సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల భవనాలకు తెలుగుదేశం పార్టీ రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్ వేశారు. ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ రంగులు వేస్తున్నా కానీ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
అన్ని ప్రభుత్వం కార్యాలయాలకు టీడీపీకి సంబంధించిన పసుపు రంగును వేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. రాజకీయంగా లబ్ధి పొందటానికి ప్రభుత్వ భవనాలకు పసుపు రంగు వేస్తున్నారన్నారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేస్తున్నారని.. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు ఇది విరుద్ధమని పిటిషన్‌లో చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు, అన్న క్యాంటీన్ల పేరుతో పెద్ద స్కామ్ జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. అన్న క్యాంటీన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం దోపిడీకి తెరలేపిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్న క్యాంటీన్లను పైసా వసూల్ క్యాంటీన్లుగా చంద్రబాబు మార్చేశారు. అన్న క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ డబ్బా కొట్టిన చంద్రబాబు.. వాటికి టీడీపీ రంగులు వేసి ఆర్భాటం చేశారు. కానీ.. ఇప్పుడు ప్రజల నుంచి చందాలు సేకరణ అంటూ మాట్లాడుతున్నారు.
ఇదీ చదవండి: తిరుపతి లడ్డూ ఆరోపణలతో హెరిటేజ్ లింకులు!?..
Comments
Please login to add a commentAdd a comment