
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు బుధవారం భేటీ అయ్యారు. కర్ణాటక ఎన్నికల్లో ఇటీవల ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు చేసిన ప్రచారంపై చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధీశ్ రాంభొట్ల మాట్లాడుతూ.. ఓ ఎన్జీవోకు అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల్లో ప్రచారం చేయడమంటే సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించినట్టేని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోద్భలంతోనే అశోక్‌బాబు బీజేపీని విమర్శిరస్తున్నారన్నారు. తనకు చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడనే నమ్మకంతోనే రాజీనామా చేస్తానని అశోక్‌బాబు సవాల్ చేస్తున్నారని పేర్కొన్నారు. అశోక్‌బాబు తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరొచ్చని సుధీశ్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment