్‌ స్పూన్‌  (కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి)
►కారం, ధనియాల పొడి – టీ స్పూన్‌  చొప్పున
►ఉప్పు – తగినంత
►నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ:
►ముందుగా ఒక బౌల్‌ తీసుకోవాలి.
మరమరాలు, బంగాళదుంప ముద్ద, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, అల్లం తురుము, శనగపిండి, బియ్యప్పిండి, వేరుశనగల మిశ్రమం, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి.
►ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి.
►నూనె వేడి చేసుకుని.. పకోడాలా దోరగా వేయించుకోవాలి. 

ఇవి కూడా ట్రై చేయండి: Nuvvula Annam: చిన్నా పెద్దా లొట్టలేసుకుంటూ తినేలా నువ్వుల అన్నం తయారీ ఇలా
Amla Candy: ఆరోగ్య లాభాలెన్నో.. ఇంట్లోనే ఇలా ఆమ్ల క్యాండీ తయారీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement