roses
-
అపుడు కటిక పేదరికం : ఇపుడు పూలసాగుతో కోట్ల ఆదాయం
దిల్లు ఉన్నోడు దునియా మొత్తం ఏలతాడు అన్నది సినిమా డైలాగే కానీ దీన్ని అక్షరాలా రుజువు చేసి చూపించాడు రైతు కుటుంబంలో పుట్టిన శ్రీకాంత్ బొల్లాపల్లి. చిన్నతనంలో కడు పేదరికంలో గడిపాడు. పదవ తరగతి స్కూలు ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఏదో ఒక పని చేసుకోవాలని భావించాడు. బెంగళూరులో వెయ్యి రూపాయలకు పనిచేశాడు. అక్కడ ఆయన జీవితం మలుపుతిరిగింది. లాభదాయకమైన పూలసాగు గురించి తెలుసుకుని సక్సెస్ అయ్యాడు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో రైతు కుటుంబంలో పుట్టి పెరిగాడు శ్రీకాంత్. అతని కుటుంబం వ్యవసాయ కుటుంబమే కానీ పెద్దగా లాభసాటిగా లేదు. చదువుకొని ఉద్యోగం చేయాలనుకున్నాడు. అదీ కుదరలేదు. అటుపేదరికం, ఇటు అప్పులు ఇలా అనేక సవాళ్లు కళ్లముందు కనిపించాయి. దీంతో16 ఏళ్లకే 1995లో బెంగళూరులో బంధువులతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. అక్కడ పూల పెంపకం గురించి తెలుసుకుని మళ్లీ వ్యవసాయం చేయాలన్న కోరిక పుట్టింది.నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఏడాది పని చేసిన తర్వాత, శ్రీకాంత్ వ్యాపారానికి సంబంధించిన మెళకువలతో సిద్ధమయ్యాడు. పూలసాగు, కోత, మార్కెటింగ్ ,పువ్వుల ఎగుమతి ఇలా ప్రతిదీ నేర్చుకున్నాడు. తొలుత చాలా తక్కువ పెట్టుబడితో రైతుల నుండి పూలను సేకరించి వాటితో వ్యాపారం చేయడం ప్రారంభించాడు. 1997లో నగరంలో చిన్న పూల దుకాణాన్ని ప్రారంభించాడు. అలా ఒక పదేళ్లు పనిచేశాక ఇతర పూల పెంపకం దారులతో సహా పరిశ్రమలోని ఇతరులతో పరిచయాలు బాగా పెరిగాయి. దీంతో సొంతంగా పూలసాగులోకి దిగాడు. నేషనల్ హార్టికల్చర్ బోర్డును సంప్రదించి, ప్రభుత్వ రుణం తీసుకొని బెంగళూరులోని దొడ్డబళ్లాపుర సమీపంలోని 10 ఎకరాలతో ప్రారంభించిన పూలసాగు ఆయన ఇప్పుడు 52 ఎకరాలకు చేరింది. 52 ఎకరాల పొలంలో గులాబీలు, జెర్బెరా, కార్నేషన్లు, జిప్సోఫిలా ఇలా 12 రకాలకు పైగా పూలను పండిస్తున్నాడు శ్రీకాంత్. ఏడాదికి దాదాపు 70 కోట్లదాకా సంపాదిస్తున్నాడు.వ్యవసాయంలో ముఖ్యంగా వాతావరణ పరిస్థితులలో మార్పులకారణంగా కష్టాలు, సవాళ్లు చాలా ఉంటాయి. దృఢ సంకల్పం , సహనమే తనను ఉన్నత స్థితికి తీసుకువెళ్లింది అంటాడు శ్రీకాంత్. తన సాగు అంతా సేంద్రీయంగా ఉంటుందనీ, గ్రీన్‌హౌస్‌లు, పాలీహౌస్‌లలో సేంద్రీయంగా పెంచుతానని తెలిపాడు. దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లతో, శ్రీకాంత్ రూ. 70 కోట్ల టర్నోవర్‌ను సాధించాడు. గ్రామీణ కర్నాటక చుటుపక్కల 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ విజయబాటలో నడుస్తున్నాడు. View this post on Instagram A post shared by Bollapally Srikanth (@bollapallysrikanth) -
వేడి, వేడి గులాబీ పకోడీ : వైరల్ వీడియో
వర్షాకాలంలో వేడి వేడి పకోడీలు, బజ్జీలు తినడం కామన్. కానీ గులాబీ పువ్వుల బజ్జీ తినడమే స్పెషల్. అదేంటి అని ఆశ్యర్యపోతున్నారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో హల్చల్ చేస్తోంది.ఉల్లి పకోడీ, క్యాబేజీ, పాలక్ పకోడీ, గోబీపకోడీ ఇలా చాలా వంటకాలను చూసి ఉంటారు. టేస్ట్ చేసి ఉంటారు కూడా కదా. అయితే గులాబీ పకోడీ గురించి విన్నారా? సోషల్ మీడియాలో ఒక వ్యక్తి బండిపై గులాబి పూలతో చేసిన పకోడీలను తయారు చేస్తూ నెట్టింట సందడి చేస్తున్నాడు. < View this post on Instagram A post shared by Blessed Indian Foodie by Omniviam Media (@blessedindianfoodie) ఎర్రటి గులాబీలను కట్ చేసిన శనగపిండిలో ముంచి అచ్చం పకోడీ మాదిరిగా వేడి వేడి నూనెలో వేయించాడు. దాన్ని ఓ కస్టమర్‌కి వడ్డించాడు. గులాబీ పువ్వు పకోడీని ఆరగించిన అతగాడు చాలా బావుంది అంటూ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందించారు. ఇది చూసి మీరు కూడా ఒక పట్టు పడతారో, ఆశ్చర్యపోతారో, నవ్వుకుంటారో, ఆనక కోప్పడతారో మీ ఇష్టం. -
గులాబీలతో గుబాళిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ (ఫోటోలు)
-
వాలెంటైన్స్ డే వేళ... కొన్ని సరదా సంగతులు!
ఫిబ్రవరి 14... వాలెంటైన్స్ డే.. అంటే ప్రేమికుల రోజు. ఆ రోజున ప్రేమికులంతా ఆనంద డోలికల్లో మునిగితేలుతుంటారు. ప్రేమ ఊసులు చెప్పుకుంటారు. అయితే వాలెంటైన్స్ డేకు సంబంధించిన కొన్ని ఆసక్తికర సంగతులు చాలామందికి తెలియవు. వాటిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం. మొదటి వాలెంటైన్ డే వేడుక 15వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో జరిగింది. మొదటి అధికారిక వాలెంటైన్స్ డే పారిస్‌లో జరిగిందని చెబుతారు. ఫిబ్రవరినాటి మధ్యస్థ రోజుల్లో పక్షుల సంభోగంలో పాల్గొంటాయట. అందుకే ఇది శృంగారాన్ని జరుపుకోవడానికి తగిన సమయమని అంటుంటారు. వాలెంటైన్స్ డే నాడు ప్రతి సంవత్సరం 145 మిలియన్ గ్రీటింగ్ కార్డ్‌లను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. యునైటెడ్ స్టేట్స్లో అత్యధిక వాలెంటైన్స్ గ్రీటింగ్ కార్డులు పంచుకుంటారట. పెంపుడు జంతువుల యజమానులలో 25 శాతం మంది వాలెంటైన్స్ డే సందర్భంగా తమ పెంపుడు జంతువులకు వాలెంటైన్స్ డే బహుమతులు ఇస్తారు. అంటే వాలెంటైన్స్ డే.. కేవలం మనుషులకే కాదు కుక్కలు, పిల్లులు,పక్షులు, ఇతర పెంపుడు జంతువులకు సంబంధించినది కూడా. హృదయాకార మిఠాయిలను 1800లో తయారుచేశారట. బోస్టన్ ఫార్మసిస్ట్ ఆలివర్ చేజ్ వీటిని తయారుచేసే ప్రక్రియను సులభతరం చేయడానికి ఒక యంత్రాన్ని కనుగొన్నాడు. ప్రతి సంవత్సరం ఎనిమిది బిలియన్ల హృదయ సంభాషణలు రూపొందిస్తారట. వివిధ రకాల క్యాండీలపై క్లాసిక్ రొమాంటిక్ పదబంధాలలో ‘బి మైన్’, ‘క్యూటీ పై’ ‘ఐ యామ్ యువర్స్’ అనే అక్షరాలను ముద్రిస్తారు. వాలెంటైన్స్ డే నాడుప్రేమికులు 58 మిలియన్ పౌండ్ల విలువైన చాక్లెట్లు, మిఠాయిలను కొనుగోలు చేస్తారట. వాలెంటైన్స్ డే మిఠాయి అమ్మకాలలో గుండె ఆకారంలో ఉండే చాక్లెట్ బాక్స్‌లు దాదాపు 10శాతం ఉంటాయి. 1850లో క్యాడ్బరీ కంపెనీ చాక్లెట్లతో కూడిన బాక్స్ రూపొందించింది. దశాబ్ధకాలం తరువాత మొదటి గుండె ఆకారపు చాక్లెట్ బాక్స్‌ను తయారయ్యింది. మొదటి వాలెంటైన్స్ డే గ్రీటింగ్ కార్డు జైలు నుండి పంపించారు. డ్యూక్ ఆఫ్ ఓర్లీన్స్ 15వ శతాబ్దం ప్రారంభంలో ఖైదీగా మారినప్పుడు మొదటి వాలెంటైన్ లేఖ రాశాడు. దానిలో ఒక కవిత రాసి, తన రెండవ భార్యకు పంపాడు. అయితే అతను జైలులో ఉన్నందున ఆ కవితకు ఆమె నుంచి వచ్చిన స్పందనను అతను చూడలేదు. అత్యధికంగా టీచర్లు వాలెంటైన్డే గ్రీటింగులను అందుకుంటారు. వాలెంటైన్స్ డే కోసం 250 మిలియన్ల గులాబీలను పండిస్తారు! రోమన్ ప్రేమ దేవత వీనస్‌కు ఇష్టమైనవి ఎరుపు రంగు గులాబీలు. ఇవి శృంగారాన్ని, ప్రేమను సూచిస్తాయి. -
గులాబీ పూలతో వెంటపడిన అమ్మాయిలు.. సిగ్గు పడిన హీరో
Female Fans Run Behind Kartik Aaryan With Rose Flowers: బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్. లవర్ బాయ్‌గా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కార్తీక్‌కు విపరీతమైన లేడీ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే ఓ నెటిజన్ రూ. 20 కోట్లు ఇస్తా పెళ్లి చేసుకుంటావా అని కార్తీక్‌కు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఇద్దరు అమ్మాయిలు కార్తీక్ ఇంటికెళ్లి అతను బయటకు రావాలంటూ గోల కూడా చేశారు. మళ్లీ తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో. ఇటీవల వేకేషన్ కోసం గోవా వెళ్లాడు కార్తీక్ ఆర్యన్. అక్కడి నుంచి తిరిగి వస్తూ ముంబై విమానాశ్రయం వద్ద మీడియాకు చిక్కాడు. అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఎర్ర గులాబీలు చేత పట్టుకుని కార్తీక్ వెంటపడ్డారు. కొద్ది సేపటిదాకా అదేం పట్టించుకోకుండా నడిచాడు కార్తీక్. అందులో ఒక అమ్మాయి ఆరోజు తన బర్త్‌డే అని పూల బొకే ఇవ్వగా అందులో కొన్ని గులాబీలు తీసుకున్నాడు. తర్వాత వారితో కలిసి ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చాడు. వాళ్ల అభిమానం చూసి సిగ్గు పడుతూ వెళ్లిపోయాడు కార్తీక్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్ వీడియోపై పలువురు నెటిజన్స్ సూపర్ ఫాలోయింగ్ అంటూ కామెంట్స్ చేయగా, మరికొందరు 'ఇది పబ్లిసిటీ స్టంట్' అంటూ విమర్శిస్తున్నారు. కాగా కార్తీక్ ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్ 'షెహజాదా' 'భూల్ భూలయ్య 2' సినిమాల్లో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
వాడని పూలు వచ్చేస్తున్నాయ్!
గులాబీలను ప్రేమకానుకగా ఇచ్చిపుచ్చుకోవడం చాలాకాలంగా ఉన్న అలవాటే. శుభాకాంక్షలు చెప్పడానికి, అభినందనలు తెలియజేయడానికి గులాబీల గుత్తులను కానుకలుగా ఇస్తూ ఉంటారు. కనువిందు చేసే గులాబీలు ఎక్కువకాలం తాజాగా ఉండవు. ఒకటి రెండు రోజుల్లోనే వాడిపోతాయి. వాటి రేకులు రాలిపోతాయి. ఇక మీదట అంత త్వరగా వాడిపోకుండా ఉండే గులాబీలు అందుబాటులోకి రానున్నాయి. జన్యు మార్పిడి పద్ధతుల్లో త్వరగా వాడిపోని గులాబీలను సృష్టించడానికి చేసిన ప్రయోగాలు ఆశాజనకమైన ఫలితాలను ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జన్యు మార్పిడి ప్రక్రియతో రూపొందించిన ఈ రకం గులాబీలు ఎక్కువకాలం తాజాగా ఉంటాయని, సాధారణమైన గులాబీల కంటే మరింత ఎక్కువ పరిమళం కలిగి ఉంటాయని వారు చెబుతున్నారు. జన్యుమార్పిడితో రూపొందించిన ఈ రకం గులాబీల మొక్కలు ఫంగల్ వ్యాధులను సమర్థంగా తట్టుకుని మరీ పెరగగలవని వివరిస్తున్నారు. చైనాకు చెందిన ‘ఓల్డ్ బుష్’ రకం గులాబీ మొక్కల్లోని లేత చిగుళ్ల నుంచి సేకరించిన డీఎన్ఏలో మార్పులను చేయడం ద్వారా ఆశాజనకమైన ఫలితాలను సాధించామని, మరిన్ని మార్పులతో పూర్తి స్థాయిలో కొత్త రకం గులాబీలను త్వరలోనే రూపొందించనున్నామని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. త్వరగా వాడిపోని, మరింత పరిమళభరితమైన గులాబీలు కొద్ది సంవత్సరాల్లోనే అందుబాటులోకి తీసుకురాగలమని బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ మహ్మద్ బెందహ్మానె తెలిపారు. -
గులాబీ.. ప్రేమికుల రాయబారి
నేడు వాలెంటైన్స్ డేకు ప్రత్యేకం మార్కెట్‌ను ముంచెత్తుతున్న గులాబీలు రూ.50 లక్షల విక్రయాలు జరగొచ్చని వ్యాపార వర్గాల అంచనా భాషకు మాటే ప్రాణం.. మనసుకు భావం వేదం.. ప్రేమకు ప్రేమే సర్వం.. హృదయంలో దాగిఉన్న ప్రేమ వ్యక్తం కావాలంటే.. మనసును గెలిచే, నచ్చే గులాబీకే సాధ్యం. అందుకే వాలెంటైన్స డే పుణ్యమా అని గులాబీల ధర నింగిని తాకుతోంది. - అమలాపురం ‘గులాబీలు.. నీ గుండెలో భావాలను అవతలి హృదయానికి అందంగా వ్యక్తీకరించే మంత్రముగ్ధమైన సాధనాలు’ అని ఓ కవి హృదయం స్పందించింది. నిజమే.. ప్రేమికుల మధ్య రాయబారం నడపడంలో గులాబీలదే అగ్రస్థానం. ప్రేమ లేఖల స్థానంలో గ్రీటింగ్‌లు వచ్చాయి. వాటి స్థానంలో సెల్ఫోన్ల ఎస్ఎంఎస్లు, ఎంఎంఎస్‌లు వచ్చాయి. రహస్యంగా కాదు.. తమ ప్రేమ బహిరంగంగా వ్యక్తం చేయాలనుకునే వారు ఫేస్బుక్, ట్విట్టర్లనూ ఆశ్రయిస్తున్నారు. కాలంతో పాటు ప్రేమ విషయంలో ఎన్ని మార్పులు చోటుచేసుకున్నా.. గులాబీల రాయబారం మాత్రం బలపడుతోంది. ప్రేమికుల దినోత్సవం (వాలెంటెన్స్ డే) రోజున ప్రేమ రాయబారానికి గులాబీ తప్పనిసరి. వందలు, వేల రూపాయల విలువ చేసే ఖరీదైన బహుమతి ఇవ్వడం కంటే.. వాటికి గులాబీలు కూడా కలిస్తేనే ప్రేమికుల రోజు పరిపూర్ణమవుతుంది. ప్రేమికుల రోజుల ప్రపంచ వ్యాప్తంగా 22 కోట్ల గులాబీలు ప్రేమికుల చేతులు మారతాయని ఓ అంచనా. మన జిల్లాలో కూడా ఈ ఒక్కరోజు రూ.50 లక్షల మేర గులాబీల వ్యాపారం జరుగుతుందని అంచనా. కడియం నర్సరీల్లో పూచే గులాబీలకన్నా ప్రేమికులు కట్ రోజస్ (కాడ గులాబీ)ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇందుకోసం పూల వ్యాపారులు బెంగళూరు నుంచి ప్రేమికుల దినోత్సవం కోసం పెద్దఎత్తున గులాబీలు దిగుమతి చేయిస్తున్నారు. ఎరుపు (రెడ్) ప్రేమకు నిర్వచనం ఇదే. ఈ గులాబీ ఇవ్వడం ద్వారా ప్రేమికురాలు, ప్రేమికుడికి ప్రేమను చెప్పడమే కాదు. వారి అందాన్ని అభిమానిస్తున్నట్టు, ప్రేమపై తమ ధైర్యాన్ని వ్యక్తపరిచి, ప్రేమికులకు గౌరవం ఇస్తున్నట్టు భావిస్తారు. తెలుపు (వైట్) తమ ప్రేమ చాలా పవిత్రమైందని తెలుపు గులాబీ ఇవ్వడం ద్వారా ప్రేమికులు వ్యక్తం చేస్తారు. కల్మషం లేని తమ హృదయాన్ని అర్ధం చేసుకోమంటూ ప్రేమపై తమ ఉత్సాహాన్ని చాటుతారు. పసుపు (ఎల్లో) ప్రేమికురాలిని కలిశానన్న సంతోషాన్ని, ఆమె లేదా అతడిపై ఉన్న స్నేహభావాన్ని, కలిసేందుకు వచ్చిన వారికి స్వాగతం చెప్పడం అనేది పసుపు గులాబీ ఇవ్వడం ద్వారా చెబుతారు. గులాబీ (పింక్) ప్రేమికులు పరస్పరం అభినందనలు చెప్పుకోవడానికి, తమ సంపూర్ణ ఆనందానికి ఈ రంగు గులాబీ ఇస్తుంటారు. అలాగే తమలోని దయ, అనుగ్రహాన్ని కూడా ఈ గులాబీ ఇవ్వడం ద్వారా వ్యక్తపరుస్తారు. లేత గులాబీ (లైట్ పింక్) తమలో తియ్యనైన ప్రేమను లేతగులాబీ రంగు గులాబీ ఇవ్వడం ద్వారా ప్రేమికులు వ్యక్తపరుస్తారు. కష్టాల్లో ఉన్న ప్రేమికురాలు లేదా ప్రేమికుడిపై తమన సానుభూతిని కూడా ఈ గులాబీ ద్వారా వ్యక్తం చేసుకుంటారు. నీలం (బ్లూ) ఈ గులాబీ ఇవ్వడం ద్వారా తమ ప్రేమకు ఏదీ అసాధ్యం కాదని ప్రేమికులు నిరూపించుకుంటారు. పెద్దలను కాదని పెళ్లి చేసుకోవడమైనా, కుటుంబాల కోసం త్యాగాలకు సిద్ధపడినా.. దానికి నీలం రంగు గులాబీ ఇస్తారన్న మాట. వంగరంగు (లేవండర్) ఈ గులాబీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ (తొలి చూపులోనే ప్రేమ)కు గుర్తు. ఇలా ప్రేమించేవారు ఈ రంగు గులాబీని ఇస్తుంటారు. నారింజ (ఆరెంజ్) ప్రేమికులు ఈ గులాబీ ఇవ్వడం ద్వారా తమలోని కోరికలను, ప్రేమికుల నుంచి ఆశిస్తున్న ప్రేమను వ్యక్తం చేస్తారు. తమలోని సృజనాత్మకతను, పరస్పరం తమ పరవశాన్ని తెలుపుతారు. -
పుష్ప విలాపం
కవి సమయం ‘ఒకసారి ఒకరికి సన్మానం చేస్తుంటే ముఖ్యఅతిథి వచ్చేటప్పుడు మార్గం పొడవునా పూలరెక్కల్ని చల్లారు. ఆ పెద్దమనిషి వాటిని తొక్కుకుంటూ వచ్చాడు. మరోసారి ఇంటికి వచ్చిన మిత్రుడి చేతికి రెండు గులాబీలు ఇస్తే నేను లోపలికి వెళ్లి వచ్చే లోపల అతడి చేతిలో ఒట్టి తొడిమలే ఉన్నాయి. రెక్కలను తినేశాడు. స్త్రీలు కూడా పుష్పాలను చిత్రహింసల పాలు చేయడం చూశాను. ఈ సంఘటనలన్నీ నన్ను పుష్ప విలాపం రాయడానికి ప్రేరేపించాయి’... - కరుణశ్రీ హుద్ హుద్ వచ్చి విశాఖ చెట్ల తలలు తీసుకెళ్లింది. కాదు... హుద్ హుద్‌తో విశాఖ చెట్లు తమ తలలు తెగిపడేంత వరకూ పోరాడి ప్రజల్ని కాపాడాయి. విశాఖ పౌరులు తమ కోసం కంటే ఈ చెట్ల కోసమే ఎక్కువ విలపించారు. ఒక కొమ్మ, ఒక రెమ్మ, ఒక పూపొద, ఒక బలిష్టమైన కాండం, తరతరాల పాటు ఒక ఇంటినీ వీధినీ ఆ దారిన పోయే ఆప్తులనూ పరికించి చూస్తూ నిలుచున్న మహావృక్షం అన్నీ పోయాయి. కవులు కలాలు అందుకున్నారు. విలపించారు. వృక్ష విలాపాన్ని వర్ణించబూనారు. కాని ఇలాంటి ఏ విపత్తునూ చూడకుండా అనునిత్యం జరుగుతున్న పుష్ప విధ్వంసాన్ని తన మానస మందిరంలో దర్శించి ‘పుష్ప విలాపం’ రాసి చిరకీర్తిని పొందిన కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. పదహారేళ్ల వయసులోనే బుద్ధదేవుని సన్నిధిలో (అమరావతి) ఒక పాకీపిల్ల దైన్యాన్ని చూసి ‘పాకీపిల్ల’ ఖండికను రాసిన కరుణశ్రీ ఆ కరుణనే తన రచనలకు ప్రధాన రసంగా తీసుకున్నారు. ఆయన ఖండ కావ్యాల్లో విశిష్టమైనది ‘ఉదయశ్రీ’. అందులో పౌరాణికంగా చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన పాత్రలను స్వీకరించి రాసిన ‘తపోభంగం’, ‘కుంతీకుమారి’, ‘అనసూయాదేవి’, ‘సతీ సావిత్రి’, ‘పోతన’ వంటి ఖండికలు ఆయనలోని రచనా సౌశీల్యాన్ని నిరూపిస్తాయి. బుద్ధునికి పర్యాయపదంగా ‘కరుణశ్రీ’ కలం పేరును పెట్టుకున్న పాపయ్య శాస్త్రి అంతటి కరుణతో పాటు మబ్బు కంటె మెత్తనైన స్వచ్ఛమైన మనసుతో పిల్లల కోసం అనేక రచనలు చేశారు. చందమామలో కుందేలు, ఇంద్ర ధనుస్సు, ఆదికవి వాల్మీకి వంటి కథలూ గాథలతో పిల్లల ప్రపంచాన్ని సంపద్వంతం చేశారు. ఇక 1942లో తాను పని చేసే ఏ.సి. కళాశాల వార్షిక సంచికలో ఆయన ప్రకటించిన ‘పుష్పవిలాపం’ ఆనాటికీ ఈనాటికీ ఏనాటికీ నిలిచి ఉండే ఒక సుకుమారమైన ప్రకృతి పట్ల ప్రేమపూర్వకమైన రచన. అయితే- ఆయన దీనిని రాయడం ఒకెత్తు ఘంటసాల పాడి అమరత్వం కల్పించడం మరొక ఎత్తు. అసలు ఘంటసాల పాడటం వల్లే పుష్ప విలాపం నలుగురికీ తెలిసి పండిత పామరులకు కూడా ఆత్మీయ ఖండిక అయ్యిందని భావించేవారున్నారు. కాని బంగారమంటూ ఉంటేనే కదా దానికి ఎవరైనా తావి ఇవ్వగలిగినది. పుష్పవిలాపం రాసి కరుణశ్రీ, పాడి ఘంటసాల చిరంజీవులయ్యారు. మనందరం పుష్పవిలాపం అనేకసార్లు వినుంటాం. కన్నీరు కార్చి ఉంటాం. కాని దాని వెనుక ఎటువంటి రాగాలు, ఛాయలు ఉన్నాయో తెలుసుకోలేకపోయి ఉండవచ్చు. సంగీత పరిజ్ఞాని, స్వయంగా సంగీతకారుడు అయిన కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ ఒక సందర్భంలో పుష్పవిలాపానికి ఘంటసాల ఎటువంటి సృజనాత్మక విలువ ఇవ్వగలిగారో వివరించారు. ఘంటసాల తానే స్వయంగా స్వరపరిచి పాడటం వల్ల, హృదయం నుంచి ఇష్టపడి చేయడం వల్ల, తన స్వభావం కూడా కరుణశ్రీ వలే కరుణపూరితమైనది కనుక ఆ ఖండిక అలా సజల నయనాల సౌందర్యాన్ని పొందగలిగింది. తన జీవితకాలంలో అనేక సందర్భాలలో రోహిణీ ప్రసాద్ రాసిన సంగీత ప్రధాన వ్యాసాలను ఇటీవల హెచ్.బి.టి ‘సంగీతం రీతులు- లోతులు’ పేరిట వెలువరించింది (ప్రతులకు: 040- 23521849). అందులో పుష్పవిలాపం ఖండికను ఘంటసాల పాడటంలోని విశేషాలను వివరించిన వ్యాసాన్ని ఇక్కడ ఇస్తున్నాం. - సాక్షి సాహిత్యం పుష్పవిలాపం రాశాక కరుణశ్రీకి కొన్ని విశిష్ట అనుభవాలు ఎదురయ్యాయి. ఒకసారి ఆయన ట్రైన్లో వెళుతుంటే పుస్తకాలమ్మే వెండర్ వచ్చి- ఘంటసాల పుష్పవిలాపం కావాలా... చాలా బాగుంటుంది అని అమ్మజూపాడు. మరోసారి ఇద్దరు మెడికో అమ్మాయిలు వచ్చి ఇక జీవితంలో ఎప్పుడూ పూలను హింసించమనీ పూలు పెట్టుకోమనీ ప్రతిజ్ఞ చేసి వెళ్లారు... ఘంటసాల పాడిన ‘పుష్ప విలాపం’లో కరుణశ్రీ రాసిన అన్ని పద్యాలు లేవు. బహుశా రికార్డింగ్‌కు వీలుగా ఆరు పద్యాలనే తీసుకొని, పాడి, 78 ఆర్.ఎం.పి. రికార్డులో విడుదల చేశారు. ఇందులోని రాగాలన్నీ హిందుస్తానీవే. భావ ప్రధానంగా సాగే కవిత్వానికి ఈ రాగాలు ఎంచుకోవడం సహజమేనేమో. మధ్య మధ్య ఘంటసాల తాను రాసిన వచనాన్ని భావభరితంగా వినిపిస్తారు. ఇందులో మొదటి పద్యాన్ని ‘మాండ్ రాగం’లో వింటాం. ఆహ్లాదకరమైన గంట సవ్వడి వినిపిస్తూ ఉండగా మనం పూలతోటలోకి ప్రవేశిస్తాం. పూజ, దేవాలయం, ప్రాతఃకాలం అన్నీ స్పష్టంగా ఆడియోలో వినిపిస్తాయి. ఇందులో ‘బావురుమనడం, క్రుంగిపోవడం’ వంటి పదాలు ఉన్నప్పటికీ పెద్దగా విషాదఛాయలు వినపడవు. చివర ఒక సున్నిత రాగాలాపన ఉంటుంది. నేనొక పూల మొక్కకడ నిల్చి చివాలున కొమ్మ వంచి గో రానెడునంతలోన విరులన్నియు జాలిగ నోళ్లు విప్పి మా ప్రాణము తీతుగా యనుచు బావురుమన్నవి; క్రుంగిపోతి; నా మానసమందెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై తరువాతి పద్య ‘మారు బిహాగ్’ రాగంలోనిది (యమునా తీరమున అనే పాట ఈ రాగంలోనిదే). శుద్ధ మధ్యమం వాడే సంప్రదాయాన్ని పంట్టించుకోలేదు కనుక కాస్త కల్యాణిలా అనిపిస్తుంది. కొత్త రాగమని కాబోలు, చివరలో కాస్త దీర్ఘమైన రాగాలాపన ఉంది. ఆయువు గల్గు నాల్గు గడియల్కని పెంచిన తీవతల్లి జా తీయత దిద్ది తీర్తుము తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై నూయలలూగుచు న్మురియచుందుము ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివేళ్లపై దీని తరువాతిది ‘బసంత్ రాగం’. బహుశా ఈ రాగాన్ని ఇంత ఖచ్చితంగా ఏ ఇతర తెలుగు సినీ సంగీత దర్శకుడూ వాడుకోలేదేమో. జాలిని ప్రతిఫలించే స్వరసముదాయంతో చేసిన అద్భుత స్వర రచన ఇది. ప్రతిభావంతుడైన విద్వాంసుడు పద్ధతి ప్రకారం గురువు దగ్గర నేర్చుకోకపోయినా రాగాలను అర్థం చేసుకోగలడనడానికి ఇదొక ఉదాహరణ. గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు భృం గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు మిమ్ముబోంట్ల నే త్రాలకు హాయిగూర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థబుద్ధితో తాళుము త్రుంచబోకుము తల్లికి బిడ్డకు వేరు చేతువే అంతటితో రికార్డు ఒక వైపు ముగిసి రెండో వైపు తిప్పి ప్లే చేయగానే మంచి లయ వినిపిస్తుంది. దీంతో మూడ్ మారినట్టనిపిస్తుంది. తన సినిమా పాటల్లో ఘంటసాల పహాడీ రాగాన్ని ఏమాత్రం వాడుకున్నారో కాని ఈ పద్యం మాత్రం ఆ రాగంలోనిదే. పైగా భావంలోని నిందకు సరిగ్గా సరిపోయే రాగం ఇది. ఊలుదారాలతో గొంతులకురి బిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చటముడులమమ్ము అకట దయలేనివారు మీ యాడవారు తరువాతి రాగం కరుణరసాన్ని ప్రతిబింబించే ‘మిశ్ర శివరంజని’. పద్యాలన్నిటి తరువాత చివరికి పాడిన ‘ప్రభూ’ అనే ‘కోడా’లో కూడా ఈ రాగచ్ఛాయలే వినిపిస్తాయి. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధమరంద మాధురీ జీవితమెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె మా యౌవన మెల్ల కొల్లగొని ఆపయి చీపురుతోడ చిమ్మి మ మ్మావల పారవోతురు గదా నరజాతికి నీతి యున్నదా? చివరి పద్యం రాగేశ్రీ రాగం. హాయిగా సాగే ఈ పద్యంలో కవిగారు మనల్ని చివాట్లు పెడుతున్నప్పటికీ మనకు సుతిమెత్తగా వీడ్కోలు చెబుతున్నట్టుగానే ఉంటుంది. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి అందమును హత్యచేసెడి హంతకుండ మైలపడిపోయెనోయి నీ మనుజ జన్మ... ఇన్నేళ్లలో ఎన్నో ఆడియో వీడియోలు వెలువడ్డాయి. ఇంత సులభంగా భావాన్ని ఎవరైనా పలికించగలగారా అంటే లేదనే చెప్పాలి. పేరు ప్రఖ్యాతుల మీద పెట్టినంత శ్రద్ధ సంస్కారం పొందడం మీద పెట్టకపోవడం వల్లే ఈ అవస్థ. జీవించినంత కాలం తన సంస్కారంతో పాటను ఉన్నతీకరించిన ఘంటసాలకు మనం సెల్యూట్ చేయాలి. - కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ -
పెళ్లి కూతురికి పువ్వుల శోభ
పుట్టినింటి బంగారుతల్లి, మెట్టినింట సిరులరాణిగా, మారే శుభతరుణాన సిరిమల్లెలదే ప్రధాన అలంకరణ. ముద్దబంతిలాంటి మోము ,ముచ్చటైన వేడుకకు మురిసేవేళ గులాబీలదే అసలైన అలంకరణ. ఇంతుల నాజూకు చేతుల్లో వరసలుగా రూపుకట్టిన చామంతులదే చూడచక్కని అలంకరణ. మల్లెలు, గులాబీలు, చామంతులు.. పూలతేరులా వధువు మేనికి సింగారంలా మారితే...‘ఎంతందంగా ఉన్నావే..’ అంటూ ఆమె నవ్వులతో పోటీపడటమే సిసలైన అలంకరణ. వివాహ వేడుకలలో పువ్వుల సుగంధాలదే పెద్దపీట. పెళ్లికి ముందు జరిపే సంగీత్, మెహిందీ సంబరాల్లో బంగార ం కన్నా వధువుకు పువ్వులనే ఆభరణాలుగా అలంకరించడం ట్రెండ్‌గా మారుతోంది. వధువుతో పాటూ వేడుకలో పాల్గొనే ప్రతి పడతీ పువ్వుల అలంకరణ పట్ల మక్కువ చూపుతోంది. ఉత్తరభారతదేశంలో మొదలైన ఈ కళ ఇప్పుడు దక్షిణభారతదేశపు తెలుగింటి లోగిళ్లలోనూ సందడి చేస్తోంది. పువ్వుల ఎంపిక: బంతి, చామంతి, లిల్లీ, మల్లెమొగ్గలు, గులాబీలు.. ఏ పువ్వులనైనా ఆభరణాల అలంకరణకు ఎంచుకోవచ్చు. మెడలో హారాలు, చెవి లోలాకులు, వేళ్లకు ఉంగరాలు, కాళ్లపట్టీలు, గాజులు.. అన్నీ పువ్వులే! అయితే ధరించిన దుస్తుల రంగుకు సూటయ్యేలా పువ్వుల ఎంపిక ఉండాలి. ఆభరణాల తయారీకి ఎంపిక... ఎంపికచేసుకున్న పువ్వులు, కుందన్స్ పొదిగిన లాకెట్స్, చమ్కీ, పూసలు, ముత్యాలు, బంగారు వర్ణపు లేసు, ఇతర ఆభరణాలు... ఇవన్నీ జతచేర్చడానికి సూది-దారం. మనిషి రూపురేఖలను బట్టి ఎంత పరిమాణంలో ఆభరణాలను తయారు చేయాలో ముందుగా కొలతలు తీసుకోవాలి. రకరకాల రూపాల్లో పువ్వుల ఆభరణాలను నచ్చిన విధంగా తయారు చేసుకున్నాక, వాటిని లేసుకు గుచ్చాలి. ఆ పైన నచ్చిన లాకెట్స్ జత చేయాలి. చిన్న చిన్న లాకెట్స్లా రూపొందించిన పువ్వులను ఇతర ఆభరణాలకూ అమర్చుకోవచ్చు. పువ్వుల ఆభరణాలకు విడిగా హుక్స్ అమర్చుకోవచ్చు. లేదా ఎలాంటి ఆభరణాలు అవసరం లేకుండా జరీ దారాలతోనూ కట్టేసుకోవచ్చు. నోట్: పువ్వుల ఆభరణాలు త్వరగా వాడిపోకుండా తయారీలో మొగ్గలు ఎక్కువ ఉపయోగించాలి. చల్లదనం ఉంటే పువ్వులు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. మాఘమాసం పెళ్లి పందిళ్లు పువ్వుల అలంకరణతో మెరిసిపోతే... అతివల నగుమోము ఇలా పువ్వుల ఆభరణాల మధ్య మురిసిపోతుంది. - నిర్మలారెడ్డి మోడల్: గ్రీష్మ, ఫొటోలు: శివమల్లాల - కల్పన పువ్వుల ఆభరణాల నిపుణురాలు www.pellipoolajada.com -
ప్రేమను పంచే రోజు
-
ఒక కొమ్మకు పూసిన 17 పువ్వులం..
సూర్యాపేట: ఒక కొమ్మకు పూసిన పువ్వులం..అనురాగం మనదేలే.., ఒక గూటికి వెలిగిన దివ్వెలం..మమకారం మనదేలే.. అన్నాడో సినీకవి. సాధారణంగా గులాబీ చెట్టుకు ఆరు నుంచి ఏడు వరకు పూలు లేదా మొగ్గలు ఉంటాయి. కానీ, ఈ గులాబీచెట్టుకు పూలు, మొగ్గలు కలిపి 17 వరకు ఉన్నాయి. నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని బొడ్రాయి బజార్లో గల నారాయణదాసు ఇంట్లోని ఈ గులాబీ చెట్టు విరగబూయడంతో పలువురు ఆసక్తిగా చూస్తున్నారు.