వర్షాకాలంలో వేడి వేడి పకోడీలు, బజ్జీలు తినడం కామన్. కానీ గులాబీ పువ్వుల బజ్జీ తినడమే స్పెషల్. అదేంటి అని ఆశ్యర్యపోతున్నారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తోంది.
ఉల్లి పకోడీ, క్యాబేజీ, పాలక్ పకోడీ, గోబీపకోడీ ఇలా చాలా వంటకాలను చూసి ఉంటారు. టేస్ట్ చేసి ఉంటారు కూడా కదా. అయితే గులాబీ పకోడీ గురించి విన్నారా? సోషల్ మీడియాలో ఒక వ్యక్తి బండిపై గులాబి పూలతో చేసిన పకోడీలను తయారు చేస్తూ నెట్టింట సందడి చేస్తున్నాడు. <
ఎర్రటి గులాబీలను కట్ చేసిన శనగపిండిలో ముంచి అచ్చం పకోడీ మాదిరిగా వేడి వేడి నూనెలో వేయించాడు. దాన్ని ఓ కస్టమర్‌కి వడ్డించాడు. గులాబీ పువ్వు పకోడీని ఆరగించిన అతగాడు చాలా బావుంది అంటూ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఇస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందించారు. ఇది చూసి మీరు కూడా ఒక పట్టు పడతారో, ఆశ్చర్యపోతారో, నవ్వుకుంటారో, ఆనక కోప్పడతారో మీ ఇష్టం.
Comments
Please login to add a commentAdd a comment