అశోక్ బాబు(పాత చిత్రం)
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్జీవో నేత అశోక్‌బాబు ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ సర్వీసు రూల్స్‌కు విరుద్ధంగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పాటు ప్రధానిపై విమర్శలు గుప్పించినందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు బుధవారం గవర్నర్ నరసింహన్‌ను కోరారు. ఆ పార్టీ అధికార ప్రతినిధులు సుధీష్‌రాంబొట్ల, ఆంజనేయరెడ్డి, తెలంగాణ రాష్ట్ర పార్టీ నేతలు ప్రకాష్‌రెడ్డి, రామకృష్ణ ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
సుధీష్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగిగా నిబంధనలు ఉల్లఘించిన అశోక్‌బాబు.. ఇప్పుడు రాజీనామా చేస్తానని చెబుతున్నారని, ఉద్యోగానికి రాజీనామా చేసినా క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకు ఆయనకు పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం చెల్లించే గ్రాట్యూటీ, పెన్షన్ వంటివి నిలుపుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను కోరామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment