రాజకీయంగా దిగాలుపడి మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నాల్లో భాగంగా 1978 లో చిక్‌మగుళూరు నుండి లోక్‌సభకు పోటీచేస్తూ ఇందిరాగాంధీ తుంగనది ఒడ్డున ఉన్న శృంగేరి మఠంలో అడుగుపెట్టారు. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి దేవరాజ్ ఆర్స్ ఇందిరాగాంధీకి పూర్తి అండగా నిలబడి తన నాయకురాలి రాజకీయ పునరుజ్జీవనానికి బాటలు వేసారు.