
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ
సాక్షి, బెంగళూర్ : పకోడాలు అమ్ముకోవడాన్నీ ఉపాథిగా గుర్తించాలని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల అనంతరం దేశంలో పకోడా రాజకీయాలు ఊపందుకున్నాయి. వివిధ పార్టీల నేతలు పకోడా వ్యాఖ్యలపై అభ్యంతరం తెలపగా..విద్యార్థులు, నిరుద్యోగులు పకోడాలు అమ్ముతూ నిరసనలు చేపట్టారు. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తన ప్రచారానికి కొద్దిసేపు విరామంగా పకోడా బ్రేక్ తీసుకున్నారు.
రాయ్‌చూర్ జిల్లాలో సీఎం సిద్ధరామయ్య, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలతో కలిసి పకోడాల విందు ఆరగించారు. పకోడాలు అమ్ముకుని రోజుకు రూ 200 ఇంటికి తీసుకువెళితే అది ఉపాధి కాదా అంటూ ఓ న్యూస్‌ఛానెల్‌తో మాట్లాడుతూ మోదీ ప్రశ్నించడం పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం దీటైన కౌంటర్ ఇచ్చారు. పకోడాలు అమ్ముకోవడం ఉపాధి అయితే భిక్షాటన కూడా ఉద్యోగమేనంటూ సెటైర్లు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment