ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటుచేయ తలపెట్టిన అన్న క్యాంటీన్లపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ మంగళవారం జరిగింది. అనంతపురంలో ఐదు, తిరుపతిలో ఐదు, గుంటూరులో 10, విశాఖపట్నంలో 15 చొప్పున అన్న క్యాంటీన్లను తొలివిడతలో ఏర్పాటుచేయాలని ఈ భేటీలో నిర్ణయించారు.
ఈ క్యాంటీన్ల నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలంటూ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలంటూ నాలుగు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తమిళనాడులోని అమ్మ క్యాంటీన్ల తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
తొలివిడతలో 25 'అన్న క్యాంటీన్లు'
Published Tue, Sep 2 2014 4:23 PM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM
Advertisement
Advertisement