Anna Canteens
-
అన్న క్యాంటీన్లు నిర్మించా... నాకు అన్నం లేకుండా చేస్తున్నారు
పిఠాపురం: ‘రూ.40లక్షలు అప్పు తెచ్చి అన్న క్యాంటీన్లు నిర్మించాను. లంచం ఇవ్వలేదని అధికారులు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించకుండా నిలిపివేసి నాకు అన్నం లేకుండా చేస్తున్నారు. ఐదుసార్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(గ్రీవెన్స్)లో ఫిర్యాదు చేశా. అయినా ప్రయోజనం లేదు. అలాంటప్పుడు ఈ పరిష్కార వేదికలు ఎందుకు?’ అంటూ కాకినాడ జిల్లా కలెక్టర్‌తోపాటు అధికారులను ఓ కాంట్రాక్టర్ నిలదీశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని అంబేడ్కర్ భవన్లో సోమవారం కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యాన నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.పిఠాపురానికి చెందిన మున్సిపల్ కాంట్రాక్టర్ సూరవరపు దివాణం తాను చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన బిల్లుల గురించి కలెక్టర్, అధికారులను గట్టిగా నిలదీయడంతో ఆయన్ను పోలీసులు బయటకు గెంటేశారు. ఈ సందర్భంగా దివాణం మాట్లాడుతూ గొల్లప్రోలు, పిఠాపురం, ఏలేశ్వరం, తుని పట్టణాల్లో తాను కాంట్రాక్టు తీసుకుని అన్న క్యాంటీన్లు నిర్మించానని తెలిపారు. అప్పులు చేసి రూ.40 లక్షల పెట్టుబడి పెట్టానని, వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికారులకు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావుకు ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించిన బిల్లు ఇవ్వాలంటే కౌన్సిల్లో తీర్మానం చేయాలని, దానికి 5 శాతం కమీషన్ ఇవ్వాలంటున్నారని ఆరోపించారు. తాను 30 శాతం తక్కువకు టెండర్ వేసి పనులు చేశానని, అయినా తనకు బిల్లు ఇవ్వడానికి లంచాలు డిమాండ్ చేస్తూ ఏడిపిస్తున్నారని చెప్పారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతిపత్రం ఇస్తే న్యాయం జరుగుతుందని భావించి ఐదుసార్లు ఫిర్యాదు చేసినా... ఇక్కడ కూడా అన్యాయమే జరుగుతోందన్నారు. కాలువల్లో పూడికలు తీశానని, వాటికి కూడా బిల్లులు రావాల్సి ఉందన్నారు. తన బిల్లుల గురించి కలెక్టర్‌ను గట్టిగా అడిగితే ‘నీ దిక్కున్న వాడితో చెప్పుకో..’ అని అంటున్నారని దివాణం చెప్పారు. పేదలకు అన్నం పెడుతున్నారని తన భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి, అప్పులు చేసి అన్న క్యాంటీన్లు కట్టించానని, చెప్పారు. ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం చాలా మంచిదని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో డబ్బులు ఉంటేనే పనులు చేయించి బిల్లులు చెల్లించేవారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో పనులు చేయించుకుని లంచాల కోసం బిల్లులు చెల్లించకుండా ఏడిపిస్తున్నారని ఆరోపించారు. కాగా, దివాణంకు త్వరలో బిల్లులు చెల్లించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
అన్నా క్యాంటీన్లకు టీడీపీ రంగులు.. హైకోర్టు నోటీసులు
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలు, అన్నా క్యాంటీన్లపై టీడీపీ రంగులు వెయ్యటాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టు పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. గతంలో గ్రామ సచివాలయలకు బ్లూ కలర్ వేయటంపై తీర్పు ఇచ్చినట్టు పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. బ్లూ కలర్ తొలగించాలని ఆదేశాలు ఇచ్చిందని, రంగులు తొలగించటానికి సమయం పట్టగా కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా దాఖలైందని పిటిషనర్ తరపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అన్నా క్యాంటీన్లకు ఇంతకు ముందు ఏ కలర్ వేశారని హైకోర్టు ప్రశ్నించింది. అదేవిధంగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఏపీ హైకోర్టు 6 వారాలకు వాయిదా వేసింది.చదవండి: ఏపీ ప్రజల కళ్లల్లో కూటమి ‘ఇసుక’! -
అన్న క్యాంటీన్లకు పసుపు రంగు.. సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల భవనాలకు తెలుగుదేశం పార్టీ రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్ వేశారు. ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ రంగులు వేస్తున్నా కానీ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.అన్ని ప్రభుత్వం కార్యాలయాలకు టీడీపీకి సంబంధించిన పసుపు రంగును వేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. రాజకీయంగా లబ్ధి పొందటానికి ప్రభుత్వ భవనాలకు పసుపు రంగు వేస్తున్నారన్నారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేస్తున్నారని.. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు ఇది విరుద్ధమని పిటిషన్లో చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.మరోవైపు, అన్న క్యాంటీన్ల పేరుతో పెద్ద స్కామ్ జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. అన్న క్యాంటీన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం దోపిడీకి తెరలేపిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్న క్యాంటీన్లను పైసా వసూల్ క్యాంటీన్లుగా చంద్రబాబు మార్చేశారు. అన్న క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ డబ్బా కొట్టిన చంద్రబాబు.. వాటికి టీడీపీ రంగులు వేసి ఆర్భాటం చేశారు. కానీ.. ఇప్పుడు ప్రజల నుంచి చందాలు సేకరణ అంటూ మాట్లాడుతున్నారు.ఇదీ చదవండి: తిరుపతి లడ్డూ ఆరోపణలతో హెరిటేజ్ లింకులు!?.. -
అన్న క్యాంటీన్లో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట
సాక్షి, అన్నమయ్య జిల్లా: రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. టీడీపీ నేతల కుమ్ములాటతో అధిపత్య పోరు బయటపడింది. పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్రాజు, ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం వర్గాల మధ్య తోపులాట జరిగింది. మేం ప్రారంభించాలంటే.. మేమంటూ ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.కత్తెరని లాక్కుని ప్రారంభోత్సవం చేసేందుకు ఇరువర్గాలు ప్రయత్నించాయి. పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్రాజు చొక్కా సుగవాసి వర్గీయులు పట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఇదీ చదవండి: ఎల్లో మీడియాకు నటి కాదంబరీ జత్వానీ ఝలక్మరో వైపు, అన్నక్యాంటీన్లను పైసా వసూల్ కేంద్రాలుగా చంద్రబాబు సర్కార్ మార్చేసింది. ప్రజల సొమ్మును దోచుకునేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. అన్నా క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ కలరింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. మాట మార్చేశారు. ఇన్నాళ్లు డబ్బాకొట్టి.. వాటికి టీడీపీ రంగులు వేసి ఆర్భాటం చేశారు. కానీ.. ఇప్పుడు ప్రజల నుంచి చందాలు సేకరణ అంటూ మాట్లాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. -
వీడియో.. బాబు, లోకేష్.. ఇదేందయ్యా ఇదీ: వైఎస్సార్సీపీ సెటైర్లు
సాక్షి, తాడేపల్లి: పబ్లిసిటీలో చంద్రబాబును మించిన వ్యక్తి మరొకరు ఉండరు. ఆయనకు పబ్లిసిటీ అంటే పిచ్చో ఇప్పటికే పలు సందర్భాల్లో చూశాం. పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఏం చేయడానికైనా వెనుకాడరు. ఇక, తాజాగా అన్న క్యాంటీన్ల ప్రారంభం సందర్భంగా పెదబాబు, చినబాబు తమలోని నటనను బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను వైఎస్సార్సీపీ ట్విట్టర్లో పోస్టు చేసింది.కాగా, వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘అన్న క్యాంటీన్లో భోజనంపై ఎంత నమ్మకమో?. అర ఇడ్లీతో సరిపెట్టిన నారా లోకేష్.. రెండు చెంచాల రైస్‌తో మమ అనిపించిన చంద్రబాబు. భోజనంలో నాణ్యతని గాలికొదిలేసి.. పబ్లిసిటీలో తెలుగు తమ్ముళ్లు బిజీ. ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తూ టీడీపీ నేతలు పెత్తనం’ అంటూ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. అన్న క్యాంటీన్లో భోజనంపై ఎంత నమ్మకమో?అర ఇడ్లీతో సరిపెట్టిన @naralokesh.. రెండు చెంచాల రైస్‌తో మమ అనిపించిన @ncbn భోజనంలో నాణ్యతని గాలికొదిలేసి.. పబ్లిసిటీలో తెలుగు తమ్ముళ్లు బిజీ ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తూ టీడీపీ నేతలు పెత్తనం pic.twitter.com/Pkvq3BAG6x— YSR Congress Party (@YSRCParty) August 16, 2024 -
సొమ్ము ఒకడిది, సోకు ఇంకొకడిది
-
దాతల భాగస్వామ్యం కావాలి
సాక్షి, మచిలీపట్నం/సాక్షి, అమరావతి: పేదోడి ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు తెచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడలోని రామబ్రహ్మం మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ప్రారంభించారు. ప్రజలతో కలిసి క్యాంటీన్లోనే భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో తాము ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఆటో కార్మికులు, హమాలీలు, పారిశుద్ధ్య కార్మికులు, చిరు వ్యాపారులు ఎంతో మంది సద్వినియోగం చేసుకున్నారని, వారి భోజన ఖర్చు చాలా మిగిలిందని అన్నారు. ఈ క్యాంటీన్ల నిర్వహణ కోసం తన సతీమణి భువనేశ్వరి రూ. కోటి ఇచ్చారని, పలువురు దాతలు కూడా విరాళాలు ఇచ్చారని, మిగతా వారు కూడా భాగస్వామ్యం కావాలని అన్నారు. పెళ్లిళ్ల ఖర్చు తగ్గించుకొని అన్న క్యాంటీన్లకు విరాళాలివ్వాలని సూచించారు. దీని కోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెరిచామని, నేరుగా ఆన్లైన్ ద్వారా ఈ ఖాతాకు విరాళాలివ్వొచ్చని తెలిపారు. జనవరిలో జన్మభూమి 2.ను ప్రారంభించి, గ్రామాల అభివృద్ధిలో మళ్లీ ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు. రాష్ట్రంలో జనాభా తగ్గుతోందని, పిల్లల పుట్టుక తగ్గడంతో యువత శాతం తగ్గిందని చెప్పారు. సంపద సృష్టించే యువకులు తగ్గడం ప్రమాదకరమని అన్నారు. జనాభా పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా.. ఎక్కువ మంది పిల్లలున్న వారికే సంపద ఉంటుందని చెప్పారు. 2004 కంటే ముందు హైదరాబాదుతో పాటు అనేక ప్రాంతాలను అభివృద్ధి చేశానని, అయితే తనకంటే మెరుగ్గా పాలిస్తారని వేరే పారీ్టకి ఓట్లు వేయడంతో రాష్ట్ర విభజనకు దారితీసే పరిస్థితి తెచ్చారని అన్నారు. 2019లోనూ తననే గెలిపించి ఉంటే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లే వాడినని చెప్పారు. మరో 23 ఏళ్లకు 100వ స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుకుంటామని, అప్పటివరకు తమ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, మంచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్‌రాజా, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నేడు 99 చోట్ల అన్న క్యాంటీన్ల ప్రారంభంవచ్చే నెలాఖరుకి రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్ల ఏర్పాటే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసినట్టు మున్సిపల్ శాఖ తెలిపింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 99 ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నట్టు వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని మున్సిపల్ మంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. -
పైసా వసూల్ కేంద్రాలుగా అన్న క్యాంటీన్లు: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ప్రజల సొమ్మును దోచుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబుకు మరో ప్లాన్ రచించుకున్నారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను పైసా వసూల్ క్యాంటీన్లుగా మార్చాడు చంద్రబాబు. అన్న క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ కలరింగ్ ఇచ్చిన బాబు.. ఇప్పుడు మాట మార్చాడని వైఎస్సార్సీపీ తీవ్ర విమర్శలు చేసింది.కాగా, వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా.. అన్న క్యాంటీన్లను పైసా వసూల్ క్యాంటీన్లుగా మార్చేసిన చంద్రబాబు. ప్రజలు డబ్బులు ఇవ్వాలి.. కానీ క్రెడిట్ మాత్రం నాకే కావాలి. అన్న క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ ఇన్నాళ్లు డబ్బాకొట్టారు.. వాటికి టీడీపీ రంగులు వేసి ఆర్భాటం చేశారు. కానీ.. ఇప్పుడు ప్రజల నుంచి చందాలు సేకరణ అంటూ మాట్లాడుతున్నారని.. చంద్రబాబు వీడియోను షేర్ చేసింది.అన్న క్యాంటీన్లను పైసా వసూల్ క్యాంటీన్లుగా మార్చేసిన @ncbnప్రజలు డబ్బులు ఇవ్వాలి.. కానీ క్రెడిట్ మాత్రం నాకే కావాలిఅన్న క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ ఇన్నాళ్లు డబ్బాకొట్టారు.. వాటికి టీడీపీ రంగులు వేసి ఆర్భాటం కానీ.. ఇప్పుడు ప్రజల నుంచి చందాలు సేకరణ.. https://t.co/f3BLYS0Xpz— YSR Congress Party (@YSRCParty) August 15, 2024ఇక, అన్న క్యాంటీన్లపై వైఎస్సార్సీపీ నేతలు కూడా ఆరోపణలు చేశారు. అన్న క్యాంటీన్ల పేరుతో పెద్ద స్కామ్ జరుగుతోందన్నారు. క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి కానీ.. ఊరికి దూరంగా ఉండటం ఏంటని ప్రశ్నించారు. క్యాంటీన్ల పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. -
బాబుకు అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్
-
అన్న క్యాంటీన్లపై కూటమి సర్కార్ కొత్త డ్రామా: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పేదలకు అందాల్సిన పథకాలను పక్కన పెట్టి అన్న క్యాంటీన్ల పేరుతో కూటమి సర్కార్ కొత్త డ్రామాకు తెరతీసిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అన్న క్యాంటీన్లకు పచ్చ రంగు ఎందుకు వేశారని ప్రశ్నించారు. అలాగే, సూపర్ సిక్స్ హామీలను సూపర్ చీట్గా మార్చేశారని ఎద్దేవా చేశారు.కాగా, మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి సర్కార్ అన్న క్యాంటీన్ల పేరుతో కొత్త డ్రామా చేస్తున్నారు. రెండు, మూడు వందల మందికి పెట్డి, విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. ఊరికి దూరంగా అన్న క్యాంటీన్లను నిర్మించారు. జనసంచారం లేని చోట నిర్మించి ఏం ప్రయోజనం?. క్యాంటీన్ల పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారు. రూ.31 కోట్లను అప్పనంగా కొట్టేశారు. ప్రభుత్వ సొమ్ముతో అన్న క్యాంటీన్లను నిర్మించి వాటికి పార్టీ ఆఫీసుల్లాగా పచ్చరంగు వేశారు. వైఎస్సార్సీపీ రంగులు వేస్తోంది అంటూ గతంలో మాపై కోర్టుకు వెళ్లారు. మరి ఇప్పుడు అన్న క్యాంటీన్లకు పచ్చరంగు ఎందుకు వేశారు?. పేదల పథకాలను ఎత్తివేసి వారిని మరింత పేదలుగా మార్చవద్దు. పేదల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో చేశారు. పప్పుబెల్లాలు పెట్టి సంక్షేమ పథకాలు ఎత్తివేయటం కరెక్ట్ కాదు.విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలుపు ఖాయమైంది. చంద్రబాబు నైతికతతో పోటీ పెట్టలేదని టీడీపీ నేతలు డబ్బాలు కొడుతున్నారు. అనైతికతకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. అలాంటి వ్యక్తి నుండి మా జడ్పీటీసీలు, ఎంపీటీసీలను కాపాడుకున్నాం. బలం లేక చంద్రబాబు పోటీ నుండి విరమించుకున్నారు. విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో చంద్రబాబు వ్యవహరించిన అనైతికతను జనం చూశారు. దెయ్యాలు వేదాలు వల్లించనట్టుగా చంద్రబాబు నైతికత ఉంది.సూపర్ సిక్స్ హామీలను సూపర్ చీట్గా మార్చేశారు. ప్రజలను నిలువునా మోసం చేశారు. విద్య, వైద్యం, పోర్టుల మీద వైఎస్ జగన్ వేల కోట్లు ఖర్చు పెట్టారు. ప్రజల అభివృద్ధి కోసం పని చేశారు వైఎస్ జగన్. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటన్నిటినీ పక్కనపెట్టారు. తల్లికి వందనం ఎప్పుడు అమలు చేస్తారో తెలియకుండా పోయింది. విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. చంద్రబాబు నిర్వాకం వల్ల ఐదు మెడికల్ కాలేజీలు నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. స్కూల్స్‌లో ఇంగ్లీషు మీడియం, టోఫెల్ శిక్షణ వంటివన్నీ పక్కన పడేశారు అంటూ కామెంట్స్ చేశారు. -
టీడీపీ ఆఫీసులను తలపిస్తున్న అన్నా క్యాంటిన్లు
-
చంద్రబాబు అన్న క్యాంటీన్ పై మల్లాది విష్ణు షాకింగ్ కామెంట్స్
-
అభివృద్ధి, సంక్షేమం, అన్న క్యాంటీన్లు.. అన్నీ విరాళాలతోనే..
సాక్షి, అమరావతి: దాతలు, ప్రజల విరాళాలతో జన్మభూమి–2 ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అన్న క్యాంటీన్లు నిర్వహిస్తామని టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే సీఎం హోదాలో చేసిన ఐదు సంతకాల అమలును ప్రారంభించామని చెప్పారు. పార్టీ సభ్యులకు ఇచ్చే ప్రమాద బీమాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు.కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధిలో పార్టీ అండగా ఉంటుందన్నారు. సిఫార్సులతో సంబంధం లేకుండా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను గుర్తించి దశలవారీగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్‌రెడ్డిని ఇంటికి పంపించడానికి ఉపాధి కోల్పోయి వలస వెళ్లిన కారి్మకులు కూడా వచ్చి ఎన్నికల్లో ఓటేశారని, ఎన్నారైలు విదేశాల నుంచి వచ్చి ఏడాది పాటు పని చేశారని చంద్రబాబు అన్నారు.వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయతి్నంచిన విధంగానే మదనపల్లెలో భూ కుంభకోణాల సాక్ష్యాలను తారుమారుకు కూడా కుట్ర చేశారన్నారు. వివేకాది గుండెపోటని చెప్పినట్లుగానే.. మదనపల్లెలో ఫైళ్ల దగ్ధాన్ని షార్ట్ సర్క్యూట్‌గా ప్రచారం చేశారన్నారు. పెద్దిరెడ్డి అక్రమాలపై ఒక్క రోజులోనే వేలాది బాధితులు ఫిర్యాదు చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ అంటేనే నేరస్థులు, అరాచకవాదులని అన్నారు. 13 లక్షలకు పైగా అసైన్డ్ భూములను కాజేశారని, 40 వేల ఎకరాలు రిజస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని చెప్పారు. 22ఏను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు, దందాలు చేశారని అన్నారు. అర్జీల పరిష్కారానికి యంత్రాంగం ఏర్పాటుఅనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, నదుల అనుసంధానం, 8 వెనకబడ్డ జిల్లాలకు కేంద్ర సహకారం, నరేగా, నీరు–చెట్టు బిల్లుల విడుదల, ప్రజావేదిక, ప్రజాదర్బార్‌లో వచి్చన అర్జీల పరిష్కారానికి యంత్రాంగం ఏర్పాటు తదితర అంశాలపై చర్చించినట్టు వివరించారు. గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం, దోపిడీపై విడుదల చేసిన ఏడు శ్వేతపత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ జిల్లా యూనిట్‌గా అమలు చేయాలని భావిస్తున్నట్టు చంద్రబాబు పొలిట్‌బ్యూరోలో వివరించినట్టు సమాచారం. -
అన్న క్యాంటీన్లకు పసుపు రంగులు దిద్దిన టీడీపీ
-
అన్నన్నా.. చంద్రన్న మార్క్ ఛీటింగ్
ఏపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన ఎన్నికల హామీలలో కీలకమైనవాటి జోలికి వెళ్లకుండా.. తేలికగా పూర్తి అయ్యే వాటిపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. అందులో భాగంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయ సంకల్పించారు. ఐదు రూపాయలకే భోజనం సమకూర్చడం దీని లక్ష్యం. ఆగస్టుపదిహేను నాటికి వంద చోట్ల ఈ క్యాంటిన్లు నెలకొల్పుతారు. ఆ తర్వాత మరో నెలలో ఇంకో 83 క్యాంటిన్లు ఏర్పాటవుతాయని టీడీపీ మీడియా కథనాన్ని ఇచ్చింది. అయితే..2014 టర్మ్‌లో కూడా కొన్ని క్యాంటిన్లు ఏర్పాటు చేసినా, వాటి వల్ల పెద్ద ప్రయోజనం ఒనగూరలేదన్నది ఒక అభిప్రాయం. దీనికోసం పెట్టిన ఖర్చులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నిజంగానే ఈ క్యాంటిన్లు పేదలకు ఎంతవరకు ఉపయోగపడతాయన్నది చర్చనీయాంశం. తమిళనాడులో కూడా అమ్మ క్యాంటిన్ల పేరుతో ఇలాంటి సదుపాయం కల్పించారు. తెలంగాణలో హైదరాబాద్‌లో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పలు చోట్ల ఇలాంటి క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి పాలవడంతో సహజంగానే వీటికి ప్రాధాన్యత తగ్గింది. ఏపీలో పట్టణ ప్రాంతాలలో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77 మున్సిపాల్టీలు, 17 కార్పొరేషన్ లు, 29 నగర పంచాయతీలు ఉన్నాయి. అన్నీకలిపి 123 అర్బన్ స్థానిక సంస్థలు ఉన్నాయన్నమాట. ఈ రకంగా చూస్తే పట్టణానికి ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు కావచ్చు. లేదంటే.. కొన్ని నగరాలలో అదనంగా మరో ఒకటో, రెండో నెలకొల్పుతారు. దీంతోనే పేదలందరికి ఆకలితీర్చేసినట్లే అన్నంతంగా ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. బహుశాఒక్కో క్యాంటిన్ లో వంద నుంచి రెండువందల మందికి భోజనం సరఫరా చేయవచ్చు. దీనికిగాను ప్రభుత్వానికి అయ్యే ఖర్చు బాగా తక్కువే. అయినా బాగా ప్రచారానికి ఉపయోగపడుతుందన్నది వ్యూహకర్తల భావనగా ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మంగా సూపర్ సిక్స్ లోని ముఖ్యమైన అంశాల జోలికి వెళ్లకుండా ఇలాంటి చిన్న,చిన్న హామీలతో ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా తల్లికి వందనం కింద ప్రతి విద్యార్దికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇవ్వవలసి ఉంది. దానిని విద్యాశాఖ మంత్రి లోకేష్ వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దానికి ఆయన చూపిన కారణం స్కీమ్ గురించి చర్చించాలట. గత ప్రభుత్వ టైమ్ లో 72 వేల మంది విద్యార్ధులు తగ్గారని, టీచర్ల సంఘాలతో చర్చలు జరపాలని ఆయన అన్నారు. ఇది చాలా చిత్రమైన ప్రకటన. విద్యార్దులు తగ్గితే ,దాని గురించి తల్లికి వందనం స్కీము అమలును ఆపవలసిన అవసరం ఏమి ఉంటుందో తెలియదు. టీచర్ల సంఘాలు ఈ స్కీము అమలు చేయవద్దని ఏమీ చెప్పలేదు కదా!. పోనీ ఎన్నికల ప్రచార సమయంలో ఆ సంఘాలవారితో ఏమైనా ఆ హామీ గురించి చర్చించి ఖరారు చేశారా?చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లతో పాటు నిమ్మల రామానాయుడు వంటివారు పోటీపడి తల్లికి వందనం స్కీము గురించి ప్రచారం చేశారు కదా!ఇప్పుడేమో విధి విధానాలు ఖరారు కావాలని లోకేష్ అంటున్నారు. మొదట ప్రతి కుటుంబంలో ఒక్కరికే ఈ స్కీము పరిమితం చేయాలని ఆలోచించారు.కాని ప్రజలలో వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత అసలు స్కీమునే ఏడాదిపాటు వాయిదా వేసుకున్నారు. దానికి కారణం.. ఈ పధకం అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. గతంలో జగన్ ప్రభుత్వం ఒక్క తల్లికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తేనే సుమారు ఆరేడువేల కోట్ల రూపాయల వ్యయం ఏడాదికి అయ్యేది. అలాంటిది ప్రతి విద్యార్దికి వర్తింపచేయాలంటే ఏడాదికి కనీసం పదిహేనువేల కోట్ల రూపాయల వ్యయం కావచ్చు. అందుకే ప్రభుత్వం వెనుకాడుతోంది. ఈ నేపధ్యంలోనే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అంటేనే భయం వేస్తోందని అంటున్నారు. ఏపీలో ప్రతి మహిళకు రూ.1,500 రూపాయల చొప్పున ప్రతి నెల ఇవ్వడం కూడా సూపర్ సిక్స్ లో భాగమే. ఆ రకంగా ఇవ్వడానికి ఏడాదికి ఇరవైవేల కోట్ల నుంచి పాతికవేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. నిరుద్యోగ భృతి, మూడు గ్యాస్ సిలిండర్లు మొదలైనవి కూడా అమలు చేయవలసిన అవసరం ఉంది. వాటిని ఎలాగోలా దాటవేయడానికి టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటిన్లను ఏర్పాటు చేసి సూపర్ సిక్స్ హామీని అమలు చేసేశామని ప్రచారం చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఈనాడు మీడియా ఇప్పటి నుంచే అన్నా క్యాంటిన్లపై ప్రచారం ఆరంభించింది. ప్రతి పట్టణంలోను ఎక్కడో ఒకటి,రెండు చోట్ల ఐదు రూపాయలకు భోజనం పెట్టి, మొత్తం పేదల ఆకలి తీర్చామని ప్రచారం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా టీడీపీ ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ సూపర్ సిక్స్ ను పక్కనబెట్టి ,ఇలాంటి జిమ్మిక్కులకు జనం ఓకే చెబుతారా?అన్నది సందేహమే.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
తప్పుడు ఆరోపణలు చేస్తే.. మీరే ఫూల్స్ అవుతారు: ఆర్కే రోజా
సాక్షి, గుంటూరు: అవసరం లేని విషయాలపై టీడీపీ రాజకీయాలు చేస్తోందని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. గుంటూరువారితోటలో వినాయక నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని మంత్రి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని నెలరోజులు రాజకీయం చేస్తోందన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే.. మీరే పూల్స్ అవుతారని హెచ్చరించారు. ఇప్పుడు అన్న క్యాంటీన్ల విషయంలో టీడీపీ కోడిగుడ్డు మీద ఈకలు పీకే రాజకీయం చేస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజంగా ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు నాలుగు అన్న క్యాంటీన్లు ప్రారంభించి మేము పెట్టాం.. మీరు తీసేశారని ఆరోపణలు చేసి టీడీపీ నేతలు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (కుప్పంలో టీడీపీ అరాచకం.. మాజీ జడ్పీటీసీ రాజ్‌కుమార్ అరెస్ట్) -
అవినీతి పునాదులపై అన్న క్యాంటీన్లు
సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు) : టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ఏడాది గడువుండగా హడావుడిగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల నిర్మాణంలో ఆ పార్టీకి చెందిన నాయకులు రూ.కోట్లు దండుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదలకు పెట్టే భోజన పథకంలోనూ చేతివాటం చూసుకున్నారనే ఆవేదన సామాన్య ప్రజల్లో కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే గత టీడీపీ ప్రభుత్వం పేదలకు రూ.5కే భోజనం పెట్టేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లను నిర్మించగా జిల్లాలో 16 క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం రూ.36 లక్షలు చొప్పున, స్థానిక నగరపాలక, మున్సిపల్ సంస్థల ద్వారా రూ.6 లక్షలు చొప్పున వెరసి ఒక్కో అన్న క్యాంటీన్‌కు రూ.42 లక్షల నిధులు కేటాయించారు. క్యాంటీన్ల నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని ఆయా నగరపాలక సంస్థలు, మున్సిపాల్టీల నుండి ఉచితంగానే అందజేశారు. అయినా ఒక్కో చదరపు అడుగుకి స్థలంతో కలిపి రూ.2 వేల నుంచి రూ.2,500 ఖర్చవుతుండగా అన్న క్యాంటీన్లకు స్థలం ఖర్చు లేకుండానే ఒక్కో అడుగుకి రూ.5,532 చొప్పున చెల్లించడంపై అప్పట్లోనే సర్వత్రా విమర్శలు వచ్చాయి. బిల్డింగ్ నిర్మాణానికి ఒక్కో అడుగుకి రూ.1500 నుండి రూ.2 వేలు ఖర్చవుతుండగా అన్న క్యాంటీన్ల నిర్మాణంలో టీడీపీ ప్రభుత్వం తన అనుచరులకు అడుగుకి రూ.3,500 నుంచి రూ.4 వేలు అదనంగా దోచి పెట్టిందని పలువురు ఆరోపిస్తున్నారు. క్యాంటీన్ల నిర్మాణంలో అవినీతిపై జేసీకి ఫిర్యాదు ఒక్కో అన్న క్యాంటీన్ నిర్మాణంలో దాదాపుగా రూ.30 లక్షలు చొప్పున ఒక్క మన జిల్లాలోనే సుమారు రూ.4.80 కోట్ల మేర అవినీతి చోటు చేసుకున్నట్లు జిల్లాలోని పలువురు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్న వారు ఆరోపిస్తున్నారు. జిల్లాలో నిర్మించిన ఒక్కో అన్న క్యాంటీన్లో రూ.30 లక్షల మేరకు అవినీతి చోటు చేసుకున్నట్లు ఇటీవల పాలకొల్లుకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారులు జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డికి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన అన్న క్యాంటీన్ల నిర్మాణానికి రూ.12 లక్షలకు మించి అవ్వదని, అయినా ఒక్కో దానికి రూ.42 లక్షలు ఖర్చు చూపి దోచుకున్నారనేది వీరి ప్రధాన ఆరోపణ. పైగా అన్నక్యాంటీన్లు నిర్మించిన స్థలం కూడా ఆయా స్థానిక సంస్థలకు చెందిన స్థలం కావడంతో కేవలం భవన నిర్మాణానికే ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఒక్కో అన్న క్యాంటీన్‌ను 756 అడుగుల విస్తీర్ణంలో నిర్మించారని గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వంలోని పెద్దలు తమ అనుయాయులకు భారీగా ముట్ట చెప్పేందేకే అన్న క్యాంటీన్లను ఆదాయ వనరులుగా వాడుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం విచారణ చేపట్టాలి అన్న క్యాంటీన్ల పేరుతో గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లను నిర్మించి రూ.62 కోట్ల మేరకు అవినీతికి పాల్పడింది. ఆఖరుకి పేదలకు భోజనం పెట్టే ఇటువంటి పథకంలోనూ గత పాలకులు తమ ధన దాహాన్ని తీర్చుకునే ప్రయత్నం చేశారు. ఒక్కో అడుగుకి రూ.5,532 ఏ లెక్కన ఇచ్చారో వారికే తెలియాలి. రాష్ట్రంలోని అన్న క్యాంటీన్ల నిర్మాణంపై ప్రభుత్వం విచారణ చేపట్టాలి. – యడ్ల తాతాజీ, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రజాధనం దుర్వినియోగం అన్న క్యాంటీన్ల పేరుతో గత టీడీపీ ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేసింది. పైకి పేదలకు రూ.5కే భోజనం అందిస్తున్నామంటూ గొప్పగా ప్రచారం నిర్వహించింది. తీరా చూస్తే వాటి నిర్మాణంలో పచ్చచొక్కాల నేతలు తమ చేతి వాటం ప్రదర్శించారు. అన్నక్యాంటీన్ల పేరుతో ఎన్నికల్లో ఆయాచిత లబ్ధి పొందాలని చూసి బోర్లాపడ్డారు. తమ నాయకుల జేబులు నింపేందుకే వీటిని సాధనాలుగా వాడుకున్నారు. – పళ్ళెం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ -
అన్న క్యాంటీన్లలో కమీషన్ల భోజనం
సాక్షి, అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ‘అన్న క్యాంటీన్ల’ పేరిట ఖజానాకు సున్నం పెట్టారు. పేదలకు నాణ్యమైన భోజనం అందిస్తామంటూ ఇష్టారాజ్యంగా కమీషన్లు భోంచేశారు. ఈ క్యాంటీన్లపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికలోని నిజాలను చూస్తే దిమ్మ తిరగడం ఖాయం. టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, ముఖ్య పట్టణాల్లో 203 అన్న క్యాంటీన్లను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నేతలు భారీ ఎత్తున దోచేశారు. 203 క్యాంటీన్ల నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం రూ.76.22 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఏకంగా రూ.53.33 కోట్లు పక్కదారి పట్టినట్లు నిపుణుల కమిటీ నిగ్గుతేల్చింది. క్యాంటీన్ల నిర్మాణంలో రూ.35.11 కోట్లు, అందులో హంగుల పేరిట రూ.18.22 కోట్లు కాజేసినట్లు గుర్తించింది. అన్న క్యాంటీన్ల నిర్మాణాల్లో ప్రతి అంగుళంలోనూ అవినీతి జరిగినట్లు నిర్ధారించింది. వ్యయం పెంచెయ్.. ముంచెయ్ నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం.. చదరపు అడుగుకు రూ.2,100 చొప్పున రూ.17.30 లక్షలతో ఒక్కో అన్న క్యాంటీన్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, టీడీపీ సర్కారు పాలనలో చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని ఏకంగా రూ.4,585కు పెంచేశారు. ఫలితంగా ఒక్కో క్యాంటీన్ నిర్మాణ వ్యయం రూ.37.55 లక్షలకు పెరిగింది. అన్ని క్యాంటీన్ల విషయంలో కేవలం నిర్మాణాల్లోనే రూ.35.11 కోట్లు అదనంగా చెల్లించారు. అలాగే షోకుల కోసం ఒక్కో క్యాంటీన్‌కు రూ.8.98 లక్షలు వెచ్చించారు. మొత్తం 203 క్యాంటీన్లలో హంగు, ఆర్భాటాలకు రూ.18.22 కోట్లు ఖర్చయ్యిందని లెక్కలు చూపారు. వాస్తవానికి క్యాంటీన్లలో అదనపు పనులేవీ జరగలేదని నిపుణుల కమిటీ తేల్చింది. అంటే ఈ సొమ్మంతా టీడీపీ నేతలు, అప్పటి ప్రభుత్వ పెద్దల జేబుల్లోకే వెళ్లిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రికార్డుల్లో అంతా గోల్మాల్ అన్న క్యాంటీన్ల నిర్మాణానికి ఎం30 గ్రేడ్ కాంక్రీట్ ఉపయోగించినట్లు రికార్డుల్లో చూపారు. ఫలితంగా ఒక్కో క్యాంటీన్ నిర్మాణ వ్యయం రూ.7 లక్షలు పెరిగినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఎం20 గ్రేడ్ కాంక్రీట్ మాత్రమే వినియోగించారని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. అన్న క్యాంటీన్ల ప్లాస్టరింగ్ సాధారణంగా ఒక మిల్లీమీటర్ నుంచి రెండు మిల్లీమీటర్ల మందంతో వేస్తారు. కానీ, మూడు మిల్లీమీటర్ల మందంతో వేసినట్లు చూపించి ఒక్కో క్యాంటీన్లో రూ.40 వేల చొప్పున మింగేశారు. ఫౌండేషన్, బేస్మెంట్లో ఇసుక నింపినట్లు రికార్డుల్లో చూపి, ఒక్కో క్యాంటీన్లో అదనంగా రూ.2.10 లక్షలు కొల్లగొట్టారు. మూడు కిలోమీటర్ల దూరం నుంచి మట్టి తెచ్చామంటూ ఒక్కో క్యాంటీన్లో అదనంగా రూ.20 వేలు, చదరపు అడుగుకు 5 టన్నుల సామర్థ్యంతో పునాది వేశామంటూ ఒక్కో క్యాంటీన్లో రూ.60 వేల చొప్పున తినేశారని నిపుణుల కమిటీ వెల్లడించింది. టెండర్లలో పాల్గొన్నది రెండు సంస్థలే ఒక్కో క్యాంటీన్‌పై అన్న క్యాంటీన్ అని పేరు రాయడానికి రూ.1.54 లక్షలు, ఒక్కో క్యాంటీన్ లోపల షోకుల కోసం రూ.3.40 లక్షలు, అన్న క్యాంటీన్ రాత్రిపూట కూడా కనిపించేలా చేయడానికి విద్యుత్ వెలుగులకు రూ.2.90 లక్షలు, క్యాంటీన్ బయట డెకరేషన్‌కు రూ.0.74 లక్షలు వ్యయం చేసినట్లు నిపుణుల కమిటీ తేల్చింది. అన్న క్యాంటీన్ల టెండర్లను ఎవరికి కట్టబెట్టాలో నిర్ణయించుకున్న తర్వాతే టెండర్ నిబంధనలు రూపొందించారని, ఈ టెండర్లలో పాల్గొనేందుకు అనుభవం గల స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించలేదని స్పష్టం చేసింది. రెండు దశల్లో చేపట్టిన అన్న క్యాంటీన్ల టెండర్లలో రెండు సంస్థలు మాత్రమే పాల్గొన్నాయని నిపుణుల కమిటీ పేర్కొంది. ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి చేసిన వ్యయం చాలా అధికంగా ఉందని వెల్లడించింది. వాస్తవానికి అంత ఖర్చు కాదని, ఈ వ్యవహారంలో బాధ్యులను గుర్తించి, చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. -
అన్న క్యాంటీన్ అవినీతిపై దర్యాప్తు
సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు) : గత ప్రభుత్వ హయాంలో పేదలకు భోజనం పెట్టే పేరుతో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో దోచేశారని, జిల్లాలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయాలంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి యడ్ల తాతాజీ జేసీ ఎం.వేణుగోపాలరెడ్డిని కోరారు. దీనిపై స్థానిక కలెక్టరేట్లో గురువారం ఆయన జేసీకి వినతిపత్రం అందజేశారు. టీడీపీ హయాంలో జిల్లాలో మొత్తం 16 అన్న క్యాంటీన్లను నిర్మించారన్నారు. వీటి కొరకు ప్రభుత్వం నుంచి రూ.36 లక్షలు, స్థానిక మున్సిపాలిటీల నుండి రూ.6 లక్షలు చొప్పున మొత్తం రూ.42 లక్షలు ఖర్చు చేశారన్నారు. ఎక్కడైనా ఒక బిల్డింగ్ కట్టాలంటే స్థలం కొని దాని నిర్మాణం చేస్తే స్థలం, నిర్మాణము కలిపి ఒక చదరపు అడుగుకి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకూ ఖర్చవుతుందన్నారు. అయితే అన్న క్యాంటీన్లు కట్టడానికి స్థలాలు మున్సిపాలిటీ, ప్రభుత్వ స్థలాలు కావడం వల్ల నిర్మాణానికి ఒక చదరపు అడుక్కి రూ.1,500 చొప్పున మాత్రమే ఖర్చవుతుందన్నారు. అయితే గత పాలకులు ఒక చదరపు అడుక్కి రూ.5,532 చొప్పున వసూలు చేశారన్నారు. ఒక్కో అన్న క్యాంటీన్లో రూ.30 లక్షల వరకూ అవినీతి చోటు చేసుకుందని ఆయన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ లెక్కన జిల్లాలోని 16 అన్న క్యాంటీన్లలో సుమారు రూ.4.80 కోట్లు అవినీతి చోటు చేసుకుందని తెలిపారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ నిర్వహించి ప్రజాధనాన్ని కాపాడాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చినమిల్లి గణపతిరావు, రేలంగి శ్రీనివాసరావు, కాపిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అన్నన్నా.. ఇదేమి గోల!
సాక్షి, అనంతపురం : అన్నార్థులు ఆకలి తీర్చేందుకే రూ.5కే భోజనం అందిస్తామని 2014 ఎన్నికల వేళ చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు ఆ పథకం గురించి మరిచిపోయాడు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 2018లో హడావుడిగా అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఇలా జిల్లాలో 16 క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. 60కి పైగా క్యాంటీన్ల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు 2016లో ప్రతిపాదనలు పంపితే అప్పటి టీడీపీ ప్రభుత్వం 2018లో 17 అన్న క్యాంటీన్లు మంజూరు చేసింది. జిల్లా కేంద్రంలో 7 క్యాంటీన్లకు అధికారులు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం నాలుగు మంజూరు చేసింది. దీంతో 2018 జూలై 15న బళ్లారి బైపాస్‌లో, 2018 డిసెంబర్ 19న గుత్తి రోడ్డులో, 2019 జనవరి 11న ఆర్ఎఫ్ రోడ్డులో అన్న క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. ఇక 11 మున్సిపాలిటీల్లో పదులు సంఖ్యలో క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళితే అందులో 17 మాత్రమే మంజూరయ్యాయి. వాటిలో ఒకటి నేటికీ ప్రారంభం(గుత్తి) కాలేదు. కేవలం గోడలు మాత్రం నిర్మించి వదిలేశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించిన ఈ క్యాంటీన్ల వల్ల పేదల కడుపునిండటం పక్కన పెడితే ప్రజాధనం దోపిడీతో తెలుగుతమ్ముళ్ల బొజ్జలు నిండాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆది నుంచి వివాదాస్పదమే జిల్లా కేంద్రంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటు ఆది నుంచి వివాదాస్పదంగానే సాగింది. క్యాంటీన్లకు స్థలాలకు కూడా చూపించలేని అప్పటి జిల్లా మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు కాలం వెళ్లబుచ్చారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగరంలో మొదట బళ్లారి బైపాస్‌లో క్యాంటీన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాస్తవంగా ఆర్అండ్బీ నిబంధనల ప్రకారం ఫ్లైఓవర్ కింద భాగంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. దీనిపై అప్పట్లోనే ఆర్అండ్బీ అధికారులు అభ్యంతరం చెప్పారు. కానీ అప్పటి ఎమెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప ఆర్భాటంగా క్యాంటీన్‌ను ఏర్పాటు చేయించారు. అయితే వారం రోజుల్లోనే భోజనం సరిగా ఏర్పాటు చేయలేదని స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు్లవెత్తాయి. కేవలం 150 మందికి మాత్రమే(పూటకు) భోజనం ఏర్పాటు చేయడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ సంఖ్యను మరో 150 మందికి పెంచేలా అప్పటి కమిషనర్ పీవీవీఎస్ మూర్తి చర్యలు తీసుకున్నారు. ఇక మిగితా మూడు ప్రాంతాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు ఆర్ఎఫ్ రోడ్డు జూనియర్ కళాశాల ఆవరణలో, గుత్తిరోడ్డు నాగవెంకోబరావు పాఠశాల ఆవరణలో క్యాంటీన్ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. కదిరి మున్సిపాలిటీలోనూ అదే పరిస్థితి. మొదట్లో జనాలు రద్దీగా ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. చివరకు వివిధ కారణాలతో వేరే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. సిబ్బందికి వేతనాలివ్వలేని దౌర్భాగ్యం వాస్తవానికి అన్న క్యాంటీన్ ఏర్పాటుకు స్థలాన్ని ఆయా మున్సిపాలిటీ, నగరపాలక సంస్థ చూపించాలి. షాపూర్జీ పూలంజీ సంస్థ ఓ భవనాన్ని ఏర్పాటు చేసి మున్సిపాలిటీలకు అందజేస్తుంది. భోజనాన్ని అక్షయపాత్ర వారు సమకూరుస్తారు. అందులో పనిచేసే సిబ్బందికి ఓ ఏజెన్సీ ద్వారా వేతనాలు చెల్లిస్తారు. కానీ సిబ్బందికి వేతనాలివ్వడంలోనూ తీవ్ర జాప్యం జరిగింది. దీంతో పలుచోట్ల వారు ఆందోళనకు దిగారు. ఐదు నెలలకు మూడు నెలల జీతం బాకీ ఈ ఏడాది జూలై 3న గుత్తిరోడ్డులోని అన్న క్యాంటీన్లోని సిబ్బంది ఆందోళనకు దిగారు. మూడు నెలలుగా వేతనాలివ్వలేదని ఏజెన్సీ నిర్వాహకులు రంగన్నతో వాగ్వాదం చేశారు. కేవలం ఐదు నెలలే క్యాంటీన్లు నిర్వహించిన టీడీపీ ప్రభుత్వం సిబ్బందికి మూడు నెలల జీతాలు ఇవ్వకపోవడం చూస్తే వాటి నిర్వహణపై ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. -
అన్నా.. ఎంత అవినీతి!
సాక్షి, ప్రొద్దుటూరు టౌన్ : అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ ప్రభుత్వం దోపిడీకి తెరలేపింది. తమకు నచ్చిన సంస్థకు కాంట్రాక్టును అప్పగించి నిర్మాణ వ్యయాన్ని ఎవ్వరూ ఊహించనంతగా పెంచి రేకుల షెడ్డుకు పైన పీఓబీ, చుట్టూ అద్దాలు, ఏర్పాటు చేసి ఒక్కో క్యాంటీన్‌కు రూ.40 లక్షలు ప్రజాధనాన్ని దోచి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లలో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం అమ్మా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకు కడుపు నిండా భోజనం పెట్టడం టీడీపీ ప్రభుత్వంలోని నాయకులు చూసి వచ్చి నాలుగేళ్ల వరకు వాటి జోలికి వెళ్లలేదు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు పేదలు గుర్తుకొచ్చారు. తయారు చేసి తీసుకొచ్చిన అన్నం పెట్టేందుకు రూ.లక్ష ఖర్చు చేస్తే షెడ్ నిర్మాణం పూర్తవుతుంది. కానీ టీడీపీ నేత కనుసన్నుల్లో ఉన్న నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి అన్న క్యాంటీన్ల నిర్మాణాలను అప్పగించింది. ఇలా టీడీపీ ప్రభుత్వం భారీ అవినీతికి తెరలేపింది. రూ.38.65 లక్షలు ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి ఖర్చుచేసేందుకు తీర్మానం చేసింది. అది నాలుగైదు నెలల్లో ఎన్నికలు వస్తాయన్న వినికిడి నేపథ్యంలో జిల్లాలో 11 క్యాంటీన్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. అన్న క్యాంటీన్ నిర్మాణానికి వినియోగించిన ఇనుప దంతెలు, పైన పటారం, లోన లోటారంలా తయారు చేసిన అన్న క్యాంటీన్ ఇనుప దంతెలపై రేకుల షెడ్డు నిర్మాణం ఇనుప దంతెలపై రేకులు పరిచి క్యాంటీన్లు నిర్మించారు.సెంటున్నర్ర లోపు స్థలంలో చుట్టూ రంగు రంగుల రేకులతో తీర్చి దిద్దారు. చుట్టూ అద్దాలు వేసి అనవసర ఖర్చుకు పూనుకున్నారు. సిమెంట్ స్లాబ్‌తో భారీ భవనం నిర్మించేంత డబ్బులు కాంట్రాక్టర్ తీసుకొని రేకుల షెడ్డుకు పీఓబీ ఏర్పాటు చేసి సగానికి పైగా డబ్బు కాజేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రమైన కడప కార్పొరేషన్లో పాత మున్సిపల్ కార్యాలయం, జెడ్పీ కార్యాలయ ఆవరణం, పాత బస్టాండ్లలో, ప్రొద్దుటూరు, రాయచోటి తదితర మున్సిపాలిటీల్లో అన్న క్యాంటీన్లు పూర్తయ్యాయి. స్థలాలు లేని ప్రాంతాల్లో అద్దెకు తీసుకుని అక్కడ స్థల యజమానుల నియమాలకు తలొగ్గి నిర్మిస్తే చివరకు అవి వారికే సొంతం అయ్యేలా నిబంధనలు టీడీపీ ప్రభుత్వం రూపొందించింది. నిలుచుని భోజనం చేసేందుకు ఇంత వ్యయం ఖర్చు చేయాలా అని ప్రజలు ప్రశ్నించినా పట్టించుకోకపోవడం గమనార్హం. అన్న క్యాంటీన్లకు విద్యుత్, వసతులు కల్పించేందుకు మున్సిపాలిటీల నుంచి రూ.2లక్షలు ఖర్చు చేశారు. జిల్లాలో 11 క్యాంటీన్ల నిర్మాణానికి మొత్తం రూ.425.15 లక్షలు ఖర్చు పెట్టేందుకు అంచనాలు సిద్ధం చేశారు. అయితే ప్రొద్దుటూరు, కడప, జమ్మలమడుగులో తదితర మున్సిపాలిటీల్లో వీటిని ప్రారంభించారు. ఏది ఏమైనా టీడీపీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. -
క్యాంటీన్లనూ వదలని చంద్రబాబు
-
అన్నా క్యాంటీన్ల మూసివేతపై మంత్రి బొత్స..
సాక్షి, విజయనగరం: అన్నా క్యాంటీన్లను తాత్కాలికంగా మాత్రమే మూసివేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. క్యాంటీన్లను నిలిపివేయడం తమకు కూడా బాధగానే ఉందని, కానీ గత ప్రభుత్వం అనవసరమయిన చోట క్యాంటీన్లను నిర్మించిందని అన్నారు. శుక్రవారం ఆయన విజయనగరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అన్నా క్యాంటీన్ల కోసం గత ప్రభుత్వం లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. త్వరలోనే ప్రభుత్వ క్యాంటీన్లు నిర్మిస్తామని, రద్దీ ప్రాంతాల్లో అవసరమయితే మొబైల్ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా పట్టణ పరిధిలోని పేదల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. గత ప్రభుత్వం అధిక ధరలకు టెండర్లను పిలిచి నిర్మాణాలను చేపట్టిందని మంత్రి విమర్శించారు. తక్కువ ధరలకు పేదలకు ఇళ్ల నిర్మాణాలను కేటాయించాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణలపై ధరలను తగ్గించుకోవాలని కాంట్రాక్టర్లను కోరినట్లు మంత్రి తెలిపారు. ఇసుక కొరతపై భవన నిర్మాణ కార్మికులు చింతించాల్సిన అవసరం లేదని, ప్రజలకు నిర్మాణాల కోసం అవసరమైన ఇసుకను కేటాయించాలని, కొత్తగా రీచ్ లను తెరిపించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి వెల్లడించారు. -
అన్న క్యాంటీన్లపై ప్రచారం అవాస్తవం
-
అన్నా.. ‘ఎలక్షన్’ క్యాంటీన్లు!
ఈ చిత్రంలో కనిపిస్తున్న టెంటుపై ‘అన్న క్యాంటిన్’ బ్యానర్ ఉందని ఆశ్చర్యపోవద్దు. ఇది నిజంగా అన్న క్యాంటీనే... అయితే నగరాల్లో, పట్టణాల్లో మాదిరిగా అధునాతన హంగులతో నిర్మించిన భవనం ఎందుకు లేదా.. అని మీకు అనుమానం రావొచ్చు. ఆగండాగండీ.. అక్కడకే వస్తున్నా. సార్వత్రిక ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకోవడానికి టెక్కలిలో ఇలా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు చేసిన ఎత్తుగడ ఇదండీ... సాక్షి, శ్రీకాకుళం: ‘ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్లలో భోజనం, ఫలహారం.. అందమైన భవనాల్లో వీటిని నడుపుతున్నాం..’ అంటూ తరచూ ఊదరగొట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు వాటిని చెట్లకింద నడిపే స్థాయికి తెచ్చారు. ఈ ఎన్నికల్లో గ్రామీణ ఓట్లను ఆకర్షించడానికి మేజర్ పంచాయతీల్లోనూ అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఎత్తుగడ వేశారు. తొలుత గతేడాది జులైలో రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో 195 చోట్ల అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ కోసం రూ. లక్షలు వెచ్చించి రంగు, హంగుల భవనాలు నిర్మించారు. వీటిలో ఉదయం ఫలహారం (ఇడ్లీ/పూరీ), మధ్యాహ్నం, రాత్రి భోజనం వడ్డిస్తున్నారు. ఈ బాధ్యతను హరేకృష్ణ మూమెంట్ ఫౌండేషన్‌కు అప్పగించారు. సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో సీఎం చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేశారు. గ్రామీణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకోవడానికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు అందుబాటులో ఉండేలా 152 మేజర్ పంచాయతీల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చారు. ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందంటూ తొందర పెడుతూ ఫిబ్రవరిలోనే వీటిని ప్రారంభించాలన్నారు. వీటికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఆయా చోట్ల రెయిన్ ప్రూఫ్ పగోడాలు (టార్పాలిన్ టెంట్లు), మూడు వైపులా కవర్ చేసే సైడ్‌వాల్స్, నాలుగు డైనింగ్ టేబుళ్లు, నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు, మూడు సింక్లు, ప్లాస్టిక్ డస్ట్బిన్లు, ఒక బీరువా, అన్న క్యాంటీన్ బ్యానర్ వంటివి సమకూర్చాలని నిర్దేశించారు. వీటికి అవసరమైన నిధులు మాత్రం సమకూర్చలేదు. వీటి నిర్వహణకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చెట్ల కింద, టెంట్లు, పాడుబడిన భవనాలనే అన్న క్యాంటీన్లుగా మార్చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 152 మేజర్ పంచాయతీలకుగాను 43 చోట్ల మాత్రమే ఏర్పాటు చేశారు. ఇప్పటికే నడుస్తున్న క్యాంటీన్లు మూడు పూటలా అందుబాటులో ఉండగా, కొత్తగా గ్రామీణ ప్రాంతాల క్యాంటీన్లలో మధ్యాహ్నం మాత్రమే భోజనం పెడుతున్నారు. పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక భవనంలో వీటిని నడుపుతుండగా, పల్లెల్లో మాత్రం చెట్లు, శిథిల భవనాలే దిక్కయ్యాయి. భోజనం తప్ప ఇంకేమీ అందుబాటులో లేని దుస్థితిపై అక్కడి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమలాంటి ఓట్లు కొల్లగొట్టాలన్న ఆలోచనతోనే చంద్రబాబు మొక్కుబడి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. బిల్లుల చెల్లింపుల్లోనూ జాప్యమే.. ఇక ఆహారం సరఫరా చేసినందు కు హరేకృష్ణ మూమెంట్ ఫౌండేషన్‌కు నెలకు రూ.5 నుంచి రూ. 6 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటోంది. ఆరంభంలో కొన్ని నెలలు బిల్లులు చెల్లించలేదు. ఇలాగైతే తమవల్ల కాదంటూ ఒత్తిడి చేయడంతో జనవరి వరకు బకాయిలు చెల్లించారు. అప్పట్నుంచి బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఓట్ల కోసమే.. ఎన్నికల ముందు పల్లెల్లో ఓట్ల కోసమే సీఎం చంద్రబాబు మేజర్ పంచాయతీల్లో హడావుడిగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఏమాత్రం సదుపాయాల్లేని టెంట్లలో మొక్కుబడిగా ఒంటిపూట భోజనం పెడుతున్నారు. కనీసం కుర్చీలూ లేవు. – డీ కుసుడు, టెక్కలి మండలం చెట్ల కింద కూర్చుని తింటున్నాం అన్న క్యాంటీన్లను పెడుతున్నామని హడావుడి చేశారు. తీరా చెట్ల కింద, శిథిల భవనాల్లో పెట్టా రు. దీంతో చెట్ల కింద భోజనం చేయాల్సి వస్తోంది. కనీస సదుపాయాలు కల్పించకుం డా ఇలా ఏర్పాటు చేయడం తగదు. – వెంపటపు కార్తీక్, పొందూరు మండలం