Karnataka election campaign
-
కాంగ్రెస్, జేడీఎస్‌కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల్లో ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పంపిన డబ్బులతోనే కాంగ్రెస్ ఎన్నికల్లో పంపిణీకి సిద్ధమైందని నిందించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గౌరీబిదనూరు, బాగేపల్లి నియోజకవర్గాల్లో సంజయ్ పర్యటించారు. బాగేపల్లిలో పార్టీ జాతీయ కార్యదర్శి సీటీ రవి, అసెంబ్లీ అభ్యర్ధి మునిరాజుతో కలిసి ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం అక్కడి మీడియాతోనూ మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసే పనిచేస్తున్నాయని, ఆ పార్టీలకు ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని వ్యాఖ్యానించారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముస్లిం రిజర్వేషన్లను పెంచే కుట్ర జరుగుతోందన్నారు. ‘కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటుకు రూ.10 వేల పంచేందుకు సిద్ధమైంది. ఆ పైసలన్నీ తెలంగాణ సీఎం కేసీఆర్ పంపినవే. వాటిని పంచేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమైనరు. ఒక్క పైసా తక్కువిచ్చినా ఊరుకోకండి. ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఓట్లేసి కాంగ్రెస్‌ను ఖతం చేయండి. కేసీఆర్ మహా తెలివైన వాడు. మొన్నటిదాకా జేడీఎస్ కు పైసలిచ్చిండు. ఆ పార్టీ అధికారంలోకి రాదని తెలిసే సరికి కాంగ్రెస్ పంచన చేరిండు. కుమారస్వామి ఫోన్ చేసినా ఎత్తడం లేదట. కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తున్నడు. ’అని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. -
కర్ణాటకలో కిచ్చ సుదీప్ రోడ్ షో
-
కులగణన వివరాలేవి?
సాక్షి, బళ్లారి: రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేయాలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. దళితులు, ఆదివాసీలకు వారి జనాభాకు తగ్గట్టుగా అవకాశాలు దక్కేందుకు వీలుగా నైష్పత్తిక రిజర్వేషన్ల పద్ధతి తేవాలన్నారు. 2011లో మోదీ సర్కారు చేపట్టిన కులగణన వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తద్వారా బీసీలకు మెరుగైన రిజర్వేషన్లు కల్పించేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బాల్కీ, హుమ్నాబాద్ల్లో ఆయన ప్రచార సభల్లో మాట్లాడారు. ఓబీసీలపై మోదీ కేవలం మాటల్లోనే ప్రమ ఒలకబోస్తారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే వెంటనే కులగణన వివరాలు బయట పెడతామని చెప్పారు. ప్రతి పనికి 40 కమీషన్ తీసుకుంటున్న బీజేపీ సర్కారుకు ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రంలో బీజేపీకి 40 సీట్లు కూడా రావు. ఉద్యోగ నియామకాల్లోనూ భారీ అవినీతి జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ అవినీతి విధానాలను, మోదీ, అదానీ బంధాన్ని గురించి లోక్‌సభలో ప్రశ్నిస్తే నా సభ్యత్వం తొలగించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెబితే దేశవ్యాప్తంగా ఆ పార్టీ పతనానికి నాంది అవుతుంది’’ అన్నారు. రాహుల్ కులగణన డిమాండ్‌కు పలు విపక్షాలు మద్దతిచ్చాయి. జేడీ(యూ) నేత, బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌తో పాటు ఎస్పీ, బీఎస్పీ్ట, ఆప్, బీజేపీ మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ ఇందుకు మద్దతు పలికాయి. దేశవ్యాప్తంగా తాజాగా కులగణన చేపట్టాలంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ లేఖను ఆయన తాజాగా ట్వీట్ చేశారు. -
ఎలక్షన్ ప్రచారకర్త ద్రవిడ్ ఓటే లేదు!
బెంగళూరు : కర్ణాటక ఎన్నికల ప్రచారకర్త, టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఈ సారి తన ఓటును వేయలేకపోతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించిన ద్రవిడే తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నాడు. దీనికి ఓటరు జాబితా నుంచి రాహుల్ ద్రవిడ్ పేరు తొలగించడమే కారణం. ద్రవిడ్ బాధ్యతారహిత్యంగానే తన ఓటును కోల్పోయినట్లు తెలుస్తోంది. ద్రవిడ్ తన అడ్రస్ మార్చడంతో ఫార్మ్-7 ద్వారా ఓటును తీసేశారు. ఈ ఫార్మ్-7ను అతని సోదరుడు ఇచ్చినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. కానీ ద్రవిడ్ మాత్రం ఫార్మ్-6తో మళ్లీ తనపేరును నమోదు చేసుకోవడంలో అలక్ష్యం వహించాడు. దీంతో ఏప్రిల్ 18న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నాడు. ఈ విషయంపై మీడియా ఆ ప్రాంత ఎన్నికల అధికారులను వివరణ కోరగా.. తమ అధికారులు ద్రవిడ్ కొత్త అడ్రస్‌కు రెండు సార్లు వెళ్లారని, కానీ ద్రవిడ్ కటుంబసభ్యులు ఎవరు అనుమతించలేదని, అతను విదేశాల్లో ఉన్నాడని సమాధానమిచ్చినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఫార్మ్-7ను కుటుంబ సభ్యులు ఎవరైనా సబ్మిట్ చేసి ఓటు తొలగించవచ్చు. కానీ ఓటు పొందాలంటే మాత్రం ఆ ఓటరే ఫార్మ్-6 అందజేయాలి. అయితే ఈ గడువు అయిపోయిన తర్వాత ద్రవిడ్‌కు ఈ విషయం తెలిసినట్లు సమాచారం. ఈ విషయంపై కర్ణాటక ఎలక్షన్ చీఫ్ సంజీకుమార్ మాట్లాడుతూ.. ‘అడ్రస్ మారడంతో ద్రవిడ్ తన ఓటును స్వచ్ఛందగా తొలిగించుకున్నారు. కానీ మళ్లీ ఓటును పొందే విషయాన్ని మరిచిపోయారు. ఇప్పుడు ఓటరు జాబితాలో అతని పేరును చేర్చడం చట్టపరంగా సాధ్యం కాదు. ఈ విషయంపై ఈసీఐ(కేంద్ర ఎన్నికల సంఘం) రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేయనుంది’ అని తెలిపారు. -
అశోక్‌బాబు పై చర్యలు తీసుకోవాలి..
-
‘అశోక్‌బాబు రాజీనామా సవాల్.. అందుకే’
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు బుధవారం భేటీ అయ్యారు. కర్ణాటక ఎన్నికల్లో ఇటీవల ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు చేసిన ప్రచారంపై చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధీశ్ రాంభొట్ల మాట్లాడుతూ.. ఓ ఎన్జీవోకు అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల్లో ప్రచారం చేయడమంటే సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించినట్టేని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోద్భలంతోనే అశోక్‌బాబు బీజేపీని విమర్శిరస్తున్నారన్నారు. తనకు చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడనే నమ్మకంతోనే రాజీనామా చేస్తానని అశోక్‌బాబు సవాల్ చేస్తున్నారని పేర్కొన్నారు. అశోక్‌బాబు తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరొచ్చని సుధీశ్ సూచించారు. -
‘రాహుల్‌ను చంపేందుకు కుట్ర!’
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది. గురువారం పెను ప్రమాదం నుంచి రాహుల్ తృటిలో బయటపడిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం కోసం గురువారం ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఆయన బయలుదేరగా.. హఠాత్తుగా సమస్య తలెత్తింది. అయితే పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి హెబ్బలి విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఆటోపైలెట్ మోడ్ ఒక్కసారిగా ఆగిపోవటంతో విమానం ఒక్కసారిగా గాల్లో పక్కకు ఒరిగిపోయింది. ఆపై వేగంగా విమానం కిందకు జారిపోతుండటంతో పైలెట్ అప్రమత్తమై ఎయిర్‌క్రాఫ్ట్‌ను మ్యానువల్ మోడ్‌లోకి తెచ్చి ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. బలమైన గాలులు వీయటంతో ఈ సమస్య తలెత్తిందని ఓవైపు అధికారులు చెబుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ‘ప్రమాద సమయంలో వాతావరణం సాధారణంగా ఉంది. ఇలా ఖచ్ఛితంగా సాంకేతిక సమస్యే. ఘటనపై మాకు అనుమానాలు ఉన్నాయి. పైగా సమస్య ఏంటన్నది పైలెట్లు కూడా వివరించలేకపోతున్నారు’ అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పోలీసు ఫిర్యాదు.. కాగా, ఘటనపై కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాహుల్ అనుచరుడు కౌశల్ విద్యార్థి.. కర్ణాటక డీజీపీ నీల్మణి ఎన్ రాజుకు ఓ లేఖ రాశారు. అంతేకాదు ఘటనపై పారదర్శకమైన దర్యాప్తు చేపట్టాలంటూ డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు ఆయన ఇంకో లేఖ రాశారు. Complaint to the DG&IG of Police, Karnataka, regarding the serious malfunction of the aircraft carrying Congress President @RahulGandhi pic.twitter.com/P3RJwkWOMR — Congress (@INCIndia) 26 April 2018 -
హిందుత్వ ప్రచారం పనిచేయదు..
సాక్షి, బెంగళూరు : బీజేపీ ప్రచారం చేస్తున్న హిందుత్వ వాదం భారత్‌లో పని చేయదని సినీనటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు.‘సంస్కృతి- విబేధాలు’ అంశంపై ఓ చర్చ వేదికలో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక సంస్కృతి గురించి మాట్లాడుతూ.. ‘ మేము(కర్ణాటక వాసులు) అందరితో కలిసి జీవిస్తాము. అందరిని ఆదరిస్తాం. ఇతరులతో సామరస్యంగా ఉంటాం. కర్ణాటకలో బహుళ సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. ఇక్కడ హిందుత్వ(బీజేపీ) ప్రచారం పనిచేయదు.’ అని పేర్కొన్నారు. కర్ణాటక ప్రజలు బీజేపీని ఆదరిస్తారా అన్న ప్రశ్నకు ప్రకాశ్ రాజ్ సమాధానమిస్తూ కొద్ది రోజుల్లో మీరే చూస్తారు(వచ్చే నెలలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి) అని బదులిచ్చారు. కర్ణాటకవాసులు చాలా సహనంతో ఉంటారని, ఏ హిందుత్వ పార్టీలు కూడా వారిని విడగొట్టలేవని ఆయన అన్నారు. మతం పేరుతో ప్రచారం చేస్తున్నవారు కర్ణాటక ప్రజల మన్నలను పొందలేరని బీజేపీ ఉద్దేశించి ఆయన వాఖ్యాలు చేశారు. కాగా ప్రకాశ్ రాజ్ ఆరోపణలను బీజేపీ అధికార ప్రతినిధి మాలవికా అవినాశ్ తీవ్రంగా ఖండించారు. ‘మేము హిందువులం అయినప్పటికి లౌకిక వాదాన్ని పాటిస్తామ’ని పేర్కొన్నారు. భారత్‌లో హిందుమతం ఎప్పటినుంచో ఉందని, మేము అన్ని మతాలను గౌరవిస్తూ సామరస్యంతో ఉంటూన్నామని అవినాశ్ పేర్కొన్నారు. హిందూలు అన్ని మతాల వారితో కలిసి ఉంటారని అన్నారు. -
కర్ణాటకపై కన్నేసిన రాహుల్
-
ప్రచారంలో పకోడా బ్రేక్
సాక్షి, బెంగళూర్ : పకోడాలు అమ్ముకోవడాన్నీ ఉపాథిగా గుర్తించాలని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల అనంతరం దేశంలో పకోడా రాజకీయాలు ఊపందుకున్నాయి. వివిధ పార్టీల నేతలు పకోడా వ్యాఖ్యలపై అభ్యంతరం తెలపగా..విద్యార్థులు, నిరుద్యోగులు పకోడాలు అమ్ముతూ నిరసనలు చేపట్టారు. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తన ప్రచారానికి కొద్దిసేపు విరామంగా పకోడా బ్రేక్ తీసుకున్నారు. రాయ్‌చూర్ జిల్లాలో సీఎం సిద్ధరామయ్య, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలతో కలిసి పకోడాల విందు ఆరగించారు. పకోడాలు అమ్ముకుని రోజుకు రూ 200 ఇంటికి తీసుకువెళితే అది ఉపాధి కాదా అంటూ ఓ న్యూస్‌ఛానెల్‌తో మాట్లాడుతూ మోదీ ప్రశ్నించడం పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం దీటైన కౌంటర్ ఇచ్చారు. పకోడాలు అమ్ముకోవడం ఉపాధి అయితే భిక్షాటన కూడా ఉద్యోగమేనంటూ సెటైర్లు వేశారు. -
రాహుల్ ‘రివర్స్ బ్యాటింగ్’ పంచ్ పేలింది
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ’జనాశీర్వాద్’ పేరిట కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం సింధనూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన బీజేపీపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘క్రికెట్ పిచ్‌లో మోదీ బ్యాటింగ్‌కు దిగితే.. వికెట్లు, కీపర్ వైపు బ్యాట్ పట్టుకుని నిలుచుంటాడు. అలా బ్యాటింగ్ చేస్తే సచిన్ కూడా ఒక్క పరుగు చేయలేడు. అంటే బాల్ ఏ దిశగా వస్తుందో కూడా తెలియని బ్యాట్స్‌మన్ మన ప్రధాని. ఎంత సేపు ఆయన కాంగ్రెస్ గతం గురించి మాత్రమే మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నాడు. కానీ, భవిష్యత్తు కాంగ్రెస్‌దేనన్న విషయం ఎందుకనో ఆయన గుర్తించలేకపోతున్నారు’ అంటూ రాహుల్ చురకలు అంటించారు. బీజేపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని సంకేతాలు అందుతుండటంతో.. తన ప్రభుత్వం సాధించిన ఘనతలంటూ ఏవేవో చెప్పుకుంటూ వెళ్లిన ప్రతీచోటల్లా మోదీ ఉపన్యాసాలు దంచుతున్నారంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. అంతకు ముందు రాయ్‌చూర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో కూడా రాహుల్ బీజేపీ, మోదీలపై విరుచుకుపడ్డారు. అవినీతిలో బీజేపీ ప్రపంచ రికార్డులు సాధించిందని.. అధికారంలో ఉన్నప్పుడు స్కాములతో ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆయన ఆరోపించారు. గత బీజేపీ ప్రభుత్వంలో ముగ్గురు సీఎంలు మారారని, నలుగురు మంత్రులు జైలు శిక్ష అనుభవిస్తూ రాజీనామాలు చేశారని గుర్తుచేశారు. ఇంత జరిగినా ప్రధాని మోదీ ఇక్కడకి వచ్చి కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. -
అవినీతిలో ప్రపంచ రికార్డు వారిదే..
సాక్షి,కొప్పల్ (కర్ణాటక) : అవినీతిలో బీజేపీ ప్రపంచ రికార్డులు సాధించిందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్‌కు అవినీతి మకిలి అంటలేదని కితాబిచ్చారు. ఉత్తర కర్ణాటకలో రెండో రోజు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించిన రాహుల్ బీజేపీ లక్ష్యంగా విమర్శల దాడి తీవ్రతరం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు స్కాములతో ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. గత ఐదేళ్లుగా కాంగ్రెస్ ఏలుబడిలో కనీసం ఒక్క కుంభకోణం కూడా చోటుచేసుకోలేదని బీజేపీ హయాంలో మైనింగ్ స్కాం సహా పలు కుంభకోణాలు జరిగాయని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనాశీర్వాద్ యాత్రలో భాగంగా రాహుల్ ఆదివారం పలు సభల్లో ప్రసంగించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. గత బీజేపీ ప్రభుత్వంలో ముగ్గురు సీఎంలు మారారని, నలుగురు మంత్రులు జైలు శిక్ష అనుభవిస్తూ రాజీనామాలు చేశారని గుర్తుచేశారు. ఇంతజరిగినా ప్రధాని మోదీ ఇక్కడకి వచ్చి కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. -
ఎగ్జిట్ గేట్లో కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నిష్క్రమణ దశలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప చేపట్టిన పరివర్తన యాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం ప్యాలెస్ గ్రౌండ్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. కాంగ్రెస్ పాలన తెరపడుతోందనేందుకు ర్యాలీకి భారీగా హాజరైన ప్రజలే సంకేతమన్నారు. ప్రజా సంక్షేమానికి కేంద్రం కేటాయించిన నిధులను కాంగ్రెస్ పార్టీ తన సంక్షేమానికి వాడుకుంటోందని ఆరోపించారు. 2014 నుంచి కర్ణాటకకు కేంద్రం కేటాయించిన నిధుల వివరాలను ప్రధాని వివరించారు. కర్ణాటక అభివృద్ధికి ఉపయోగించాల్సిన నిధులను సీఎం సిద్ధరామయ్య దారిమళ్లించారని విమర్శించారు. ఈ విషయాలపై ప్రజలు దృష్టిసారించాలని కోరారు. కేంద్ర బడ్జెట్లో బెంగళూర్ మెట్రోకు రూ 17,000 కోట్లు కేటాయించామని..దీని ద్వారా 15 లక్షల మంది నగర ప్రయాణీకులకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైతుల ప్రయోజనాల కోసం ఆపరేషన్ గ్రీన్‌ను చేపట్టామని..ఇది డైరీ రైతులకు అమూల్ తరహాలో మెరుగైన ప్రయోజనాలు అందిస్తుందని చెప్పారు. -
'మళ్లీ ఆ పదాల జోలికి వెళ్లకండి.. పవర్ రాదు'
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ, ఎలాగైనా కోల్పోయిన అధికారాన్ని పొందాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం ప్రచారాల్లో కూడా ఎలాంటి లోపం జరగకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. రెండు పార్టీల్లో కూడా అగ్ర నాయకుల సూచనల ఆధారంగానే పార్టీ క్షేత్ర స్థాయి శ్రేణులు ముందుకెళ్లాలని హెచ్చరిస్తున్నాయి. ఏ ఒక్క వ్యక్తితోనో, వర్గంతో పెట్టుకోకుండా అందరినీ ఆకర్షించే ప్రయత్నాల్లో తలమునకలవుతున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమైన కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నేతలకు ముందుగానే ఏం చేయాలో ఏం చేయకూడదో అనే అంశాలను ప్రత్యేకంగా హెచ్చరించి మరీ చెప్పారు. ముఖ్యంగా బీఫ్, హిందూ టెర్రర్ అనే పదాల జోలికి అస్సలు వెళ్లకూడదని, వీటిని ఉపయోగించకుండానే పెద్ద నేతల నుంచి చిన్నస్థాయి నేతల వరకు ప్రచారంలో ముందుకు వెళ్లాలని హెచ్చరించారు. ఈ రెండు అంశాలే అధికారాన్ని దూరం చేసే ప్రమాదం లేకపోలేదని కూడా ఆయన హెచ్చరించారు. ఎన్నికల ప్రధాన అంశాల నుంచి దృష్టిని మరల్చేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుందని, ట్రాప్‌లో పడేయాలను చూస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో అలా అవకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. ఎవరూ ఏమనుకున్నా బీఫ్, హిందూ టెర్రరిజం అనే పదాలపై ఎలాంటి ప్రకటనలు ఆవేశాలకు పోవద్దని సూచించారు. -
కన్నడ మొగ్గు ఎటు?
28 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్ వి.సురేంద్రన్, సాక్షి-బెంగళూరు: కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాలకు గురువారం ఒకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి. పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలకు ప్రతిష్టాత్మంగా మారిన ఈ ఎన్నికల్లో ఎవరిది పైచేయి అవుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 22 నియోజక వర్గాల్లో కాంగ్రెస్, బీజేపీలు ముఖాముఖి తలపడుతున్నాయి. నాలుగు చోట్ల కాంగ్రెస్-జేడీఎస్, బీజేపీ-జేడీఎస్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మిగిలిన రెండు నియోజక వర్గాల్లో మూడు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు ముక్కోణపు పోటీ నెలకొంది. 2009లో జరిగిన ఎన్నికల్లో 19 స్థానాలను గెలుచుకున్న బీజేపీ, నరేంద్ర మోడీ హవాతో ఈసారి ఒకట్రెండు సీట్లు అదనంగా గెలుచుకుంటామనే విశ్వాసంతో ఉంది. మరోవైపు ఈ పది నెలల కాలంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌ను ఒడ్డున పడవేయక పోతాయా అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆశాభావంతో ఉన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉత్తమ ఫలితాలు సాధించకపోతే, ప్రభుత్వ సారథులు తప్పుకోవాల్సి ఉంటుందనే అధిష్టానం హెచ్చరికలు సీఎంకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు తన పాలనపై రెఫరెండం కాబోదని ఆయన ముందుగానే చెప్పుకుంటున్నారు. 2009లో ఆరు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్, ఈసారి కనీసం 15 స్థానాలనైనా చేజిక్కించుకోవాలని ఆశిస్తోంది. గత ఎన్నికల్లో మూడు స్థానాలను గెలుచుకున్న జేడీఎస్, ఈసారి వాటిని నిలుపుకోవడం గగనంగా కనిపిస్తోంది. కేంద్ర మంత్రులకు సంకటం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేంద్ర మంత్రులు మల్లికార్జున ఖర్గే(గుల్బర్గా), వీరప్ప మొయిలీ(చిక్బళ్లాపురం), కేహెచ్ మునియప్ప (కోలారు)లు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఖర్గే తన నియోజక వర్గానికి అనేక పనులు మంజూరు చేయించినా, ప్రభుత్వ వ్యతిరేకత ఆయనకు శాపంలా పరిణమిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, స్థానికంగా వ్యక్తమవుతున్న నిరసన మొయిలీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆయన నియోజక వర్గం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోనే ఉన్నందున, విభజనపై ఆగ్రహ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. 1991 నుంచి ఓటమి ఎరుగని మునియప్ప, ఈసారి గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరుగురు మాజీ సీఎం(కుమారస్వామి, డీవీ సదానంద గౌడ, బీఎస్ యెడ్యూరప్ప, ధరమ్‌సింగ్, దేవెగౌడ, మొయిలీ)లు పోటీపడుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మాజీ ప్రధాని కూడా అయిన జేడీఎస్ అధినేత దేవెగౌడకు ఇవే చివరి ఎన్నికలు కనుక స్థానిక ఓటర్లు అనుగ్రహిస్తారనే అంచనాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థులు దాదాపుగా అన్ని నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్నా, వారి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. కాంగ్రెస్ తరఫున రాహుల్, బీజేపీ తరఫున మోడీ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరఫున చిరంజీవి చిక్‌బళ్లాపురంలో రోడ్ షో నిర్వహించగా, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ పక్కనున్న కోలారుతో పాటు రాయచూరు, గుల్బర్గాలో చివరి రోజు బీజేపీ తరఫున సుడిగాలి పర్యటన చేశారు. -
బీజేపీకి మద్దతుగా కర్ణాటకలో పవన్ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: బీజేపీకీ, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి మద్దతుగా సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ మంగళవారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కర్ణాటకలో తెలుగువారు ఎక్కువగా ఉన్న రాయచూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉదయం 9 నుంచి 11 గం టల మధ్య.. కోలార్ లోక్‌సభ పరిధిలో 12.30 నుంచి 2 మధ్య .. గుల్బర్గా నియోజకవర్గంలో సాయంత్రం జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం చేయడానికి కారణాలు వివరిస్తూ జనసేన కార్యాలయం పేరుతో సోమవారం మీడియాకు ప్రకటన విడుదలైంది. ‘సోమవారం ఢిల్లీ నుంచి మోడీ ప్రతినిధులతో పాటు తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి, సీమాంధ్ర బీజేపీ నేతలు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, పార్టీ కార్యవర్గంతో భేటీ అయ్యారు. ప్రాంతాలకు అతీతంగా అందరికీ న్యాయం చేస్తామంటూ బీజేపీ నేతల నుంచి స్పష్టమైన హామీ అనంతరం పవన్ కల్యాణ్ బీజేపీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి జనసేన పార్టీ కార్యవర్గం నిర్ణయించింది’ అని ప్రకటనలో పేర్కొన్నారు.