గులాబీ పూలతో వెంటపడిన అమ్మాయిలు.. సిగ్గు పడిన హీరో | Female Fans Run Behind Kartik Aaryan With Rose Flowers | Sakshi
Sakshi News home page

Kartik Aaryan: గులాబీ పూలతో వెంటపడిన అమ్మాయిలు.. సిగ్గు పడిన హీరో

Published Tue, Mar 22 2022 6:06 PM | Last Updated on Tue, Mar 22 2022 6:10 PM

Female Fans Run Behind Kartik Aaryan With Rose Flowers - Sakshi

Female Fans Run Behind Kartik Aaryan With Rose Flowers: బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్. లవర్‌ బాయ్‌గా క్రేజీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉ‍న్న కార్తీక్‌కు విపరీతమైన లేడీ ఫాలోయింగ్‌ ఉంది. ఇటీవలే ఓ నెటిజన్‌ రూ. 20 కోట్లు ఇస్తా పెళ్లి చేసుకుంటావా అని కార్తీక్‌కు మ్యారేజ్ ప్రపోజల్‌ పెట్టిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఇద్దరు అమ్మాయిలు కార్తీక్‌ ఇంటికెళ్లి అతను బయటకు రావాలంటూ గోల కూడా చేశారు. మళ్లీ తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఈ హ్యాండ్సమ్‌ హీరో. ఇటీవల వేకేషన్‌ కోసం గోవా వెళ్లాడు కార్తీక్‌ ఆర్యన్‌. అక్కడి నుంచి తిరిగి వస్తూ ముంబై విమానాశ్రయం వద్ద మీడియాకు చిక్కాడు. 

అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఎర్ర గులాబీలు చేత పట్టుకుని కార్తీక్ వెంటపడ్డారు. కొద్ది సేపటిదాకా అదేం పట్టించుకోకుండా నడిచాడు కార్తీక్. అందులో ఒక అమ్మాయి ఆరోజు తన బర్త్‌డే అని పూల బొకే ఇవ్వగా అందులో కొన్ని గులాబీలు తీసుకున్నాడు. తర్వాత వారితో కలిసి ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చాడు. వాళ్ల అభిమానం చూసి సిగ్గు పడుతూ వెళ్లిపోయాడు కార్తీక్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియోలో చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్‌ వీడియోపై పలువురు నెటిజన్స్‌ సూపర్‌ ఫాలోయింగ్‌ అంటూ కామెంట్స్‌ చేయగా, మరికొందరు 'ఇది పబ్లిసిటీ స్టంట్' అంటూ విమర్శిస్తున్నారు. కాగా కార్తీక్‌ ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్‌ 'షెహజాదా' 'భూల్‌ భూలయ్య 2' సినిమాల్లో నటిస్తున్నాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement