Pakodi
-
వేడి, వేడి గులాబీ పకోడీ : వైరల్ వీడియో
వర్షాకాలంలో వేడి వేడి పకోడీలు, బజ్జీలు తినడం కామన్. కానీ గులాబీ పువ్వుల బజ్జీ తినడమే స్పెషల్. అదేంటి అని ఆశ్యర్యపోతున్నారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో హల్చల్ చేస్తోంది.ఉల్లి పకోడీ, క్యాబేజీ, పాలక్ పకోడీ, గోబీపకోడీ ఇలా చాలా వంటకాలను చూసి ఉంటారు. టేస్ట్ చేసి ఉంటారు కూడా కదా. అయితే గులాబీ పకోడీ గురించి విన్నారా? సోషల్ మీడియాలో ఒక వ్యక్తి బండిపై గులాబి పూలతో చేసిన పకోడీలను తయారు చేస్తూ నెట్టింట సందడి చేస్తున్నాడు. < View this post on Instagram A post shared by Blessed Indian Foodie by Omniviam Media (@blessedindianfoodie) ఎర్రటి గులాబీలను కట్ చేసిన శనగపిండిలో ముంచి అచ్చం పకోడీ మాదిరిగా వేడి వేడి నూనెలో వేయించాడు. దాన్ని ఓ కస్టమర్‌కి వడ్డించాడు. గులాబీ పువ్వు పకోడీని ఆరగించిన అతగాడు చాలా బావుంది అంటూ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందించారు. ఇది చూసి మీరు కూడా ఒక పట్టు పడతారో, ఆశ్చర్యపోతారో, నవ్వుకుంటారో, ఆనక కోప్పడతారో మీ ఇష్టం. -
ఇది పకోడీ కాలం..
ఇది వర్షాకాలం. వాన చినుకులు పడుతుంటే... వేడి వేడి పకోడీలు తింటూ గరం గరం చాయ్ తాగుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఏడాదంతా వర్షాకాలమే ఉంటే బావుణ్ననిపిస్తుంది. ఇది వర్షాకాలం కాదు పకోడీల కాలం అనాలనిపిస్తుంది.పోహా పకోడీ..కావలసినవి:అటుకులు– ఒకటిన్నర కప్పులు;బంగాళాదుంప– అర కప్పు(ఉడికించి చిదిమినది);కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు;పచ్చిమిర్చి తరుగు– టీ స్పూన్;మిరప్పొడి– టీ స్పూన్;చక్కెర – అర టీ స్పూన్;నిమ్మరసం – అర టీ స్పూన్;జీలకర్ర– అర టీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నూనె– వేయించడానికి తగినంత.తయారీ:– అటుకులను ఒక పాత్రలో వేసి (అటుకులు తేలేటట్లు) నిండుగా నీటిని పోసి కడిగి వడపోత గిన్నెలో వేయాలి.– నీరంతా కారిపోయిన తర్వాత తీసి వెడల్పు పాత్రలో వేసుకోవాలి.– అందులో ఉడికించి చిదిమిన బంగాళాదుంప, కొత్తిమీర, పచ్చిమిర్చి, మిరప్పొడి, చక్కెర, జీలకర్ర, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి.– ఈ మిశ్రమం అంతటినీ చిన్న నిమ్మకాయంత గోళీలుగా చేసుకోవాలి.– బాణలిలో నూనె వేడి చేసి, మరుగుతున్న నూనెలోఒక్కో గోళీని మెల్లగా వేయాలి.– మంటను మీడియంలో పెట్టి దోరగా వేగనివ్వాలి.– అన్నివైపులా ఎర్రగా వేగిన తర్వాత చిల్లుల గరిటతో తీసి టిష్యూ పేపర్ మీద వేస్తే పోహా పకోడీ రెడీ. వీటికి పుదీన చట్నీ లేదా టొమాటో కెచప్ మంచి కాంబినేషన్.కార్న్ పకోడీ..కావలసినవి:స్వీట్ కార్న్ గింజలు– 2 కప్పులు;అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు;జీలకర్ర– అర టీ స్పూన్;శనగపిండి– 3 టేబుల్ స్పూన్లు;బియ్యప్పిండి– 3 టేబుల్ స్పూన్లు;గరం మసాలా – అర టీ స్పూన్;ఉల్లిపాయ – ఒకటి (తరగాలి);పచ్చిమిర్చి – 2 (తరగాలి);కరివేపాకు – 2 రెమ్మలు;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;పసుపు – పావు టీ స్పూన్;మిరప్పొడి– అర టీ స్పూన్;నూనె – వేయించడానికి తగినంత.తయారీ:– మొక్కజొన్న గింజలను కడిగి చిల్లుల పాత్రలో వేసి నీరు పోయే వరకు ఉంచాలి.– ఈ లోపు ఒక పాత్రలో నూనె మినహా పైన తీసుకున్నవన్నీ వేసి కలపాలి.– మొక్కజొన్న గింజల్లో గుప్పెడు గింజలను తీసి పక్కన పెట్టి మిగిలిన గింజలను మిక్సీలో కచ్చపచ్చాగా గ్రైండ్ చేయాలి.– ఇప్పుడు పక్కన పెట్టిన గింజలను కూడా శనగపిండి మిశ్రమంలో వేసి కలపాలి.– బాణలిలో నూనె మరిగించి పకోడీ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని వేళ్లతో కొద్దికొద్దిగా నూనెలో వేయాలి.– దోరగా వేగిన తర్వాత తీసి టిష్యూ పేపర్ మీద వేస్తే వేడి వేడి కార్న్ పకోడీలు తినడానికి రెడీ. ఇలాగే పిండినంతటినీ చేసుకోవాలి. -
కొత్తిమీర తాజాగా, పకోడీలు క్రిస్పీగా, క్రంచీగా: ఈ టిప్స్ పాటించండి!
వంట చేసేటపుడు కొన్ని చిట్కాలు పాటించడమో, లేదా కొన్ని ఇంగ్రీడియంట్స్ అదనంగా కలపడమో తప్పని సరి. లేదంటే ఎంత కష్టపడి చేసిన వంట అయినా రుచిని కోల్పోతుంది. అలాగే ముఖ్యమైన పోషకాలను కోల్పోతాం. లేదా ఒక్కోసారి అసలు టేస్టే లేకుండా పోతుంది. అందుకే ఈ టిప్స్ ఒకసారి చూడండి. ♦ పకోడీలు మెత్తబడకుండా ఎక్కువ సేపు కరకరలాడుతూ ఉండాలంటే పావు కేజీ శనగపిండిలో గుప్పెడు మొక్కజొన్న పిండి కలపాలి. ♦ పూరీలు నూనె తక్కువ పీల్చుకుని, పొంగి కరకరలాడాలంటే పూరీలు వత్తేటప్పుడు బియ్యప్పిండి చల్లుకోవాలి. ♦ కూరగాయలను తొక్క తీసి, తరిగిన తర్వాత నీటిలో శుభ్రం చేస్తే అందులోని పోషకాలు నీటిలో కరిగిపోతాయి. ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్లను నష్టపోతాం. కాబట్టి తొక్క తీయడమైనా, తరగడమైనా నీటితో శుభ్రం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. అలాగే తరిగిన వెంటనే వండాలి. పై నియమాన్ని వంకాయలకు పాటించడం కష్టం. ఎందుకంటే తరిగిన వెంటనే నీటిలో వేయకపోతే వంకాయ ముక్కలు నల్లబడడంతోపాటు చేదుగా మారతాయి. కాబట్టి ముందుగా వంకాయలను ఉప్పు నీటిలో కడిగి ఆ తర్వాత తరిగి మళ్లీ నీటిలో వేయాలి. ♦ యాపిల్‌ను కట్ చేసి, ఆ ముక్కలను ప్లేట్లో అమర్చి సర్వ్ చేసే లోపే ముక్కలు రంగు మారుతుంటాయి. కాబట్టి కట్ చేసిన వెంటనే ఆ ముక్కల మీద నిమ్మరసం చల్లితే ముక్కలు తాజాగా ఉంటాయి. చాకును నిమ్మరసంలో ముంచి కట్ చేయడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. ♦ కొత్తిమీరను పలుచని క్లాత్ బ్యాగ్‌లో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచితే ఆకులు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. -
ఇదేందయ్యా ఇది? నేను ఎప్పుడూ చూడలే.. పకోడీ తయారీలో భారీ ట్విస్ట్?
ప్రపంచంలో అణువణువునా ఆహార ప్రియులు కనిపిస్తారు. ఈ ఫుడ్ లవర్స్ కారణంగానే కొత్త ప్రయోగాలతో వినూత్న ఆహారాలు పుట్టుకొస్తుంటాయి సోషల్ మీడియాలో వంటల ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు లెక్కలేనన్ని కనిపిస్తాయి. తాజాగా ఒక వీడియో హల్చల్ చేస్తోంది. ఒక మహిళ ఉడికించిన బంగాళ దుంపలు, బిస్కెట్లు కలిపి వినూత్న రీతిలో పకోడీలు తయారు చేసింది. ఈ వీడియో చూసిన వారంతా రకరకాల కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వీడియో మొదట్లో ఆ మహిళ పకోడీల తయారీకి వినియోగించే శనగపిండిలో బిస్కెట్లను ముంచడాన్ని గమనించవచ్చు. ఆ తరువాత వాటిని ఆమె వేడి నూనెలో వేయిస్తుంది. అయితే వీడియోలో ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఆమె ఈ బిస్కెట్ పకోడీలను వేయించడానికి ముందు.. మొదటగా బంగాళాదుంపలను ఉడకబెట్టి మెత్తగా చేస్తుంది. దానికి వేయించిన మసాలా దినుసులు కలుపుతుంది. తరువాత రెండు బిస్కెట్ల మధ్య ఆ బంగాళదుంప మసాలా ముద్దను ఉంచి, వాటిని పకోడీలు చేయడానికి ఉపయోగించే పిండిలో ముంచి, డీప్ ఫ్రై చేస్తుంది. చివరగా ఆమె వాటిని సాస్‌తో కూడిన ప్లేట్లో సర్వ్‌చేస్తుంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @Shayarcasm అనే ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 20 వేల మందికి పైగా యూజర్లు వీక్షించారు. ఈ 58 సెకన్ల వీడియోపై ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా చూడండి: వాయు కాలుష్యంతో క్యాన్సర్? ‘ఎయిమ్స్’ నిపుణులు ఏమంటున్నారు? Gujjus have gone INSANE. pic.twitter.com/7VXRZzjOcP — 𝐌𝕒𝕟𝕥𝕠™ 𝚏𝚊𝚗 (@Shayarcasm) November 3, 2023 -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఇలా చేయండి
రైస్ పకోడా ఎలా చేయాలంటే.. కావల్సిన పదార్థాలు: అన్నం – 1 కప్పు,ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి – పావు కప్పు చొప్పున కారం – 1 టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్ ధనియాల పొడి – 1 టీ స్పూన్ , కొత్తిమీర తురుము – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో అన్నం వేసుకుని.. మెత్తగా పప్పు రుబ్బు కర్రతో ఒత్తుకుకోవాలి. అనంతరం దానిలో శనగపిండి, కారం, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర తురుము, ఉప్పు.. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి. అనంతరం కాగే నూనెలో.. పకోడీల్లా దోరగా వేయించుకుని.. సర్వ్ చేసుకోవాలి. -
Recipe: బంగాళదుంప, శనగపిండి, బియ్యప్పిండితో మరమరాల పకోడా!
మరమరాలు, బంగాళదుంప, శనగపిండి, బియ్యప్పిండితో ఇలా పకోడాలు తయారు చేసుకోండి. మరమరాల పకోడా తయారీకి కావలసినవి: ►మరమరాలు – రెండున్నర కప్పులు ►ఉల్లిపాయ ముక్కలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ►పచ్చిమిర్చి ముక్కలు – రెండు టీ స్పూన్లు ►బంగాళదుంప – 1 (ఉడికించి, ముద్దలా చేసుకోవాలి) ►కొత్తిమీర తురుము – పావు కప్పు ►అల్లం తురుము – అర టీ స్పూన్ ►శనగపిండి – పావు కప్పు, ►బియ్యప్పిండి – రెండున్నర కప్పులు ►వేరుశనగలు – టేబుల్ స్పూన్ (కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి) ►కారం, ధనియాల పొడి – టీ స్పూన్ చొప్పున ►ఉప్పు – తగినంత ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ►ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. మరమరాలు, బంగాళదుంప ముద్ద, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, అల్లం తురుము, శనగపిండి, బియ్యప్పిండి, వేరుశనగల మిశ్రమం, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. ►నూనె వేడి చేసుకుని.. పకోడాలా దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Nuvvula Annam: చిన్నా పెద్దా లొట్టలేసుకుంటూ తినేలా నువ్వుల అన్నం తయారీ ఇలా Amla Candy: ఆరోగ్య లాభాలెన్నో.. ఇంట్లోనే ఇలా ఆమ్ల క్యాండీ తయారీ -
Recipe: స్వీట్ కార్న్, పాలకూర.. కార్న్ పాలక్ పకోడి తయారీ ఇలా..
ఉల్లిపాయ పకోడి బోర్ కొడితే ఈ వర్షాకాలంలో కార్న్ పాలక్ పకోడి రెసిపీ ట్రై చేయండి. కావలసినవి: ►పాలకూర – కప్పు ►స్వీట్ కార్న్ గింజలు – కప్పు ►శనగపిండి – రెండు కప్పులు ►కారం – మూడు టీస్పూన్లు ►అల్లం తరుగు – రెండు టీస్పూన్లు ►జీలకర్ర పొడి – నాలుగు టీస్పూన్లు ►ఉప్పు – రుచికి సరిపడా ►నూనె – డీప్‌ఫ్రైకి తగినంత. తయారీ: ►ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి గిన్నెలో వేయాలి. ►పాలకూర వేసిన గిన్నెలో నూనె తప్పించి మిగతా పదార్థాలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లుపోసి పకోడి పిండిలా కలుపుకోవాలి. ►నూనె వేడెక్కిన తరువాత కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించి తీసేయాలి. ►వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఈ పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేయండి: Idiyappam Pulihora Recipe: బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి.. ఇడియప్పం పులిహోర Capsicum Rings Recipe: రుచికరమైన క్యాప్సికమ్ రింగ్స్ తయారీ ఇలా! -
Recipe: ముసురుకి దుప్పటి ముసుగేయకుండా.. ఇలా ఫిష్ పకోడి చేసుకోండి!
ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వానల్లో.. నోటికి కాస్త కారంగా, క్రిస్పీగా తినాలనిపిస్తుంటుంది. ముసురుకి దుప్పటి ముసుగేయకుండా ఎంజాయ్ చేస్తూ యాక్టివ్‌గా ఉండాలంటే... వేడివేడిగా కరకరలాడే స్నాక్స్ ఉండాల్సిందే. ఎక్కువ సమయం లేదా..? సులభంగా, త్వరగా ఇలా ఫిష్ పకోడి చేసుకోండి! ఫిష్ పకోడి కావలసినవి: ►చేపముక్కలు – అరకేజీ ►అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు టీస్పూన్లు ►నిమ్మరసం – టేబుల్ స్పూను ►శనగపిండి – పావు కప్పు ►కార్న్ ఫ్లోర్ – మూడు టేబుల్ స్పూన్లు ►కారం – రెండు టీస్పూన్లు ►గరం మసాలా – టీస్పూను ►వాము పొడి – అరటీస్పూను ►గుడ్డు – ఒకటి ►ఉప్పు – రుచికి సరిపడా ►నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. ఫిష్ పకోడి తయారీ విధానం ►ముందుగా చేపముక్కలను శుభ్రంగా కడిగి గిన్నెలో వేయాలి. ►దీనిలో అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ►ముక్కలకు పట్టించిన తరువాత పదినిమిషాలు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి ►మరో గిన్నెలో శనగపిండి, కార్న్‌ఫ్లోర్, కారం, గరం మసాలా, వాముపొడి, గుడ్డు సొన, అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు పోసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి ►పది నిమిషాల తరువాత చేపముక్కలను కలిపి మరో పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి ►ఇప్పుడు చేప ముక్కలను తీసుకుని శనగపిండి మిశ్రమంలో ముంచి డీప్‌ఫ్రై చేసుకోవాలి ►ముక్క రెండువైపులా బంగారు వర్ణం, క్రిస్పీగా మారేంత వరకు ఫ్రై చేసి సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Chilakada Dumpa Poorilu: నోరూరించే చిలగడదుంపల పూరీ తయారీ ఇలా! Mutton Keema Cheese Samosa: మటన్ కీమా- చీజ్ సమోసా ఇంట్లో ఇలా ఈజీగా చేసుకోండి! -
ఓరి నీ యేషాలో.. యాపిల్ పకోడీ అట! వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నెట్ అనేది ఒక వింతల పుట్ట. ఎవరి బుర్రలో తోచింది వారు క్రియేటివ్ అమల్లో పెట్టి సోషల్‌మీడియాలో వైరల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ ప్రపంచంలోని జరిగే వింతలు, విశేషాలు, గందరగోళాలు క్షణాల్లో మన కళ్ల ముందుటున్నాయి. ఇటీవలికాలంలో విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్లు కొత్త ట్రెండ్.. తాజాగా యాపిల్ పకోడీ అంటూ వింత వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది. అదేంటి యాపిల్ పకోడీ అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే ఈ వీడియో మీకోసమే. అదేదో సినిమాలో బంగాళా బౌబౌ అంటూ జంధ్యాల గిలిగింతలు గుర్తున్నాయా? ఇటీవలికాలంలో ఫాంటా మ్యాగీ, కుల్డ్ మోమోస్, ఓరియో పకోడా అంటూ రకరకాల వంటకాల వీడియోలను చూశాం. అలాగే పానీపూరీ ఐస్‌క్రీమ్, మోమోస్ పరాటా లాంటివీడియోలను ఎంజాయ్ చేశాం. మిర్చీ , పకోడీ చేసినట్టుగా యాపిల్ పకోడీతో ట్రెండింగ్‌లోకి వచ్చాడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. వీడియోలో, ఫుడ్ వ్లాగర్ యాపిల్‌లను ముక్కలుగా చేసి , దానిని పిండిలో ముంచి, ఆ తరువాత వేడి నూనెలో వేయించాడు. కాసేపు వేయించిన తర్వాత, దానిని టేస్ట్ చేసి “యమ్మీ” అంటూ లొట్ట లేయడం ఈ వీడియోలు చూడొచ్చు. ఈ సరికొత్త వంటకాన్ని చేసి తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది ఫుడ్ లవర్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంటే కొంతమంది నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తుండటం విశేషం. ఈ వీడియో 7400 కంటే ఎక్కువ లైక్‌లు, అనేక కామెంట్లను సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Whathowtry (@whathowtry) -
విచిత్రమైన వంటకం...అదే ఏం పకోడి రా బాబు!
ఇంతవరకు చెఫ్‌లు చేసే సరికొత్త రకాల పకోడిలను మనం చూశాం. అంతేందుకు బ్రెడ్లతో కూడా రకరకాలగా పకోడిలు వేశారు. కానీ బిస్కెట్స్‌తో ఎప్పుడైన పకోడిలను చూశారా. అవును మీరు వింటుంది నిజమే. ఏంటి బిస్కెట్ పకోడి అని ఆలోచించించేస్తూ కూర్చోకండి. అదేంటో ఎలా చేస్తారో చూసేద్దాం రండి. (చదవండి: ‘ప్రవేశం లేదు’ బోర్డు.. ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి!) అసలు విషయంలోకెళ్లితే...అహ్మదాబాద్‌లో ఒక స్ట్రీట్ ఫుడ్‌లో ఈ ఓరియో పకోడిలను తయారు చేస్తున్నారు. ఈ వంటకానిన సెనగపిండితో చేసే బజ్జీల మాదిరిగా ఓరియో బిస్కెట్‌ని సెనగపిండిలో ముంచి ఆయిల్లో బంగారు రంగు వచ్చేంత వరకు వేయించేస్తున్నాడు. పైగా దీన్ని వేయించిన పచ్చిమిర్చితోపాటు ఖర్జురం జట్నీతో సర్వ్ చేస్తున్నాడు. అంతేకాదు ఒక ప్లేట్ ఓరియో పకోడి ధర రూ.20 చొప్పున అమ్ముతున్నాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: దుపట్టా మేరా సాంగ్‌కు దుమ్ములేపేశారు..) -
నాడు ఫిరంగులకు..నేడు పకోడీలకు ప్రసిద్ధి
యడ్లపాడు(గుంటూరు): హైదరాబాద్ బిర్యానీ.. రాజస్తానీ పానీపూరీ.. ఆత్రేయపురం పూతరేకులు.. కాకినాడ కాజ.. మచిలీపట్నం బందర్‌లడ్డు.. మందస కోవా.. గుంటూరు కారం.. ఇవన్నీ తయారు చేసే విధానం ఒకటే. పట్టణం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో సైతం నిత్యం అందుబాటులో ఉంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో తయారైన ఐటం ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. అందుకే ఆయా ప్రాంతాల పేరుతో అవి ప్రసిద్ధి చెందాయి. అలా ప్రసిద్ధి చెందిన స్నాక్‌ఐటంలలో ‘మసాలా పకోడి’ ఒకటి. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఫిరంగిపురం మసాలా పకోడి తయారీకి ప్రత్యేకమని చెప్పాలి. మసాలా ఐటమ్స్‌లో ‘మగధీర’ మనం మసాలా దోశ, మసాలా వడ, మసాలా ఇడ్లీ, ముంత మసాలా (పిడతకింద పప్పు) ఇలా మసాలాతో చేసే బ్రేక్‌ఫాస్టు, స్నాక్స్ అనేకం చూశాం.. తిన్నాం. ఆ కోవకు చెందినదే మసాల పకోడి. శనగపిండితో తయారు చేసే పకోడిలో మెత్త పకోడి, గట్టి పకోడి అని రెండు రకాలు ఎక్కువగా స్ట్రీట్‌ఫుడ్స్ బండ్లపై చూస్తుంటాం. తింటుంటాం. కాని మసాలా పకోడిలా ప్రత్యేకమైంది. కేవలం ఫిరంగిపురంలో మాత్రమే స్పెషల్‌గా లభించిన చోటా వీటిని తిన్నామంటే ఆ టేస్ట్‌కు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. నాడు ఫిరంగులు..నేడు పకోడీలు తయారీ అద్దంకి రెడ్డిరాజులు కొండవీడును రెండోరాజధానిగా చేసుకుని పాలించే క్రమంలో రాజ్య సంరక్షణకు అవసరమైన ఫిరంగులను తయారీ, రవాణా కేంద్రంగా వర్థిల్లిన ప్రాంతమే ఫిరంగిపురం. భారతస్వాతంత్య్రానికి ముందు నుంచే ఈ చారిత్రక ప్రాంతంలోనే మసాలా పకోడి విక్రయాలు చేయడం విశేషం. ప్రస్తుతం ఫిరంగిపురం రాష్ట్రీయ రహదారిపక్కనే ఉన్న దుకాణాల బజారును పకోడిలా సెంటర్‌గా పిలుస్తారు. మద్రాసు నుంచి వచ్చిన మసాలా పకోడి మద్రాసు ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన మసాలా పకోడిని రాజమహేంద్రవరం నుంచి వలస వచ్చిన పెద్దకోట్ల లూర్థు ఇక్కడ వారికి తొలిసారిగా పరిచయం చేశారు. అప్పట్లో గారెలు, బజ్జీ, పకోడి వంటి బాండీ రకాలను కొద్దిమంది అమ్ముతున్నారు. స్థానికుల వద్దే అలవాటు పడ్డ కస్టమర్లు తనదుకాణానికి రావాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో అతని వద్ద పనిచేస్తున్న మద్రాసు వాసితో మసాలా పకోడిని తయారు చేయించడం ప్రారంభించాడు. కొత్త దుకాణం, కొత్త రుచి ఆనోటా ఈనోటా పాకి ఊళ్లోవారినే కాదు సమీప గ్రామాల ప్రజల్ని ఆకర్షించేలా చేసింది. దీంతో పది మంది పనివాళ్లతో చేసేస్థాయికి వ్యాపారం ఎదిగింది. ఐదుతరాలుగా అదే రుచి అందిస్తూ... 1940లో లూర్థు ద్వారా ప్రారంభమైన ఈ మసాలా పకోడి నేటికీ ఆయన వంశీయులు తయారు చేసి విక్రయించడం జరుగుతుంది. కేవంల శనగపిండి, పచ్చిమిర్చి, ఉల్లి, వెల్లుల్లి, చెక్క, లవంగా, అల్లం వంటి ఆరు దినుసులతో మసాలా పకోడి తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఐదోతరం వారు ఇక్కడ మూడు దుకాణాలను పక్కపక్కనే ఏర్పాటు చేసుకున్నప్పటికీ అందరూ లూర్థు పకోడి పాత దుకాణం అంటూ పేరు పెట్టుకోవడం గమనార్హం. ఈ మూడు దుకాణాల్లో లూర్థు, బాలసురేంద్ర, అన్నదమ్ములు చెందిన పిల్లలే వీటిని తయారు చేసి విక్రయాలు చేస్తున్నారు. దేశవిదేశాలకు, రాజకీయ ప్రముఖులకు పరిచమైన పకోడి లూర్థు మసాలా పకోడి దేశ రాజధాని ఢిల్లీ, బొంబాయి తదితర మహానగరాలకు వెళ్లడమే కాదు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, కేంద్ర మాజీ మంత్రులు సైతం గుంటూరు వాసులు అందించే ఊరగాయ పచ్చళ్లతో పాటు మసాలా పకోడి తీసుకెళ్లేవారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో పాటు రాష్ట్రంలోని ఎందరో రాజకీయ, పారిశ్రామిక పెద్దలు వీటి రుచి చూసిన వారే. అంతేకాదు లాక్‌డౌన్‌కు ముందు వరకు ప్రతినెలా రెండుసార్లు అమెరికా, జపాన్‌లో ఉన్న మన తెలుగు వారు వీటిని కొరియర్లో తెప్పించుకోవడం పరిపాటి. సో ఈ సారి మీరెప్పుడైనా ఫిరంగిపురం వెళ్తే మసలా పకోడిని ఓ పట్టు పట్టండి. -
పకోడి బండి వద్ద వివాదం.. టెన్త్ క్లాస్ విద్యార్థి మృతి
సాక్షి, తూర్పు గోదావరి: కిర్లంపూడి మండలంలోని వీరవరంలో దారుణం చోటుచేసుకుంది. వీరబాబు అనే వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ఆదివారం రాత్రి సమయంలో పకోడి బండి వద్ద స్వల్ప వివాదం చోటకోవటంతో వీరబాబు ఆ పకోడి బండిని కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో బండి యజమాని ఏసు, ఆయన కొడుకు శివకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో శివను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పదో తరగతి చదువుతున్న శివ తన తండ్రికి వ్యాపారంలో పకోడి బండి వద్ద సహాయంగా ఉంటున్నాడని తెలుస్తోంది. బాలుడు మృతి చెందడంతో వీరవరం గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వీరవరం గ్రామానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. చదవండి: రెండు జిల్లాల్లో ఘోర ప్రమాదాలు.. 11 మంది దుర్మరణం -
ఇలా పకోడీ అయ్యింది
వానలు పడుతుంటే... నోటికి కరకరలు కావాలి... వేడివేడిగా... అప్పటికప్పుడు చేసుకుని తినాలి... వెంటనే పకోడీలు గుర్తుకు వచ్చాయి కదూ... అబ్బా... అవే పకోడీలా అనుకుంటున్నారా... అవును... అవే పకోడీలు... కానీ పకోడీ మారింది... ఏంటా అనుకుంటున్నారా... షేప్ అందాజాగా అలాగే ఉంది... స్వరూపం మారలేదు... స్వభావం మారింది...మీరు కూడా ప్రయత్నించండి... నోటికి కరకరలు అందించండి... వానలను ఆస్వాదించండి... కార్న్ పకోడీ కావలసినవి: మొక్కజొన్న గింజలు – 2 కప్పులు (ఉడికించాలి); సెనగ పిండి – రెండు కప్పులు; ఉల్లికాడల తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 6; అల్లం తురుము – పావు టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; గరం మసాలా – పావు టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; మిరియాల పొడి – పావు టీ స్పూను; సోంపు పొడి – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – తగినన్ని; చాట్ మసాలా – కొద్దిగా; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ఒక పాత్రలో ఉల్లికాడల తరుగు, ఉడికించిన మొక్కజొన్న గింజలు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, మిరప కారం, పసుపు, గరం మసాలా, ఇంగువ, మిరియాల పొడి, సోంపు పొడి, ఉప్పు వేసి కలపాలి ∙సెనగ పిండి, తగినన్ని నీళ్లు జత చేసి పకోడీల పిండిలా కలుపుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి ∙పిండిని పకోడీల మాదిరిగా నూనెలో వేసి బాగా దోరగా వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోచాలి (కరకరలాడేలా వేయించుకోవాలి) ∙ప్లేట్లో అందించేటప్పుడు పైన చాట్ మసాలా చల్లాలి ∙గ్రీన్ చట్నీ, టొమాటో సాస్‌లతో తింటే రుచిగా ఉంటాయి. బ్రెడ్ పకోడీ కావలసినవి: బంగాళ దుంపలు – 2 (మీడియం సైజువి); పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – 5 టీ స్పూన్లు; పుదీనా తరుగు – 2 టీ స్పూన్లు; మిరప కారం – పావు టీ స్పూను; ఆమ్ చూర్ పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత. పిండి కోసం: సెనగ పిండి – ఒక కప్పు; వాము – అర టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; గరం మసాలా పొడి – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; బేకింగ్ సోడా – చిటికెడు; నీళ్లు – కొద్దిగా; ఉప్పు – తగినంత; వీట్ బ్రెడ్ – 5 స్లైసులు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙బంగాళ దుంపలను కుకర్‌లో ఉంచి మెత్తగా ఉడికించాలి ∙బయటకు తీసి తొక్క వేరు చేసి, బంగాళ దుంపను సన్నగా తురిమి పక్కన ఉంచాలి ∙కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, పచ్చి మిర్చి తరుగు, మిరప కారం, ఆమ్ చూర్ పొడి, ఉప్పు, బంగాళ దుంప తరుగులను ఒక పాత్రలో వేసి బాగా కలపాలి ∙పెనం మీద కొద్దిగా నూనె వేసి బ్రెడ్ స్లైసులను దోరగా కాల్చి, చిన్న చిన్న ముక్కలుగా చేయాలి ∙ఒక పాత్రలో సెనగ పిండి, వాము, మిరప కారం, గరం మసాలా, ఇంగువ, ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి ∙అర కప్పు నీళ్లు జత చేసి మరోమారు కలపాలి ∙ఒక టీ స్పూను వేడి వేడి నూనె జత చేయాలి ∙బ్రెడ్ ముక్కలను ఈ పిండిలో వేసి బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, సిద్ధంగా ఉంచుకున్న పిండిని పకోడీల మాదిరి గా వేసి దోరగా వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. రైస్ పకోడీ కావలసినవి: అన్నం – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 4; మిరప కారం – ఒక టీ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – పావు కప్పు; వాము – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – చిటికెడు; సెనగ పిండి – 5 టేబుల్ స్పూన్లు; నీళ్లు – తగినన్ని; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ఒక పాత్రలోకి అన్నం తీసుకుని, మెత్తగా అయ్యేలా చేతితో మెదపాలి (అన్నం మెత్తగా ఉండాలి) ∙నూనె మినహా మిగతా పదార్థాలన్నీ జత చేసి పకోడీ పిండిలా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పిండి మిశ్రమాన్ని పకోడీల మాదిరిగా వేసి దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. కంద పకోడీ కావలసినవి: కంద – పావు కేజీ; సెనగ పిండి – పావు కేజీ; బియ్యప్పిండి – 2 టీ స్పూన్లు; అల్లం తురుము – 2 టీ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – 6; జీలకర్ర – ఒక టీ స్పూను; వాము – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; ఉల్లి తరుగు – పావు కప్పు (సన్నగా తరగాలి); నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙కందను శుభ్రంగా కడిగి చెక్కు తీసేయాలి ∙చెక్కు తీసిన కందను మరోమారు శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలోకి సన్నగా తురమాలి ∙ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, కంద తురుము, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు, జీలకర్ర, వాము, ఉప్పు వేసి బాగా కలపాలి ∙ఒక టేబుల్ స్పూను వేడి నూనె జత చేయాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి పకోడీల పిండిలా కలుపుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పింyì ని పకోడీలుగా వేసి బాగా కరకరలాడేలా వేయించాలి ∙పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. చీజ్ పకోడీ కావలసినవి: సెనగ పిండి – అర కప్పు; ఇంగువ – కొద్దిగా; మిరియాల పొడి – పావు టీ స్పూను (రవ్వ మాదిరిగా ఉండాలి); ధనియాల పొడి – పావు టీ స్పూను (రవ్వ మాదిరిగా ఉండాలి); బేకింగ్ సోడా – చిటికెడు; పసుపు – అర టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; నువ్వులు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – కొద్దిగా; చీజ్ – 125 గ్రా.; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ఒక పాత్రలో సెనగ పిండి, మిరియాల పొడి, ధనియాల పొడి, ఇంగువ, బేకింగ్ సోడా, పసుపు, మిరప కారం, నువ్వులు, ఉప్పు వేసి కలపాలి ∙కొద్దిగా నీళ్లు జత చేసి పకోడీ పిండిలా కలుపుకోవాలి (ఉండలు లేకుండా చూసుకోవాలి) ∙చీజ్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేయాలి (ఫ్రిజ్‌లో నుంచి తీసి, వెంటనే వాడాలి) ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక కొద్దిగా నూనెను పిండి మిశ్రమంలో వేసి కలపాలి ∙చీజ్ ముక్కలను సెనగ పిండి మిశ్రమంలో ముంచి, పకోడీల మాదిరిగా కాగిన నూనెలో వేయాలి (మీడియం మంట మీద వేయించాలి) ∙కొద్దిగా గట్టి పడి, బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, కిచెన్ పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙చట్నీతో కాని, సాస్‌తో కాని అందించాలి. ఫిష్ పకోడీ కావలసినవి: ముల్లు లేని చేప ముక్కలు – 250 గ్రా.లు; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; నిమ్మ రసం – టీ స్పూన్; పచ్చి మిర్చి – 2 (సన్నగా తరగాలి); వెల్లుల్లి రెబ్బలు – 2 (సన్నగా తరగాలి); అల్లం – చిన్నముక్క (తురమాలి). పిండి తయారీకి: కారం – తగినంత; వాము – అర టీ స్పూన్; ధనియాల పొడి – టేబుల్ స్పూన్ (వేయించి, కచ్చాపచ్చాగా దంచాలి); తందూరీ మసాలా – తగినంత; బియ్యప్పిండి / కార్న్ ఫ్లోర్ – టేబుల్ స్పూన్; సెనగపిండి – 4 టేబుల్ స్పూన్లు; యోగర్ట్ – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ∙చేప ముక్కలకు ఉప్పు, పసుపు, నిమ్మరసం, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి– అల్లం తరుగు వేసి కలిపి పైన మూత పెట్టి 20 నిమిషాలు అలాగే ఉంచాలి ∙స్టౌ మీద బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి ∙ఒక గిన్నెలో పిండి, దాంతో పాటు మిగతా దినుసులన్నీ వేసి బాగా కలపాలి ∙సిద్ధంగా ఉంచుకున్న చేప ముక్కలకు పిండికి పట్టేలా కలపాలి ∙కావాలనుకుంటే పిండి మృదువుగా అవడానికి మరికాస్త యోగర్ట్‌ని వాడుకోవచ్చు ∙పిండి కోటింగ్ ఉన్న చేప ముక్కలను కాగుతున్న నూనెలో వేసి అన్నివైపులా వేయించాలి ∙అన్నీ బంగారు రంగు వచ్చేలా వేయించుకొని, ప్లేట్లోకి తీసుకోవాలి ∙వీటిని ఏదైనా సాస్, పుదీనా–కొత్తిమీర చట్నీతో సర్వ్ చేయాలి. చికెన్ పకోడీ కావలసినవి: చికెన్ (బోన్‌లెస్) – పావు కేజీ (250 గ్రా.లు); ఉల్లిపాయ – 1 (సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి); పచ్చి మిర్చి – 2 (సన్నగా తరగాలి); అల్లం, వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; కారం – టీ స్పూన్ (తగినంత వేసుకోవచ్చు); గరం మసాలా– అర టీ స్పూన్; పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; కరివేపాకు – 2 రెమ్మలు; సెనగ పిండి – పావు కప్పు (విడిగా మరో 2 టేబుల్ స్పూన్లు); బియ్యప్పిండి లేదా కార్న్ ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్లు; గుడ్డు – 1 (తెల్లసొన మాత్రమే); నీళ్లు – తగినన్ని; నూనె – వేయించడానికి తగినంత. తయారీ: ∙ఒక వెడల్పాటి గిన్నెలో సెనగ పిండి, బియ్యప్పిండి, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి కలపాలి ∙అన్నీ సరిపడా ఉన్నాయా లేదా చెక్‌చేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, తరిగిన కరివేపాకు పచ్చిమిర్చి వేసి కలపాలి ∙చిన్న చిన్న క్యూబ్స్‌లా కట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలపాలి ∙కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు ∙పిండి లూజ్‌గా కాకుండా, గట్టి ముద్దలా తయారుచేసుకోవాలి. ఇలా వేయించాలి: ∙స్టౌ య్యి మీద బాణలి పెట్టి తగినంత నూనె పోసి వేడి చేయాలి ∙చేత్తో కొద్ది కొద్దిగా పిండి ముద్ద తీసుకొని కాగిన నూనెలో వేసి, వేయించాలి ∙నూనె వేడిని బట్టి మంటను సరిచూసుకోవాలి ∙చికెన్ ముక్కలు అన్ని వైపులా బాగా వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి ∙ఈ చికెన్ పకోడీని పుదీనా చట్నీ లేదా సాస్‌తో వడ్డించాలి. ప్రాన్ పకోడీ కావలసినవి: రొయ్యలు – పావు కేజీ; పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు; ఉల్లిపాయలు – 6 (సన్నగా తరగాలి); అల్లం ముక్క – చిన్నది (సన్నగా తరగాలి); వెల్లుల్లి – 5 రెబ్బలు (క్రష్ చేయాలి); పచ్చి మిర్చి – 2 (సన్నగా తరగాలి); కారం – టీ స్పూన్; ఉప్పు – తగినంత. మరి కొన్ని... ఉల్లిపాయ – 1 ; సోంపు – టీ స్పూన్; కొత్తిమీర తరుగు – పావు కప్పు ; బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు; నూనె – వేయించడానికి తగినంత; కరివేపాకు, ఉల్లికాడలు – తగినన్ని. తయారీ: ∙రొయ్యలను శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉంచాలి ∙రొయ్యలు, కొబ్బరి పొడి కలిపి గ్రైండ్ చేసుకోవాలి ∙వెడల్పాటి గిన్నెలో బియ్యప్పిండి, రొయ్యలు కొబ్బరి ముద్ద, ఉల్లితరుగు, కొత్తిమీర, సోంపు, ఉప్పు, కారం.. ఇతర దినుసులన్నీ వేసి ముద్దలా కలుపుకోవాలి ∙పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని, గుండ్రంగా చేసి, చేత్తో అదిమి పక్కన పెట్టాలి ∙స్టౌ మీద బాణలి పెట్టి, నూనె పోసి వేడిచేయాలి ∙కాగుతున్న నూనెలో 5–6 చొప్పున సిద్ధంగా ఉంచుకున్న బాల్స్ వేసి, రెండువైపులా బంగారు రంగు వచ్చేలా వేయించుకోవాలి ∙కొత్తిమీర చట్నీ లేదా సాస్‌తో సర్వ్ చేయాలి. ఖీమా పకోడీ కావలసినవి: మటన్ ఖీమా – 250 గ్రా.లు; గుడ్డు – 1; ఉల్లిపాయ – 1 (తరగాలి); పచ్చి మిర్చి – 4 (సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి); సెనగ పిండి – అర కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; కొత్తిమీర తరుగు – 3 టేబుల్ స్పూన్లు; అల్లం–వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; కారం – టీ స్పూన్; గరం మసాలా – కొద్దిగా; వంట సొడా – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె –వేయించడానికి తగినంత తయారీ: ∙ఒక గిన్నెలో పై పదార్ధాలన్నీ వేసి బాగా కలపాలి ∙చిన్న ముద్దలు తీసుకొని, బాల్స్ చేసి చేత్తో అదిమి, పక్కనుంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, అదిమి ఉంచుకున్న బాల్స్‌ను ఉల్లి పకోడీల్లా కొద్ది కొద్దిగా పిండి చేత్తో తీసుకుంటూ కాగుతున్న నూనెలో వేసి, అన్నివైపులా బంగారు రంగు వచ్చేలా వేయించుకొని, తీయాలి ∙టొమాటో సాస్ లేదా కొత్తిమీర చట్నీతో వడ్డించాలి. -
రుచుల గడప
కడపలో పెరిగి, ఒకసారి ఇక్కడ రుచులకు నాలుక అలవాటు పడ్డాక, మరే ఊరిలోని వంటకాలు తిన్నా సరే! దాన్ని తృప్తి పరచడం మహా కష్టం. బయటి ఊరి వాళ్లెవరైనా కడప గురించి విన్నపుడు, ‘అబ్బే కరువు ప్రాంతం కదా... ఇక్కడి వంటలు ఏం రుచి గా ఉంటాయిలే’ అనుకుంటారు, కానీ ఒక్కసారి కడప గడపలో అడుగుపెట్టి ఇక్కడి ఆతిథ్యం స్వీకరించాక గానీ నమ్మరు, కడపలో రుచులు అద్భుతః అని. సీమలో జనాలకు ఆతిథ్యం ఇవ్వడం అంటే మహా ఇష్టం, ఇంట్లో వాళ్ళకు లేకపోయినా సరే, అతిథికి మాత్రం ప్రేమతో చుక్కలు చూపించాల్సిందే, అందుకే సీమలో మంచినీళ్లడిగితే మజ్జిగిస్తారు, అన్న సామెత పుట్టుకొచ్చింది. కడప గురించి మాట్లాడుకునేటప్పుడు దోశెతోనే మొదలెట్టాలి, ఇక్కడ దోశెల్లో కారమే కాదు, మమకారం కూడా బాగానే దట్టిస్తారు, అందుకే కల్లలో నీల్లు కారిపోతున్నా సరే, కంచెం లో దోశె ను ఒక పట్టాన వదలబుద్ది అవ్వదు. చాలా చోట్ల దోశె అంటె ఒక వైపే కాలుస్తారు, కానీ కడపలో రెండు వైపులా కాల్చి, ఒక వైపున ఎండు మిరపకాయలతో చేసిన ఎర్రకారం, పుట్నాల పప్పులతో చేసిన పొడి, బొంబాయి చట్నీ, (కొన్నిచోట్ల దీన్ని ‘పిట్లా’ అంటారు) ని దోశె మొత్తం బాగా పూసి బాగా ఎర్రగా కాల్చి చేస్తారు. ఈ దోశెలు చెన్నూరు బస్ స్టాండ్ దగ్గర చాలా ఫేమస్, పది పదిహేనేళ్ల కిందట, ఒకే వరుసలో మూడు బండ్లు ఉండేవి, అప్పట్లోనే ఒక్కోదోశె 6 రూపాయలు, ఇప్పుడు 40 రూపాయలనుంచి వంద రూపాయల దాకా ఉంది, బండ్లు పోయి స్టాళ్లు వెలిసాయి. దోశెల్లో అక్కడ దొరకని వెరైటీ ఉండదు, దోశె దొరకాలంటే ఎలాంటి టైంలో అయినా అథమ పక్షం అరగంట వెయిట్ చేయాల్సిందే. బీకేయం వీధిలో లక్ష్మీనారాయణ స్వామి గుడి పక్కన ఒక చిన్న హోటల్లో పొద్దున మాత్రమే ‘పచ్చి కారం దోశె’ దొరుకుతుంది. ఇక్కడే ‘చిట్లంపొడి దోశె, చింతాకు పొడి దోశె, కరివేపాకు పొడి దోశె’ లాంటి వెరైటీ లు దొరుకుతాయి. ఊటుకూరు గేటు దాటి చమ్మిమియ్యా పేటలో దొరికే పాలకూర దోశె, టాప్ క్లాస్. ఇంకా యెర్రముక్కపల్లె లో దొరికే సమీర్ దోశె, గాంధీనగర్ స్కూల్ దగ్గర దొరికే రాగి దోశె కూడా ఫేమస్సే. మామూలుగా కడప దోశెలంటే బాగా పల్చగా ఉండి వాటి లోపల పూసిన టాపింగ్స్ మొత్తం బయటికి కనిపిస్తూ, కరకరలాడుతుంటాయి, కాని పెద్ద దర్గా దగ్గర దొరికే సోమయ్య దోశెలు మాత్రం దీనికి భిన్నం, చాలా మందంగా... కారం దట్టంగా పూసి, నెయ్యిలో స్నానం చేసినట్టున్న ఒక్క దోశె తిన్న కడుపు నిండిపోతాయి. కడపలో రవ్వ ఇడ్లీ కన్నా పిండి ఇడ్లీలు బాగా ఫేమస్సు, రవ్వ ఇడ్లీలు పెద్ద హోటల్ల లో మాత్రమే దొరుకుతాయి, కాని ప్రతీ వీధి దగ్గరా బండిలో పిండి ఇడ్లీలు దర్శనమిస్తాయి, కోటిరెడ్డి సర్కిల్ నుంచి నారాయణ కాలేజ్‌కి వెళ్లే దారిలో దొరికే శ్యాం బండి ఇడ్లీలు చూడటానికి మల్లె పువ్వులా తెల్లగా ఉండి, తినటానికి దూది కన్నా మెత్తగా ఉండి, నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి, ఇంకా దొంగల చెరువు కట్ట మీద సాయంత్రం దొరికే ఇడ్లీ కూడా దాదాపుగా ఇదే రుచి తో ఉంటుంది, దేవుని కడప మాడ వీధుల పక్కన దొరికే ఎర్ర కారం ఇడ్లీ కూడా యమా రుచి. ఇక కడప బిరియానీ, 21 వ శతాబ్దపు సరికొత్త సంచలనం, ఇరవై సంవత్సరాల కిందట, చెన్నూరులో శివరాం అనే ఒక వ్యక్తి చిన్న పందిరి వేసి ఒక బిరియానీ హోటల్ మొదలెట్టాడు, అది కడప– హైదరాబాదు నేషనల్ హైవే కావటంతో కస్టమర్ల ప్రవాహానికి కొదవ ఉండదు, జనాలకు ఈ బిరియాని ఎంత నచ్చేసిందంటే, పదేళ్లు తిరక్కుండానే ఒక్క కడప నగరంలోనే చెన్నూరు బిరియానీ పేరుతో వందకు పైగా హోటళ్లు వెలిశాయి, కానీ ఒరిజినల్ బ్రాంచ్ మాత్రం చెన్నూరు లోనే ఉంది, ఇది ఎంత ప్రాచుర్యంలోకి వచ్చిందో తెలియడానికి రెండు ఉదాహరణలు చాలు, రోడ్డు పక్కన చిన్న స్టాలు పెట్టుకుని బిరియానీలు అమ్ముకునే చోటికి ఐటి అధికారులు లెక్కలు చూపించమని రైడుకు రావడం, అమెరికాలోని ఓ పేద్ద హోటల్ మెనులో చెన్నూరు బిరియానీ అనే రెసిపీ దొరకడం. కడప జిల్లా మొత్తం కలిపి, చెన్నూరు బిరియానీ పేరుతో రమారమి ఓ 500 çహోటళ్ల దాకా ఉండొచ్చని అంచనా! కడప నుంచి రాయచోటి వెళ్ళే దారిలో గువ్వల చెరువు ఘాట్ దిగగానే ఓ ఇరవై ముప్పై పాలకోవా సెంటర్లు కనిపిస్తాయి, ఇక్కడ నుంచి విదేశాలకు కోవా ఎగుమతి అవుతుందంటే నమ్మండి, అక్కడికెళ్ళి నించోగానే ఓ చిన్న కప్పులో కోవా వేసి పైన, కొన్ని బాదం పలుకులు వేసి ఇస్తాడు, దాని రుచి నచ్చితేనే మనం కొనుక్కోవచ్చు, లేదా కొనుక్కోకుండా వెళ్లిపోవచ్చు కూడా! డబ్బులు అడగరు!! ఆరేడేళ్ళ క్రితం నాగరాజు పేటలో ఓ బండిలో బొరుగుల మిచ్చర్ దొరికేది, బాగా ఫేమస్సు, రాజారెడ్డి వీధిలో సీయస్సై గ్రౌండు వెనక పక్క ఓ బొరుగుల బండిలో 30 వెరైటీలు దొరుకుతాయి. కృష్ణా హాలు నుంచి దేవుని కడప వెళ్లే రోడ్డులో దొరికే సమోసా భలే ఉంటుంది, ఇక్కడ మరో స్పెషల్ ఏంటంటే స్వీట్ సమోసా, బూందిని స్టఫ్ గా పెట్టి సమోసా వేసి దానికి పాకం పడతారు, చాలా బావుంటుంది. వైవీ స్ట్రీట్ దగ్గర దొరికే అలంకార్ లస్సీ, కొంచెం లోపలికి, వెళ్లగానే దొరికే బాసుంది కడప ఐకానిక్ డిజర్ట్స్. నల్లమల అడవుల్లో మాత్రమే దొరికే నన్నారి వేర్లతో తయారు చేసే షర్బత్ చాలా కమ్మగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కడప నుంచి ఈ నన్నారి షర్బత్ బాటిళ్లు విదేశాలకు చాలా రెగ్యులర్‌గా పార్సిల్ అవుతుంటాయి. షర్బత్ తో పాటు నానబెట్టిన సబ్జా గింజలు కలుపుతారు, చూడటానికి చాలా కలర్ ఫుల్‌గా ఉంటుంది. (వాట్సప్‌లో చక్కర్లు కొడుతున్న ఓ సందేశం ఆధారంగా...) ఆలూ దాల్ టిక్కీ కావలసినవి: బంగాళ దుంపలు – అర కిలో (ఉడికించి తొక్క తీసి చేతితో మెత్తగా అయ్యేలా మెదపాలి); బ్రెడ్ స్లయిసెస్ – 3; ఉప్పు, కారం – రుచికి తగినంత; గరం మసాలా – కొద్దిగా; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – అర కప్పు; సన్నగా తరిగిన పచ్చి మిర్చి – 4; నిమ్మ రసం – ఒక టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ∙బ్రెడ్ స్లయిస్‌లను చేతితో మెత్తగా చేయాలి ∙బంగాళ దుంప ముద్ద, పచ్చిసెనగ పప్పు, కొత్తిమీర, నిమ్మరసం, పచ్చి మిర్చి తరుగు జత చేసి బాగా కలపాలి ∙జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కొద్దిగా నూనె జత చేసి మరోమారు కలపాలి ∙కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని, వడల మాదిరిగా ఒత్తాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక వీటిని ఒక్కొక్కటిగా వేస్తూ, బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి. ఇడ్లీ పకోడా కావలసినవి: బొంబాయి రవ్వ – ముప్పావు కప్పు; పెరుగు – పావు కప్పు; నీళ్లు – పావు కప్పు; ఉప్పు – తగినంత; బేకింగ్ సోడా – అర టీ స్పూను; పంచదార పొడి – అర టీ స్పూను; నీళ్లు – రెండు టీ స్పూన్లు. పిండి కోసం: చిక్కుడు గింజలు – ఒకటిన్నర కప్పులు; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాలు – ఒకటిన్నర టీ స్పూన్లు; మెంతులు – ఒక టేబుల్ స్పూను; నీళ్లు – 5 టేబుల్ స్పూన్లు; నూనె – డీప్ ఫ్రై కోసం. తయారీ: ∙చిక్కుడు గింజలకు తగినన్ని నీళ్లు జత చేసి సుమారు నాలుగు గంటల సేపు నానబెట్టాలి ∙వేరే పాత్రలో ముప్పావు కప్పు రవ్వ, పావు కప్పు పెరుగు, పావు కప్పు నీళ్లు వేసి బాగా కలిపి నాలుగు గంటల సేపు పక్కన ఉంచాలి (నానిన తరవాత బాగా గట్టిగా అనిపిస్తే, కొద్దిగా నీళ్లు జత చేయాలి) ∙బాగా నానిన ఈ పిండిని సగ భాగం తీసుకుని, తగినంత ఉప్పు, పావు టీ స్పూను బేకింగ్ సోడా, పావు టీ స్పూను పంచదార పొడి వేసి బాగా కలపాలి ∙ఇడ్లీ రేకులకు కొద్దిగా నూనె పూసి, కలిపిన పిండిని వెంటనే ఇడ్లీ రేకులలో వేసి, కుకర్‌లో ఉంచి విజిల్ లేకుండా ఇడ్లీలు ఉడికించాలి ∙పది నిమిషాల తరవాత స్టౌ మీద నుంచి దింపి చల్లారనివ్వాలి ∙నానిన చిక్కుడు గింజలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి (కొద్దిగా నీళ్లు జత చేయాలి) ∙ఉప్పు, మిరప కారం, ధనియాల పొడి, మెంతి పొడి, కొత్తిమీర జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙ఉడికిన ఇడ్లీలను చిక్కుడు గింజల మిశ్రమంలో దొర్లించాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక, కొద్దిగా నూనె వేసి కాగాక, ఈ ఇడ్లీలను పెనం మీద వేసి రెండు వైపులా దోరగా కాల్చి తీసేయాలి ∙గ్రీన్ చట్నీతో కాని టొమాటో సాస్‌తో కాని అందించాలి. రైస్ పకోడా కావలసినవి: అన్నం – 2 కప్పులు; అటుకులు – పావు కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; అల్లం ముద్ద – ఒక టీ స్పూను; స్వీట్ కార్న్ – పావు కప్పు (ఉడికించాలి); ఉప్పు – తగినంత; మిరప కారం – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ: – ఒక పాత్రలో అటుకులకు, పావు కప్పు నీళ్లు జత చేసి బాగా కలిపి పక్కన ఉంచాలి – అన్నాన్ని చేతితో మెత్తగా చేయాలి ∙ – ఒక పెద్ద పాత్రలో మెత్తగా మెదిపిన అన్నం, ఉడికించిన స్వీట్ కార్న్, ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, అల్లం ముద్ద, ఉప్పు, మిరపకారం, నానబెట్టిన అటుకులు వేసి బాగా కలపాలి ∙చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న ఉండలను వేసి దోరగా వేయించి కిచెన్ టవల్ మీదకు తీసుకోవాలి ∙సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి. -
గేట్ ర్యాంక్ హోల్డర్.. పకోడా వ్యాపారం
డెహ్రడూన్ : గేట్ ఎగ్జామ్ ఎంత కష్టంగా ఉంటుందో ఇంజనీరింగ్ చదివే వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గేట్ ర్యాంక్‌తో డైరెక్ట్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరే అవకాశం ఉండటంతో దానికి ఓ రేంజ్లో క్రేజ్ ఉంటుంది. దేశ వ్యాప్తంగా లక్షల మంది పోటీ పడే ఈ ఎగ్జామ్‌లో మంచి ర్యాంక్ సాధించడం కోసం విద్యార్థులు ఇంజనీరింగ్ మొదటి ఏడాది నుంచే కోచింగ్ వంటి వాటికి వెళ్తూ చాలా కష్టపడుతుంటారు. ఒక్క సారి గేట్లో ర్యాంక్ వచ్చిందంటే.. ఇక జీవితం సెటిల్ అయినట్లే అనుకుంటారు. అలాంటిది గేట్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించిన ఓ కుర్రాడు దాన్ని వదిలేసుకుని ప్రస్తుతం పకోడాలు అమ్ముతున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు. వివరాలు.. సాగర్ షా అనే కుర్రాడు ఉత్తరాఖండ్‌లో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేశాడు. తరువాత ఎంటెక్‌లో చేరడం కోసం గేట్ ఎగ్జామ్ రాశాడు. దానిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. అయితే ఎంటెక్ పేరుతో మరో రెండేళ్లు కుటుంబానికి భారంగా మారకూడదని భావించాడు. దాంతో కుటుంబ వ్యాపారమైన పకోడి బిజినెస్‌లో చేరి తండ్రికి చేదోడు.. వాదోడుగా నిలుస్తున్నాడు. షాప్‌కు వచ్చే కస్టమర్లకు టీ, పకోడిలు సర్వ్ చేయడమే కాక ఏ మాత్రం మొహమాటపడకుండా పాత్రలను కూడా శుభ్రం చేస్తున్నాడు. ఈ విషయం గురించి సాగర్‌ను ప్రశ్నించగా.. ‘ఇంజనీరింగ్ పూర్తయ్యాక గేట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలనేది నా కల. అందుకోసం ఎంతో శ్రమించాను. స్వంతంగానే చదువుకున్నాను. గేట్లో 8 వేల ర్యాంక్ సాధించాను. ఆ ర్యాంక్‌తో నాకు మంచి ఎన్ఐటీలోనే సీటు వస్తుంది. కానీ ఎంటెక్ పేరుతో మరో రెండేళ్ల సమయం వృధా చేయదల్చుకోలేదు. దాని బదులు ఏదో ఒక పని చేసి నా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలనుకున్నాను. అందుకే మా పకోడా వ్యాపారంలో భాగస్వామినయ్యాన’ని తెలిపారు. పకోడా షాప్ నడపడం కూడా ఓ సవాలే అన్నారు సాగర్. దీన్ని కూడా టెక్నాలజీతో అనుసంధానం చేసి మరింత స్మార్ట్‌గా ఈ బిజిసెస్‌ను ముందుకు తీసుకెళ్లాలన్నదే నా కోరిక అని తెలిపాడు సాగర్. -
పాకిస్తాన్లో మోదీ మంత్ర
ఇస్లామాబాద్ : తమ ఉద్యోగాలు కోల్పోయేలా చేసిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై బహిష్కృత జర్నలిస్టులు వినూత్న నిరసన చేపట్టారు. భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన పకోడీ మంత్రను అనుసరించి రోడ్డుపై బైఠాయించి మంగళవారం పకోడీలు వేశారు. పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) ప్రభుత్వం చర్యల వల్ల ఉద్యోగాలు కోల్పయిన తమ దుర్భర పరిస్థితిని వెళ్లగక్కారు. ఈ కార్యక్రంమలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో పాల్గొని జర్నలిస్టులకు తన మద్దతు ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్ వచ్చాకే ఇదంతా.. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ అధికారంలోకి వచ్చాక మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు విధించిందని జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రసారాలపై ఆంక్షల నేపథ్యంలో పత్రికలు, టీవీ చానెళ్లు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయని అంటున్నారు. మీడియా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు సైతం నిలిపివేయడంతో నెలనెలా జీతాలు చెల్లించడానికి సంకటంగా మారిందనీ, దాంతో యాజమాన్యాలు తమను తొలగించింయని ఉద్యోగాలు కోల్పోయిన జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సాయం నిలిచిపోవడంతో ‘వక్త్ న్యూస్’టీవీ చానెల్ మూతపడడం గమనార్హం. నిరసన కార్యక్రమంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో Whole of the Waqt News staff sacked and offices across Pakistan shut down. — Matiullah Jan (@Matiullahjan919) October 29, 2018 -
క్యాంపస్‌లో పకోడాలు.. 20 వేలు ఫైన్!
ఢిల్లీ : క్యాంపస్‌లో పకోడాలు(మన భాషలో పకోడి) చేసినందుకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన ఓ ఎం.ఫిల్ విద్యార్ధిపై 20 వేల రూపాయల జరిమానా విధించడమే కాక హస్టల్ నుంచి వెళ్లి పోమ్మని ఆదేశాలు జారీ చేసింది విచారణ కమిషన్. వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన మనీష్ కుమార్ మీనా జెఎన్యూలో ఎం.ఫిల్ చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ పకోడాలు అమ్మి కూడా డబ్బులు సంపాదించవచ్చంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మోదీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలపడం కోసం మనీష్, అతనితో పాటు చదువుతున్న మరో నలుగురు విద్యార్ధులు వెరైటిగా యూనివర్సిటీలోనే పకోడాలు తయారు చేసి అమ్మడం ప్రారంభించారు. అయితే విద్యార్ధుల చేసిన చర్యలు క్యాంపస్ నియమాలకు వ్యతిరేకం అని చెప్పి వర్సిటీ అధికారులు వీరి చర్యలపై ఒక విచారణ కమిషన్‌ను వేశారు. ఆ కమీషన్ క్యాంపస్‌లో పకోడాలు వేయడం నేరం అని, ఇందుకు గాను మనీష్ కుమార్ 20 వేల రూపాయలు ఫైన్ కట్టాలని ఆదేశించింది. హస్టల్ నుంచి వెళ్లిపోవాలని తెలిపింది. అయితే ఈ నిరసన కార్యక్రమాలు అన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగాయి. కానీ విచారణ కమిషన్ మాత్రం ఇప్పుడు విద్యార్ధులు థీసిస్ పేపర్లు సమర్పించే ముందు చర్యలు తీసుకుని వారిని హస్టల్ నుంచి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే మనీష్ వర్సిటీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ‘స్వయంగా ప్రధాని మోదీనే పకోడాలను అమ్మి డబ్బు సంపాదించమని చెప్పారు. ఆయన చెప్పిన దానినే నేను పాటించాను. ప్రధాని మాటను విన్నందుకు నాకు జరిమాన విధించడమే కాక నన్ను హస్టల్ నుంచి వెళ్లిపొమ్మంటున్నారు. ఈ నెల 21 నాటికి నేను నా థీసిస్ పేపర్లను సబ్మిట్ చేయాలి. నా దగ్గర డబ్బు లేదు. ఈ సమయంలో ఇలాంటి చర్యలు తీసుకోవడం చూస్తే వర్సిటీ కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఉంది. ఈ విషయంలో నేను కోర్టును ఆశ్రయించి చట్టపరంగా ముందుకు వెళ్తానని’ తెలిపారు. ఈ విషయం గురించి విచారణ కమిషన్ ‘మనీష్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరి 5న నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా సబర్మతి బస్ స్టాండ్ వద్ద ఆటంకం కలిగించాడు. ఫిబ్రవరి 9న కూడా రోడ్డు మీద పకోడాలను తయారు చేస్తూ రాకపోకలకు అంతరాయం కల్గించాడు. అందుకే అతని మీద ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింద’ని తెలిపింది. నిరసన కార్యక్రమాల్లో పాల్గోన్న విద్యార్ధుల మీద చర్యలు తీసుకోవడం ఇదే ప్రథమం కాదు. గతంలో సుభాన్షు సింగ్ అనే పీహెచ్డీ విద్యార్ధి నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నాడనే నేపంతో అతనికి 40 వేల రూపాయల జరిమానా విధించారు. ఈ విషయం గురించి సుభాన్షు ‘నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి విద్యార్ధికి జరిమానా విధించారు. దీని వల్ల సమయం వృథా కావడమే కాక థీసిస్ పేపర్లను కూడా త్వరగా సబ్మిట్ చేయలేకపోతున్నాం. తప్పకుండా జరిమానా కట్టాల్సి రావడంతో డబ్బుల్లేక చాలా మంది విద్యార్ధులు బాధపడుతున్నారు. జేఎన్‌యూ చర్యలు మా గొంతును నొక్కివేసేలా ఉన్నాయని’ తెలిపారు. -
మోదీ ఐడియా.. సెటిలైన కాంగ్రెస్ నేత!
గాంధీనగర్, గుజరాత్ : ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పకోడాలు (పకోడీలు) అమ్ముకోవడం కూడా ఉద్యోగమే’ అన్న సంగతి తెలిసిందే. అయితే మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. కానీ నేడు మోదీ ఇచ్చిన ‘పకోడా ఐడియా’నే ఒక కాంగ్రెస్ కార్యకర్త జీవితాన్ని మార్చేసింది. వడోదరకు చెందిన నారాయణభాయ్ రాజ్‌పుత్ హిందీ లిటరేచర్‌లో పోస్టు గ్రాడ్యూయేట్. కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. ఎన్ఎస్యూఐలో కార్యకర్తగా చేరి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాడు. అయితే పీజీ చేసిన నారాయణభాయ్ నిరుద్యోగి. మోదీ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను అతడు కూడా చూశాడు. మోదీ చెప్పిన ‘పకోడా ఐడియా’ అతనికి బాగా నచ్చింది. పనిపాటా లేకుండా ఖాళీగా ఉండటం కంటే పకోడా బిజినెస్ చేయడం మంచిదని భావించాడు. తొలుత ఒక స్టాల్‌తో ప్రారంభమైన నారాయణభాయ్ పకోడా వ్యాపారం నేడు మొత్తం 35శాఖలుగా, వడోదర నగరమంతా విస్తరించింది. ఈ విషయం గురించి నారాయణభాయ్ ‘ప్రధాని ‘పకోడా బిజినెస్ ఐడియా’ విన్న తర్వాత నేను ఎందుకు ఆ మార్గంలో వెళ్లకూడదు అనుకున్నాను. నిరుద్యోగిగా ఉండటం కంటే పకోడా అమ్మి రోజుకు కనీసం 200 రూపాయలు సంపాదించడం మంచిదే కదా అనిపించింది. అందుకే ఒకసారి ప్రయత్నించి చుద్దామని భావించాను. మొదట 10 కేజీల పదార్థాలతో, 100 గ్రాముల పకోడా ఒక్కొక్కటిగా 10 రూపాయలుగా ఒక స్టాల్‌ను ప్రారంభించాను. నేడు నగరవ్యాప్తంగా నా పకోడా స్టాల్స్ 35 ఉన్నాయి. ప్రతిరోజు 500 - 600 కేజీల పకోడాలు అమ్ముతున్నాను’ అని తెలిపాడు. వ్యాపారం ప్రారంభించిన రెండు నెలల్లోనే నారాయణభాయ్ ‘పకోడా బిజినెస్’కు మంచి పేరు వచ్చింది. నారాయణభాయ్ రోజు ఉదయం 7 - 11 గంటల వరకూ అలానే సాయంత్రం కూడా ఇదే సమయంలో పకోడాను అమ్ముతుంటాడు. -
మోదీజీ.. పకోడా బిజినెస్‌కు లోన్ ఇవ్వండి
సాక్షి, లక్నో : పకోడా వ్యాపారం చేసుకునేందుకు తనకు సహకరించాలని అమేథికి చెందిన ఓ నిరుద్యోగ యువకుడు అశ్విన్ మిశ్రా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాశారు. తాను పకోడా బిజినెస్‌ను చేపట్టేందుకు ముద్రా రుణం మంజూరయ్యేలా తన తరపున ప్రధానిని కోరాలని ఆ యువకుడు కోరారు. పకోడా యూనిట్ ఏర్పాటు గురించి ప్రధాని ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పినప్పటి నుంచి తాను ఉద్యోగ ప్రయత్నాలు విరమించానని పకోడా జాయింట్ ప్రారంభించాలని నిర్ణయించకున్నానని అశ్విన్ మిశ్రా లేఖలో పేర్కొన్నారు. పకోడీలు అమ్ముకోవడంపై ప్రధాని సూచన తనను అమితంగా ఆకట్టుకుందని.. ఇది తాను బతకడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించేందుకు ఉపయోగపడుతుందని భావించానన్నారు. అయితే పకోడీ వ్యాపారాన్ని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించగా నిధుల కొరతతో ముందుకెళ్లలేకపోయానన్నారు. దీంతో లోన్ కోసం బ్యాంకులను ఆశ్రయించగా...తనకు రుణం లభించలేదన్నారు. ముద్రా యోజన ద్వారా పది కోట్ల మంది లబ్ధిపొందారని ప్రధాని చెబుతున్నా తనకు రుణం ఇచ్చేందుకు బ్యాంకులు తిరస్కరించాయని అమేథి బీజేపీ సోషల్ మీడియా మాజీ చీఫ్‌గా వ్యవహరించిన అశ్విన్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మాటలు అవాస్తవాలని తాను భావించడంలేదని, బ్యాంకుల తీరుతోనే తాను ఈ లేఖ రాస్తున్నానని తన తరపున ప్రధానికి విజ్ఞప్తి చేసి పకోడా వ్యాపారం ప్రారంభించేలా తనకు రుణం మంజూరయ్యేలా చూడాలని మంత్రిని కోరారు. మరోవైపు ఈ లేఖ బీజేపీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసేందుకు విపక్షానికి అవకాశం ఇచ్చినట్టైంది. బీజేపీ ప్రభుత్వ నిర్వాకాలు ప్రతిరోజూ వెలుగుచూస్తున్నాయని.. ఇది కేవలం వాటికి ఓ ఉదాహరణేనని స్ధానిక కాంగ్రెస్ నేత అచ్ఛే లాల్ వ్యాఖ్యానించారు. -
మోదీకి వ్యతిరేకంగా ఆందోళన
సేలం: చదువుకున్న యువకులు పకోడీ విక్రయించైన బతకవచ్చని తెలిపిన మోదీ వ్యాఖ్యను ఖండిస్తూ సేలం రైల్వేస్టేషన్లో డైఫీ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మంగళవారం సేలం రైల్వే స్టేషన్లో పకోడి పంపిణీ చేశారు. తర్వాత స్టేషన్లోకి చొరబడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు పోలీసులను పక్కను తోసివేసి రైల్వే స్టేషన్లోకి చొరబడి, రైల్వే పట్టాలపై బైటాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో యువకులకు అవకాశం కల్పించాలి, రైల్వే శాఖను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాని విరమించాలని నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు 63 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. రైలు పట్టాలపై ఆందోళన చేస్తున్న డైఫీ నేతలు, కార్యకర్తలు -
ప్రచారంలో పకోడా బ్రేక్
సాక్షి, బెంగళూర్ : పకోడాలు అమ్ముకోవడాన్నీ ఉపాథిగా గుర్తించాలని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల అనంతరం దేశంలో పకోడా రాజకీయాలు ఊపందుకున్నాయి. వివిధ పార్టీల నేతలు పకోడా వ్యాఖ్యలపై అభ్యంతరం తెలపగా..విద్యార్థులు, నిరుద్యోగులు పకోడాలు అమ్ముతూ నిరసనలు చేపట్టారు. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తన ప్రచారానికి కొద్దిసేపు విరామంగా పకోడా బ్రేక్ తీసుకున్నారు. రాయ్‌చూర్ జిల్లాలో సీఎం సిద్ధరామయ్య, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలతో కలిసి పకోడాల విందు ఆరగించారు. పకోడాలు అమ్ముకుని రోజుకు రూ 200 ఇంటికి తీసుకువెళితే అది ఉపాధి కాదా అంటూ ఓ న్యూస్‌ఛానెల్‌తో మాట్లాడుతూ మోదీ ప్రశ్నించడం పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం దీటైన కౌంటర్ ఇచ్చారు. పకోడాలు అమ్ముకోవడం ఉపాధి అయితే భిక్షాటన కూడా ఉద్యోగమేనంటూ సెటైర్లు వేశారు. -
బజ్జీలు,పకోడీలు వేసిన పాండిచ్చేరి సీఎం
-
మోదీ చెప్పిందే.. వాళ్లు చేశారు
సాక్షి, బెంగళూరు : ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగిన వేళ.. నగరంలో కొందరు విద్యార్థులు చేసిన పని అందరి దృష్టిని ఆకర్షించింది. మోదీ ‘పకోడా’ వ్యాఖ్యలను అనుసరించి రోడ్లపైకి చేరిన కొందరు పకోడా అమ్ముతూ కనిపించారు. ఉద్యోగ కల్పనలో కేంద్రం విఫలమవుతోందన్న కథనాలపై ఓ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో ప్రధాని స్పందిస్తూ.. ‘పకోడా అమ్ముకోవటం కూడా ఉద్యోగ కల్పనలో భాగమే. రోజుకు 200రూ. సంపాదించినా నిరుద్యోగ సమస్యను రూపుమాపినట్లే కదా’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం బెంగళూరు పర్యటనకు వచ్చిన మోదీకి నిరసన తెలిపే ఉద్దేశంతో కొందరు విద్యార్థులు ఈ ఆలోచన చేశారు. మెహ్క్రి సర్కిల్ వద్ద చేరుకుని ర్యాలీ వెళ్లే వారిని అడ్డుకుని ఇలా పకోడా అమ్ముతూ కనిపించారు. ‘మోదీ పకోడా, అమిత్ షా పకోడా, వై రెడ్డి(యాడ్యురప్ప) పకోడా’ అంటూ వాటికి పేర్లు పెట్టి మరీ అమ్మసాగారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగటంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. -
పకోడిలో బొద్దింక
ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారులు దేశాయిపేట రోడ్డులోని ఓ రెస్టారెంట్లో ఘటన తనిఖీలు మరచిన అధికారులు పోచమ్మమైదాన్ : మేడి పండు చూడు మేలిమై ఉండు. పొట్ట విప్పి చూడ పురుగులుండు.. అన్నట్లుగా ఉంది బార్ అండ్ రెస్టారెంట్లలో విక్రయించే తినుబండారాల పరిస్థితి. నాణ్యతలేని ఆహారlపదార్థాలు, పురుగులతో కూడిన తినుబండారాలు విక్రయిస్తూ వినియోగదారుల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు కొందరు హోటళ్ల యాజామాన్యాలు. వరంగల్ దేశాయిపేట రోడ్డులోని శ్రీలక్ష్మి బార్ అండ్ రెస్టారెంట్లో ఆదివారం పకోడిలో చనిపోయిన బొద్దింక కనిపించడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరానికి చెందిన రాజు తన మిత్రులతో కలిసి ఆదివారం శ్రీలక్ష్మి బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఉల్లి పకోడిని ఆర్డర్ ఇవ్వగా, బేరర్ తెచ్చి టేబుల్‌పై పెట్టాడు. పకోడి మధ్యలో చూడగా బొద్దింక కనిపించింది. విషయాన్ని బార్ యాజమాన్యానికి చెప్పగా వారు పట్టించుకోలేదు. పైగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాజు వెంటనే ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి జ్యోతిర్మయికి ఫోన్లో సమాచారం అందించి, వాట్సప్‌లో ఫొటో పంపారు. ఫిర్యాదు చేసినా తనిఖీలు శూన్యం.. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లాలలో పలు హోటళ్లలో నాణ్యతలేని ఆహారపదార్థాలు, తినుబండారాల్లో పురుగులు వస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో తనిఖీ చేసిన సంఘటనలు ఎక్కడా కానరావడం లేదు. నెలవారీ మామూళ్లకు కక్కుత్తి పడి తనిఖీలకు వెనకాడుతున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు. కాగా ఈ విషయమై శ్రీలక్ష్మి బార్ అండ్ రెస్టారెంట్ డైరెక్టర్ మల్లారెడ్డి మాట్లాడుతూ తమ రెస్టారెంట్లో పకోడిలో బొద్దింక వచ్చిన సంఘటన ఏమీ జరగలేదని తెలిపారు. -
వేడి వేడి పకోడి... భలే టేస్ట్ గురూ!
‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన.. ఎన్నాళ్లని దాక్కుంటావే పైన’ అంటూ ఎండలకు విసిగిపోయిన ప్రతి ఒక్కరూ ‘వర్షం’లో త్రిష పాడుకున్నట్లుగా పాడుకుంటారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన వానకు రకుల్ ప్రీత్ సింగ్ ఆ పాటను గుర్తు చేసుకున్నారు. బయట కురుస్తున్న వానను చూస్తూ, వేడి వేడి పకోడీలు లాగించేస్తే ఎంత బాగుండు అనుకున్నారు. పాపం పకోడీలు తయారు చేయడం రాదు కదా. అందుకే తన తల్లిని గుర్తు చేసుకున్నారు. ‘‘మా అమ్మగారు చేసే పకోడీలు భలే టేస్టీగా ఉంటాయి. ప్చ్... ఇప్పుడామె హైదరాబాద్‌లో లేరు’’ అని రకుల్ అన్నారు. వర్షంలో లాంగ్ డ్రైవ్ వెళ్లడం ఇష్టమట. అది తీరే అవకాశం లేదు కాబట్టి జస్ట్ వాన చూస్తూ, ఎంజాయ్ చేసేశానని ఈ బ్యూటీ అన్నారు. -
పాట్నా ప్లేట్
బిహార్ వాసుల్లాగే సింపుల్‌గా ఉంటుంది.అప్పుడే పడిన వానకు గుప్పుమన్న మట్టి వాసనలా మన ఊరి పరిమళాన్ని గుర్తుచేస్తుంది. ఇట్టే చేసుకోవచ్చు.. లొట్టలేసుకోవచ్చు. బీ రెడీ ఫర్ బిహార్ ఆహారం! ఎంజాయ్ పాట్నా ప్లేట్!! మూంగ్ దాల్ కి గోలీ కావల్సినవి: పొట్టు తీయని పెసలు - 200 గ్రా.లు; నూనె - 2 టేబుల్ స్పూన్లు; అల్లం- వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్; గరం మసాలా - టీ స్పూన్ (లవంగాలు, యాలకులు, ధనియాలు, దాల్చిన చెక్కలను వేయించి పొడి చేసినది); కారం - అర టీ స్పూన్; టొమాటో - సగం ముక్క (సన్నగా తరగాలి); ఉల్లిపాయ - సగం ముక్క (సన్నగా తరగాలి); ఉప్పు - రుచికి తగినంత; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్ పోపు మిశ్రమానికి... టొమాటో- సగం ముక్క, ఉల్లిపాయ సగం ముక్క, పసుపు-పావు టీ స్పూన్, కారం- అర టీ స్పూన్, అల్లం-వెల్లుల్లి పేస్ట్-అర టీ స్పూన్, పచ్చిమిర్చి-1(తరగాలి), కొత్తిమీర- టీ స్పూన్, ఉప్పు తగినంత తయారీ: పెసరపప్పును 2 గంటలు నీళ్లలో నానబెట్టాలి. నీళ్లను వడకట్టి గ్రైండర్లో పప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాలపొడి, కాగిన టేబుల్ స్పూన్ నూనె కొద్దిగా నీళ్లు కలిపి, మెత్తగా రుబ్బుకోవాలి మూకుడును స్టౌ మీద పెట్టి, వేడయ్యాక అందులో టేబుల్ స్పూన్ నూనె వేసి పప్పు మిశ్రమం పోసి కలపాలి. కొన్ని నిమిషాలు ఉడకనివ్వాలి దీంట్లో టొమాటో, ఉల్లిపాయ తరుగు వేసి బాగా ఉడికించాలి. మిశ్రమం బాగా గట్టిపడ్డాక మంట తీసేయాలి మిశ్రమం చల్లారాక చిన్న చిన్న ముద్దలు తీసుకొని, గుండ్రని బాల్స్ తయారు చేయాలి మూకుడులో టేబుల్ స్పూన్ నూనె వేసి, మసాలాకోసం ఇచ్చిన పదార్థాలను వేసి కలపాలి. మిశ్రమం లూజ్‌గా అవడానికి కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. ముక్కలు బాగా ఉడికాక దీంట్లో పప్పు ఉండలు, గరం మసాలా వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి చివరగా కొత్తిమీర చల్లి దించాలి. ఫిష్ కర్రీ కావల్సినవి: చేపముక్కలు - అర కేజీ; ఆవ ముద్ద - టేబుల్ స్పూన్; వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్; కారం - అర టీ స్పూన్; పసుపు - అర టీ స్పూన్; ఆవనూనె - 2 టేబుల్ స్పూన్లు (తగినంత); ఆవాలు - అర టీ స్పూన్; మెంతిపిండి - అర టీ స్పూన్; పచ్చిమిర్చి - 2 ; ఎండుమిర్చి - 2; టొమాటోలు - 2 (సన్నగా తరగాలి); ఉప్పు - తగినంత; కొత్తిమీర తరుగు - టీ స్పూన్ తయారీ: చేపముక్కలను శుభ్రం చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు చేపముక్కలకు పట్టించాలి ఆవనూనెలో చేపముక్కలను వేయించి, పక్కనుంచాలి కడాయిలో ఆవనూనె వేసి అందులో ఎండుమిర్చి, ఆవాలు, ఆవముద్ద, పచ్చిమిర్చి తరుగు, మెంతిపొడి వేసి కలపాలి దీంట్లో పసుపు, టొమాటో తరుగు వేసి వేగాక, వెల్లుల్లి ముద్ద వేసి 5-7 నిమిషాలు ఉడికించాలి దీంట్లో 3 కప్పుల నీళ్లు పోసి, తగినంత ఉప్పు, కారం వేసి మరో 5 నిమిషాలు ఉడికించి, వేయించిన చేప ముక్కలు వేయాలి సన్నని మంట మీద 10 నిమిషాలు ఉంచి, దించి కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. పకోడి కావల్సినవి: శనగ పిండి - 250గ్రా.లు; ఉప్పు - రుచికి తగినంత; పసుపు - పావు టీ స్పూన్; కారం - అర టీ స్పూన్; మ్యాంగో పొడి (అమ్చ్యూర్ పొడి)- టీ స్పూన్; ఏదైనా ఆకుకూర - టీ స్పూన్; వాము - అర టీ స్పూన్; ఉల్లిపాయలు - 125 గ్రాములు (నిలువుగా సన్నని ముక్కలు కట్ చేయాలి); బంగాళ దుంపలు - 120గ్రా.లు (సన్నని ముక్కలు); నూనె - వేయించడానికి తగినంత తయారీ: పిండిలో నూనె, కూరగాయలు మినహా అన్ని రకాల పదార్థాలు వేసి కలపాలి తగినన్ని నీళ్లు పోసి, పిండిని బాగా కలుపుకోవాలి తర్వాత కూరగాయల ముక్కలు వేసి కలపాలి కడాయిలో నూనె పోసి కాగనివ్వాలి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని కాగుతున్న నూనెలో వేసి అన్నివైపులా బంగారు రంగు వచ్చేలా వేయించాలి వేయించిన పకోడీలను పేపర్‌నాపికిన్ మీద వేయాలి. ఇలా చేయడం వల్ల పకోడీల నూనె పేపర్ పీల్చుకుంటుంది. పకోడీలు కరరలాడుతుంటాయి. ఉడ్ యాపిల్ (వెలగపండు) షర్బత్ కావల్సినవి: వెలగపండు - 1 (మీడియమ్ సైజ్); బెల్లం - 3 టేబుల్ స్పూన్లు; యాలకులు - 2; నిమ్మరసం - టేబుల్ స్పూన్; పంచదార - తగినంత; ఉప్పు - అర టీ స్పూన్; చల్లటి (ఐస్) నీళ్లు - 2 కప్పులు; తయారీ:వెలగపండు లోపలి గుజ్జు, యాలకుల పొడి, బెల్లం 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కలిపి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి దీంట్లో నిమ్మరసం, అర కప్పు నీళ్లు పోసి మళ్లీ బ్లెండ్ చేయాలి చివరగా చల్లటి నీళ్లు పోసి బ్లెండ్ చేసి గ్లాస్లో పోసి చల్లగా అందించాలి. ఠేక్వా కావల్సినవి: మైదా/గోధుమపిండి- 200 గ్రాములు; నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు; పంచదార/బెల్లం - 250 గ్రాములు; బాదంపప్పు, జీడిపప్పు పలుకులు - 3 టేబుల్ స్పూన్లు, కిస్మిస్-టేబుల్ స్పూన్; నూనె - తగినంత; యాలకుల పొడి - పావు టీ స్పూన్, బేకింగ్ పౌడర్ - చిటికెడు, ఎండుకొబ్బరి - అర కప్పు, చాకో చిప్స్ - 2 టేబుల్ స్పూన్లు తయారీ: మైదాలో సన్నగా తరిగిన బాదంపప్పు, జీడిపప్పు పలుకులు, చాకో చిప్స్, కిస్మిస్, నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలిపి పక్కనుంచాలి పంచదార లేదా బెల్లంలో కప్పు నీళ్లు పోసి, కరిగించి వడకట్టి పొయ్యి మీద పెట్టి మరిగించాలి మైదాలో కరిగించిన పంచదార/ బెల్లం నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. పిండి మృదువుగా అయ్యేవరకు కలపాలి. చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని, గుండ్రంగా చేసి, వత్తి, కాగుతున్న నూనె లేదా నెయ్యిలో వేసి రెండువైపులా వేయించాలి. నోట్: ఠేక్వాలను నెయ్యిలో కాకుండా ఓవెన్లో బేక్ చేసుకుంటే కుకీస్‌లా వస్తాయి. బేకింగ్ ట్రేకి నెయ్యి రాసి, 375 డిగ్రీల హీట్ వద్ద 20 నిమిషాలు బేక్ చేయాలి. చల్లారిన తర్వాత సర్వ్ చేయాలి. ఛోఖా కావల్సినవి: ఆవనూనె - అర కప్పు ; టొమాటోలు - 3 (గుజ్జు చేయాలి); వంకాయలు - 2 (ఉడికించి గుజ్జు చేయాలి); బంగాళదుంపలు - 3 (ఉడికించి గుజ్జు చేయాలి); కారం - అర టీ స్పూన్; ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి) ; పచ్చిమిర్చి - 3 (సన్నగా తరగాలి); నిమ్మకాయ - 1; కొత్తిమీర - ఒక కట్ట; ఉప్పు - తగినంత తయారీ: కడాయిలో ఆవనూనె వేసి వేడి చేయాలి. దీంట్లో టొమాటో గుజ్జు వేసి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత వంకాయ, బంగాళదుంప గుజ్జు వేసి కలపాలి కొద్దిగా ఉడికాక కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలపాలి మిశ్రమం బాగా గుజ్జుగా అయ్యేంతవరకు ఉడికించి, మంట తీసేసి నిమ్మరసం కలపాలి చివరగా కొత్తిమీర చల్లి దించాలి. దాల్ భరీ పూరీ కావల్సినవి పెసరపప్పు - 200 గ్రాములు; ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు ; సోంపు - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత, కొత్తిమీర - 2 కట్టలు అల్లం తరుగు - టీ స్పూన్; కారం - అర టీ స్పూన్; నూనె - వేయించడానికి తగినంత మైదా/గోధుమ పిండి - కప్పు; నీళ్లు - తగినన్ని; ఉప్పు - తగినంత తయారీ: పప్పు 15 నిమిషాలు నీళ్లలో నానబెట్టి వడకట్టాలి. దీంట్లో ఉప్పు, అల్లం, సోంపు, ధనియాల పొడి, కొత్తిమీర, కారం వేసి కలిపి మెత్తగా రుబ్బాలి. పిండిలో పప్పు మిశ్రమం, కొద్దిగా నీళ్లు పోసి ముద్ద చేయాలి. మూకుడులో నూనె పోసి కాగనివ్వాలి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని, ఉండలు చేసి, పూరీలా వత్తాలి. ఇలా తయారుచేసుకున్నవాటిని కాగుతున్న నూనెలో వేసి రెండువైపులా కాల్చాలి ఈ పూరీలను ఏదైనా గ్రేవీ కర్రీతో వడ్డించాలి. -
వేడి వేడి పకోడి...
ఇంటిప్స్ ♦ బియ్యాన్ని నానబెట్టి రుబ్బి సెనగపిండిలో కలిపి పకోడీలు వేస్తే కరకరలాడటమే కాకుండా రుచిగా ఉంటాయి. ♦ మామూలు పెనంపై కొద్దిగా ఉప్పు వేసి వేడిచేసి, ఆ తర్వాత ఆ ఉప్పును తీసేయాలి. తర్వాత నూనె రుద్ది.. దోసె, అట్లు లాంటివి వేస్తే నాన్‌స్టిక్ పాన్‌లా పనిచేస్తుంది. ♦ పాలు మాడువాసన వస్తే రెండు తమలపాకులు వేసి కాసేపు వేడిచేయాలి. ♦ పచ్చళ్లు బూజు పట్టకుండా ఉండాలంటే చిన్న ఇంగువ ముక్కను నిప్పు మీద కాల్చి జాడీలో పెట్టి పైన మూత ఉంచాలి. అరగంట తర్వాత జాడీలో నుంచి ఇంగువ ముక్కను తీసేయాలి. -
మిఠాయి కొట్టున పకోడి పొట్లం!
హ్యూమర్ వస్తూ వస్తూ రైల్వేస్టేషన్లో కొన్న మామిడి తాండ్రను మా రాంబాబు చేతిలో పెట్టగానే... దాన్ని చూసి ‘‘హు...’’ అంటూ రాంబాబు గాడు విరక్తిగా పెదవి విరిచాడు. అది చూసి ఆశ్చర్యపోయాన్నేను. ‘‘మామిడి తాండ్రను చూడగానే తాండ్రపాపారాయుడిని చూసినట్లు జోష్‌లో ఊగిపోయేవాడి. ఆ రుచిని ఆస్వాదించుకుంటూ తినేవాడివి. ఇదేంట్రా ఇలా నిరుత్సాహంగా ఉండిపోయావు?’’ అడిగాను. ‘‘ఇదీ ఒక తాండ్రేనా? అలనాడు పొట్లం కడితే ఈతచాప అచ్చులు తాండ్రపై కనిపించాలి. అలాంటి అచ్చులు లేని తాండ్ర కనిపిస్తే చారల్లేని పులిలా, జూలు లేని సింహంలా బోసిగా అనిపిస్తోందిరా’’ అన్నాడు రాంబాబు. అలా మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా వాడు కిరాణా షాప్ దగ్గర, మిఠాయి దుకాణం దగ్గర... ఇలా రెండు చోట్ల గాల్లోనే దండం పెట్టుకున్నాడు. దార్లో గుడిని చూసినప్పుడు భక్తిపూర్వకంగా పెట్టుకునే నమస్కారంతో పాటు వేళ్ల ఉంగరాలను ముద్దు పెట్టుకోవడం చూసి... ‘‘ఆ షాపుల్లో ఏవైనా నీ ఇష్టదైవాల ఫొటోలున్నాయా?’’ అని అడిగాను. ‘‘లేదురా... మిఠాయి కొట్లో వాడు పకోడీ పొట్లం కట్టే తీరు ఒక అద్భుతం రా. అసలు పకోడీ పొట్లాన్ని ఒక ఉదాహరణగా స్వీకరించి... అత్యంత సీరియస్ సబ్జెక్టు అయిన జర్నలిజం పాఠాలు బోధిస్తారు తెల్సా. మనం న్యూస్ ఇచ్చే సమయంలో వివరాలన్నీ అచ్చం తలకిందులైన పకోడీ పొట్లాంలా ఉండాలని లెసన్ చెబుతారురా. మొదట ప్రధాన వివరాలూ, ఆ తర్వాత అప్రధాన అంశాలూ పకోడీ పొట్లం చేత శీర్షాసనమేయించినట్లుగా ఉండాలంటారు. ఇలా పాఠాల్లో చోటుచేసుకున్న ఆ పొట్లం బతుకు ధన్యం కాదా? త్రిభుజాకారంలో ఉండే ఆ పొట్లంలో మన కాళ్ల పనీ... అనగా లెగ్ వర్క్, జబ్బ సత్తువలూ కనిపించాలంటూ శాస్త్రప్రమాణమైన దాఖలాను చూపుతారు. అంటే పోలిక కోసం ఎంపిక జరిగిన తీరును బట్టి అయినా పొట్లాం మీద మనందరికీ భక్తి కలగాలి కదా’’ అన్నాడు వాడు. ఆ సెటైరు నాకే అని అర్థమైంది. ఎందుకంటే నాకు పకోడీ పెద్దగా ఇష్టముండదు. అదే విషయాన్ని చెప్పా. ‘‘అసలు పకోడీ గురించి ఎవడు మాట్లాడారురా ఇక్కడ. నేను చెప్పేదంతా పొట్లాం గురించే కదా. ఒక్కో పొట్లానికి ఒక్కో నిర్దిష్టమైన విధానముందీ, దీన్ని కట్టేందుకు తగిన పద్ధతుంది. శాస్త్రబద్ధమైన ఈ పద్ధతులేవీ ఫాలో కాకుండా... ఒకప్పటి ఉదాత్తమైన పొట్లాలు కట్టే కళను ఇప్పుడు ప్లాస్టిక్‌తో అపభ్రంశం చేస్తున్నారురా ఈ షాపుల వాళ్లు. ఇందాక నేను నమస్కరించిన కిరాణ షాపులో ఇంకా శాస్త్రోక్తంగా పొట్లాలు కడుతున్నారు’’ అన్నాడు వాడు సశాస్త్రీయమైన పొట్లాల గురించి శంకరాభరణం శంకరశాస్త్రిలా బాధపడుతూ. ‘‘పొట్లాలు కట్టడంలోనూ పద్ధతా?’’ అడిగా ఆశ్చర్యంగా. ‘‘కాదా... మరి? ఆయుర్వేద మందుల్ని చిట్టి చిట్టి పొట్లాల్లా కడతారు. వాటిని నలుచదరాకారపు వైనాన్ని ఎప్పుడైనా గమనించావా? ఆ పొట్లాం కట్టిన తీరుతోనే వైద్యుడి నైపుణ్యం అర్థమవుతుంది. అన్నట్లు... మసాలాదోశను చాపచుట్టినట్లుగా రోల్ చేస్తారు. అలా చేసి, స్తూపాకారంలో పొట్లం కడతారు. బోండాలను, బజ్జీల కాగితపు పొట్లం కట్టే ముందర అరిటాకుతోనో, బాదం ఆకులతో ఫౌండేషన్ వేస్తారు. అనేక దొంతరలుగా ఉండే తందూరీ రోటీలనూ, జొన్న రొట్టెల్ని వృత్తాకారంలోనే కాగితాల్లో చుడతారు. ఇందాక మనం చూసిన ఆ కిరాణ షాపులో పప్పు పొట్లాన్ని క్యూబ్ ఆకారంలో పొట్లాం కడతారు. దాన్ని చూస్తే ఘనాఘన సుందరుణ్ణి చూసినంత ఆనందం కలుగుతుంది. ఇక బెల్లం అచ్చుల్ని పిరమిడ్ ఆకారాన్ని మధ్యకు కోసినట్లుగా తాటాకు చాపలో చుట్టిపెడతారు. అందుకే బెల్లంపై తాటాకు అచ్చుల్ని చూడకపోయినా, మామిడి తాండ్రపై ఈతచాప కదుములు కనిపించకపోయినా నాకెంతో బెంగగా ఉంటుందిరా. అంతెందుకు కాసిన్ని పూలు బయటికి కనిపించేలా పూలమాల పొట్లాంలోనూ ఓ చమత్కారం ఉంటుంది’’ అన్నాడు మా రాంబాబు. ‘‘ఒరే బాబూ... పూలూ, కిరాణా పొట్లాల్లోనూ పొట్లకాయలాంటి నిర్మాణ చమత్కృతి చూస్తున్న నిన్నేం అనాలో నాకు తోచడం లేదురా’’ అన్నాను. ‘‘నేను చెప్పేది ఇంకా అయిపోలేదు. ఇక జర్నలిజపు పాఠాలను తన ఒంటిపై అక్షరాలతో అచ్చోసుకున్న ఆ వార్తల కాగితమే, మళ్లీ పకోడీ పొట్లాలకు మూలం కావడంలోని చిత్రం చూశావా? ఎంత మాలావు ఇంగ్లిషు పేపరైనా పాత పేపర్ల వాడి నుంచి చివరకు కిరాణాషాపుకు లేదా కాకాహోటళ్లకు మళ్లుతుంది. అయితే ఇక్కడ కూడా తెలుగు పేపరు కంటే ఇంగ్లిష్ పేపరుకే ఎక్కువ ధర పలకడం చూస్తే బాధేస్తుంది. పొట్లాం దగ్గర కూడా తెలుగు పేపర్ల పట్ల ఇంకా కొనసాగుతున్న ఈ వివక్ష చూస్తే బాధేస్తోందిరా’’ అన్నాడు వాడు. ‘‘చూస్తుంటే కంగారూ సైతం తన బిడ్డను పొట్టకు పొట్లాంలా కట్టుకుంటుందని అనేలా ఉన్నావు’’ అంటూ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాన్నేను. - యాసీన్